Farmers Bank Accounts
-
ధాన్యం అమ్మాలన్నా.. నగదు అందాలన్నా..రోడ్డెక్కాల్సిందేనా..?
మంచిర్యాలఅగ్రికల్చర్: యాసంగి ధాన్యం అమ్ముకోవడమే కాదు.. ఆ నగదు జమ కావాలన్నా రైతులు రోడ్డెక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ధాన్యం విక్రయించి నెల రోజులు గడిచినా నగదు అందక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అప్పు చెల్లించడానికి, సాగు పెట్టుబడికి నగదు కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ధాన్యం డబ్బులు వెంటనే చెల్లించాలని దండేపల్లి మండలం లింగాపూర్ గ్రామ రైతులు శుక్రవారం రాస్తారోకో చేశారు. జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాల్లో 1.80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. ఈ నెల 16వరకు జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు ముగిసాయి. తరుగు, మిల్లర్ల తిరకాసు, గన్ని సంచులు, లారీల కొరత, అకాల వర్షాలతో అరిగోస పడ్డారు. క్వింటాల్‌కు ఐదు నుంచి పది కిలోల వరకు కోతలు పెట్టారు. ధర్నాలు, ఆందోళనలతో రోడ్డెక్కి ధాన్యం విక్రయించినా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావడం లేదు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోనే నగదు జమ చేస్తామని అధికారులు, పాలకులు ప్రకటించినా అమలుకు నోచుకోలేదు. నగదు కోసం మరోసారి ఆందోళనలు చేపట్టాల్సిన దుస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. నగదు రూ.147.33 కోట్లు పెండింగ్ ఈ సీజన్లో 25,088 మంది రైతుల నుంచి 1,80,483.040 టన్నుల ధాన్యం సేకరించారు. ఇందుకు గాను రూ.353,74,67,584 రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉంది. ఇప్పటివరకు 16,578 మందికి గాను రూ.206,41,63,488 ఖాతాల్లో జమైంది. ఇంకా 8,510 మందికి రూ.రూ.147,33,04,096 అందా ల్సి ఉంది. బుక్ కీపర్లు రైతుల నుంచి కొనుగోలు చే సిన ధాన్యం వివరాలను ట్యాబ్‌లో అప్లోడ్ చేసిన 48 గంటల్లోగా రైతు ఖాతాలో నగదు జమ కావాల్సి ఉంటుంది. కానీ నెల గడుస్తున్నా డబ్బులు అందక రైతులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. ఇప్పటికే వానాకాలం సీజన్ ప్రారంభం కావడంతో విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసి సాగు పనులు చేపట్టారు. నగదు అందని రైతులు ఇంకెప్పుడు చెల్లింపులు చేస్తారోనని ఆందోళనలో ఉన్నారు. సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం నుంచే డబ్బులు రాలేదని, జమ అయిన వరకు రైతులకు బది లీ చేశామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు. నెలరోజులు దాటింది.. ధాన్యం విక్రయించి నెల రోజులు దాటింది. అయినా డబ్బులు ఖాతాలో జమ కాలేదు. 239 బస్తాలు తూకం వేసినా డబ్బుల చెల్లింపు లేకపోవడం దారుణం. రెండు రోజులలో పడుతయని చెప్పి నెల రోజులుగా తిప్పతున్నారు. సెంటర్ నిర్వాహకులను అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారు. వానాకాలం సాగు విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు చేతిలో పైసలు లేక తిప్పలు పడుడు అయితంది. – రైతు శివలాల్, గ్రామం: లింగపూర్, మం:దండేపల్లి ధాన్యం డబ్బుల కోసం రైతుల రాస్తారోకో దండేపల్లి: ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం విక్రయించిన 40రోజులు దాటినా నగదు చె ల్లించకపోవడంతో ఆగ్రహించిన రైతులు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. మండలంలోని లింగా పూర్ గ్రామనికి చెందిన పలువురు రైతులు స్థాని కంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధా న్యం విక్రయించారు. ఖాతాలో నగదు జమ కాకపోవడంతో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మా ట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం అమ్మితే 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నట్లు బీఆర్ఎస్ నాయకులు గొప్పలు చెబుతున్నారని, 40 రోజు లు గడుస్తున్నా ఖాతాలో జమ కావడం లేదని ఆరోపించారు. సహకార సంఘం కార్యాలయాని కి వెళ్లి అడిగితే మిల్లు ట్యాగింగ్ కాలేదని చెబుతున్నారని అన్నారు. వెంటనే డబ్బులు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎస్సై ప్రసాద్ రైతులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఇప్పటి వరకు రైతుబంధు రాలేదా?.. వారిందరికీ గుడ్‌న్యూస్
సాక్షి, హైదరాబాద్: కొత్తగా పట్టాదార్ పాస్ బుక్ వచ్చిన రైతులకు ఈ వానాకాలం సీజన్లో రైతుబంధుకు అవకాశం కల్పించారు. జూన్ 16 నాటికి పాస్ బుక్ వచ్చిన ప్రతీ రైతుకు రైతుబంధు పెట్టుబడి సాయాన్ని అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పథకం కింద సాయం పొందడానికి కొత్త పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక ఏఈవోలకు అందజేయాల్సి ఉంటుంది. బుధవారం నుంచే ఏఈవోలకు రైతుబంధు పోర్టల్‌లో ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చారు. సీసీఎల్ఏ డేటా ఆధారంగా రైతులను గుర్తిస్తారు. రైతు పట్టాదారు పాస్‌బుక్ వివరాలను రైతుబంధు పోర్టల్‌లో అప్లోడ్ చేస్తారు. రాష్ట్రంలో సీసీఎల్ఏలో నమోదైన పట్టాదారు పాసు పుస్తకాలు కలిగిన 68.94 లక్షలకు పైగా రైతులు రైతుబంధుకు అర్హులుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కొత్త లబ్ధిదారుల నమోదుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. దీంతో ఈనెల 26 నుంచే రైతుబంధు పెట్టుబడి సాయం పంపిణీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇది కూడా చదవండి: 15,660 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 117 బ్లాకులు.. -
ఏపీ: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదును అందించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసింది జగన్ సర్కార్. ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: జగనన్నకు చెబుదాంపైనా అక్కసు.. ఆయనగారి పైత్యం -
రైతుబంధుపై వీడని సస్పెన్స్.. కొత్త రైతులకు కష్టమే?
ఇందూరు(నిజామాబాద్ అర్బన్) : రైతుబంధు వివరాలను రాష్ట్ర ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. బయటకు చెప్పకూడదని వ్యవసాయాధికారులను కట్టడి చేసింది. బయటి వ్యక్తులకే కాదు మీడియాకు కూడా వివరాలను వెల్లడించడానికి అధికారులు జంకుతున్నారు. ఉద్యోగాలు పోతాయనేంతగా భయంతో ‘ఆ ఒక్కటి అడక్కు’ అని మాట దాటేస్తున్నారు. దీంతో జిల్లాలో ఏడాది యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతుబంధు నిధులు ఎంతమందికి వచ్చాయన్న లెక్కలు తెలియని పరిస్థితి నెలకొంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలస్యంగా రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం వేస్తుండడమే ఇందుకు కారణమని మాత్రం తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 28 నుంచి రైతుబంధు సాయం అందజేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. జిల్లాలో కొత్తగా 7,176 మంది రైతులను కలుపుకొని లబి్ధదారుల సంఖ్య 2,78,351 మందికి చేరుకుంది. ఇందుకు రూ.274.10కోట్లకు పైగా పెట్టుబడి సాయం అవసరమవుతోంది. తొలుత ఒకటి, రెండు, మూడెకరాలు వారికి పెట్టుబడి డబ్బులు అందగా, నాలుగు నుంచి ఆరెకరాల్లోపు ఉన్న రైతులకు ఆలస్యంగా అందాయి. ప్రస్తుతం ఆరు ఎకరాలకు పైగా ఉన్న వారికి ఇంకొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీంతో పక్షం రోజులవుతున్నా తమకు రైతుబంధు రాలేదని రైతులు వ్యవసాయాధికారులకు ఫోన్లు చేస్తున్నారు. కొంత ఆలస్యమైనా డబ్బులు తప్పకుండా పడతాయని అధికారులు వారికి సముదాయిస్తున్నారు. కానీ, వరినాట్లు దాదాపు పూర్తయినప్పటికీ పంట సాయం అందకపోవడం పట్ల రైతులు ఆందోళనగా ఉన్నారు. ఎరువులు, మందుల కొనుగోలుకు చేతిలో పైసల్లేక అప్పు తెచ్చుకుంటున్నారు. కొత్త రైతులకు అనుమానమే.. జిల్లాలో రైతుబంధు పొందే లబ్ధిదారుల జాబితాలో కొత్తగా పట్టాపాసు పుస్తకాలు పొందిన 7,176 మంది రైతులను చేర్చింది. అర్హత ఉన్న రైతులు రైతుబంధు కోసం దరఖాస్తుతో పాటు పాస్‌బుక్, బ్యాంక్ అకౌంట్, ఆధార్ జిరాక్స్‌లను మండల వ్యవసాయాధికారులకు అందజేశారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఆ రైతుల పేర్లను మాత్రం రైతుబంధు పోర్టల్‌లో ఇంకా నమోదు చేయలేదు. దీంతో వ్యవసాయాధికారులు రైతుల వివరాలను ఎంట్రీ చేయలేకపోతున్నారు. వచ్చిన దరఖాస్తులన్నీ మండల కార్యాలయాల్లోనే పడున్నాయి. తద్వారా కొత్త రైతులకు యాసంగి పెట్టుబడి సాయం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. సీసీఎల్ఏ నుంచి రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ను కొత్త పాస్‌పుస్తకాలు పొందిన రైతుల వివరాలు అందలేదని తెలుస్తోంది. -
వారికి రైతుబంధు రానట్టేనా?
సాక్షి, యాదాద్రి : కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులకు ఈసారి రైతుబంధు సాయం అందే పరిస్థితి కనిపించడం లేదు. వ్యవసాయ అధికారులకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ వ్యవసాయ శాఖ ముఖ్య కమిషనర్ (సీసీఎల్ఏ) నుంచి వచ్చిన డేటాలో వారి వివరాలు లేవు. యాసంగిలో పెట్టుబడి సాయం వస్తుందని ఆశపడ్డ కొత్త రైతులు ఇప్పుడు నిరాశలో ఉన్నారు. కొత్తగా పాస్ పుస్తకాలు తీసుకున్న రైతులు యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా 8 వేలకు పైనే ఉన్నారు. 5,495 మంది దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అమల్లోకి తీసుకువచ్చిన తర్వాత వివిధ రకాల సాంకేతిక సమస్యల వల్ల వేలాది మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు రాలేదు. ఇటీవల సమస్యలను పరిష్కరించడంతో జిల్లాలోని 17 మండలాలు, ఆరు మున్సిపాలిటీల పరిధిలో 8 వేల మందికి పైగా రైతులు కొత్త పాస్ పుస్తకాలు పొందారు. వీరిలో 5,495 మంది రైతుబంధు సాయం కోసం దరఖాస్తు చేసుకున్నారు. సరైన ప్రచారం లేకపోవడం, అవగాహన లేమితో ఇంకా 2,500 మందికి పైగా దరఖాస్తు చేయలేదు. 2022 డిసెంబర్ 20లోపు నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు వచ్చిన వారు ఈనెల 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ ప్రకటించారు.దరఖాస్తు చేసుకున్న రైతులు రైతుబంధు సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశలో రైతులు వానాకాలం సీజన్లో రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే వారి ఖాతాల్లో నగదు జమ అయ్యింది. యాసంగిలోనూ అదే విధంగా వస్తుందని కొత్త పాస్ పుస్తకాలు పొందిన రైతులు ఆశపడ్డారు. కానీ, సీసీఎల్ఏ నుంచి సమాచారం రా కపోవడంతో అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. బ్యాంకు పాస్ పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ çవెబ్సైట్ ఓపెన్ కావడం లేదని అధికారులు చెబుతున్నారు. వివరాలు పంపని సీసీఎల్ఏ నూతనంగా పట్టదారు పాస్ పుస్తకాలు తీసుకున్న రైతుల వివరాలను సీసీఎల్ఏ వ్యవసాయశాఖకు పంపించలేదు. దీంతో వ్యవసాయ శాఖ కమిషనర్ వెబ్సైట్లో కొత్తగా దరఖాస్తు చేసుకున్న రైతుల వివరాలు లేవు. గతంలో మాదిరిగానే రకరకాల సాంకేతిక సమస్యలు చూపుతోంది. నూతన పాస్ బుక్ నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, విస్తీర్ణం వివరాలను సీసీఎల్ఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ వివరాల ఆధారంగా ఏఈఓలు రైతుల బ్యాంకు పాస్‌పుస్తకం వివరాలు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ తర్వాత రైతుబంధు సాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుంది.కానీ, వెబ్సైట్లో వారి వివరాలు చూపడం లేదు. డేటా వస్తే జమ చేస్తాం కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారి డేటా సీసీఎల్ఏ నుంచి మాకు రాలేదు. డేటాలో పట్టాదారు పాస్ బుక్ నంబర్, రైతు పేరు ఉంటుంది. ఈ వివరాలు సీసీఎల్ఏ నుంచి మాకు వస్తేనే నిర్ణీత ఫార్మాట్లో రైతుల బ్యాంకు అకౌంట్ నంబర్ అప్లోడ్ చేసి వారి ఖాతాల్లో డబ్బులు జమచేస్తాం. గత సీజన్లలో కొత్తగా పాస్ పుస్తకాలు పొందిన వారికి వెంటనే రైతుబంధు సహాయం అందింది. మాకు డేటా రాగానే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తాం. –అనురాధ, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి -
Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. -
‘పీఎం–కిసాన్’ సొమ్ము విడుదల
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి(పీఎం–కిసాన్) 12వ విడత నిధులను ప్రధాని నరేంద్ర మోదీ అర్హులైన రైతుల ఖాతాల్లోకి బదిలీ చేశారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ, ఎరువుల శాఖల ఆధ్వర్యంలో ప్రారంభమైన పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్–2022 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 12వ విడతలో దాదాపు రూ.16,000 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి చేరాయి. దీంతో ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు రూ.2.16 లక్షల కోట్ల సాయం అందించినట్లయ్యింది. ఏటా 11 కోట్ల మంది రైతన్నలు లబ్ధి పొందుతున్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పీఎం–కిసాన్ కింద అర్హులకు ప్రతి సంవత్సరం రూ.6,000 మూడు విడతల్లో అందిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి నాలుగో నెలలకోసారి రూ.2,000ను వారి ఖాతాల్లోకి బదిలీ చేస్తున్నారు. ఈ పథకాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే అమలు చేస్తోంది. రైతులపై తగ్గిన ఆర్థిక భారం మధ్యవర్తులు, కమీషన్ల ఏజెంట్ల ప్రమేయం లేకుండా పీఎం–కిసాన్ నిధులను నేరుగా రైతుల బ్యాంకు ఖతాల్లోకే బదిలీ చేస్తున్నామని ప్రధానీ మోదీ వివరించారు. కిసాన్ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. దీపావళి పండుగకు ముందు రైతులకు నిధులు అందడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. రబీ సీజన్లో పంటల సాగుకు ఈ డబ్బులు ఉపయోగపతాయని చెప్పారు. పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అన్నదాతలకు రూ.2 లక్షల కోట్లకుపైగా అందజేశామని తెలిపారు. పీఎం–కిసాన్ పథకం ఆర్థికంగా ఎంతో భారాన్ని తగ్గించిందని రైతులు తనతో చెప్పారని గుర్తుచేశారు. కిసాన్ సమృద్ధి కేంద్రాలు ప్రారంభం ‘ఒకే దేశం, ఒకే ఎరువుల పథకం’లో భాగంగా ‘భారత్’ బ్రాండ్ రాయితీ యూరియాను ప్రధాని నరేంద్ర మోదీ విడుదల ఆవిష్కరించారు. అలాగే 600 పీఎం–కిసాన్ సమృద్ధి కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ రెండు చర్యల వల్ల రైతులకు నాణ్యమైన ఎరువులు సకాలంలో అందుతాయని చెప్పారు. అంతర్జాతీయ ఎరువుల ఈ–వారపత్రిక ‘ఇండియన్ ఎడ్జ్’ను సైతం మోదీ ఆవిష్కరించారు. మార్కెట్లో వివిధ రకాల బ్రాండ్లు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయని, అధిక కమీషన్ కోసం డీలర్లు కొన్ని రకాల బ్రాండ్లనే విక్రయిస్తున్నారని, ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఏకైక బ్రాండ్‌ను తీసుకొచ్చినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. ఖజానాపై ‘ఎరువుల’ భారం కిసాన్ సమృద్ధి కేంద్రాల్లో రైతులకు బహుళ సేవలు అందుతాయని తెలియజేశారు. ఇవి ‘వన్ స్టాప్ షాప్’గా పని చేస్తాయన్నారు. దేశవ్యాప్తంగా 3.25 లక్షల రిటైల్ ఎరువుల దుకాణాలను కిసాన్ సమృద్ధి కేంద్రాలుగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. ఎరువుల కోసం మనం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని, ఎరువులపై కేంద్ర ప్రభుత్వం ప్రతిఏటా రూ.2.5 లక్షల కోట్ల మేర రాయితీ భారం భరిస్తోందన్నారు. ఒక్కో కిలో ఎరువును రూ.80కి కొని, రైతులకు రూ.6కు అమ్ముతున్నామని చెప్పారు. ఎరువులతోపాటు ముడి చమురు, వంట నూనెల దిగుమతుల భారం సైతం పెరుగుతోందన్నారు. దిగుమతుల బిల్లు తగ్గించుకోవాలని, ఎరువులు, వంట నూనెల ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించాలని, ఈ విషయంలో మిషన్ మోడ్‌లో పనిచేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. పీఎం కిసాన్ సమ్మాన్ సమ్మేళన్‌లో కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్ తోమర్, మన్సుఖ్ మాండవియా తదితరులు పాల్గొన్నారు. 13,500 మందికిపైగా రైతులు హాజరయ్యారు. దాదాపు 1,500 వ్యవసాయ స్టార్టప్ కంపెనీలు తమ ఉత్పత్తులను, నవీన ఆవిష్కరణలను ప్రదర్శించాయి. -
AP: రైతన్నల ఖాతాల్లోకి రూ.1036 కోట్ల నగదు జమ
సాక్షి, అమరావతి: వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద మూడోవిడత పెట్టుబడి సాయం జమ చేసింది. మొత్తం 50,58,489 మందికి రూ.1,036 కోట్లు జమ చేసింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లోకి జమ చేశారు. ఈ మొత్తంతో కలిపి 2021–22 సీజన్లో రూ.6,899.67 కోట్లు జమ కాగా గడిచిన మూడేళ్లలో ఈ పథకం కింద రూ.19,812.79 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లయ్యింది. వైఎస్సార్ రైతుభరోసా–పీఎం కిసాన్ కింద ఏటా మూడు విడతల్లో రూ.13,500 చొప్పున అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటికి రూ.5,863 కోట్లు జమ 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతల్లో 50.37 లక్షల రైతు కుటుంబాలకు రూ.5,863.67 కోట్లు జమచేశారు. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,848.33 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేయ గా, పీఎం కిసాన్ కింద రూ.2,015.34 కోట్లు కేంద్రం కేటాయించింది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు కాగా, 82,251 మంది ఆర్ఓఎఫ్ఆర్–దేవదాయ భూము లు సాగుచేస్తున్న రైతులతోపాటు 68,737 మంది కౌలుదారులున్నారు. భూ యజమానులకు రూ.7,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమచేయగా, పీఎం కిసాన్ కింద కేంద్రం అందించిన రూ.4వేలు సర్దుబాటు చేసింది. ఇక తొలిరెండు విడతల్లో అర్హత పొందిన 1,50,988 మంది కౌలుదారులు, ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు మాత్రం రెండు విడతల్లో రూ.11,500 చొప్పున రైతుభరోసా కింద రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా జమచేసింది. ఇప్పుడు మూడో విడతలో ఇలా.. ఇక మూడో విడతలో 48,86,361 మంది భూ యజమానులకు పీఎం కిసాన్ కింద రూ.2వేల చొప్పున రూ.977.27 కోట్లు జమచేయనుండగా, గతంలో అర్హత పొందిన 1,50,988 మంది ఆర్ఓఎఫ్ఆర్, కౌలుదారులకు రూ.2వేల చొప్పున వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.30.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. కొత్తగా సాగుహక్కు పత్రాలు æ(సీసీఆర్సీ) పొందిన 21,140 మంది కౌలుదారులకు వైఎస్సార్ రైతుభరోసా కింద ఒకేవిడతగా రూ.13,500 చొప్పున రూ.28.53 కోట్లు నేడు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తోంది. మూడు విడతలు కలిపి 2021–22లో 50,58,489 మందికి రూ.6,899.67 కోట్లు పెట్టుబడి సాయం అందించినట్లు అవుతుంది. ఈ మొత్తంలో వైఎస్సార్ రైతుభరోసా కింద రూ.3,907.06 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం జమచేస్తుండగా, పీఎం కిసాన్ కింద రూ.2,992.61 కోట్లు కేంద్రం అందిస్తోంది. లబ్ధిపొందిన వారిలో 48,86,361 మంది భూ యజమానులు, 82,251 మంది ఆర్ఓఎఫ్ ఆర్–దేవదాయ భూముల సాగుదారులు, 89,877 మంది భూమిలేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సాగుదారులున్నారు. ఇక సామాజిక తనిఖీలో భాగంగా రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను ఆర్బీకేల్లో ప్రదర్శించనున్నారు. -
తొలిరోజు రూ. 516 కోట్లు.. నేడు మరో రూ.1,152.46 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఈ వానాకాలం సీజన్‌కు గాను రైతుబంధు నిధులు మంగళవారం రైతుల ఖాతాల్లో జమ చేయడం ప్రారంభమైంది. ఈ నెల 25 వరకు ఈ జమ కార్యక్రమం ఉంటుంది. తొలిరోజు 16.95 లక్షల మంది రైతులకు రూ. 516.95 కోట్లు వారి బ్యాంకు ఖాతా ల్లో జమయ్యాయని వ్యవసాయశాఖ వెల్లడించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,11,970 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 36.10 కోట్లు జమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లా లో అత్యల్పంగా 9,628 మంది రైతుల ఖాతా ల్లోకి రూ. 35.60 లక్షలు జమ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఎకరా వరకు ఉన్న 10,33,915 ఎకరాలకు చెందిన 16,95,601 మంది రైతుల ఖాతాల్లోకి నిధులు చేరినట్లు అధికారులు తెలిపారు. రెండోరోజు 2 ఎకరాల వరకు 23.05 లక్షల ఎకరాలకుగాను 15.07 లక్షల మంది ఖాతాల్లోకి రూ.1,152.46 కోట్లు జమ చేస్తామని వెల్లడించారు. రెండో రోజు కూడా నల్లగొండ జిల్లాలో అత్యధికంగా1,10,407 మంది రైతుల ఖాతాలకు రూ. 85.23 కోట్లు జమ చేస్తారు. రైతుబంధు నిధులు అన్నదాతల ఖాతాల్లో జమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యవసాయ మంత్రి నిరం జన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు కూడా ట్విట్టర్ వేదికగా మొదటి రోజు రైతుల ఖాతా ల్లో సొమ్ము జమయినట్లు చెప్పారు. రైతులకు అభినందలు తెలిపారు. కాగా, ఈ సీజ¯Œ లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన 150.18 లక్షల (కోటిన్నర) ఎకరాలకు రూ. 7,508.78 కోట్లు రైతుబంధు నిధులు ఇవ్వనున్నారు. -
నేటి నుంచి రైతుల ఖాతాల్లోకి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించిన పెట్టుబడి సాయం మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వర్షాలు పడుతున్న కీలకమైన సమయంలో రైతులకు నగదు జమ కావడం ఎంతో ఊరటనిచ్చే అంశం. మంగళవారం ఒక ఎకరా వరకు భూమి కలిగిన రైతులందరికీ రైతుబంధు నిధులు వేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందర్రావు తెలిపారు. గత సీజన్లో మాదిరిగానే జమ చేసే ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈ నెల 25 వరకు రైతుబంధు సొమ్ము అందరికీ అందుతుందన్నారు. ఈ సీజన్లో 63,25,695 మంది అర్హులైన రైతులకు చెందిన కోటిన్నర ఎకరాలకు రూ.7,508 కోట్ల నిధులు అందుతాయి. గత యాసంగి కన్నా 2.81 లక్షల మంది కొత్తగా రైతులు పెరిగిన సంగతి తెలిసిందే. -
రైతుబంధుకూ ‘లెక్కాపత్రం’
సాక్షి, హైదరాబాద్: రానున్న వానాకాలం, యాసంగి సీజన్లకు రైతుబంధు సొమ్ము విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. రెండు సీజన్లలో సీజన్‌కు ఎకరానికి రూ.5వేల చొప్పున ఇవ్వనున్న పెట్టుబడి సాయాన్ని నేరుగా రైతు ఖాతాల్లోకి ఈ–కుబేర్ ద్వారా జమ చేస్తామని, నిధుల లభ్యతను బట్టి తక్కువ విస్తీర్ణం ఉన్న రైతులకు తొలి ప్రాధాన్యమిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం జనవరి 23, 2020న భూపరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) ఇచ్చిన పట్టాదారుల రికార్డుల ఆధారంగా రైతుబంధు పంపిణీ చేస్తారు. కాగా, రైతుల ఖాతాల్లో నగదు జమయిన తర్వాత రికార్డులను ఆడిట్ టీంలు పరిశీలిస్తాయి. వ్యవసాయ శాఖ నియమించిన ఆడిటర్లు లేదా కాగ్ ప్రతినిధులు ఆడిటింగ్‌లో పాల్గొంటారు. నాబార్డు, కాగ్, ఆర్బీఐ నిబంధనలకనుగుణంగా తనిఖీలుంటాయి. ‘రైతుబంధు’ అమలుకు మార్గదర్శకాలివే.. ► ఈ ఆర్థిక సంవత్సరానికి అవసరమైన బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించిన సమయంలో సీసీఎల్ఏ ఇచ్చిన రికార్డుల ఆధారంగా భూమి యజమానులకు మాత్రమే రైతుబంధు వర్తిస్తుంది. ఆ తర్వాత రికార్డుల్లో పేర్లు మారినా కొత్త రైతులకు మాత్రం మళ్లీ వానాకాలం నుంచే రైతుబంధు వర్తింపజేస్తారు. రబీలోనూ వీరిని పరిగణనలోకి తీసుకోరు. ► సీసీఎల్ఏ నుంచి ఏడాదికి ఒక్కసారే అర్హులైన రైతుల వివరాలు తీసుకుంటారు. అంటే జనవరి 23, 2020న తీసుకున్న రికార్డుల్లో మార్పులు చేయాలనుకుంటే ఏడాది వరకు ఆగాల్సిందే. ► గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ ఇచ్చిన జాబితా ఆధారంగా అటవీ భూములపై హక్కు పత్రాలు (ఆర్వోఎఫ్ఆర్)న్న రైతులకూ రైతుబంధు వర్తిస్తుంది. పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం పాలితం గ్రామ హామ్లెట్ కాసులపల్లిలో రంగనాయకస్వామి దేవాలయ భూములను దీర్ఘకాలికంగా సాగు చేసుకుంటున్న 621 మంది రైతులకు కూడా ఆర్వోఎఫ్ఆర్ తరహాలో ప్రత్యేక కేసు కింద పరిగణించి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ ఇచ్చే విస్తీర్ణపు అంచనా మొత్తానికి రైతుబంధు వర్తింపజేస్తారు. ► ఒక రైతుకు సంబంధించిన భూమి రాష్ట్రంలో ఎక్కడున్నా సదరు రైతు ఆధార్ వివరాల ఆధారంగా అన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటారు. ► గత మూడు సీజన్ల తరహాలోనే ఈ–కుబేర్ వ్యవస్థ ద్వారా నేరుగా రైతు ఖాతాల్లోకే నిధులు జమ చేస్తారు. ► ఆర్థిక శాఖ నుంచి రైతుబంధు నిధులు దశలవారీగా వస్తే.. తక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల నుంచి ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల వరకు బిల్లులు ప్రాధాన్యతా క్రమంలో పాస్ అవుతాయి. ► ఎవరైనా రైతు పెట్టుబడి సాయం వద్దనుకుంటే మండల వ్యవసాయ విస్తరణాధికారి లేదా వ్యవసాయ అధికారికి ‘గివిట్ అప్’ దరఖాస్తు పూర్తిచేసి ఇవ్వాలి. తద్వారా రైతుబంధు పోర్టల్‌లో ఆ పట్టాదారు కాలమ్‌లో ‘గివిట్‌అప్’ అని నమోదుచేస్తారు. ► ఈ పథకం అమలు పర్యవేక్షణకు రాష్ట్రస్థాయిలో కమిటీ ఏర్పాటుచేశారు. కమిటీ చైర్మన్‌గా వ్యవసాయ శాఖ కార్యదర్శి, కన్వీనర్‌గా కమిషనర్, సభ్యులుగా ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్, రాష్ట్ర సమాచార అధికారి (ఎన్ఐసీ) ఉంటారు. ► కలెక్టర్ల మార్గదర్శనం మేరకు జిల్లాస్థాయిలో వ్యవసాయ అధికారులు పథకం అమలు బాధ్యతలు తీసుకుంటారు. ► మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో ఏర్పా టు చేసుకునే వ్యవస్థల ఆధారంగా, రెవెన్యూ శాఖతో సంప్రదింపులు జరుపుతూ జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో పథకం అమ లుకు సంబంధించిన ప్రతి వినతిని 30 రోజుల్లోగా పరిష్కరించాల్సి ఉంటుంది. -
రైతుకు భరోసా
నారాయణపేట: ‘భూ ప్రక్షాళనలో చిన్న చిన్న తప్పులతో కొంతమందికి మాత్రమే కొత్త పాసు పుస్తకాలు రాలేదు.. ఇందుకు ఎవరూ పరేషాన్ కావొద్దు.. రెవెన్యూ రికార్డుల్లో భూములు మీవైతే.. మీకు తప్పకుండా కొత్త పాసుపుస్తకాలు వస్తాయ్.. రైతు బంధు డబ్బులు మీ బ్యాంకు ఖాతాలోనే జమ అవుతాయి.. ఇందులో ఎలాంటి అపోహలు పెంచుకోవద్దు..’ అని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. భూ సమస్యలు, రైతుబంధు తదితర సమస్యలపై ప్రజలు తమ గోడును వినిపించేందుకు కలెక్టర్‌తో మంగళవారం ఉదయం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టరేట్లో నిర్వహించిన ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లా నలుమూలల నుంచి పలువురు రైతులు ‘సాక్షి’ ఫోన్ ఇన్ ద్వారా భూ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు చెప్పిన సమస్యలను కలెక్టర్ ఓపికగా విని.. పరిష్కారానికి భరోసా ఇచ్చారు. సమస్యల ఏకరువు.. చాలామంది రైతులు రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం రావడం లేదని.. కొత్త పాసుపుస్తకాలు ఇవ్వలేదని.. పట్టాదారు పాస్ పుస్తకాలకు అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదంటూ కలెక్టర్‌కు ఫోన్లో ఏకరువు పెట్టారు. స్పందించిన కలెక్టర్ ఫోన్ చేసిన రైతులందరి సమస్యలను పరిష్కరించడమే కాకుండా.. సమస్య పరిష్కారం తర్వాత వారికి తిరిగి ఫోన్ చేసి చెప్పాలని తహసీల్దార్లను ఆదేశించారు. కొంతమంది రైతుల ఫోన్ నంబర్లను నోట్ చేసుకొని సంబంధిత వీఆర్ఓలకు సమాచారం అందించి రైతులకు న్యాయం చేయాలని సూచించారు. మరి కొంతమంది రైతులకు మాత్రం ఈ రోజు (మంగళవారం) సాయం త్రం వరకు మీమీ మండల తహసీల్దార్ల వద్దకు వెళ్లి సమస్యను వివరించాలని చెప్పారు. ఫోన్ ఇన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదును ఆర్డీఓ నోట్ చేసుకున్నారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రఘువీరారెడ్డి, ఆర్డీఓ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ బాలాజీ, నారాయణపేట తహసీల్దార్ రాజు, జిల్లాలోని తహసీల్దార్లు పాల్గొన్నారు. సార్ నీ కాల్మొక్త.. పాసు బుక్ ఇస్తలేరు కలెక్టర్ సార్ నీ కాల్మొక్త.. నా పేరు హన్మంతు. దామరగిద్ద మండలం ఆశన్‌పల్లి గ్రామం. 1996లో సర్వే నంబర్లు 91, 92, 94లలో ఐదెకరాల భూమి కొన్నాం. డాక్యుమెంట్లు, ఈసీ ఉన్నాయి. ఉర్దూలో ఉన్న డాక్యుమెంట్లను తెలుగులోకి మార్పించా. సంబంధిత పత్రాలను రెవెన్యూ అధికారులకు చూపించినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. నాకు న్యాయం చేయండి సారూ. కలెక్టర్ స్పందిస్తూ.. హన్మంతు మీ డాక్యుమెంట్లు తీసుకెళ్లి ఈ రోజు సాయంత్రం దామరగిద్ద తహసీల్దార్‌ను కలవండి. వాటిని సరిచూసి విచారణ జరిపి మీకు న్యాయం జరిగిలే చూస్తాం. సరే సార్ మీకు రుణపడి ఉంటా. నా భూమి నాకు ఇప్పించండి సార్.. నా పేరు కుర్వ దశరథ్. ఊట్కూర్ మండలం పెద్దపొర్ల గ్రామం. సర్వే నంబర్ 170/సీ/5లో 18 గుంటల భూమి ఉంది. రికార్డుల్లో మార్చి నాకు భూమి లేకుండా చేశారు. నా వద్ద పట్టా పాసు బుక్కు ఉంది. రెవెన్యూ అధికారులను అడిగితే పట్టించుకోవడం లేదు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ.. అక్కడే ఉన్న ఊట్కూర్ తహసీల్దార్‌ను విచారణ జరిపి భూమిపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. భూమి దశరథ్‌దే అని తేలితే సంబంధిత వీఆర్ఓపై చర్యలు తీసుకునేందుకు వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. పట్టా చేసుకున్న వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని హెచ్చరించారమూడెకరాలకు ఎకరానే వచ్చింది సార్ మా మామయ్య హన్మంతు పేరిట సర్వే నంబర్లు 692, 704లో మూడెకరాల భూమి ఉంది. కొత్త పుస్తకంలో ఒక ఎకరా మాత్రమే వచ్చింది. నా పేరు పవిత్ర. మాది మరికల్ గ్రామం. ఇంకా రెండు ఎకరాల భూమి ఎక్కడపోయింది. మాకు న్యాయం చేయండి. కలెక్టర్ స్పందిస్తూ.. మరికల్ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ఖలీద్ ను కలిసి భూమికి సంబంధించిన పట్టాదారు పాసు పుస్తకాలు చూయించండి. రికార్డులను పరిశీలించి సరిచేసుకునే అవకాశం ఉంది. కొత్త పాసుపుస్తకం రాలేదు సార్.. నా పేరు నీరటి వెంకటమ్మ. మాది నారాయణపేట పట్టణం పళ్లబురుజు. సర్వే నంబర్లు 441, 443లో తొమ్మిది ఎకరాలకు 10 సెంట్లు తక్కువగా ఉంది. మొదటి విడతలో పాసుపుస్తకం రాకపోయినా రైతుబంధు డబ్బులు ఇచ్చారు. ఇంత వరకు కొత్త పాసుపుస్తకం రాలేదు. రెండో విడత డబ్బులు పడలేదు. దయచేసి నాకు కొత్త పాసు పుస్తకం ఇప్పించి రైతుబంధు డబ్బులు వేయించండి సార్ మీకు పుణ్యమొస్తది. తక్షణమే కలెక్టర్ స్పందించి ఫోన్ ఇన్ నీరటి వెంకటమ్మను లైన్లోనే పెట్టి వెంటనే వీఆర్ఓ కు ఫోన్ కలపండంటూ పక్కనే ఉన్న నారాయణపేట తహసీల్దార్‌కు ఆదేశించారు. వీఆర్ఓ తో ఫోన్లో మాట్లాడుతూ నీరటి వెంకటమ్మకు సంబంధించిన భూమిపై నివేదిక సాయంత్రం వరకు నా టేబుల్‌పై ఉండాలని ఆదేశించారు. ఇనాం భూములకు.. సార్.. నాపేరు గజలప్ప. దామరగిద్ద మండలం బాపన్‌పల్లి గ్రామం. సర్వే నంబర్లు 9, 10, 11, 16లలో దాదాపు 20 కుటుంబాలకు ఇనాం భూ ములు ఇచ్చారు. కొత్త పాసు పుస్తకాలు ఇవ్వ మంటే ఇవ్వడం లేదు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవడం లేదు. కలెక్టర్ స్పందిస్తూ.. బాపన్‌పల్లిలో ఈనాం భూములకు సంబంధించి వెంటనే విచారణ చేపట్టి నివేదికలను సమర్పించాలని ఆర్డీఓ శ్రీనివాసులు సూచించారు. బాపన్పల్లితోపాటు ఇతర గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉంటే తహసీల్దార్లతో సమీక్షించి వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. బుక్క రాలే.. పైసలు పడలే సార్.. నా పేరు నర్సింహులు. దామరగిద్ద మండలం లక్ష్మీపూర్. ఇంత వరకు కొత్త పాసు పుస్తకం రాలేదు. రైతుబంధు డబ్బులు పడలేదు. ఆరు నెలలుగా రెవెన్యూ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా. అప్పుడు.. ఇప్పుడు అంటూ తిప్పుతున్నారు. కానీ, ఇంత వరకు బుక్ ఇస్తలేరు. నాకు న్యాయం చేయండి సార్. కలెక్టర్ స్పందిస్తూ..ఈ రోజు సాయంత్రం 4 గంటలకు దామరగిద్ద తహసీల్దార్‌ను వెళ్లి కలవండి. మీ దగ్గర ఉన్న పాత పాసు బుక్కులు చూయించండి. ఏమైనా సమస్య ఉంటే వాటి ని సరిచేసి కొత్తపాసు బుక్కు ఇచ్చేందుకు చర్యలు చేపడుతాం. నా కొడుకు జర్మనీలో ఉంటాడు సార్.. నా పేరు రఘుపతిరెడ్డి. మద్దూరు మండలం నిడ్జింత. నా కొడుకు జర్మనీలో ఉంటాడు. భూమి కొడుకు పేరు మీద ఉంది. కొత్త పట్టా పాసు పుస్తకం రాలేదు. ఆఫీసులో అడిగితే ఈకేవైసీ సమస్య ఉందంటున్నారు. మాకు పట్టా పాసుపుస్తకం ఇప్పించండి. కలెక్టర్ స్పందిస్తూ.. మీ కుమారుడి ఆధార్ కార్డును ఈకేవైసీ ద్వారా ఆన్లైన్లో అప్లోడ్ చేయించాలి. మీరు తహసీల్దార్ కార్యాలయంలో వెళ్లి కలవండి. మీ కుమారుడి ఆధార్ నంబర్‌కు లింకైన ఫోన్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఆ నంబ ర్ చెబితే లింకప్ చేసి ఓకే చేస్తారు. అప్పుడు మీ కొడుకు పేరిట కొత్త పాసుపుస్తకం వస్తుంది. తహసీల్దార్‌ను కలిసిన రైతులు తమకు పొలాలు ఉన్న కొత్త పట్టా పాసు పుస్తకాలు రాలేదని ‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చిన సిద్దన్ కిష్టమ్మ, నీటి వెంకటమ్మల కుటుంబ సభ్యులు కలెక్టర్ సూచన మేరకు సాయంత్రం 4 గంటలకు తహసీల్దార్ రాజు ను కలిసి భూముల పట్టా పాసు పుస్తకాల జిరాక్స్ కాపీలను అందజేశారు. కలెక్టర్‌కు ఫోన్ ఇన్‌లో తమ సమస్యను వివరించామని, మిమ్మల్ని కలవాలని చెప్పారని వివరించారు. దీంతో తహసీల్దార్ స్పందిస్తూ.. రెండు, మూడు రోజుల్లో సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తామని హామీ ఇచ్చారు. -
డబ్బుల్ ధమాకా
తొలకరి జల్లులు కురిసింది మొదలు దుక్కులు దున్నడం.. ఎరువులు.. విత్తనాలు.. కూలీల కోసం ఇలా అన్నదాతకు ఎన్నో రకాల ఖర్చులుంటాయి. ఇందుకోసం అయినకాడికి అప్పు చేసి సాగుబాట పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పంట పండించినా.. వర్షాభావం, కరువు కాటకాలతో పెట్టుబడి చేతికి రాకపోగా చివరికి చేసిన అప్పులే మిగులుతున్నాయి. మరోపని చేయలేక ఉన్న భూమిని నమ్ముకుని కష్టాల సాగు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో దేశానికి అన్నం పెట్టే రైతన్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. వారి కష్టాలను దూరం చేసేందుకు.. మొహాల్లో చిరునవ్వును చిందించేందేకు ఆర్థిక తోడ్పాటును అందిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ‘రైతుబంధు’ పేరిట పెట్టుబడి సాయం అందిస్తోంది. కేంద్రం కూడా సాయం చేసేందుకు ముందుకొచ్చింది. పీఎం కిసాన్ పథకంలో ప్రతిరైతుకు రూ.6వేల చొప్పున అందిస్తోంది. వారి వివరాలు కూడా కలిపితే లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. సాక్షి, మెదక్ : కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్సమ్మన్ నిధి పథకం కింద ప్రతిరైతుకు ఏడాదికి మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున ఏడాదికి రూ.6 వేల చొప్పున అందిస్తోంది. ఈ పథకంలో ఐదెకరాల లోపు ఉన్న రైతులను మాత్రమే అర్హులుగా పేర్కొంది. జిల్లాలో ఐదెకరాల లోపు 1,18,386 మంది రైతు కుటుంబాలు ఉన్నాయి. వీరికి ఏడాదికి ఒక్కొక్కరికి రూ.6 వేల చొప్పున మొత్తం రూ.71కోట్ల 30 లక్షల 16వేలు అవుతోంది. వీటిని మూడు విడతల్లో రైతుల ఖాతాల్లో వేయనున్నారు. ఇంకా కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు రాని వారు చాలా మంది ఉన్నారు. రైతుబంధుతో రూ.372 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.4వేల చొప్పున అందించేది. దానిని ప్రస్తుతం రూ.5 వేలకు పెంచింది. ఖరీఫ్, రబీసీజన్ కలిపి ఏడాదికి రూ.10 వేల చొప్పున ఇవ్వనుంది. జల్లాలోని 2,11,104 మంది లబ్ధిదారులలు 3.70 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. జిల్లాలో ఏడాదికి రూ.372 కోట్లను ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయం కింద అందించనుంది. ఎకరం భూమి ఉన్న రైతుకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి రూ.6వేలు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలు అందిస్తోంది. రెండు ప్రభుత్వాలు కలిపి ఏడాదికి రూ.16 వేల చొప్పున అందిస్తున్నాయి. ఈ లెక్కన ఏడాదికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి జిల్లా రైతులకు రూ.443 కోట్ల 30 లక్షల 16వేలను అందిస్తున్నాయి. ‘రైతుబంధు’ అందింది ప్రభుత్వం రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయం అన్నదాతలకు గొప్పవరం. గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఇంత మంచి పథకాన్ని తీసుకురాలేదు. రైతుబంధు పథకంలో భాగంగా ఎకరాకు రూ.పదివేల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం హర్షించదగిన విషయం. నాకు ఉన్న రెండన్నర ఎకరాలకు సంబంధించి రూ.12,500 వచ్చింది. దీంతో పెట్టుబడికి ఎలాంటి ఇబ్బంది లేదు. – కొమ్మాట బాబు, రైతు, నిజాంపేట -
రైతుబంధుపై ఆందోళన వద్దు
బషీరాబాద్: మీ సేవలో ఆధార్ లింక్ చేసుకున్న రైతులందరికీ త్వరలో పాసుపుస్తకాలు అందజేస్తామని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ తెలిపారు. రైతుబంధు రాలేదని ఆందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. బషీరాబాద్ మండలం జలాల్పూర్లో బుధవారం నిర్వహించిన రెవెన్యూ గ్రామ సభకు హాజరైన కలెక్టర్ రైతుల సమస్యలను తెలుసుకున్నారు. నీళ్లపల్లి అటవీ ప్రాంతం లోని భూములకు సంబంధించి పాసుపుస్తకాలు ఉన్న వారికి పదిహేను రోజుల్లో రైతుబంధు సాయం అందుతుందని చెప్పారు. ఈకేవైసీ చేసుకోని రైతులు వెంటనే మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధా ర్ అనుసంధానం చేయించుకోవాలన్నారు. జలాల్పూర్లో చెం చులు తమకు పాసుపుస్తకాలు రాలేదని కలెక్టర్‌కు విన్నవించారు. దీనిపై స్పందించిన ఆమె సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహసీల్దార్ వేప చేదు ఉమామహేశ్వరి, వీఆర్ఓ పెంటప్ప, రైతులు పాల్గొన్నారు. బడిబాటను విజయంవంతం చేయాలి... వికారాబాద్ అర్బన్: జిల్లాలో ఈ నెల 14 నుంచి 19వరకు అన్ని పాఠశాలల్లో బడిబాట కార్యక్రమం నిర్వహించాలని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను ఆదేశించారు. సంబంధిత శాఖ అధికారులతో బుధవారం తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ నెల 14న వికారాబాద్ పట్టణంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను ఇందులో భాగస్వాములను చేయాలని తెలిపారు. 6 నుంచి 14 సంవత్సరాలలోపు బడీడు పిల్లలను గుర్తించి వారిని వివిధ పాఠశాలల్లో చేర్పించాలన్నారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఏడీ భరత్ కుమార్, అసిస్టెంటు కమిషనర్ ఆఫ్ లేబర్ చంద్రశేఖర్‌గౌడ్, డీడబ్ల్యూఓలు జ్యోత్స్న, హన్మంతరావు, చైల్డ్‌లైన్ సభ్యులు పాల్గొన్నారు. బషీరాబాద్ ఎందుకు వెనకబడింది.. బషీరాబాద్: మరుగుదొడ్ల నిర్మాణంలో బషీరాబాద్ మండలం ఎందుకు వెనకబడిందని కలెక్టర్ ఆయేషా మస్రత్ ఖానమ్ అధికారులను నిలదీశారు. ఎట్టి పరిస్థితిలోనూ ఈ నెలాఖరుకు మండలంలో వంద శాతం మరుగుదొడ్ల నిర్మాణం పూర్తికావాలని ఆదేశించారు. మండల కేంద్రంలోని రాధాకృష్ణ సమావేశ మందిరంలో డీఆర్డీఏ పీడీ జాన్సన్, ఎంపీపీ కరుణ, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మండలాన్ని ఓడీఎఫ్‌గా మార్చడానికి బాధ్యతగా పనిచేయాలని సూచించారు. గ్రామాల్లో ఎక్కడైనా సమస్యలు వస్తే స్తానిక ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య పరిష్కరించుకోవాలనితెలిపారు. ఇసుక సమస్య లేకుండా తహసీల్దార్ అనుమతులు ఇస్తారని చెప్పారు. గ్రామాల వారీగా కమిటీలు వేసుకొని ఉద్యమంలా నిర్మాణాలు పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణాలు చేపట్టడానికి కాంట్రాక్టర్లు ముందుకు రాకపోతే.. ఈ బాధ్యతలను స్థానికులకు అప్పగిస్తామని చెప్పారు. విధుల పట్ల నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి రవి, ఎంపీడీఓ అనురాధ, ఈఓపీఆర్డీ ఉమాదేవి, ఎస్ఐ మహిపాల్‌రెడ్డి, ఉపాధి, వెలుగు అధికారులు పాల్గొన్నారు. -
రైతుబంధు సాయం.. రూ.350 కోట్లు
ఖరీఫ్ ప్రారంభ సమయానికే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయం సొమ్ము బ్యాంకు ఖాతాలో జమ అవుతుండడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఇక సాగు పెట్టుబడుల కోసం అప్పులు చేయాల్సిన బాధ తప్పిందని అన్నదాతలు సంబరపడుతున్నారు. ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన రైతులందరికీ పెట్టుబడి సాయం అందనుంది. గత రబీ సీజన్ వరకు ఎకరాకు రూ.4 వేల పెట్టుబడి సాయాన్ని జమ చేసిన ప్రభుత్వం.. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేస్తోంది. ప్రభుత్వం గత రబీలో ఎంపిక చేసిన రైతులందరికీ పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించింది. రైతు సమగ్ర సమాచారం సేకరణతో.. సాగులో లేని భూములకు రైతుబంధు వర్తింపజేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందారు. అయితే, ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యాచారం(ఇబ్రహీంపట్నం): ఆన్లైన్లో భూ వివరాలు నమోదైన జిల్లాలోని 2,77,516 మంది రైతులకు ఎకరాకు రూ.5 వేల చొప్పున జమ చేయడానికి రూ.350 కోట్లు విడుదలయ్యాయి. రెండు రోజుల నుంచి రైతుబంధు పెట్టుబడి సాయం రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఖరీష్‌కు పెరిగిన రైతుల సంఖ్య... గత రబీ సీజన్లో పెట్టుబడి సాయాన్ని 2,74,000 మంది రైతులకు అందజేస్తే ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో అదనంగా 3,500 మంది రైతులు పెరిగారు. జిల్లాలో మొత్తం రైతుల సంఖ్య 2,77,516 ఉండగా, అందులో 2లక్షల 24వేల మంది రైతులకు సంబంధించి భూ వివరాలు, ఆధార్, బ్యాంకు ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేయడం జరిగింది. దాదాపు 20వేల మందికి పైగా రైతులు సరైన వివరాలు అందజేయని కారణంగా రైతుబం«ధు పెట్టుబడి సాయాన్ని కోల్పోతున్నారు. ఆన్లైన్ నమోదు కోసం రైతులు రికార్డులు అందజేస్తే వెంటనే వారి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ అయ్యే అవకాశం ఉంది. అదే విధంగా భూముల క్రయ, విక్రయాల వల్ల కూడా కొందరి రైతులకు రైతుబంధు అందడం లేదు. భూ వివరాలు తక్షణమే అందజేస్తే ఆన్లైన్లో నమోదు చేసి ఖాతాలో పెట్టుబడి సాయం నిధులు జమ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఎకరాకు రూ.4వేల నుంచి రూ.5వేలకు పెంచడం వల్ల రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. రైతులకు ఎంతో మేలు ప్రభుత్వం రైతులకు మంచి అదునులో రైతుబంధు సాయం జమ చేస్తుండడం సంతోషకరం. 15 ఎకరాల్లో పత్తి సాగుకు రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తున్నా. పెట్టుబడి సాయం అందడం వల్ల అప్పు చేయాల్సిన పరిస్థితి తప్పింది. ఎకరాకు రూ.5 వేల పెట్టుబడి సాయం అందజేస్తుండడంతో రైతులకు ఎంతో మేలు కలుగుతుంది. – బత్తుల మోహన్‌రెడ్డి, రైతు, మాడ్గుల -
రైతులకు మరో చాన్స్
రబీలో పంట సాగు చేసి రైతుబంధు పథకం పొందని వారికి శుభవార్త. రబీలో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోని, రైతుబంధు పథకం వర్తించని రైతులకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పించనుంది. కొంతమంది రైతులు అర్హులయినప్పటికీ ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నూతన పాసుపుస్తకాలు అందక ప్రభుత్వ సాయానికి నోచుకోలేదు. రబీ దరఖాస్తుల గడువు ముగిసిన తరువాత రెవెన్యూ యంత్రాంగం పట్టాపాస్ పుస్తకాలను అందించింది. అయితే అధికారులు గత సంవత్సరం నవంబరు నుంచి వరుస ఎన్నికల్లో తలమునకలై ఉండడంతో జాప్యం జరిగింది. ప్రస్తుతం ప్రాదేశిక ఎన్నికలు కూడా ముగియడంతో తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ రైతులకు రైతుబంధు వర్తించనుంది. ఇటీవలనే తిరిగి రబీ ఆన్లైన్ సైట్‌ని రీ ఓపెన్ చేశారు. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 25 మండలాల్లో మొత్తం 2,81,938 మంది రైతులు ఉండగా, కేవలం 2,49,104 మంది మాత్రమే రైతుబంధు పథకం డబ్బులు అందుకున్నారు. మిగతా 32,834 రైతులు తమవద్ద తగిన ఆధారాలు లేక దరఖాస్తు చేసుకోలేకపోయారు. వీరికి అందించాల్సిన రూ. 22,96,08,570 సొమ్ము వ్యవసాయ శాఖ దగ్గర జమయి ఉన్నాయి. తాజాగా ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తు చేసుకోని రైతులను గుర్తించి వారి వివరాలను వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద ప్రదర్శించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి ఆదేశాలు రాగానే పూర్తి వివరాలతో కూడిన ప్రతులను ఏఈఓల ద్వారా రైతులకు అందించనున్నారు. ఈ ప్రకారం రైతులు తమ బ్యాంకు అకౌంట్, పట్టాదార్ పాస్ పుస్తకం, ఆధార్‌కార్డు జిరాక్స్‌లతో ఫాం నింపి ఏఈఓకు ఈ నెల 31 వరకు అందించాల్సి ఉంటుంది. వచ్చే నెల మొదటి వారంలో అర్హులైన వారి ఖాతాల్లో డబ్బులు జమకానున్నాయి. బ్యాంకు ఖాతాల్లో తప్పులు ఉండొద్దు రైతుబంధు కోసం దరఖాస్తు చేస్తుకున్నా అనివార్య కారణాలతో బ్యాంకుల్లో చాలామంది రైతులకు సంబంధించి తిరస్కరించారు. ఇందులో అధికంగా రైతులు తమ బ్యాంకు ఖాతాలను అందించినా డబ్బులు జమ కాలేదు. కొంత మందికి ఖాతాలో జమయినట్లు సమాచారం (మెస్సేజ్) వచ్చినా తీరా చూస్తే పాత బ్యాలెన్స్ మాత్రమే ఉంది. ఇలాంటి వారికి అధికారులు మరోసారి అవకాశం కల్పిస్తున్నారు. బ్యాంకుల నుంచి వివరాలు తెలుసుకున్నాక సంబంధిత గ్రామాల వ్యవసాయ విస్తరణాధికారులకు కొత్త అకౌంట్ నంబర్లు ఇచ్చినట్లయితే ఇంతకుముందువలె ఎకరానికి రూ. 4 చొప్పున అందించనున్నారు. కాగా ఈ సహాయాన్ని ఈ ఖరీఫ్ నుంచి ఎకరానికి రూ.5వేలు చేయనున్నారు. జిల్లాలో రబీలో 32,834 మందికి రైతుబంధు అందలేదు. బ్యాంకు ఖాతా వివరాలను రైతులు సరిగ్గా ఇవ్వాలని, ఒక్క అంకె తప్పు పడినా ఇబ్బంది తప్పదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఈ నెలాఖరు నుంచి అంటే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రైతుబంధు డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. జూన్ మొదటి వారంలోగా రైతులందరి ఖాతాల్లో వేయనున్నామని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రకటించింది. తొలకరి వర్షాలు కురిసే నాటికి ఖరీఫ్ సాగు మొదలుకు ముందు రైతులందరికీ అందజేయాలని సర్కారు కృతనిశ్చయంతో ఉంది. గతేడాది ప్రభుత్వం ఒక్కో సీజన్‌కు ప్రతీ రైతుకు ఎకరానికి రూ. 4వేల చొప్పున ఇవ్వగా.. ఎన్నికల హామీ మేరకు ఈ ఖరీఫ్ నుంచి రూ. 5 వేలు ప్రతీ సీజన్‌కు ప్రతీ ఎకరానికి రైతుల బ్యాంకు ఖాతాల్లో వేయనున్నారు. గతంలో రైతుబంధు రానివారికి రబీకి సంబంధించి ఎకరానికి రూ.4వేలు ఇవ్వనున్నారు. రైతుబంధు రాని అర్హులైన రైతులు ఈ నెల 31వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవచ్చు. గత రబీ సీజన్లో పట్టాదారు పాసుపుస్తకాలు లేక, బ్యాంకు ఖాతా నంబర్లు తప్పులు, తదితర కారణాల వల్ల సుమారుగా 32,834 మంది రైతుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వీరికి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఈ అవకాశాన్ని అర్హులు సద్వినియోగం చేసుకోవాలి. ఖరీఫ్ సీజన్లో రైతుబంధు పథకం లబ్ధిదారులకు సంబంధించి పూర్తి వివరాలతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రభుత్వం ఎప్పుడు నిధులు విడుదల చేసి ఖాతాల్లో జమ చేయడానికి అనుమతిస్తే అప్పుడు రైతుల ఖాతాల్లో వేస్తాం. ఈ సీజన్లో ప్రతీ ఎకరానికి రూ.5వేల చొప్పున ప్రభుత్వం ఇవ్వనుంది. బి.నర్సింహారావు, జేడీఏ -
దేశవ్యాప్తంగా రైతుబంధు!
న్యూఢిల్లీ: మూడు రాష్ట్రాల్లో ఓటమిపాలైన బీజేపీ రైతులకు చేరవయ్యేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఒక్కో పంటకాలానికి రైతులకు ఎకరాకు రూ.4 వేల చొప్పున నేరుగా వారి ఖాతాలోకే నగదును బదిలీచేసే కొత్త పథకానికి కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే, ఎకరానికి రూ.50 వేల వడ్డీ రహిత (రైతుకు గరిష్టంగా రూ.లక్ష) రుణాలు అందించాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ఈ రెండు పథకాల వల్ల కేంద్ర ఖజానాపై ఏటా రూ.2.3 లక్షల కోట్ల భారం పడే అవకాశాలున్నాయి. ఎరువుల సబ్సిడీ పథకాన్ని కూడా వీటిలో విలీనం చేయాలని యోచిస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈ వారంలోనే వెలువడుతుందని భావిస్తున్నారు. -
రేపు రైతుల ఖాతాల్లోకి ‘పెట్టుబడి’
సాక్షి, హైదరాబాద్: రబీ రైతుబంధు సొమ్ము పంపిణీకి వ్యవసాయశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సీజన్లో మొదటిదశ పెట్టుబడి సొమ్మును సోమ వారం రైతులకు అందజేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ధ్రువీకరించారు. ఐదు లక్షలమంది రైతుల బ్యాంకు ఖాతాలకు రూ.500 కోట్లు బదిలీ చేయనున్నట్లు ఆయన ‘సాక్షి’కి తెలిపారు. గత ఖరీఫ్ సీజన్లో రైతులకు ప్రభుత్వం రూ.5,100 కోట్లు పంపిణీ చేసింది. మొత్తం 51 లక్షల మంది రైతులకు గ్రామసభల్లో పెట్టుబడి చెక్కులను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో చెక్కుల పంపిణీ చేయొద్దని, నేరుగా రైతుల ఖాతాల్లోకే సొమ్మును అందజేయాలని ఎన్నికల కమిషన్ తేల్చిచెప్పడంతో బదిలీ ప్రక్రియ చేపట్టింది. 13 లక్షల బ్యాంకు ఖాతాల సేకరణ... రైతుల నుంచి బ్యాంకు ఖాతా నంబర్లను సేకరించేపనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు సేకరించాల్సి ఉండగా, ఇప్పటివరకు వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో) 13 లక్షలు సేకరించారు. వాటిని మరోసారి పరిశీలించాక ఎటువంటి అభ్యంతరాల్లేని ఖాతాలు ఐదు లక్షలు మండల వ్యవసాయ అధికారుల(ఏవో) వద్దకు చేరాయి. వాటిని ఇప్పటికే వ్యవసాయశాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. ఆ వివరాలను ఆర్థిక శాఖకు పంపారు. వాటిని సరిచూసుకున్న ఆర్థికశాఖ సోమవారం ఆయా బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము బదిలీ చేయనుంది. నెలలోగా పూర్తి చేసే ప్రణాళిక... మొదటిదశలో ఐదు లక్షలమంది రైతులకు పెట్టుబడి సొమ్మును బదిలీ చేశాక, తదుపరి వారంరోజుల్లోనే మరో విడత సొమ్ము అందజేసేలా వ్యవసాయశాఖ ప్రణాళిక రచించింది. నెల రోజుల్లోగా మొత్తం 52 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము చేరనుందని వ్యవసాయశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. ఖాతాల సేకరణ, సొమ్ము బదిలీ పనిలో దాదాపు 2,400 మంది ఏఈవోలు నిమగ్నమయ్యారు. -
ఖాతాల్లోకే ‘రైతుబంధు’
బూర్గంపాడు : రైతుబంధు పథకంలో భాగంగా పెట్టుబడి సాయం అందజేతకు ఎన్నికల సంఘం షరతులు విధించింది. పెట్టుబడి సాయాన్ని నేరుగా చెక్కుల రూపంలో కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని ఆదేశించింది. రెండో విడత రైతుబంధు చెక్కుల పంపిణీకి శాఖాపరంగా అన్ని ఏర్పాట్లు చేసుకున్న వ్యవసాయశాఖ ఎన్నికల సంఘం ఆదేశాలతో డైలమాలో పడింది. ఎన్నికల సంఘం ఆదేశానుసారం రైతుల ఖాతాలలో పెట్టుబడి సాయం అందించేందుకు చర్యలు ప్రారంభించింది. రైతుల బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకు ముమ్మర చర్యలు ప్రారంభించింది. గ్రామాల్లో ఏఈఓలు రైతుల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాస్తవానికి రైతుబంధు చెక్కులను ఈ నెల 7వ తేదీ నుంచి పంపిణీ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో చెక్కుల పంపిణీకి స్వస్తి చెప్పి బ్యాంకు ఖాతాలలో జమచేసే చర్యలు ప్రారంభించింది. రైతులకు పెట్టుబడి సాయం అందేందుకు మరో ఇరవైరోజులకు పైగా సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివరాల సేకరణలో అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను సేకరించేందుకు బుధవారం నుంచి వ్యవసాయ విస్తరణాధికారులు రైతుల ఇళ్లకు వెళ్లి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వారం రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు సొమ్మును జమచేయాలని వ్యవసాయశాఖ యోచిస్తోంది. బ్యాంకు ఖాతాలు లేనటువంటి రైతులకు వెంటనే ఖాతాలు తెరిపించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో రెవెన్యూశాఖ అధికారులు రైతుల బ్యాంకు ఖాతాలను కూడా సేకరించారు. వ్యవసాయశాఖ అధికారులు ఇప్పుడు రెవెన్యూశాఖ వద్ద ఉన్నటువంటి రైతుల బ్యాంకుఖాతాల సమాచారాన్ని కూడా తీసుకుంటున్నారు. దీంతో ఖాతాల సేకరణ సులువవుతుందని భావిస్తున్నారు. తొలివిడతలో సాయం పొందినవారికే.. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు రైతుబం«ధు పథకంలో తొలివిడతలో చెక్కులు తీసుకున్న రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందనుంది. కొత్తగా పట్టాహక్కులు కలిగిన రైతులకు పెట్టుబడిసాయానికి గండిపడింది. ఏఈఓలు రైతుల బ్యాంకు ఖాతాల సేకరణకు సంబంధించి ఓ ఫార్మట్‌ను వ్యవసాయశాఖ తయారుచేసింది. ఇందులో రైతుపేరు, గ్రామం, మండలం, జిల్లా, ఆధార్ నంబర్, పట్టాదారు పాసుపుస్తకం నంబర్, సెల్‌నెంబర్, బ్యాంకు పేరు, బ్రాంచి పేరు, ఐఎఫ్ఎస్సీ కోడ్, ఖాతా నంబర్ వివరాలు నమోద చేసి రైతుసంతకం, ఏఈఓలు సంతకాలు చేయాల్సివుంది. ఈ నివేదికలను వ్యవసాయశాఖ కమిషనర్‌కు కార్యాలయానికి అన్లైన్లో పంపాలి. ఆ తరువాత ఈ– కుబేర్ ద్వారా రైతుల ఖాతాల్లోకి నగదు జమచేయనున్నారు. జిల్లా ఖరీఫ్‌లో 1.21 లక్షల మంది రైతులకు 1. 31 లక్షల చెక్కులను పెట్టుబడి సాయంగా అందించారు. ఖరీఫ్‌లో జిల్లాలో రైతులకు రూ. 120 కోట్ల పెట్టుబడి సాయం అందింది. రబీలో కూడా అంతే మొత్తంలో అందనుంది. గతంలో లబ్ధిపొందిన వారికే.. ఖరీఫ్‌లో రైతుబంధు పథకంలో లబ్ధిపొందిన రైతులకే రబీలో పెట్టుబడి సాయం అందుతుంది. గతంలో మాదిరి చెక్కులు కాకుండా ఈ సారి రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం జమవుతుంది. రైతుల బ్యాంకు ఖాతాల సేకరణ ప్రక్రియ అన్ని మండలాల్లో చేపట్టాం. రైతులు వ్యవసాయశాఖ అధికారులకు సహకరించి బ్యాంకు ఖాతాల వివరాలను అందజేయాలి. –కే అభిమన్యుడు, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
కా‘పాడి’తేనే రైతుకు మేలు
* పాడి రైతులకు ఇంకా అందని ప్రోత్సాహకం * సర్కారు రూ.27 కోట్లు విడుదల చేసినా రైతులకు చెల్లించని తెలంగాణ విజయ డెయిరీ * రైతుల బ్యాంకు ఖాతాల వివరాలు సేకరిస్తున్నామంటూ సాకులు సాక్షి, హైదరాబాద్: పాలు పోసే రైతు నోట్లో మట్టి కొడుతోంది తెలంగాణ విజయ డెయిరీ. ప్రోత్సాహకం అందించకుండా నిరుత్సాహానికి గురిచేస్తోంది. సర్కార్ కరుణించినా విజయ డెయిరీ సాకులు వెతుకుతోంది. తెలంగాణ విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు ప్రోత్సాహకపు సొమ్ము బకాయిలను విజయ డెయిరీ ఇంకా చెల్లించనేలేదు. లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహం అందించాలి. నాలుగు నెలలుగా బకాయిలు పేరుకుపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ప్రభుత్వం ఇటీవల రూ.27 కోట్ల బకాయి సొమ్ము విడుదల చేసినా వాటిని రైతుకు అందించడంలో ఆలస్యమవుతోంది. ప్రోత్సాహకపు సొమ్ముతోపాటు రైతుకు ఇవ్వాల్సిన వాస్తవ పాల డబ్బులు కూడా సకాలంలో అందించడంలేదు. ప్రభుత్వం విడుదల చేసిన నిధుల నుంచి ప్రోత్సాహకం, అసలు సొమ్మును వేర్వేరుగా రైతుల ఖాతాలో వేసేందుకు కసరత్తు చేస్తున్నామని విజయ డెయిరీ అధికారులు సాకులు చెబుతున్నారు. దానికోసం రైతు ఖాతాల వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం విజయడెయిరీని కోరిందని పశు సంవర్థకశాఖ వర్గాలు తెలిపాయి. ఈ తతంగమంతా పూర్తి అయి రైతులకు బకాయిలు చేరాలంటే మరో నెల రోజుల వరకు పట్టే అవకాశముంది. కరువులో రైతులను ఆదుకోవడంలో సర్కారు విఫలమైందని తెలంగాణ ఆదర్శ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి కందాల బాల్‌రెడ్డి విమర్శించారు. ఏడాదిపాటు సక్రమంగా నడిపి ఇప్పుడు చేతులెత్తేశారు... విజయ డెయిరీకి పాలు పోసే రైతులకు లీటరుకు రూ. 4 నగదు ప్రోత్సాహం కల్పిస్తూ ప్రభుత్వం 2014 అక్టోబర్ 29వ తేదీన ఉత్తర్వులు జారీ చేసింది. అదే ఏడాది నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆ ఉత్తర్వును అమలు చేసింది. వర్షాలు లేకపోవడం, తీవ్ర కరువు ఛాయల నేపథ్యంలో రైతులు పాడిని ప్రత్యామ్నాయ జీవనవిధానంగా మలుచుకుంటున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సర్కారు పేర్కొంది. అందులో భాగంగా విజయడెయిరీ పరిధిలోని రైతులకు లీటరుకు 4 రూపాయలను ప్రోత్సాహకం కింద అదనంగా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో లీటరుకు రూ.28 చొప్పున చెల్లిస్తోంది. ప్రోత్సాహకపు ఉత్తర్వు అమలుకాకముందు విజయ డెయిరీ 1.18 లక్షల లీటర్ల పాలను రైతుల నుంచి సేకరించింది. ఉత్తర్వు అమలు ప్రారంభమైన 2014 నవంబర్ నుంచి 2015 అక్టోబర్ వరకు సరిగ్గా ఈ ఏడాది కాలంలో పాల సేకరణ 5.27 లక్షల లీటర్లకు పెరిగింది. ఇది సర్కారు అంచనాలను మించింది. అయితే గత ఏడాది అక్టోబర్ వరకు రైతులకు ప్రోత్సాహకపు సొమ్మును విజయ డెయిరీ సక్రమంగానే అందించింది. నవంబర్ రెండోవారం నుంచి సకాలంలో చెల్లించడంలో విఫలమైంది. దీంతో పాలపైనే ఆధారపడి జీవనం సాగిస్తోన్న రైతులు రోడ్డున పడ్డారు.