సీలింగ్ భూములు ఎస్సీ, ఎస్టీలకు పంచాలి
జైపాల్ సింగ్ ముండాకు ఆదివాసి మహాసభ నివాళులు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): రాష్ట్రంలో భూసంస్కరణలు అమలు చేసి సీలింగ్ చట్ట ప్రకారం 50 శాతం భూమి ఎస్సీ, ఎస్టీలకు పంపిణీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేసింది. భారత రాజ్యాంగ సభ సభ్యులు, ఆదివాసీ మహాసభ వ్యవస్థాపకుడు జైపాల్ సింగ్ ముండా 55వ వర్ధంతి సందర్భంగా గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయనకు ఆదివాసీ మహాసభ తరఫున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసి మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 34,348 ఎకరాల సీలింల్ మిగులు భూములు ఉన్నాయని, వాటిలో 15,500 ఎకరాల పంపిణీ జరిగిందన్నారు. సుమారు 18,848 ఎకరాలు కోర్టు వివాదాలలో ఉన్నాయన్నారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా ప్రారంభించిన భూ పంపిణీ కార్యక్రమంలో సీలింగ్ భూములు వెయ్యి ఎకరాలు పంచారన్నారు. ఇప్పటికై నా తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ జిల్లా, కోనసీమ జిల్లా అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లు బాధ్యత వహించి సీలింగు భూములన్నీ వేరే పార్టీకి రిజిస్ట్రేషన్‌న్ జరుగకుండా 22ఎ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదివాసీ మహాసభ డిమాండ్ చేస్తోందన్నారు. నాయకులు జక్కల పాండవులు, సభ్యులు గూన అప్పన్న, అర్జన, మల్లేశ్వరి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment