
హీరోయిన్ అక్సాఖాన్
కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: భీమిలి బీచ్, ఉప్పాడ బీచ్ వద్ద గురువారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సీహెచ్ రూప నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుర్ల శివబాబు (వసీకరన్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రూప మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో 39 రోజులపాటు 90 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, మరో రెండు ఫైట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఇదే సినిమాలో మరో హీరో మధు నందన్, మరో ఇద్దరు హీరోయిన్లు లావణ్య, అక్సా ఖాన్ నటిస్తున్నట్లు తెలిపారు.
చదవండి: నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్
Comments
Please login to add a commentAdd a comment