
ఉప్పాడ తీరంలో బంగారం కోసం వెతుకుతున్న స్థానిక మత్స్యకారులు
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు.
ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు
Comments
Please login to add a commentAdd a comment