AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ | CM Jagan To Release 3rd Phase YSR Rythu Bharosa Funds To Beneficiaries | Sakshi
Sakshi News home page

AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ

Published Mon, Jan 3 2022 7:47 AM | Last Updated on Mon, Jan 3 2022 2:09 PM

CM Jagan To Release 3rd Phase YSR Rythu Bharosa Funds To Beneficiaries - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్‌లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్‌ రైతుభరోసా–పీఎం కిసాన్‌ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఇప్పటికి రూ.5,863 కోట్లు జమ
2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్‌ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్‌–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్‌ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున  రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది.

ఇప్పుడు మూడో విడతలో ఇలా..
ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్‌ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్‌ఓఎఫ్‌ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్‌సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్‌ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది.

మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్‌ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్‌ఓఎఫ్‌ ఆర్‌–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement