గంజాయి విక్రేతల ముఠా అరెస్టు
నిడదవోలు: గంజాయి విక్రయిస్తున్న ఆరుగురు యువకుల ముఠాను నిడదవోలు పోలీసులు అరెస్టు చేశారు. నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ బుధవారం విలేకర్లకు ఈ వివరాలు వెల్లడించారు. పట్టణంలో వైఎస్సార్ కాలనీలోని మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద కొందరు యువకులు గంజాయిని కలిగి ఉన్నారనే సమాచారంతో మంగళవారం సాయంత్రం పట్టణ ఎస్సై జీఎస్‌ఆర్‌కే పరమహంస తన సిబ్బందితో దాడి చేశారు. పట్టణానికి చెందిన కొందరు యువకులు ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా కామన్‌గూడ ప్రాంతం నుంచి కేజీ గంజాయిని రూ.3 వేల చొప్పున కొనుగోలు చేసి, నిడదవోలుకు తీసుకొచ్చారు. మానే గాంధీ పొలంలో పంపు షెడ్డు వద్ద వేయింగ్ మెషీన్‌పై తూచి, ప్యాకెట్లుగా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులు దాడి చేసి, పట్టణంలోని కుమ్మరి వీధికి చెందిన దాసరి పృథ్వీవెంకటసాయి నితీష్, జగనన్న కాలనీకి చెందిన గడిచుకోట భానుప్రకాష్, వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ బషీర్, చర్చిపేటకు చెందిన అక్కాబత్తుల బాలు, సింగవరం గ్రామానికి చెందిన మద్దాల భానుప్రకాష్, తిమ్మరాజుపాలెం గ్రామానికి చెందిన పడాల భాగ్య శివసుబ్రహ్మణ్యంను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపించినట్టు సీఐ తిలక్ తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.55 వేల విలువైన 11 కేజీల గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు, మోటార్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ నిడదవోలు పోలీసులను అభినందించారు.
నిందితుల్లో ఆరుగురు యువకులు
11 కేజీల సరకు, ఇతర వస్తువులు స్వాధీనం
గంజాయి విక్రేతల ముఠా అరెస్టు
Comments
Please login to add a commentAdd a comment