paddy lossed
-
ఏపీ: వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో అకాల వర్షాలకు దెబ్బతిన్న రైతులకు ధాన్యం డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు సమయం.. అదీ ఐదు రోజులకే ధాన్యం డబ్బుల్ని నష్టపోయిన రైతుల ఖాతాలో జమ చేయడం గమనార్హం. అకాల వర్షాలతో పంట దెబ్బ తిన్న రైతుల పట్ల ఉదాసీనంగా వ్యవహరించాలని మొదటి నుంచి సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం భావిస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నష్టపోయిన రైతులను ఆదుకోవడమే కాకుండా.. పంట నిల్వలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలంటూ ఎప్పటికప్పుడు అధికారుల్ని ఆదేశిస్తూ వస్తున్నారాయన. ఇక ఇప్పుడు రికార్డు సమయంలో రైతులకు నగదును అందించింది. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 5 రోజులకే ధాన్యం డబ్బులు జమ అయ్యాయి. ఈరోజు ఒక్కరోజే 32,558 రైతులకు 474 కోట్లు జమ కాగా.. రబీ సీజన్‌కి సంబంధించి ఇప్పటివరకు రూ. 1,277 కోట్లు ధాన్యం డబ్బులు జమ చేసింది జగన్ సర్కార్. ఏపీలో ఇప్పటిదాకా 82.58 శాతం రైతులకు డబ్బులు జమ అయ్యాయి. వాస్తవానికి 21 రోజులు సమయమున్నా.. 5 రోజులకే రైతులకు చెల్లింపులు జరిగాయి. జిల్లాల వారీగా పరిశీలిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా రైతులకు రూ. 527 కోట్లు, ఏలూరు జిల్లా రైతులకు రూ. 296 కోట్లు, తూర్పుగోదావరి జిల్లా రైతులకు రూ. 258 కోట్లు, కోనసీమ జిల్లా రైతులకు రూ. 100 కోట్లు జమ చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ అరుణ్ కుమార్ వెల్లడించారు. ఇదీ చదవండి: జగనన్నకు చెబుదాంపైనా అక్కసు.. ఆయనగారి పైత్యం -
పేటలో 78.4 మి.మీల వర్షపాతం
పొంగుతున్న వాగులు, చెరువులు నీట మునిగిన వందలాది ఎకరాల వరిపంట వీరోజిపల్లితో తెగిపోయిన సంబంధాలు పెద్దశంకరంపేట: పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు 78.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మండలంలోని పలు గ్రామాల్లోని చెరువులు, కుంటలు అలుగుపారి ప్రవహిస్తున్నాయి. అలాగే ఉత్తులూర్ వాగు పాత వంతెనపై నుండి ప్రవహిస్తోంది. వరద ప్రవాహం అంతా నిజాంసాగర్‌లోకి వెళ్తుండటంతో పాటు ఎగువ, సింగూరు నుంచి నీటి ఉధృతికి మండలంలోని కొత్తపేట, కొప్పోల్, జూకల్, సంగారెడ్డిపేట, వీరోజిపల్లి గ్రామల్లో భారీగా వరద నీరు చేరడంతో వందలాది ఎకరాల్లోని వరిపంట నీటమునిగింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. వీరోజిపల్లికి తెగిపోయిన సంబంధాలు పెద్దశంకరంపేట మండలం వీరోజిపల్లి, సంగారెడ్డిపేట, జూకల్ గ్రామాలకు పేటతో సంబంధాలు తెగిపోయాయి. గ్రామాలకు వెళ్లాలంటే టేక్మాల్ మండలం బోడగట్టు నుంచి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. వీరోజిపల్లి వాగు వద్ద వంతెన నిర్మాణ పనులు ఆలస్యం కావడంతో నిజాంసాగర్ బ్యాక్ వాటర్ వల్ల వరదనీటితో పాటు రామోజిపల్లి చెరువు పొంగి ప్రవహిస్తుండడంతో వంతెన వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రహదారి కొట్టుకపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.