
రామచంద్రపురం రూరల్(కాకినాడ): కన్న బిడ్డలను పంట కాలువలోకి తోసేసిన కర్కశ తండ్రి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. రాయవరం మండలం వెంటూరుకు చెందిన పిల్లి రాజు సోమవారం రామచంద్రపురం మండలం నెలపర్తిపాడు శివారు గణపతినగరం సమీపంలోని పంట కాలువలో తన బిడ్డలు పదేళ్ల రామసందీప్, ఏడేళ్ల కారుణ్యశ్రీని తోసేసిన ఘటనలో, సందీప్ బతికి బయటపడగా, కారుణ్య నీటమునిగి చనిపోయిన సంగతి విదితమే.
అప్పుల నేపథ్యంలో పిల్లలను చంపి, తానూ ఆత్మహత్య చేసుకునేందుకు ఇలా చేసి ఉండొచ్చనే కోణంలో పోలీసులు కాలువలు, గోదావరి వెంబడి పిల్లి రాజు ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలించారు. ఈ క్రమంలో యానాం బ్రిడ్జిపై రాజు స్కూటర్ కనిపించడంతో, వారి అనుమానం బలపడింది. రామచంద్రపురం సీఐ వెంకటనారాయణ, ద్రాక్షారామ ఎస్సై ఎం.లక్ష్మణ్ బోటుపై గోదావరిలో విస్తృతంగా గాలించారు. అయితే నిందితుడు రాజు మండపేట రూరల్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయినట్టు తెలిసింది. పోలీసులు దీనిని గోప్యంగా ఉంచడం గమనార్హం.
‘‘నాన్నా చంపొద్దు.. ప్లీజ్’’
Comments
Please login to add a commentAdd a comment