తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష | CM YS Jagan Review Meeting On Nivar Cyclone Effect | Sakshi
Sakshi News home page

తుపాను ప్రభావంపై సీఎం జగన్‌ సమీక్ష

Published Thu, Nov 26 2020 12:12 PM | Last Updated on Thu, Nov 26 2020 2:17 PM

CM YS Jagan Review Meeting On Nivar Cyclone Effect - Sakshi

అమరావతి: నివర్‌ తుపాను ప్రభావంపై  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం క్యాంప్‌ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. తుపాను ప్రభావం,  కురుస్తున్న వర్షాలపై సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు. తుపాను తీరాన్ని తాకిందని, క్రమంగా బలహీనపడుతోందని వివరించారు. చిత్తూరులోని ఏర్పేడు, శ్రీకాళహస్తి, సత్యవేడు, నెల్లూరు జిల్లాలో వర్షాలు పడుతున్నాయని, అలాగే కడప, అనంతపురం జిల్లాల్లోని కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో సగటున 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యిందని ముఖ్యమంత్రికి వివరించారు. నివర్‌ (తుపాన్‌: ఏపీలో వర్ష బీభత్సం..)

పెన్నానదిలో ప్రవాహం ఉండొచ్చని, సోమశిల ఇప్పటికే నిండినందున వచ్చే ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని నీటిని విడుదల చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు.  అక్కడక్కడా పంటలు నీటమునిగిన ఘటనలు వచ్చాయని, వర్షాలు తగ్గగానే నష్టం మదింపు కార్యక్రమాలు చేపడతామన్నారు. రేణిగుంటలో మల్లెమడుగు రిజర్వాయర్‌ సమీపంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు జారీచేశారు. నెల్లూరు జిల్లాలో కరెంటు షాక్‌తో మరణించిన కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు. వర్షాలు అనంతరం పంట నష్టంపై వెంటనే అంచనాలు రూపొందించాలని, భారీ వర్షాలుకారణంగా ఏదైనా నష్టం వస్తే.. సత్వరమే సహాయం అందించడానికి సిద్ధం కావాలని ఆదేశాలు ఇచ్చారు. (తీరాన్ని దాటిన నివర్‌ తుపాను..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement