సాక్షి, విజయవాడ : ప్రజల భాగస్వామ్యంతోనే ప్లాస్టిక్ వాడకాన్ని నియత్రించవచ్చన్నారు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్. జిల్లాలో ప్లాస్టిక్ వినియోగాన్ని నియంత్రించడానికి నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు. కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహించారు. కళ్యాణ మండపాలు, రెస్టారెంట్‌లు, దుకాణాల వద్ద ప్లాస్టిక్ వాడకం ఎక్కువగా ఉందని వచ్చే వారంలో ప్లాస్టిక్‌ను బ్యాన్ చేయడానికి ఒక ప్రకటన విడుదల చేయనున్నట్లు వివరించారు. వచ్చే మంగళవారం, బుధవారం, శుక్రవారం ప్రజలతో సమావేశాలు ఏర్పాలు చేసి ప్లాస్టిక్ వాడకం వలన కలిగే దుష్పరిణాలమాలను వివరిస్తామని అన్నారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు, విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాటన్ క్లాత్ బ్యాగ్స్, పేపర్ గ్లాస్‌లు అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. కార్పోరేషన్, పోలీస్, కమర్షియల్ టాక్స్ డిపార్ట్‌మెంట్‌ల సహాకారంతో స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహిస్తామని, ప్లాస్టిక్‌ను నగరంలోకి రాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో కూడా వీటిపై ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. జిల్లాలో సైకిల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రజలతో ప్లాస్టిక్‌ను నిషేధిస్తామని ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. అలాగే స్వయం సహాయక సంఘాలతో కాటన్ బ్యాగ్‌ల తయారీ చేపడతామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment