visakha beach
-
విశాఖ బీచ్‌లో స్నేహితుల దినోత్సవం సందర్భంగా స్టూడెంట్స్ సందడి (ఫొటోలు)
-
మత్స్యకారుల బోటులో అగ్ని ప్రమాదం
మహారాణిపేట(విశాఖ దక్షిణ)/కాకినాడ రూరల్: విశాఖ సముద్ర తీరంలో శుక్రవారం మధ్యాహ్నం చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్ పేలిన ఘటనలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా నలుగురు స్వల్ప గాయాలతో కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. కాకినాడ జిల్లాకు చెందిన వీరంతా గత నెల 26వ తేదీన శ్రీదుర్గాభవాని ఐఎన్డీ ఏపీ 47 బోటులో చేపల వేటకు వెళ్లారు. ఈ నెల 14వ తేదీన తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం జరిగింది. 20 నాటికన్ మైళ్ల దూరంలో.. విశాఖకు 20 నాటికన్ మైళ్ల దూరంలో మత్స్యకారుల బోటులో షార్ట్ సర్క్యూట్ కారణంగా జనరేటర్ పేలడంతో మంటలు ఎగసిపడ్డాయి. సమీపంలో మరో పడవలో ఉన్నవారు వారికి సాయం అందించి కోస్ట్‌గార్డ్ అధికారులకు సమాచారం చేరవేశారు. సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఐసీజీఎస్ వీరా నౌక సిబ్బంది వారికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నేవల్ డాక్‌యార్డ్‌కు తీసుకొచ్చి క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా కేజీహెచ్‌కు తరలించారు. మత్స్యకారులు ఆర్.సత్తిబాబు, ఎన్.వజ్రం, ఎస్.సత్తిబాబు, కె.ధర్మారావు, వై.సత్తిబాబులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న కాకినాడ మత్స్యశాఖ అధికారి కరుణాకర్, ఫిషింగ్ హార్బర్ పీవో అనురాధ మత్స్యకారుల వివరాలు సేకరించారు. కాకినాడ మత్స్యకారులకు ప్రమాదం తప్పిందని, కోస్టుగార్డు సిబ్బంది వారిని సురక్షితంగా విశాఖకు తరలించారని, చికిత్స అనంతరం తిరిగి కాకినాడ చేరుకుంటారని అధికారులు తెలిపారు. -
వైజాగ్ బీచ్ లో భక్తుల పుణ్య స్నానాలు
-
విశాఖ బీచ్‌రోడ్‌లో మారథాన్ (ఫొటోలు)
-
విశాఖ తీరంలో అరుదైన జీవి.. రాలిన ఆకులా చదునైన శరీరం, ఇదే ప్రత్యేకత
సాగర గర్భం ఎన్నో వింతలకు, మరెన్నో విశేషాలకు నిలయం. ఎన్నో అంతుచిక్కని జీవరాశులకు ఆలవాలం. సముద్రం లోతుపాతుల్ని అన్వేషిస్తున్న క్రమంలో అప్పుడప్పుడు శాస్త్రవేత్తలు, మెరైన్ బయాలజిస్టులకు అరుదైన సముద్ర జీవరాశుల ఉనికి లభ్యమవుతోంది. తాజాగా అలాంటి అత్యంత అరుదైన ‘ఫ్లాట్‌వార్మ్’ జాడ భారతదేశ తూర్పు తీరంలో విశాఖలో తొలిసారిగా వెలుగు చూసింది. ఇది అచ్చం రాలిన ఆకును పోలి ఉండి చదునైన శరీరాన్ని కలిగి ఉంది. రక్తనాళాలు లేని ఈ జీవి లేత, ముదురు నీలి రంగు, మధ్యలో పొడవైన పసుపురంగు వెన్నుతో కనువిందు చేస్తోంది. సాక్షి, విశాఖపట్నం: సాధారణంగా సముద్ర తీరంలో ఆటుపోట్లు సంభవించే (ఇంటర్ టైడల్) ప్రాంతంలో వివిధ రకాల సముద్ర జీవులు కనిపిస్తుంటాయి. వీటిలో అరుదైన జాతులు/జీవులపై పరిశోధనలు చేసేవారు వీటిని రికార్డు చేస్తున్నారు. విశాఖకు చెందిన ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్ (ఈసీసీటీ) సభ్యులు ఆంధ్రప్రదేశ్ తీరంలో ప్రతి రెండు వారాలకు మెరైన్ వాక్ చేపడుతున్నారు. ఇందులో ఆసక్తి ఉన్న సాధారణ ప్రజలకు కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఇలా ఈసీసీటీ, గ్రీన్ పా సంస్థలకు చెందిన మెరైన్ బయాలజిస్టులు ఇంటర్ టైడల్ బయోడైవర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులో భాగంగా విశాఖ రుషికొండ బీచ్‌లో గతేడాది జూలైలో వాక్ చేస్తున్నప్పుడు మూడు సెంటీమీటర్ల పొడవున్న మెరైన్ ఫ్లాట్‌వార్మ్ (సాంకేతిక నామం సూడోసెరోస్ గలాథీన్సిస్ –Pseudoceros galatheensis) కనిపించింది. ఏదైనా అరుదైన జీవి కనిపించినప్పుడు దాని గురించి సైంటిఫిక్ జర్నల్‌లో ప్రచురించాల్సి ఉంటుంది. ఇలా ఈ ఫ్లాట్‌వార్మ్ గురించి ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ క్రియేటివ్ రీసెర్చ్ థాట్‌కు పంపగా ఈ జూలై మొదటి వారంలో ప్రచురించింది. తూర్పు తీరంలో మరెక్కడా లభించని ఉనికి.. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా ఫ్లాట్‌వార్మ్ జాతులు ఉన్నా ఐదేళ్ల క్రితం వరకు వీటి జాడ భారతదేశంలో ఎక్కడా లభ్యం కాలేదు. 2017లో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జెడ్ఎస్ఐ) నిపుణులు అండమాన్‌లో పాలిక్లాడ్ వర్గానికి చెందిన ఈ ఫ్లాట్‌వార్మ్ ఉనికిని మొదటిసారి కనుగొన్నారు. తూర్పు తీరంలో మరెక్కడా ఇప్పటిదాకా ఈ జీవి ఉనికి కనిపించలేదు. దీంతో తొలిసారిగా దేశంలోని తూర్పు తీరంలోని విశాఖలో ఫ్లాట్‌వార్మ్ జాడ లభించినట్టైంది. విశాఖలో మెరైన్ బయాలజిస్టు శ్రీచక్ర ప్రణవ్ నేతృత్వంలోని విమల్‌రాజ్, మనీష్ మానిక్, పవన్‌సాయిలు ఈ ఫ్లాట్‌వార్మ్‌ను గుర్తించి రికార్డు చేశారు. విష పూరితాలు కూడా.. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు విషపూరితాలు. వీటికున్న రంగుల ద్వారా ఇతర జంతువులు వాటిని విషపూరితాలుగా గుర్తించి దగ్గరకు రానీయవు.. వెళ్లవు. ఇవి చిన్న చిన్న పీతలను, వీటికన్నా చాలా చిన్న జీవులను, రాళ్లపై ఉండే స్పంజికలు, అసిడియన్లు వంటి జీవరాశులను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి పగడపు దిబ్బలు, లోతు లేని సముద్రంలోని రాతి ప్రాంతాల్లో ఉంటాయి. ఈ ఫ్లాట్‌వార్మ్‌లు రెండు మడతలను కలిగి ఉండి ప్రతి మడతపై 12 కళ్ల మచ్చలుంటాయి. అవి కాంతిని గ్రహించడానికి ఉపయోగపడతాయని మెరైన్ బయాలజిస్టులు చెబుతున్నారు. కాగా వీటి జీవిత కాలం ఎంత అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రజల భాగస్వామ్యంతో మరిన్ని.. ప్రజల భాగస్వామ్యంతో కొత్త సముద్ర జీవరాశుల ఉనికి మరింతగా తెలుస్తుంది. అందుకే మేం ఆసక్తి ఉన్న ప్రజలతో కలిసి మెరైన్ వాక్ చేస్తున్నాం. ప్రజల్లో మరింత అవగాహన కల్పిస్తాం. ప్రజలు ముందుకొస్తే ఇంకా చాలా జాతులను కనుగొనవచ్చు. విశాఖ రుషికొండ తీరంలో కనుగొన్న ఫ్లాట్‌వార్మ్ తూర్పు తీరంలోనే మొట్టమొదటిదిగా రికార్డయింది. దీంతో పాటు మరో రెండు జాతులను చూశాం. అవి ఏంటనేది త్వరలో తెలుస్తుంది. మా ప్రాజెక్టు ద్వారా విశాఖ తీర ప్రాంతంలో ఇప్పటిదాకా 130కి పైగా సముద్ర జాతులను కనుగొన్నాం. – శ్రీచక్ర ప్రణవ్, మెరైన్ బయాలజిస్టు, ఈస్ట్‌కోస్ట్ కన్జర్వేషన్ టీమ్, విశాఖపట్నం -
విశాఖ బీచ్‌లో ‘ప్రేమ కడలి’ సందడి
కొమ్మాది (భీమిలి)/విశాఖపట్నం: భీమిలి బీచ్, ఉప్పాడ బీచ్ వద్ద గురువారం సినిమా షూటింగ్ సందడి నెలకొంది. సీహెచ్ రూప నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సుర్ల శివబాబు (వసీకరన్) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ప్రేమ కడలి అనే సినిమాకు సంబంధించి హీరో మనీష్, హీరోయిన్ అల్వియా ముఖర్జీ పై కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ సందర్భంగా నిర్మాత రూప మాట్లాడుతూ విశాఖ ప్రాంతంలో 39 రోజులపాటు 90 శాతం సినిమా చిత్రీకరణ పూర్తయిందని, మరో రెండు ఫైట్లు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఇదే సినిమాలో మరో హీరో మధు నందన్, మరో ఇద్దరు హీరోయిన్లు లావణ్య, అక్సా ఖాన్ నటిస్తున్నట్లు తెలిపారు. చదవండి: నాకు నా భార్యతో కలిసి జీవించాలని లేదు: హీరో పవన్ -
విశాఖ బీచ్ క్లీనింగ్ చేపట్టిన ప్రజా ప్రతినిధులు, అధికారులు
-
విశాఖ బీచ్ : బుడి బుడి అడుగుల బుల్లి తాబేళ్లు (ఫొటోలు)
-
Olive Ridley Turtle: వెళ్తాం..పెరిగి పెద్దయి.. మళ్లొస్తాం!
బీచ్‌రోడ్డు(విశాఖ తూర్పు): వెళ్తాం.. పెరిగి పెద్దయి.. గుడ్లు పెట్టేందుకు మళ్లీ ఇక్కడకు వస్తాం అంటూ బుల్లి తాబేళ్లు బుడి బుడి అడుగులు వేసుకుంటూ.. సముద్రంలోకి వెళ్లిపోయాయి. అంతరించే ప్రమాదమున్న ఆలివ్ రిడ్లే తాబేలు పిల్లలను జిల్లా అటవీ శాఖ పరిరక్షించి సముద్రంలోకి విడిచిపెట్టింది. సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లను చూసి పిల్లలు, ప్రకృతి ప్రేమికులు, యువతీయువకులు పరవశించిపోయారు. ఆర్.కె.బీచ్ వేదికగా ఆదివారం ఈ కార్యక్రమం జరిగింది. చిన్నారులతో కలిసి కలెక్టర్ మల్లికార్జున బుల్లి తాబేళ్లను సముద్రంలోకి విడిచిపెట్టి.. వాటి తల్లుల వద్దకు చేర్చారు. బుడిబుడి అడుగులతో సముద్రంలోకి వెళ్తున్న తాబేళ్లు ఏటా జనవరి నుంచి మార్చి వరకు ఆలివ్ రిడ్లే తాబేళ్లు తీరానికి చేరుకుని గుడ్లు పెడతాయి. అది కూడా రాత్రి 2 గంటల నుంచి వేకువ 5.30 గంటల్లోపు మాత్రమే. ఈ సమయంలోనే ఇసుక తిన్నెల్లో బొరియలు చేసి గుడ్లను పెట్టి సముద్రంలోకి జారుకుంటాయి. ఆ గుడ్లను సేకరించిన అటవీ శాఖ అధికారులు బీచ్‌రోడ్డులోని తాబేళ్ల సంరక్షణ కేంద్రంలో 45 రోజుల పాటు సంరక్షించారు. సేకరించిన గుడ్లు పొదిగి పిల్లలుగా మారాయి. చదవండి: అంత యాక్షన్ వద్దు.. పులి కూడా బ్రష్ చేస్తుంది! తాబేలు పిల్లను పట్టుకుని ఆనందిస్తున్న కలెక్టర్ మల్లికార్జున అలా గుడ్ల నుంచి బయటకు వచ్చిన 982 బుల్లి తాబేళ్లను సూర్యోదయం సమయంలో కలెక్టర్ సముద్రంలోకి విడిచిపెట్టారు. ఆ సమయంలో తల్లులు తీరానికి చేరువలో ఉంటాయి. అందుకే పిల్లలను సూర్యోదయ సమయంలో సముద్రంలోకి విడిచిపెట్టడం ద్వారా అవి తల్లుల వద్దకు సులభంగా చేరుకునే అవకాశం ఉంటుందని అటవీ శాఖ అధికారి అనంత్‌శంకర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ సముద్ర జలాలను శుద్ధి చేసే ఈ రకం తాబేళ్లు అంతరించిపోకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సముద్రంలోకి విడిచిపెట్టేందుకు బుట్టల్లో సిద్ధంగా ఉన్న తాబేలు పిల్లలు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
సాగర తీరంలో కనువిందు చేస్తోన్న యుద్ధనౌకలు, హెలికాప్టర్లు
-
Vizag: సినిమా సిటీ.. తీరంలో తారల సందడి
కొమ్మాది (భీమిలి): విశాఖలో సినిమా షూటింగ్ సందడి తిరిగి మొదలైంది. కోవిడ్ నిబంధనలు సడలించడంతో ఇతర ప్రాంతాల నుంచి ఆర్టిస్టులు కూడా విశాఖ చేరుకుంటున్నారు. విశాఖ కేంద్రంగా సినీ పరిశ్రమ అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన తరువాత జోష్ ఎక్కువగా కనిపిస్తోంది. విశాఖ నగరం అంటే ప్రకృతి అందాలకు నెలవు. సముద్రానికి పచ్చని కొండలు తోడవడంతో పర్యాటకులతో పాటు సినిమా షూటింగులో కూడా అనువైన ప్రాంతంగా మారింది. 1971 ప్రాంతంలో ప్రముఖ దర్శకుడు బాలచందర్ సినీ ఫ్రేమ్‌లో విశాఖను ఆవిష్కరించడంతో నగర అందాలు బయట ప్రపంచానికి తెలిశాయి. యారాడ, అప్పికొండ, ఆర్కే బీచ్, రుషికొండ, తొట్లకొండ, భీమిలి ఇలా భిన్నమైన ప్రకృతి అందాలతో కూడిన ఈ ప్రదేశాలు షూటింగ్ సీన్స్ సినిమాల్లో ప్రత్యేకతను చాటుతున్నాయి. ఇక సింహాచలం కొండ సెంటిమెంట్‌గా మారడంతో చాలా మంది నటులు కొన్ని సీన్లు అక్కడ తీయాలని పట్టుబడుతున్న సందర్భాలు కూడా ఉంటున్నాయి. ఇక మెగాస్టార్ చిరంజీవికి కొత్త కేరీర్ విశాఖ ఇచ్చింది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తిమ్మాపురంలో రామానాయుడు స్టూడియో చాలెంజ్, అభిలాష, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సినిమాలతో విశాఖనగరం చిరంజీవి సినీ చరిత్రనే మార్చేసింది. సర్పయాగం, చామంతి లాంటి సినిమాలు రోజాకు కొత్త సినిమా జీవితాన్ని అందించాయి. సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు, లెజెండ్, లేటెస్ట్ హిట్ అఖండ వరకూ సింహాచలం కేంద్రంగానే షూటింగ్‌లు జరుపుకున్నాయి. ఓటీటీలో అలరిస్తున్న పరంపర చిత్రం మొత్తం విశాఖలోనే చిత్రీకరించారు. ఇక అరకు అందాల గురించి చెప్పనవసరం లేదు. ఆలాపన, స్టేషన్ మాస్టర్, కృష్ణ, ఒక్కడు, కృష్ణగాడి వీర ప్రేమ కథ, ఉమామహేశ్వర ఉగ్రరూపస్య లాంటి సినిమాలు ఎన్నో ఇక్కడే ఊపిరి పోసుకున్నాయి. బీచ్‌ను ఆనుకునే ఉన్న రామానాయుడు స్టూడియోలో జరిగే ఒడిశా, బెంగాలీ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు కూడా ఉన్నాయి. కోవిడ్ అనంతరం ఇప్పుడు విశాఖలో సినిమా షూటింగులు ఎక్కువగా జరుగుతున్నాయి. సాగర్‌నగర్‌లో రాజేంద్రప్రసాద్ తీరంలో తారల సందడి ప్రస్తుతం తీర ప్రాంతాల్లో జరుగుతున్న షూటింగ్లలో తారలు సందడి చేస్తున్నారు. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్, బెల్లంకొండ శ్రీనివాస్, కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర వంటి తారలతో పాటు నూతన నటీనటులు జ్ఞానేశ్వరి, విజయ్ వంటి నటులు ఎంతమందో ప్రస్తుతం ఇక్కడ సినిమా చిత్రీకరణలో పాల్గొంటున్నారు. దీంతో పాటు ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లు, సినిమా ప్రమోషన్లో భాగంగా ఎందరో నటీనటులు నగరంలో సందడి చేస్తున్నారు. షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి సినిమా షూటింగ్‌లకు అనువైన ప్రాంతం భీమిలి. అప్పట్లోనే తెలుగు సినిమా షూటింగులకు బీజం పడింది. 1962లో అక్కినేని, కృష్ణ కుమారి నటించిన కులగోత్రాలు సినిమా షూటింగ్ ఇక్కడే ప్రారంభమైంది. ఇక్కడ శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి కొండపై ఈ సినిమాలో పెళ్ళి దృశ్యాన్ని తెరకెక్కించారు. 1972లో విశాఖ నుంచి భీమిలి మధ్య బీచ్ రోడ్డు నిర్మించటంతో భీమిలి అందాలు అప్పటి నుంచి ఇప్పటివరకు వెండి తెరపై కనువిందు చేస్తున్నాయి. అంతే కాదు విశాఖ అందాలకు ముగ్ధుడైన జం«ధ్యాల పదికి పైగా సినిమాలను ఇక్కడే నిర్మించారు. 1978లో ప్రఖ్యాతి దర్శకుడు కె.బాలచందర్ భీమిలిలో పలు చిత్రాలను చిత్రీకరించారు. అప్పటి నుంచి మద్రాసు, హైదరాబాద్ తరువాత షూటింగులకు అనుకూలమైన ప్రాంతంగా విశాఖ–భీమిలి గుర్తింపు పొందింది. అంతులేనికథ, మరోచరిత్ర, గుప్పెడు మనసు, నాలుగు స్తంభాలాట, ఆరాధన, అభిలాష, కోకిలమ్మ, నిప్పురవ్వ వంటి సినిమాలు హిట్ కావడంతో విశాఖలో షూటింగ్ చేస్తే సినిమా బాక్సాఫీస్ కళకళలాడుతుందన్న సెంట్మెంట్ ఇప్పటికీ కొనసాగుతోంది. విశాఖ తీరంలో షూటింగ్ జరిపితే కచ్చితంగా హిట్ అన్న సెంట్మెంట్ బలంగా ఉండడంతో దర్శక నిర్మాతలు భీమిలికి క్యూ కడుతున్నారు. భీమిలి బీచ్ నుంచి యారాడ బీచ్ వరకు నిత్యం ఎన్నో షూటింగ్‌లు ప్రస్తుతం జరుపుకుంటున్నాయి. ఇందులో ఎక్కువ శాతం ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, మంగమారిపేట, ఎర్రమట్టి దిబ్బలు, రామానాయుడు స్టూడియో, భీమిలి బీచ్‌లలో చిత్రీకరణలు ఎక్కువ కొనసాగుతున్నాయి. బుల్లితెర నుంచి వెండితెర వరకూ.. ప్రస్తుతం ఈ తీర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సినిమా షూటింగ్ సందడి కనపడుతోంది. షార్ట్ ఫిల్మ్‌ల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలవరకు చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఫొటో షూట్లు, వెడ్డింగ్ షూట్స్, షార్ట్ ఫిల్మ్స్,వెబ్ సిరీస్ , టివి సీరియల్స్, డాక్యుమెంటరీల చిత్రీకరణతో నిత్యం ఈ ప్రాంతాలు కళకళలాడుతున్నాయి. -
జలక్రీడలకు నెలవుగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: జల క్రీడలకు విశాఖ బీచ్‌లు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. వివిధ విభాగాల్లో శిక్షణ అందించేలా రుషికొండలో వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటుకు కేంద్ర, ఏపీ ప్రభుత్వాల నుంచి అనుమతులు లభించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో జల క్రీడలకు విశాఖ వేదికగా మారనుంది. అదేవిధంగా చింతపల్లి బీచ్‌లో డైవింగ్ అకాడమీ ఏర్పాటుకు పర్యాటక శాఖ పచ్చజెండా ఊపింది. ఏపీ స్కూబా డైవింగ్ అకాడమీ ఆవరణలో దీనిని ఏర్పాటు చేయనున్నారు. ఈ రెండూ అక్టోబర్‌లో ప్రారంభం కానున్నాయి. వాటర్ స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్లో బోట్ డ్రైవర్స్‌కు శిక్షణ అందించడంతో పాటు లైఫ్ సేవింగ్, యాచింగ్, సెయిలింగ్, వింగ్ సర్ఫింగ్‌లో ట్రైనింగ్ అందిస్తారు. -
తీరానికి కొట్టుకొచ్చిన భారీ తాబేలు..
కొమ్మాది (భీమిలి): విశాఖలోని సాగర్‌నగర్ తీరానికి శనివారం భారీ తాబేలు కళేబరం కొట్టుకుని వచ్చింది. ఈ తరహా తాబేలు సాగర జలాల్లో సంచరిస్తుంటాయి. ఇవి గుడ్లు పెట్టేందుకు సముద్రపు ఒడ్డుకు వచ్చే సమయంలో వలలో చిక్కుకుని పడవ చక్రాలకు తగిలి మృత్యువాత పడుతుంటాయని మత్స్యకారులు తెలిపారు. ఒక్కోసారి సముద్రంలో కాలుష్యం ఎక్కువ అవుతున్నప్పుడు కూడా మరణిస్తుంటాయని పేర్కొన్నారు. చదవండి: టీడీపీ నేతకు షాక్: అక్రమ నిర్మాణం కూల్చివేత.. ‘గ్రామీణ వికాసం’లో ఏపీ భేష్ -
అరుదైన ఆ డాల్ఫిన్స్‌కు ఏమైంది?
కొమ్మాది (భీమిలి): అరుదైన జీవ సంతతికి చెందిన డాల్ఫిన్స్ మృత్యువాత పడటంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యానికి చేపలు, తాబేళ్లు తరచూ తీరానికి కొట్టుకుని రావడం చూశాం. గత కొద్ది రోజులుగా డాల్ఫిన్లు మృత్యువాత పడి తీరానికి కొట్టుకుని వస్తున్నాయి. మంగళవారం సాయంత్రం సాగర్‌నగర్ తీరానికి డాల్ఫిన్ కళేబరం ఒకటి కొట్టుకొచ్చింది. గురువారం మరో డాల్ఫిన్ కళేబరం కొట్టుకొచ్చింది. వరుసగా డాల్ఫిన్లు మృత్యువాత పడటంపై జిల్లా మత్య్సశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా శీతల వాతావరణంలో జీవించే ఈ డాల్ఫిన్లు ప్రస్తుతం ఉష్ణాగ్రతలు అధికమవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని, వీటిపై సీఎమ్ఎఫ్ఆర్ఐ సైంటిస్ట్‌లతో కలసి పరిశీలించనున్నట్లు తెలిపారు. చదవండి: ‘కూన’ గణం.. క్రూర గుణం బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్చల్ -
బీచ్‌రోడ్డు మెరిసేలా.. పర్యాటకం మురిసేలా..
సాక్షి, విశాఖపట్నం: అందాల విశాఖ నగర సిగలో మరో పర్యాటక మణిహారం చేరనుంది. నగరాన్ని పర్యాటకంలో అగ్రపథాన నిలపాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకాలకు అనుగుణంగా సందర్శకులకు ఆకట్టుకునే విధంగా నూతన ప్రాజెక్టులను వీఎంఆర్డీఏ రూపకల్పన చేసింది. బీచ్ రోడ్డులో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం, టూరిజం కాంప్లెక్స్ ఏర్పాటుకు సిద్ధమవుతోంది. రూ.40 కోట్లతో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రణాళికలు, డీపీఆర్ సిద్ధం చేశారు. రూ.10 కోట్లతో సీహారియర్ ఎయిర్‌క్రాఫ్ట్ మ్యూజియం కూడా ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రారంభించనున్నారు. ఇంటిగ్రేటెడ్ మ్యూజియం... సీ హారియర్ మ్యూజియం అందుబాటులోకి తీసుకురావడంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. బీచ్ రోడ్డుకు వచ్చే ప్రతి సందర్శకుడికీ సరికొత్త అనుభూతి కలిగించేలా మ్యూజియం తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించిన నేపథ్యంలో వీఎంఆర్డీఏ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న టీయూ–142, కురుసుర మ్యూజియంతో పాటు సీ హారియర్‌ని అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దనున్నారు. దీనికి సంబంధించిన ప్రాజెక్టు రిపోర్టు తూర్పు నౌకాదళం సిద్ధం చేసింది. మొత్తంగా రూ.40 కోట్ల అంచనా వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మ్యూజియం బీచ్‌రోడ్డులో అందుబాటులోకి రానుంది. ఫుడ్ కోర్టులు.. షాపింగ్‌లు... ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో భాగంగా రాజీవ్ స్మృతి భవన్లో సీ హారియర్ మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు. రూ.10 కోట్లతో మ్యూజియం అభివృద్ధి చెయ్యనున్నారు. అదే విధంగా రూ.10 కోట్లతో సబ్‌మెరైన్ మ్యూజియంకు సరికొత్త హంగులు అద్దనున్నారు. మరో రూ.20 కోట్లతో ఫుడ్ కోర్టులు, షాపింగ్ చేసుకునేలా దుకాణాలు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి వీఎంఆర్డీఏ సిద్ధమవుతోంది. సీహారియర్ మ్యూజియంలో.. వివిధ రకాల యుద్ధ విమానాల గురించి తెలుసుకునేలా సమగ్ర సమాచార ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు. టీయూ–142 మ్యూజియం ముందు భాగంలో ఏర్పాటు చేసిన ఆర్చ్ మాదిరిగా సబ్‌మెరైన్ మ్యూజియంను తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా.. ఇంటిగ్రేటెడ్ మ్యూజియంలో విభిన్న హంగులు కొత్త అనుభూతిని అందివ్వనున్నాయి. సావనీర్ షాప్, సిమ్యులేషన్ గేమ్స్, కాఫీషాప్‌తో పాటు జోన్ల వారీగా విభిన్నతలు అందుబాటులోకి తీసుకురానున్నారు. టీయూ–142, సబ్‌మెరైన్, సీ హారియర్ విమానాలకు గుర్తులుగా కీచైన్లు, పుస్తకాలు, ట్రేలు, కాఫీ కప్పులు, జ్ఞాపికలు.. ఇలా ఎన్నో విభిన్నమైన వస్తువులతో కూడిన షాపింగ్ దుకాణాలు కొలువుదీరనున్నాయి. సిద్ధమవుతున్న సీహారియర్... ఆర్కే బీచ్‌లో టీయూ–142 ఎయిర్‌క్రాఫ్ట్ సందర్శకులను ఎంతగానో అలరిస్తోంది. కురుసుర జలాంతర్గామి సందర్శకుల మనసు దోచుకుంటోంది. సాగరతీరానికి అదనపు ఆభరణంలా ఇప్పుడు సీ హారియర్ యుద్ధ విమానం సన్నద్ధమవుతోంది. 1983లో బ్రిటిష్ ఏరోస్పేస్ నుంచి కొనుగోలు చేసిన ఈ సీహారియర్ నౌకాదళం ఏవియేషన్ విభాగంలో చేరింది. గోవాలోని ఐఎన్ఎస్ హంస యుద్ధనౌకలో 32 ఏళ్ల పాటు దేశానికి సేవలందించింది. 2016లో సేవల నుంచి ని్రష్కమించింది. ఈ యుద్ధ విమానాన్ని వీఎంఆర్డీఏ సాగరతీరంలో మ్యూజియంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. రాజీవ్ స్మృతి భవన్లో దీనికి సంబంధించిన మ్యూజియం నిర్వహించనున్నారు. ప్రస్తుతం దీన్ని టీయూ–142 యుద్ధ విమాన మ్యూజియం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ఉంచారు. సముద్రపు గాలులకు ఇది తుప్పు పట్టకుండా ఇటీవలే వీఎంఆర్డీఏ ప్రత్యేక కోటింగ్ వేయించింది. త్వరలోనే ఇది రాజీవ్ స్మృతి భవన్‌కు చేరనుంది. బీచ్‌ను కొత్తగా చూస్తారు... ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా మూడు ప్రధాన మ్యూజియంలను అనుసంధానం చేస్తూ ఇంటిగ్రేటెడ్ మ్యూజియంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ఇది అందుబాటులోకి వచ్చాక.. ప్రతి సందర్శకుడూ బీచ్‌ను సరికొత్తగా చూస్తారు. మ్యూజియంని సందర్శించడంతో పాటు జ్ఞాపకాల్ని తీసుకెళ్లేలా షాపింగ్ సౌకర్యం, పిల్లల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాం. త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. –పి.కోటేశ్వరరావు, వీఎంఆర్డీఏ కమిషనర్ -
సాగరమంతా సంబరమే!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ ఆర్కే బీచ్ వేదికగా.. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నేవీ డే వేడుకలు బుధవారం సాయంత్రం ఘనంగా జరిగాయి. విశిష్ట, ముఖ్య అతిథిగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. ఆయనకు తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ సతీసమేతంగా స్వాగతం పలికారు. తొలుత నేవీ చిల్డ్రన్ స్కూల్ విద్యార్థుల నేవీ బ్యాండ్ ప్రదర్శనతో నావికాదళ వేడుకలకు శ్రీకారం చుట్టారు. మెరైన్ కమెండోలు 84 ఎంఎం రాకెట్ వాటర్ బాంబు పేల్చి సీఎంకు స్వాగతం పలికారు. తొలిసారిగా త్రివిధ దళాలకు చెందిన సిబ్బంది ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ యుద్ధ విమానాల బృందం చేసిన విన్యాసాలు గగుర్పొడిచాయి. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో సముద్రంలో పయనిస్తూ ఐఎస్‌వీ తరహా నౌకలు సుదూరం నుంచి ఎదురెదురుగా దూసుకువచ్చే సన్నివేశం అబ్బురపరచింది. ఆరువేల అడుగుల ఎత్తులో పయనిస్తున్న ఎయిర్ క్రాఫ్ట్‌ల నుంచి పారా జంపింగ్ చేసిన స్కై డైవర్లు గాల్లో విన్యాసాలు చేస్తూ ప్యారాచూట్ల సహాయంతో వేదిక ప్రాంగణంలో చాకచక్యంగా వాలారు. అనంతరం స్కై డైవర్ల బృంద సారధి లెఫ్టినెంట్ రాథోడ్ విశిష్ట అతిథి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి స్మృతి చిహ్నాన్ని అందించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో భాగంగా సముద్రంలో చిక్కుకున్న వారిని హెలికాప్టర్ల ద్వారా రక్షించడం, మిగ్ విమానాలు పల్టీలు కొడుతూ దూసుకుపోవడం, మార్కోస్‌ను సీకింగ్ హెలికాప్టర్ల ద్వారా మరో చోటకు తరలించడం వంటి సాహస విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అద్భుతమైన రీతిలో విన్యాసాలు ప్రదర్శించారంటూ నౌకాదళ బృందాన్ని సీఎం ప్రశంసించారు. బుధవారం విశాఖ సాగర తీరంలో ఒళ్లు గగుర్పొడిచే యుద్ధ విన్యాసాలు చేస్తున్న నేవీ సిబ్బంది. (ఇన్సెట్లో) తూర్పు నౌకాదళాధిపతి, వైస్ అడ్మిరల్ అతుల్‌కుమార్ జైన్‌తో కలిసి విన్యాసాలను వీక్షిస్తున్న సీఎం వైఎస్ జగన్ తేనీటి విందులో సీఎం జగన్ విన్యాసాలు ముగిసిన అనంతరం నేవీ హౌస్‌లో ఎట్ హోం పేరుతో నిర్వహించిన తేనీటి విందులో సీఎం జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. భారత నౌకాదళం ఆవిర్భావం నుంచి ఇప్పటివరకూ సాగించిన వీరోచిత చరిత్రపై ప్రదర్శించిన షార్ట్ ఫిల్మ్‌ను తిలకించారు. సీఎం వెంట మంత్రులు అవంతి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబు, సీఎం ప్రోగ్రామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు. -
విశాఖ బీచ్‌లో రేవ్ పార్టీ కలకలం
-
ఉన్నోళ్లకే ఓడలు!
ఉన్నోడికే పండుగ.. అని పెద్దలు ఉత్తనే అనలేదు. పండుగైనా, పబ్బమైనా చేతిలో కాసులు లేకపోతే పని జరగదు. ఆ సూత్రాన్నే మన పర్యాటక శాఖ పెద్దలు అందిపుచ్చుకున్నట్టు ఉంది. సాగరతీరంలో ఈ నెలాఖరులో జరగనున్న ‘ఓడల పండుగ’ (యాటింగ్ ఫెస్టివల్) అంతా సొమ్ములున్నోళ్ల సందడిగా సాగనుంది. విదేశాల నుంచి యాట్స్ (విలాసవంతమైన ఓ మోస్తరు ఓడలు) తెచ్చి విశాఖలో తొలిసారి నిర్వహించనున్న వేడుకలో పాల్గొనాలంటే చేతి చమురు గట్టిగానే వదలనుంది. ఓడెక్కాలంటే నిర్దేశించిన రేట్లు చూస్తే కాస్త క్యాష్ కలవారు కూడా వెనకడుగు వేయాల్సి వస్తోంది. ఇక సామాన్యులు దూరం నుంచి ఓడలు చూసి ఓహో అనుకునే సదుపాయాన్ని మాత్రం పర్యాటక శాఖ ‘ఉచితంగా’ కల్పిస్తోంది. సాక్షి, విశాఖపట్నం: పర్యాటక స్వర్గధామంగా పేరొందిన విశాఖ మరో పండగకు ఆతిథ్యమిస్తోంది. అయితే ఇది సామాన్య, మధ్య తరగతి వారికి కాదండోయ్.. కేవలం ధనవంతుల కోసమే! వారిని విదేశీ బోట్లలో సువిశాల సాగరంలో షికారు చేయించడానికి పర్యాటకశాఖ సన్నద్ధమవుతోంది. దానికి యాటింగ్ ఫెస్టివల్ అనే పేరు పెట్టింది. ఈ నెల 28 నుంచి 31 వరకు దేశంలోనే తొలిసారిగా విశాఖ సాగరతీరంలో ఈ ఫెస్టివల్ జరపనుంది. విమానాల్లో విహరించే ధరలకంటే ఈ యాటింగ్ బోట్లలో షికారు చేసేందుకు వసూలు చేసే టిక్కెట్ల ధరలే అధికం కావడం ఈ ఫెస్టివల్ విశేషం! ఇప్పటిదాకా రాష్ట్రంలో సరస్సులు, నదుల్లో సాధారణ బోట్లలో పర్యాటకులు, సందర్శకులను తీసుకెళ్లి తీసుకొస్తున్నారు. సరికొత్తగా విశాఖలో పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా దేశ, విదేశీ పర్యాటకులను మరింతగా ఆకట్టుకోవడానికి ప్రభుత్వం ఈ యాటింగ్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తోంది. ఈ యాటింగ్ ఫెస్టివల్ నిర్వహణ బాధ్యతను ఈ–ఫ్యాక్టర్ ఎంటర్టైన్మెంట్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థకు అప్పగించింది. ఈ ఫెస్టివల్‌కు ప్రభుత్వం రూ.3 కోట్లు వెచ్చించనుంది. విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు ఆనుకుని ఉన్న ప్రత్యేక జెట్టీని ఫెస్టివల్‌కు వేదికగా నిర్ణయించారు. ఇందుకోసం థాయ్‌లాండ్, సింగపూర్, మలేసియా దేశాల నుంచి కేబిన్లు కలిగిన 10 ప్రత్యేక యాటింగ్ బోట్లను తీసుకొస్తున్నారు. వీటిలో ఒక కేబిన్, రెండు కేబిన్లున్న బోట్లు కూడా ఉంటాయి. ఒక కేబిన్ బోటులో 20 సీట్లు, రెండు కేబిన్ల బోటులో 20 నుంచి 30 సీట్లు ఉంటాయి. రోజూ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఫెస్టివల్‌ను నిర్వహిస్తారు. చార్టర్డ్ బోటు కూడా.. ఇక కుటుంబ సభ్యులు, స్నేహితులు, కార్పొరేట్ సంస్థల వారు ప్రత్యేకంగా ఒక చార్టర్డ్ యాటింగ్ బోటును తీసుకోవచ్చు. 20 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న ఈ బోటు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ బోట్‌ను ఒక రోజు బుక్ చేసుకోవడానికి రూ.2.5 లక్షలు వసూలు చేస్తారు. వీరికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి విందు వంటివి అందజేస్తారు. ఎక్కడెక్కడకు తీసుకెళ్తారు..? రెండేళ్ల క్రితం విశాఖలో అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూ (ఐఎఫ్ఆర్) జరిగిన సమయంలో ఫిషింగ్ హార్బర్‌కు ఆనుకుని పాసింజర్ జెట్టీని నిర్మించారు. ఇప్పుడు ఈ యాట్ ఫెస్టివల్‌కు కూడా దానినే వేదికగా చేశారు. బోట్లు అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తాయి. తొట్లకొండ, యారాడ, భీమిలి, రుషికొండ (ప్రతిపాదిత విమాన వాహక యుద్ధనౌక మ్యూజియం ప్రాంతం), కైలాసగిరిలకు రోజుకొక ప్రాంతానికి ఈ పర్యాటకులను తీసుకెళ్తారు. అక్కడ స్టార్ హోటల్ స్థాయిలో మధ్యాహ్న భోజనం అందజేస్తారు. ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం రాత్రికి వేదిక వద్దకు తీసుకొస్తారు. ఈ యాటింగ్ బోట్ల వెంట గజ ఈతగాళ్లతో కూడిన నేవీ, విశాఖ పోర్టు పడవలు తోడుగా వెళ్తాయి. ఇంకా ఏం చేస్తారంటే? ఈ ఫెస్టివల్లో ఆసక్తి ఉన్న వారి కోసం స్నార్కెలింగ్ (సముద్ర అడుగున డైవింగ్ తరహా విన్యాసం), ట్రజర్ హంట్, సర్కులర్ సీ స్విమ్మింగ్ (డాల్ఫిన్ నోస్ వద్ద), సెయిలింగ్ పోటీలు వంటివి కూడా నిర్వహించనున్నారు. రాత్రి వేళ తీరంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు. వెయ్యి మందికే అవకాశం! తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ యాటింగ్ ఫెస్టివల్‌కు వెయ్యి మంది వరకు పర్యాటకులకు అవకాశం కల్పించనున్నారు. ఆయా బోట్లలో రోజుకు 300–350 మంది షికారు చేసేలా ఏర్పాట్లు చేశారు. పాపికొండల్లో అలా..యాటింగ్ ఫెస్టివల్లో ఇలా.. రాజమండ్రి నుంచి పాపికొండలు పర్యటనకు గోదావరి నదిలో బోటు (ఏసీ)లో వెళ్లి రావడానికి ఒకరికి ఒకరోజు ప్యాకేజీ గరిష్టంగా రూ.వెయ్యి, రెండ్రోజుల ప్యాకేజీకి రూ.2500 వసూలు చేస్తున్నారు. వీరికి బోటులోనే అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు సమకూరుస్తారు. మార్గమధ్యలో దేవాలయాల సందర్శనకు తీసుకెళ్తారు. దీనిని బట్టి చూస్తే యాటింగ్ ఫెస్టివల్ రేట్లు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది. నిధులు చారిటీకే.. యాటింగ్ ఫెస్టివల్ ద్వారా వచ్చే ఆదాయాన్ని చారిటీకే వినియోగించాలని నిర్ణయించారు. ఫెస్టివల్ నిర్వహించే ఈ–ఫ్యాక్టర్ సంస్థకు ఇవ్వబోమని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. పర్యాటకాభివృద్ధికే.. యాటింగ్ ఫెస్టివల్ ద్వారా విశాఖలో పర్యాటకరంగం మరింత అభివృద్ధి చెందనుంది. ఫెస్టివల్ నిర్వహణ ద్వారా అంతర్జాతీయ స్థాయిలో విశాఖ ఖ్యాతి మళ్లీ ఇనుమడిస్తుంది. స్పందన బాగుంది. ఇందులో పాల్గొనే వారికోసం రక్షణ, భద్రత పరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. – డి.శ్రీనివాసన్, రీజనల్ డైరెక్టర్, ఏపీటీడీసీ రేట్లు.. హడలు యాటింగ్ బోటులో ఒక రోజు షికారు చేయడానికి ఒక్కొక్కరికి రూ.14,500, ఒక జంట విహారానికి రూ.27,500, నాలుగు రోజులకు రూ.47,500, చార్టర్ యాట్ పేరుతో ఒక రోజు పడవలో పర్యటించడానికి రూ.2.50 లక్షలు చొప్పున ధరలు నిర్ణయించారు. అంతేకాదు.. ఒక పడవను నాలుగు రోజులు పాటు ప్రచారానికి వినియోగించు కోవాలంటే రూ.17.5 లక్షలు వసూలు చేయనున్నారు. దీంతో సామాన్యులు ఈ యాటింగ్ ఫెస్టివల్ దరికి చేరే అవకాశం కూడా లేదు. దీనిని విశాఖ ఆర్కే బీచ్ నుంచి వీక్షించే అవకాశం కల్పిస్తామని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. తొలిరోజు ఆర్కే బీచ్ నుంచి గౌరవ వందనం స్వీకరించే కార్యక్రమం ఉంటుంది. మరోవైపు టిక్కెట్లను ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం కల్పించారు. -
విశాఖ్ బీచ్‌లో గోవా సెట్టింగ్స్
-
విశాఖ బీచ్‌లో మరో మృతదేహం లభ్యం
హైదరాబాద్: విశాఖపట్టణంలోని జోడుగుళ్ల పాలెం బీచ్‌లో శనివారం మరో మృతదేహం లభ్యమైంది. గురువారం ముగ్గురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. ఆ ముగ్గురిలో లోకేశ్, రాజు మృతదేహాలు శుక్రవారం లభ్యమయ్యాయి. మిగిలిన విజయ్ మృతదేహం కూడా లభ్యమైంది. విశాఖ జిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలకు గల్లంతైన సంగతి తెలిసిందే. -
బీచ్‌లో రెండు మృతదేహాలు లభ్యం
-
బీచ్‌లో రెండు మృతదేహాలు లభ్యం
విశాఖపట్ణణం: విశాఖపట్టణంలోని జోడుగుళ్లపాలెం బీచ్‌లో గురువారం గల్లంతైన యువకుల్లో ఇద్దరి మృతదేహాలు ఉదయం లభించాయి. మృతదేహాలు శుక్రవారం ఉదయం బీచ్ ఒడ్డుకు చేరుకున్నాయి. మరో మృతదేహం లభించాల్సి ఉంది. వివరాలు.. విశాఖ జిల్లాలోని తెన్నేటిపార్కు సమీపంలోని జోడుగుళ్లపాలెం తీరంలో సముద్ర స్నానం చేస్తున్న లోకేష్(19), రాజు(18), విజయ్(20) అనే ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన అలకు గల్లంతైన సంగతి తెలిసిందే.