సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. రేపు (మంగళవారం) రైతు భరోసా, నివర్ తుపాను నష్ట పరిహారం చెల్లింపులను ప్రభుత్వం చేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత రూ.1,120 కోట్లు చెల్లింపులతో 51.59 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరనుంది.(చదవండి: ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లు: సీఎం జగన్)
నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో నష్టపోయిన రైతులకు పరిహారాన్ని ప్రభుత్వం అందించనుంది. రూ.646 కోట్లు నివర్ పరిహారాన్ని సీఎం వైఎస్ జగన్.. రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అసెంబ్లీలో సీఎం చెప్పిన మాట ప్రకారం తుపాను బాధితులకు పరిహారం అందనుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాను బాధితులకు వైఎస్ జగన్ ప్రభుత్వం పరిహారం అందిస్తుంది.(చదవండి: సీఎం జగన్‌కు తమిళ తంబీల ఫాలోయింగ్)
Comments
Please login to add a commentAdd a comment