uppada beach
-
తీరం మారింది
ఆ తీర ప్రాంతమంతా మత్స్యకారుల ఆవాసం.. చేపల వేట వారి జీవనాధారం అయితే వేటాడిన చేపలు వెంటనే అమ్ముకోవడం తప్ప వేరే దారి లేదు. వారి వేట సామగ్రికి రక్షణ లేదు. వారి జీవితాలే గాలి వాటంగా మారిపోయాయి. అలాంటి వారి జీవితాలలో 2019వ సంవత్సరం వెలుగులు నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం ఇప్పుడు దేశం గర్వించదగ్గ తీర ప్రాంతంగా మారింది. రాష్ట్రానికి మత్స్యసంపద ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చి పెట్టే ఒక ప్రముఖ ప్రాంతంగా ఉప్పాడ తీరం చరిత్ర సృష్టించబోతోంది. పిఠాపురం: మాకు మాట ఇచ్చారు... అన్న వచ్చారు... చెప్పినదానికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి జాలర్లు జై కొడుతున్నారు. సుమారు 50 ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్న ఉప్పాడ మినీ హార్బర్ నిర్మాణం సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాలి్చంది. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హార్బర్‌ను నిర్వించడం విశేషం. మినీ హార్బర్ నిరి్మస్తామని చెప్పినా మేజర్ హార్బర్ నిరి్మంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ హయాంలో... 2014లో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తీరుస్తామని మినీ హార్బర్ నిరి్మస్తామని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మినీ హార్బర్ ఊసెత్తలేదు. రూ.50 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నారు. డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, ప్రమాదవశాత్తు మరణించిన వారికి పరిహారం పెంపు విషయాలను పక్కన పెట్టేశారు. ఐదేళ్లపాటు ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. డ్రెడ్జింగ్ పేరుతో రూ.2 కోట్లు ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలు పంచేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 2019 తరువాత... ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకార సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచి్చన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న మత్స్యకారుల వేటకు వీలుగా మేజర్ హార్బర్ నిర్మాణానికి రూ.351 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు. 2500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరించేలా, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిర్మాణం చేపట్టారు. కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, ఫిష్ హ్యాండ్లింగ్, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. తొలుత కరోనా వల్ల పనులు కొంత నెమ్మదైనా గత ఏడాది నుంచి ఊపందుకున్నాయి. ఆరు నెలలుగా పరుగులు పెట్టిన పనులతో రూ.250 కోట్లకు పైగా నిధులు వెచి్చంచి నిర్మాణాలు పూర్తి చేశారు. ఇంత అభివృద్ధి చూస్తాననుకోలేదు నా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో హార్బరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో కాకినాడ హార్బర్‌కు మా బోట్లు వెళ్లేవి. కానీ పదేళ్లుగా మా బోట్లను కాకినాడ హార్బర్‌కు రానివ్వడం లేదు. దీంతో ఇక్కడే ఉప్పుటేరులో బోట్లు నిలుపుకుంటున్నాం. అప్పుడప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించేవి. గతంలో టీడీపీ నేతలు ఎన్నో వాగ్దానాలు చేసినా అవేవీ నెరవేరలేదు. ఇక జన్మలో హార్బర్ చూస్తామనుకోలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ మా బాధలు విని అన్న మాట ప్రకారం నిరి్మంచి,మాకు ప్రత్యక్ష దైవంగా మారారు. - కంబాల రాంబాబు, మత్స్యకారుడు,ఉప్పాడ శివారు సూరాడపేటజిల్లాలో తీరప్రాంత మండలాలు: 5 మత్స్యకార గ్రామాలు: 36 మెరైన్ ఫిషర్మెన్ జనాభా: 2,00,000 చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు: 36,000 మెకనైజ్డ్ బోట్లు: 467 మోటారు బోట్లు: 3,779 సంప్రదాయ బోట్లు: 399 మొత్తం బోట్లు: 4,645ఉప్పాడ మేజర్ హార్బర్ విశేషాలు∗ నిర్మాణ వ్యయం: రూ.351 కోట్లు ∗ నిర్మాణ స్థలం: 58 ఎకరాలు∗ ఉపాధి పొందే మత్స్యకారుల కుటుంబాలు: 2500 ∗ ఉపాధి పొందే మండలాలు కొత్తపల్లి,తొండంగి, కాకినాడ రూరల్ ∗ ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు పెరగనున్న మత్స్య ఉత్పత్తి ∗ చేపల ఉత్పత్తి అంచనా విలువ రూ.890 కోట్లు ∗ ఒకేసారి 2,500 బోట్లు నిలుపుకునే సామర్థ్యం.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం ∗ 20 టన్నుల కెపాసిటీ గలశీతల గిడ్డంగులు.. భారీ ట్యూనా చేపల ఫిష్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ షెడ్లు ∗ కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ∗ ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం.. వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ -
ఏపీలో కనువిందు చేసే ఆకర్షణీయమైన బీచ్‌లు (ఫొటోలు)
-
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
పిఠాపురం: వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. కాకినాడ జిల్లా ఉప్పాడ వద్ద సముద్రంలో ఆదివారం ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో ఒకరు మృతిచెందగా, ఇద్దరి ఆచూకీ తెలియరాలేదు. యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లికి చెందిన సుమారు 70మంది యువకులు వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి ఊరేగింపుగా తీసుకు వెళ్లారు. ఉప్పాడ సమీపాన హార్బర్ నిర్మాణ స్థలం వద్దకు విగ్రహాన్ని తీసుకువెళ్లి నిమజ్జనం చేశారు. విగ్రహం మళ్లీ వెనక్కి కొట్టుకు రాసాగింది. ఈ విషయాన్ని గమనించిన చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి, అనిశెట్టి వెంకటరెడ్డిలతోపాటు మరో ముగ్గురు యువకులు విగ్రహాన్ని తిరిగి లోపలకు నెట్టేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో సముద్ర ఉధృతి ఎక్కువగా ఉండడంతో విగ్రహంతోపాటు వారిని కూడా కెరటాలు ఒక్కసారిగా సముద్రంలోకి లాగేశాయి. భయంతో కేకలు వేస్తున్న వారిని అక్కడే ఉన్న మత్స్యకారులు గమనించి బోటుపై వెళ్లి ఆరుగురిలో నలుగురు యువకులను రక్షించి ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఆ నలుగురిలో అనిశెట్టి వెంకటరెడ్డి అలియాస్ వంశీరెడ్డి పరిస్థితి విషమంగా ఉండడంతో పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. చింతపల్లి సతీ‹Ùరెడ్డి, తమిలిశెట్టి విజయవర్ధనరెడ్డి ఆచూకీ కోసం పోలీసులు, అగ్నిమాపక, రెస్క్యూ సిబ్బంది గాలిస్తున్నారు. ఘటనాస్థలాన్ని అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, సీఐ వైఆర్కే శ్రీనివాస్ పరిశీలించారు. మరో ఇద్దరి గల్లంతు ఇదిలా ఉండగా, వినాయక నిమజ్జనం చేస్తుండగా కాకినాడ జిల్లా పిఠాపురం శాలిపేటకు చెందిన ఇద్దరు గల్లంతయ్యారు. నవఖండ్రవాడ వద్ద పిఠాపురం బ్రాంచి కెనాల్ (పీబీసీ)లో వినాయక విగ్రహ నిమజ్జనం కోసం విగ్రహాన్ని దించుతుండగా ఐదుగురు వ్యక్తులు కాలువ ఉధృతికి కొట్టుకుపోయారు. వారిలో ముగ్గురిని స్థానికులు రక్షించారు. జోగా కుమారస్వామి (36), దోసూరి నరసింహాచారి (35) గల్లంతయ్యారు. -
విశాఖ బీచ్‌లో ‘ప్రేమ కడలి’ సందడి
కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: భీమిలి బీచ్, ఉప్పాడ బీచ్ వద్ద గురువారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సీహెచ్ రూప నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుర్ల శివబాబు (వసీకరన్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రూప మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో 39 రోజులపాటు 90 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, మరో రెండు ఫైట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఇదే సినిమాలో మరో హీరో మధు నందన్, మరో ఇద్దరు హీరోయిన్లు లావణ్య, అక్సా ఖాన్ నటిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ -
సినీ దర్శకులను ఆకర్షిస్తున్న ఉప్పాడ బీచ్‌రోడ్డు
పిఠాపురం(తూర్పుగోదావరి): పైన నీలాల నింగి.. కింద నీలి సముద్రం.. ఉవ్వెత్తున ఎగసిపడే కెరటాలు.. వాటి అంచుల్లో పాలల్లా పరచుకున్న తెల్లని నురుగు.. మెత్తని ఇసుక తిన్నెలు.. వీనులకు ఆనందాన్నిచ్చే సాగర ఘోష.. ఇటు నేలకు.. అటు సాగరానికి సరికొత్త అందాలను అద్దే మడ అడవులు.. హోప్ ఐలాండ్.. మనసుకు ఆహ్లాదాన్ని అందించే ఇటువంటి విభిన్నమైన ప్రకృతి అందాలకు కేరాఫ్‌గా నిలుస్తున్న ఉప్పాడ సాగర తీర సౌందర్యం.. వెండితెర ప్రముఖుల్ని మరోసారి ఎంతో ఆకర్షిస్తోంది. ‘నీ కన్ను నీలి సముద్రం.. నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం..’ అంటూ ‘ఉప్పెన’ సినిమాలో హీరో వైష్ణవ్‌తేజ్ పాడిన పాట.. ఉల్లాసంగా ఆడిన ఆట కుర్రకారు గుండెల్ని ఊపేసింది. ఉప్పాడ సాగర తీర సౌందర్యాన్ని ఆవిష్కరించిన ఈ చిత్రం బంపర్ హిట్ కొట్టడంతో.. దర్శకుల దృష్టి మళ్లీ ఈ ప్రాంతం వైపు మళ్లింది. ఉప్పాడ అందాలు వారిని ఈ ‘తీరానికి లాగేటి దారం’గా మారిపోయాయి. కొత్త సినిమాలతో పాటు టీవీ సీరియళ్ల చిత్రీకరణకు కూడా ఉప్పాడ తీరం కేంద్రంగా మారుతోంది. గతంలో.. చాలాకాలం కిందట ఉప్పాడ తీరంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. రెబల్‌స్టార్ కృష్ణంరాజు హీరోగా, రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య తదితర అగ్రశ్రేణి నటులు నటించిన ‘నాకూ స్వాతంత్య్రం వచ్చింది’ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ఉప్పాడ తీరంలో జరిగింది. తరువాత రణరంగం, పోరు, కనకం, డియర్ కామ్రేడ్, దుర్మార్గుడు, ఆగ్రహం, ఒక్కడు, జయమ్ము నిశ్చయమ్మురా.. తదితర సినిమాల చిత్రీకరణ ఇక్కడే జరిగింది. తరువాత కొన్నాళ్లు అంతగా షూటింగ్‌లు లేవు. కానీ ఉప్పెన సినిమాతో సాగరతీరం మరోసారి సినిమా షూటింగ్‌లకు నెలవుగా మారింది. ఇప్పుడు తీరంలో తరచుగా ‘క్లాప్.. స్టార్ట్.. రోల్.. కెమెరా.. యాక్షన్.. అంటూ సినిమా షూటింగ్‌ల సందడి కనిపిస్తోంది. ప్రముఖ బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ ఈ ప్రాంతంలోని పండూరుతో పాటు అల్లవరం మండలంలోని పలు గ్రామాల్లో జరిగింది. వీటితో పాటు పలు ప్రముఖ బుల్లితెర సీరియల్స్ షూటింగ్‌లు ఇక్కడ జరిగాయి. ఉప్పెన సినిమా షూటింగ్ జరిగిన కాకినాడ ఫిషింగ్ హార్బర్ కాకినాడ నుంచి తుని సమీపంలోని అద్దరిపేట వరకూ ఉన్న సాగరతీరం ప్రకృతి అందాలకు పెట్టింది పేరు. కాకినాడ సమీపంలోని హోప్ ఐలాండ్, మడ అడవులు.. చూడచక్కటి లొకేషన్లతో సందర్శకులనే కాదు.. వెండితెర, బుల్లితెర దర్శకుల కళ్లను కూడా కట్టి పడేస్తున్నాయి. కడలి కెరటాలు.. పచ్చని చెట్లు.. ఇసుక తిన్నెలు.. మధ్యలో ఉన్న కాలువలు ఎక్కడో ఉన్న దీవులను తలపిస్తుంటాయి. రవాణా సౌకర్యాలు మెరుగు పడడంతో పాటు రోడ్లను అభివృద్ధి చేయడంతో ఇక్కడ షూటింగ్‌లు జరుపుకునేందుకు ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆసక్తి చూపుతున్నారు. ఉప్పాడ.. నా కెరీర్‌ను మలుపు తిప్పింది నా తొలి సినిమా షూటింగ్ నా సొంత ఊరిలో జరుపుకోవడం నా కెరీర్‌ను మలుపు తిప్పింది. ఏ దర్శకుడికీ దక్కని అవకాశాన్ని నా సొంత ఊరిలో ప్రకృతి నాకు ఇచ్చింది. కాకినాడ – ఉప్పాడ సాగరతీరంలో ఎన్నో అందమైన లోకేషన్లున్నాయి. ఉప్పెన సినిమాలో లొకేషన్లు చూసి, హిందీ నటుడు ఆమిర్‌ఖాన్ సైతం ఇక్కడ షూటింగ్‌కు ఉత్సాహం చూపించారు. ఇప్పటికీ ఎంతో మంది ఫోన్ ద్వారా ‘ఉప్పాడలో అంత మంచి లొకేషన్లున్నాయా? మేమూ సినిమా తీస్తాం’ అని చెబుతున్నారు. షూటింగ్‌కు ఇక్కడి ప్రజల సహకారం ఎంతో బాగుంటుంది. రానున్న రోజుల్లో మరిన్ని చిత్రాల షూటింగ్‌లు ఉప్పాడ తీరంలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. – సానా బుచ్చిబాబు, ఉప్పెన సినిమా దర్శకుడు ‘లాల్‌సింగ్ చద్దా’ షూటింగ్‌కు వచ్చిన బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ ఇక్కడ సెట్టింగ్‌లతో పని లేదు కాకినాడ – ఉప్పాడ తీర ప్రాంతాల్లో సినిమా షూటింగ్‌లు చేస్తే సెట్టింగ్‌లతో పని ఉండదు. అంతా ప్రకృతి అందాలతో ఎక్కడ చూసినా ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రకృతిని చిత్రీకరించాలంటే ఇక్కడి కంటే మంచి లొకేషన్లుండవు. సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. తక్కువ ఖర్చుతో మంచి లొకేషన్లలో సినిమాలు తీసుకోవడానికి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంటుంది. అందుకే ఇక్కడ ‘కనకం 916 కెడిఎం’ సినిమా తీశాం. షూటింగ్‌కు స్థానిక ప్రజలు చాలా సహకరించారు. – రాకేష్ కనకం, సినిమా డైరెక్టర్ కనకం 916 కేడీఎం సినిమా షూటింగ్లో హీరోకు దర్శకుడు రాకేష్ సూచనలు -
తీరంలో కొనసాగుతున్న ‘పసిడి’ వేట
సాక్షి, కొత్తపల్లి: ఉప్పాడ శివారు పాత మార్కెట్ సమీపంలోని తీర ప్రాంతంలో రెండు రోజులుగా పసిడి వేట కొనసాగుతోంది. శుక్రవారం కూడా స్థానిక మత్స్యకారులు బంగారం కోసం వెతికారు. మహిళలు, చిన్నారులు సైతం దువ్వెనలు, పుల్లలు, జల్లెళ్లలో ఇసుకను జల్లెడ పడుతున్నారు. ఇప్పటికే మహిళలకు బంగారం రేణువులు, రూపులు, దిద్దులు, ఉంగారాలలో పాటు బంగారు, వెండి వస్తువులు లభ్యమయ్యాయి. గతంలో పెద్దపెద్ద బంగ్లాలు, పలు దేవాలయాలు సముద్ర గర్భంలో కలిసిపోయాయని, వాటిలో ఉన్న వస్తువులు తుపాన్ సమయాల్లో బయట పడుతున్నాయని మత్స్యకారులు చెబుతున్నారు. ఒక మహిళకు లభ్యమైన బంగారు దిద్దులు -
అల్ల కల్లోలంగా ఉప్పాడ తీరం
సాక్షి, కాకినాడ: ‘అంఫన్’ తుఫాన్ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ తీరం అల్ల కల్లోలంగా మారింది. తీరం వెంబడి కెరటాలు ఎగసిపడుతున్నాయి. రాకాసి అలలు ఎగసిపడడంతో కాకినాడ ఉప్పాడ బీచ్ రోడ్డు ధ్వంసమైంది. వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. మాయపట్నం వద్ద జియా ట్యూబ్ దాటుకుని ఇళ్ళల్లోకి సముద్రపు నీరు వచ్చి చేరింది. (‘అంఫన్’ ఎఫెక్ట్; ఎగసిపడుతున్న సముద్ర అలలు) కాకినాడలోని సూరడపేట, మాయపట్నంలో కూడా సముద్రం కల్లోలంగా మారింది. జియో ట్యూబ్ దాటి ఊరిలోకి కెరటాలు ఎగసిపడుతున్నాయి. కెరటాల దాటికి జియో ట్యూబ్ రాళ్లు ఊళ్ళో వచ్చి పడుతున్నాయి. పూరి గుడిసెళ్ళోకి సముద్రపు నీరు చొచ్చుకు రావడంతో మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) కాగా, అంఫన్ తుపాను మంగళవారం బలహీనపడి, అత్యంత తీవ్ర తుపానుగా మారింది. అయినా, ఒడిశా, పశ్చిమబెంగాల్లోని తీర ప్రాంత జిల్లాల్లో విధ్వంసం సృష్టించే స్థాయిలోనే ఉంది. దాంతో, ఆ రాష్ట్రాలు ఆయా ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. తుపాను ప్రభావం ఉండే తీర ప్రాంతాల నుంచి లక్షలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించాయి.‘కోల్‌కతాకు దక్షిణంగా 180 కి.మీల దూరంలో ఉన్న దిఘాకు, బంగ్లాదేశ్‌లోని హతియా దీవికి మధ్య బుధవారం మధ్యాహ్నానికి తుపాను తీరం దాటొచ్చు. ఆ సమయంలో తీరం వెంబడి పెనుగాలుల వేగం 165 కి.మీల వరకు ఉండొచ్చు’ అని భువనేశ్వర్‌లోని వాతావరణ శాఖ అధికారి వెల్లడించారు. -
కడగండ్ల ఉప్పెనలో ‘కడలి’ బిడ్డలు..
సాక్షి, పిఠాపురం: ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని ఊయలలుగా, అగాధ జలధిని గంగమ్మ ఒడిగా భావించే ధీరులు వారు. కడలి కడుపులోని మత్స్యసంపదను వేటాడడమే వారి బతుకు బాట. సముద్రంపై సునాయాసంగా వేట సాగించే వారికి.. అలా వేటాడి తెచ్చిన చేపలను ఒడ్డుకు చేర్చడం తుపానులో నావను నడపడమంత కష్టతరమవుతోంది. వారి కష్టాలను గట్టెక్కించే మినీ హార్బర్ నిర్మాణం పాలకుల కపటపు హామీలకే పరిమితమవుతోంది. ‘గెలిపిస్తే మీ సమస్యలను చిటికెలో తీరుస్తాం. మినీ హార్బర్ నిర్మిస్తాం’ అని నమ్మించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, పిఠాపురం ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్వర్మ ఎన్నో వాగ్దానాల్లాగే దాన్నీ విస్మరించారు. దాంతో గంగపుత్రులైన మత్స్యకారులు.. వలలో చిక్కిన చేపల్లా వెతల్లో కొట్టుమిట్టాడుతున్నారు. మత్స్యకారుల కష్టాలను గట్టెక్కిస్తామన్న సీఎం చంద్రబాబు, ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ ‘ఒడ్డు ఎక్కాక నావ తగలేసిన’ చందంగా ద్రోహం చేశారని మత్స్యకారులు మండిపడుతున్నారు. వందల బోట్లు, వేలమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మూడు మండలాలకు చెందిన మత్స్యకారులకు మినీ హార్బర్ నిర్మాణం జరగకపోవడం పెనుసమస్యగా మారింది. చేపలవేటే ఆధారంగా సుమారు 20 వేల మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుండగా అతి ముఖ్యమైన జెట్టీలు లేక వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రాణాలకు తెగించిన సముద్రంపై చేపల వేట సాగించే వారిని జెట్టీ సమస్య పీడిస్తోంది. కాకినాడ నుంచి విశాఖ వకూ ఉన్న తీర ప్రాంతంలో కాకినాడలో తప్ప ఎక్కడా జెట్టీలు కాని, హార్బర్లు కాని లేవు. దీంతో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాలకు చెందిన వేలాది మంది మత్స్యకారులు వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చేందుకు, బోట్లకు లంగరు వేసేందుకు మత్స్యకారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాకినాడ సమీపంలోని హార్బర్లో మాత్రమే ఈ మండలాలకు చెందిన మత్స్యకారుల బోట్లు నిలిపి చేపల క్రయ విక్రయాలు జరిపే అవకాశం ఉంది తప్ప మరే ఇతర సౌకర్యాలు లేవు. ప్రణాళికలకే పరిమితం మత్స్యకారులు తమ అగచాట్లను గతంలో కేంద్ర మంత్రి ఎంఎం పళ్లంరాజు దృష్టికి తెచ్చారు. దాంతో ఆయన మినీ హార్బర్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. అనంతరం కొత్తపల్లి మండలం అమీనాబాద్ శివారు పెట్రోలు బంకు వద్ద సముద్రం పక్కనే ఉన్న సుమారు 50 ఎకరాల ప్రభుత్వ భూమిని మినీ హార్బర్ నిర్మాణానికి అనువని అధికారులు గుర్తించారు. సుమారు రూ.50 కోట్ల వ్యయంతో నిర్మాణానికి ప్రణాళికలు సైతం సిద్ధమయ్యాయి. అయితే ఎన్ని సంవత్సరాలు గడుస్తున్నా కార్యరూపం దాల్చలేదు. దీంతో నిర్మాణ వ్యయం పెరుగుతూ రూ.300 కోట్లకు చేరింది. గతంలో కొత్తపల్లి, తొండంగి, తుని మండలాల్లోని మత్స్యకారుల బోట్లను కాకినాడ హార్బర్లోకి అనుమతించక పోవడంతో కొన్ని ఏళ్లుగా వారు ఉప్పాడ సమీపంలో ఉన్న ఉప్పుటేరుని జెట్టీగా ఉపయోగించుకుంటున్నారు. ఏ మాత్రం అనువుగా లేకపోయినా గత్యంతరం లేని స్థితిలో బోట్లను ఉప్పుటేరులోనే లంగరు వేసి, వేటాడిన చేపలు ఒడ్డుకు మోసుకొచ్చి నడి రోడ్డుపైనే విక్రయించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయని మత్స్యకారులు వాపోతున్నారు. తొండంగి, తుని మండలాల మత్స్యకారులకు ఉప్పుటేర్లు లేకపోవడంతో బోట్లను సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. తుపాన్లు సంభవించినప్పుడు కెరటాల ఉధృతితో సముద్రంలోని బోట్లను ఒడ్డుకు తెచ్చే అవకాశం ఉండదు. జెట్టీ లేక సముద్రంలోనే లంగరు వేస్తే బోట్లు మునిగి తీవ్ర నష్టం చవిచూస్తున్నామని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. మామూలు సమయాల్లో బోట్లపై వేటకు వెళ్లి తిరిగి వచ్చి సముద్రంలోనే లంగరు వేయాల్సి వస్తోంది. విలువైన బోట్లకు రక్షణ కరువు జెట్టీలు లేక వేటాడి తెచ్చిన చేపలను దింపేందుకు బోటును ఒడ్డు వరకూ తీసుకు రావాల్సి వస్తోంది. దాంతో పాటు ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అధికారుల హెచ్చరికల నేపథ్యంలో బోట్లు, వలల వంటి విలువైన సామగ్రిని అతి కష్టం మీద తీవ్ర వ్యయప్రయాసలకోర్చి గ్రామాలకు దూరంగా ఎక్కడ వీలు కుదిరితే అక్కడ ఎలాంటి రక్షణా లేకుండా ఒడ్డుకు చేర్చుకోవల్సి వస్తోంది. దీంతో విలువైన బోట్లకు రక్షణ లేకుండా పోతుంది. అత్యవసర పరిస్థితుల్లో బోట్లను ఒడ్డుకు చేర్చుకొనే ప్రయత్నంలో ఉన్న మత్స్యకారులకు హార్బరే సురక్షిత ప్రాంతం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో హార్బర్ లేకపోవడంతో ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు బోట్లను తీవ్ర వ్యయప్రయాసలకోర్చి ఒడ్డుకు చేర్చుకోవాల్సి వస్తోంది. హార్బరు, జెట్టీలు లేక డీజిల్, ఐస్, వంట సామగ్రిలను కెరటాల అవతల లంగరు వేసిన బోట్ల వద్దకు పట్టుకువెళ్లి నింపుకోవాల్సిన అగత్యం తప్పడం లేదు. కెరటాల అవతల లంగరు వేసిన బోట్లలో డీజీల్, ఐస్, వంట సామగ్రి చోరీ అవుతున్నాయని మత్స్యకారులు గగ్గోలు పెడుతున్నారు. కష్టంతో పాటు నష్టాలే ఎక్కువ.. వేటాడిన చేపలను ఒడ్డుకు చేర్చుకొని అమ్ముకోవడానికి హార్బర్లో అయితే అన్ని సౌకర్యాలూ ఉండడం వల్ల చేపలు పాడవకుండా వెంటనే అమ్మకాలు జరిగి మత్స్యకారులు నష్టపోరు. అయితే పై మూడు మండలాల్లోని మత్స్యకారులకు హార్బర్ లేక చేపల అమ్మకాల్లో తీవ్ర జాప్యం ఏర్పడి నష్టాలు తప్పడం లేదు. వ్యాపారులు కాకినాడ హార్బర్‌కే పరిమితమౌతుండడంతో ఇక్కడ వేటాడిన చేపలను వేరే వాహనాలపై కాకినాడ హర్బర్‌కు తరలించి అమ్ముకోవాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు. -
తీరంలో అలకలం..!
పిఠాపురం : పిఠాపురం సమీపంలోని ఉప్పాడ సముద్ర తీరంలో కడలి కెరటాలు ఉగ్రరూపం దాల్చాయి. ఎగసిపడుతున్న కెరటాల తాకిడికి తీరప్రాంతం అతలాకుతలమవుతోంది. తీరప్రాంత వెంబడి రక్షణగా నిర్మించిన రక్షణ గోడ తునాతునకలవుతోంది. మంగళవారం ఉదయం నుంచి సముద్రం వెనక్కి వెళ్లిపోగా సాయంత్రానికి ఒక్కసారిగా సుమారు 20 మీటర్ల మేర ముందుకు చొచ్చుకుని వచ్చినట్లు మత్స్యకారులు చెబుతున్నారు. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా బలమైన ఈదురు గాలులతో కూడిన భారీవర్షం కురవడంతో అలల ఉధృతి మరింత పెరిగింది. తీరప్రాంతం వెంబడి ఉప్పాడ నుంచి కాకినాడ శివారు వాకలపూడి వరకు ఉన్న బీచ్‌రోడ్డు తీవ్ర కోతకు గురవుతోంది. బుధవారం ఉదయానికి రోడ్డు పూర్తిగా ధ్వంసమయ్యే సూచçనలు కనిపిస్తున్నాయి. తీరప్రాంతంలో లంగరు వేసిన బోట్లు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకునే పనిలో మత్స్యకారులు నిమగ్నమయ్యారు. పిడుగు హెచ్చరికలు భారీ వర్షంతోపాటు జిల్లాలో పిడుగులు పడే అవకాశాలున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలో మారేడుమిల్లి, పిఠాపురం, ఉప్పాడ, ప్రత్తిపాడు, శంఖవరం, రామచంద్రాపురం, కాకినాడ, రౌతులపూడి తదితర మండలాల పరిధిలో మంగళవారం పిడుగులు పడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ అయ్యాయి. టోర్నడోను తలపించిన ఈదురు గాలులు కాకినాడ రూరల్: సముద్ర తీరం వెంబడి వీచిన బలమైన ఈదురుగాలులు మంగళవారం సాయంత్రం సూర్యారావుపేట వాసులను భయకంపితులను చేశాయి. టోర్నడో తరహాలో ఆకస్మాత్తుగా వీచిన బలమైన గాలులతో ఈ ప్రాంతంలోని పూరిళ్లు, తోపుడు, మిక్చర్బళ్లు, చిన్న, చిన్న నావలు ఎగిరి పడ్డాయి. మత్స్యకారులు, ఇతర పర్యాటకులు పరుగులు తీసినట్టు ప్రత్యక్షసాక్షులు తెలిపారు. పూరిపాకలు సైతం గాలిలో ఎగిరిపడ్డాయి. ఏ జరుగుతుందో అర్థం కాక మత్స్యకారులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. రాత్రి అంతా మేల్కొని ఉండేందుకు నిర్ణయించుకున్నట్టు అక్కడి పెద్దలు తెలిపారు. -
ఉప్పాడ బీచ్‌లో వలకు చిక్కిన జారుమెను
తూర్పుగోదావరి: కాకినాడలోని ఉప్పాడ బీచ్ వద్ద వేటకు వెళ్లిన మత్స్య కారులకు సోమవారం పంటపండింది. సుమారు రెండు టన్నుల బరువు ఉండే జారుమెను జాతికి చెందిన చేప వలకు చిక్కింది. దీంతో దానిని బోటుకు కట్టుకుని తీరానికి లాక్కొచ్చారు. దానిని చూడటానికి స్థానికులు గుమిగూడుతున్నారు.