సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం.
అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదును అందించింది.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసింది జగన్ సర్కార్.
ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు.
ఇదీ చదవండి: జగనన్నకు చెబుదాంపైనా అక్కసు.. ఆయనగారి పైత్యం
Comments
Please login to add a commentAdd a comment