
సాక్షి, విజయవాడ: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు గంటగంటకూ 7 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వరద పెరుగుతోంది. ఈస్టన్, వెస్టన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు సోమవారం 70 గేట్లను ఎత్తి సముద్రానికి నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహాం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి, రమేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు, వరదలు వస్తుండటంతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ఫ్లడ్ మేనేజ్‌మెంట్ అధికారుల శ్రమ మంత్రి అభినందనీయం అన్నారు. నీటి కొరత లేకపోవడంతో పంటలు సంవృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కానీ తెలుగు దేశం పార్టీ నేతలు వరదలని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment