
సాగర్‌నగర్ బీచ్ వద్ద తీరానికి కొట్టుకుని వచ్చిన డాల్ఫిన్ కళేబరం
కొమ్మాది (భీమిలి): అరుదైన జీవ సంతతికి చెందిన డాల్ఫిన్స్ మృత్యువాత పడటంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. ఇంతవరకు సముద్రంలో పెరుగుతున్న కాలుష్యానికి చేపలు, తాబేళ్లు తరచూ తీరానికి కొట్టుకుని రావడం చూశాం. గత కొద్ది రోజులుగా డాల్ఫిన్‌లు మృత్యువాత పడి తీరానికి కొట్టుకుని వస్తున్నాయి.
మంగళవారం సాయంత్రం సాగర్‌నగర్ తీరానికి డాల్ఫిన్ కళేబరం ఒకటి కొట్టుకొచ్చింది. గురువారం మరో డాల్ఫిన్ కళేబరం కొట్టుకొచ్చింది. వరుసగా డాల్ఫిన్లు మృత్యువాత పడటంపై జిల్లా మత్య్సశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.శ్రీనివాసరావును వివరణ కోరగా శీతల వాతావరణంలో జీవించే ఈ డాల్ఫిన్లు ప్రస్తుతం ఉష్ణాగ్రతలు అధికమవడం వల్ల మృత్యువాత పడుతున్నాయని, వీటిపై సీఎమ్‌ఎఫ్‌ఆర్‌ఐ సైంటిస్ట్‌లతో కలసి పరిశీలించనున్నట్లు తెలిపారు.
చదవండి:
‘కూన’ గణం.. క్రూర గుణం
బాబు చెప్పినా వినలేదు.. టీడీపీ నేతల హల్‌చల్
Comments
Please login to add a commentAdd a comment