ఉప్పాడ తీరంలో అభివృద్ధి తరంగం
దశాబ్దాల సమస్యకు పరిష్కారం
మేజర్ హార్బర్ నిర్మాణంతో మత్స్యకారుల సమస్యకు లంగరు
సీఎం వైఎస్ జగన్‌కు జేజేలు కొడుతున్న మత్స్యకారులు
తీరం రూపు రేఖలు మార్చేసిన ఉప్పాడ హార్బర్
వచ్చే 50 ఏళ్ల అవసరాలకు అనుగుణంగా నిర్మాణం
ఆ తీర ప్రాంతమంతా మత్స్యకారుల ఆవాసం.. చేపల వేట వారి జీవనాధారం అయితే వేటాడిన చేపలు వెంటనే అమ్ముకోవడం తప్ప వేరే దారి లేదు. వారి వేట సామగ్రికి రక్షణ లేదు. వారి జీవితాలే గాలి వాటంగా మారిపోయాయి. అలాంటి వారి జీవితాలలో 2019వ సంవత్సరం వెలుగులు నింపింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే వారి జీవితాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఎటువంటి సౌకర్యాలు లేని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం ఇప్పుడు దేశం గర్వించదగ్గ తీర ప్రాంతంగా మారింది. రాష్ట్రానికి మత్స్యసంపద ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని తెచ్చి పెట్టే ఒక ప్రముఖ ప్రాంతంగా ఉప్పాడ తీరం చరిత్ర సృష్టించబోతోంది.
పిఠాపురం: మాకు మాట ఇచ్చారు... అన్న వచ్చారు... చెప్పినదానికంటే ఎక్కువ చేసి చూపిస్తున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జాలర్లు జై కొడుతున్నారు. సుమారు 50 ఏళ్లుగా ప్రధాన సమస్యగా ఉన్న ఉప్పాడ మినీ హార్బర్ నిర్మాణం సీఎం వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక కార్యరూపం దాలి్చంది. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న జనాభా అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ హార్బర్‌ను నిర్వించడం విశేషం. మినీ హార్బర్ నిరి్మస్తామని చెప్పినా మేజర్ హార్బర్ నిరి్మంచడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
టీడీపీ హయాంలో...
2014లో ఉప్పాడ మత్స్యకారుల సమస్యలు తీరుస్తామని మినీ హార్బర్ నిరి్మస్తామని చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు హామీలు గుప్పించారు. తీరా అధికారంలోకి వచ్చాక మినీ హార్బర్ ఊసెత్తలేదు. రూ.50 కోట్లు కేటాయించామని గొప్పలు చెప్పుకున్నారు. డీజిల్ సబ్సిడీ, వేట నిషేధ పరిహారం, ప్రమాదవశాత్తు మరణించిన వారికి పరిహారం పెంపు విషయాలను పక్కన పెట్టేశారు. ఐదేళ్లపాటు ఉప్పాడ తీర ప్రాంతంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయలేదు. డ్రెడ్జింగ్ పేరుతో రూ.2 కోట్లు ప్రభుత్వ సొమ్మును టీడీపీ నేతలు పంచేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
2019 తరువాత...
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా కాకినాడలో నిర్వహించిన మత్స్యకార సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ మత్స్యకారుల సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. అధికారంలోకి వచి్చన వెంటనే అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తానని మాట ఇచ్చారు. అన్న మాట ప్రకారం అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ఉప్పాడ తీరంలో మేజర్ హార్బర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రానున్న 50 ఏళ్లలో పెరగనున్న మత్స్యకారుల వేటకు వీలుగా మేజర్ హార్బర్ నిర్మాణానికి రూ.351 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించారు.
2500 బోట్లు నిలిపే సామర్థ్యంతో 1.10 లక్షల మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరించేలా, 50 వేల మత్స్యకార కుటుంబాలకు ఆసరాగా నిర్మాణం చేపట్టారు. కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, ఫిష్ హ్యాండ్లింగ్, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు, ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం, వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్ పనులు 70 శాతం పూర్తయ్యాయి. తొలుత కరోనా వల్ల పనులు కొంత నెమ్మదైనా గత ఏడాది నుంచి ఊపందుకున్నాయి. ఆరు నెలలుగా పరుగులు పెట్టిన పనులతో రూ.250 కోట్లకు పైగా నిధులు వెచి్చంచి నిర్మాణాలు పూర్తి చేశారు.
ఇంత అభివృద్ధి చూస్తాననుకోలేదు
నా చిన్నప్పటి నుంచి ఈ ప్రాంతంలో హార్బరు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. గతంలో కాకినాడ హార్బర్‌కు మా బోట్లు వెళ్లేవి. కానీ పదేళ్లుగా మా బోట్లను కాకినాడ హార్బర్‌కు రానివ్వడం లేదు. దీంతో ఇక్కడే ఉప్పుటేరులో బోట్లు నిలుపుకుంటున్నాం. అప్పుడప్పుడు చాలా ప్రమాదాలు జరిగి ఆస్తి, ప్రాణ నష్టాలు సంభవించేవి. గతంలో టీడీపీ నేతలు ఎన్నో వాగ్దానాలు చేసినా అవేవీ నెరవేరలేదు. ఇక జన్మలో హార్బర్ చూస్తామనుకోలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ మా బాధలు విని అన్న మాట ప్రకారం నిరి్మంచి,మాకు ప్రత్యక్ష దైవంగా మారారు. - కంబాల రాంబాబు, మత్స్యకారుడు,ఉప్పాడ శివారు సూరాడపేట
జిల్లాలో తీరప్రాంత మండలాలు: 5
మత్స్యకార గ్రామాలు: 36
మెరైన్ ఫిషర్‌మెన్ జనాభా: 2,00,000
చేపల వేట ద్వారా జీవనోపాధి పొందుతున్న వారు: 36,000
మెకనైజ్డ్ బోట్లు: 467
మోటారు బోట్లు: 3,779
సంప్రదాయ బోట్లు: 399
మొత్తం బోట్లు: 4,645
ఉప్పాడ మేజర్ హార్బర్ విశేషాలు
∗ నిర్మాణ వ్యయం: రూ.351 కోట్లు
∗ నిర్మాణ స్థలం: 58 ఎకరాలు
∗ ఉపాధి పొందే మత్స్యకారుల కుటుంబాలు: 2500
∗ ఉపాధి పొందే మండలాలు కొత్తపల్లి,తొండంగి, కాకినాడ రూరల్
∗ ఏటా 30 వేల టన్నుల నుంచి 1.10 లక్షల టన్నులకు పెరగనున్న మత్స్య ఉత్పత్తి
∗ చేపల ఉత్పత్తి అంచనా విలువ రూ.890 కోట్లు
∗ ఒకేసారి 2,500 బోట్లు నిలుపుకునే సామర్థ్యం.. భారీ బోట్లు నిలుపగలిగేలా నిర్మాణం
∗ 20 టన్నుల కెపాసిటీ గలశీతల గిడ్డంగులు.. భారీ ట్యూనా చేపల ఫిష్ హ్యాండ్లింగ్ ప్యాకింగ్ షెడ్లు
∗ కోల్డ్ స్టోరేజ్‌లు, పెట్రోల్ బంకు, జెట్టీలు, వేలం ప్రాంగణం, చేపలు ఎండబెట్టుకునే యార్డు,
∗ ప్యాకింగ్ షెడ్లు, మత్స్యకారులకు శిక్షణా కేంద్రం.. వలలు అల్లుకునే షెడ్లు, ఐస్ ప్లాంట్
Comments
Please login to add a commentAdd a comment