
సాక్షి, విజయవాడ: ప్లాస్టిక్ వాడకం నిషేధంపై వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ ఇంతియాజ్ మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేటి నుంచి నగరంలో ‘మన విజయవాడ’ పేరుతో యాంటీ ప్లాస్టిక్ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్‌ను బ్యాన్ చేస్తూ నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జ్యూట్ బ్యాగులను అందుబాటులో ఉంచుతామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగిస్తే.. కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్లాస్టిక్ వినియోగించకుండా ఉన్నవారికి బహుమతులు అందిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment