Top Stories
ప్రధాన వార్తలు

ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ముస్లిం సోదరులకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్ అని వైఎస్ జగన్ చెప్పుకొచ్చారు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారురంజాన్ పండుగ సందర్బంగా వైఎస్ జగన్..‘ముస్లింలకు రంజాన్ పండుగ ఎంతో పవిత్రమైనది. రంజాన్ పండుగ సామరస్యానికి, సుహృద్భావానికి, సర్వమానవ సమానత్వానికి, కరుణకు, దాతృత్వానికి ప్రతీక. అల్లాహ్ దీవెనలతో రాష్ట్ర ప్రజలకు, ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్ మాసం విశిష్టత. పవిత్ర దివ్య ఖురాన్ అవతరించిన ఈ మాసంలో కఠిన ఉపవాస దీక్షలకు రంజాన్ ఒక ముగింపు వేడుక. మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని రూపుమాపే గొప్ప పండుగ రంజాన్’ అని అన్నారు.భక్తి శ్రద్ధలతో కఠినమైన ఉపవాస దీక్షలు ముగించుకుని ప్రేమ, శాంతి, సౌభ్రాతృత్వానికి ప్రతీక అయిన రంజాన్ పండుగను జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ నా శుభాకాంక్షలు. అల్లా చూపిన మార్గంలో నడవాలని, అల్లా చల్లని దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా…— YS Jagan Mohan Reddy (@ysjagan) March 31, 2025

Nara Lokesh: కోతి చేతికి కొబ్బరిచిప్ప దొరికినట్లు..!
తెలుగుదేశం పార్టీ అబద్దాల ఫ్యాక్టరీగానే కాదు.. అహంభావం తలకెక్కిన పార్టీగా మారిపోయిందా! పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌లు చేసిన ప్రసంగాలు చూస్తే అలాగే అనిపిస్తోంది! అవకాశవాద రాజకీయాలు చేసేందుకు చంద్రబాబు ఏ మాత్రం ఫీల్ కారు. ఇప్పుడు లోకేష్ కూడా అదేబాటలో పయనిస్తూ అబద్దాలు చెప్పడంలో తండ్రితో పోటీ పడుతున్నారన్న విమర్శలు ఎదుర్కుంటున్నారు. అబద్దాల వరకైతే ఒక రకంగా సరిపెట్టుకోవచ్చు. కాని తానొక యువరాజు అనుకుని అహంకారంతో నారా లోకేష్(Nara Lokesh) మాట్లాడుతున్న తీరు కచ్చితంగా ఆయన స్వభావాన్ని తెలియచేస్తుంది. చంద్రబాబు నాయుడుకు లోపల అహం ఉన్నా, పైకి కనిపించకుండా నటిస్తూ, రెండు రకాలుగా ఆయనే మాట్లాడుతూ ప్రజలను మభ్య పెట్టే యత్నం చేస్తుంటారు. కానీ లోకేష్ మాత్రం అధికారంతో వచ్చిన కైపుతో మాట్లాడుతున్న వైనం పార్టీలోనే కాదు.. ప్రజలలో కూడా వెగటు పుట్టించే అవకాశం ఉంది. వీరి ఉపన్యాసాలకు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ.. చంద్రబాబు ఎప్పటి మాదిరే అసత్యాలు చెప్పారని, లోకేష్ అధికార మదంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో లోకేష్ ఇందుకు మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరించారు. 👉విశేషం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ(TDP) ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ పార్టీలో చేరనే లేదు. పార్టీలోకి రావాల్సిందిగా మామ ఎన్టీఆర్, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోరినా, అసలు తెలుగుదేశం పార్టీ మనజాలదని చెప్పారు. సినిమా వాళ్లను జనం ఆదరించరని ఎద్దేవా చేశారు. అప్పట్లో ఆయన కాంగ్రెస్ (ఐ) ప్రభుత్వంలో మంత్రి. పార్టీ అదేశిస్తే మామపై కూడా పోటీ చేస్తానని బీరాలు పలికిన చరిత్ర ఆయనది. కానీ 1983 ఎన్నికలలో చంద్రబాబు ఓడిపోయాయిన వెంటనే ముఖ్యమంత్రి పీఠమెక్కిన మామ పార్టీలోకి రావడం చంద్రబాబుకు ఇబ్బంది రాలేదు. అప్పటి నుంచి పార్టీని ఒక ప్లాన్ ప్రకారం తన గుప్పెట్లోకి తెచ్చుకుని, చివరికి రామారావునే కూలదోసిన సంగతీ తెలిసిందే. 👉చివరి రోజుల్లో ఎన్టీఆర్ స్వయంగా చంద్రబాబును(Chandrababu) విలువలు లేని వ్యక్తి అని చెప్పిన విషయం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. చంద్రబాబు అంత దుష్టుడు లేడంటూ రామారావే వీడియో విడుదల చేశారు. ఆయన ఆకస్మిక మరణంతో చంద్రబాబు మాట మార్చేసి, ఆయన వారసత్వం తనదేనని ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ ఆశయాలే తమ సిద్దాంతమని, ఆయన యుగపురుషుడు అంటూ కబుర్లు చెబుతూ వస్తున్నారు. కాలం గడిచే కొద్ది ఆ పేరు కనుమరుగవుతూ వచ్చింది. స్వోత్కర్ష పెరిగింది. పార్టీలోని ఇతర నేతలు, క్యాడర్ కూడా అదే బాటలో నడుస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడు టీడీపీని ఒక అబద్దాల కర్మాగారంగా మార్చడంలో విజయవంతం అయ్యారన్న అభిప్రాయం వివిధ వర్గాలలో వ్యక్తం అవుతుంటుంది. ఒక వర్గం మీడియాకు అవసరమైన వనరులను సమకూర్చి దానిని తన చెప్పుచేతలలో ఉండేలా చేసుకున్నారు. చంద్రబాబు చెప్పే అబద్దాలను జనంలోకి తీసుకువెళ్లడంలో ఈ ఎల్లో మీడియా నిరంతరం శ్రమిస్తుంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు విజయవంతం అయ్యారు. మరికొన్ని సార్లు విఫలం అయ్యారు. వార్షికోత్సవంలో ఒకరినొకరు పొగుడుకుంటే పర్వాలేదు.కాని అదేదో పార్టీలో మొదటి నుంచి తానే ఉన్నట్లు, ఇప్పటికీ ఎన్టీఆర్ కాలం నాటి విలువలు కొనసాగిస్తున్నట్లుగా కబుర్లు చెప్పడమే అతిశయోక్తిగా ఉంటుంది. ఎన్టీఆర్ ఆత్మగౌరవ నినాదంతో పార్టీని పెట్టారు. పేదలను సంక్షేమ కార్యక్రమాలతో ఆదుకోవాలని భావించేవారు. మాట ఇస్తే సాధ్యమైనంత వరకు ఆచరించి చూపాలని అనేవారు. అబద్దాలు చెప్పడానికి అంతగా ఇష్టపడేవారు కారు. అయితే పార్టీ చంద్రబాబు నాయుడు చేతిలోకి వచ్చినప్పటి నుంచి వీటన్నిటికి మంగళం పలికింది కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఎన్టీఆర్ ఆత్మగౌరవం కోసం ఢిల్లీలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాడితే, చంద్రబాబు అదే కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడానికి 2023 లో నానా తంటాలు పడ్డారు. 2024 ఎన్నికలకు ముందు ఢిల్లీలో రోజుల తరబడి బీజేపీ పెద్దల చుట్టూ తిరిగి ఎలాగైనా పొత్తు కావాలని కోరిన వైనం, పవన్ కళ్యాణ్‌ను బతిమలాడుకున్న తీరును గమనిస్తే, టీడీపీ ఆత్మగౌరవం ఎలా దిగజారిపోయింది తెలియడం లేదా! తన పార్టీలోకి ఎవరైనా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రావాలంటే రాజీనామా చేసి రావాలని ఎన్టీఆర్ నియమం పెట్టారు. చంద్రబాబేమో పూర్తిగా అందుకు విరుద్దం. 2014 టర్మ్‌లో 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి టీడీపీలోకి తీసుకు వచ్చి, నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టారు. ఎన్టీఆర్ ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా 1994లో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి మద్య నిషేధం విధిస్తే, చంద్రబాబు ఆయనను పదవీచ్యుతుడిని చేసి మొత్తం రివర్స్ చేశారు. పోనీ వాటికైనా కట్టుబడి ఉంటారా ఉంటే అదేమీ లేదు. ఎన్నికలకు ముందు ఎక్కడలేని అబద్దాలు చెబుతారన్న విమర్శకు ఆస్కారం ఇస్తారు. ఆ తర్వాత వాటిని ఏ రకంగా ఎగవేయాలన్న దాని కోసం ఎన్ని అసత్యాలైనా చెప్పడానికి వెనుకాడరని అనుభవాలు చెబుతున్నాయి. 2014 టర్మ్‌లో రైతుల రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణమాఫీ వంటి హామీలు ఇచ్చి ఏమి చేశారో అందరికి తెలుసు. 2024లో రికార్డు స్థాయిలో అబద్దాలు చెప్పి గెలిచిన తర్వాత ఇప్పుడు ఏ రకంగా మాట్లాడుతున్నారో అంతా గమనిస్తూనే ఉన్నారు. సూపర్ సిక్స్, తదితర హామీలు, అప్పుల గురించి ఎన్నికల ప్రచారంలో ఏమి చెప్పారు! ఇప్పుడు ఏమి అంటున్నారు. 👉ఎన్నికలకు ముందు బయట నుంచి చూస్తే సూపర్ సిక్స్ అమలు చేయగలనని అనిపించిందట. అందుకే హామీలు ఇచ్చారట. కాని అధికారం వచ్చాక చేయడం కష్టమని తెలుస్తోందట. పదిహేనేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి ఈ మాటలు చెబితే ఎవరైనా నమ్ముతారా? ప్రజల చెవిలో పూలు పెట్టడం తప్ప ఇంకొకటి అవుతుందా? ఒకసారి అప్పు చేసి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానంటారు. మరోసారి స్కీములన్నీ ఇచ్చేస్తానని అంటారు. వేరొకసారి అప్పులు చేసి స్కీములు ఎలా ఇస్తామని ప్రజలనే ప్రశ్నిస్తారు. ఇలా అన్ని మాటలు ఆయనే చెబుతారు. కక్ష రాజకీయాలు చేయబోమని అంటారు. మళ్లీ ఆయనే తప్పు చేస్తే తాట తీస్తామని చెబుతారు. చంద్రబాబు పైకి కనీసం నటించనన్నా నటిస్తారు. కాని లోకేష్ ఏ మాత్రం మొహమాటం, పద్దతి ఏమీ లేకుండా అహంకార పూరితంగా మాట్లాడుతున్నారు. కేవలం మాటలే కాదు.. ఆయన పనులు కూడా అలాగే ఉన్నాయి. ఎన్నికలకు ముందు తాను చంద్రబాబు అంత మంచివాడిని కానని కూడా ప్రచారం చేసుకునేవారు. ఆయన కనిపెట్టిన రెడ్ బుక్ అనేది కోతికి కొబ్బరికాయ మాదిరిగా ఉంది. రెడ్‌బుక్ పేరుతో అరాచకాలు సృష్టిస్తున్నది, ఇష్టారాజ్యంగా వైసీపీ వారిపై కేసులు పెడుతున్నది, దౌర్జన్యాలు, విధ్వంసాలను ప్రోత్సహిస్తున్నది తానేనని లోకేష్ చెప్పకనే చెబుతున్నారు. రెడ్ బుక్ అనగానే ఒకరికి గుండెపోటు వచ్చిందని, ఇంకొకరు బాత్ రూమ్ లో కాలు జారిపడ్డారని.. అర్థమైందా రాజా! అంటూ మాట్లాడిన తీరు ఆయనలోని అహంభావాన్ని స్పష్టంగా తెలియచేస్తుంది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కౌంటర్ ఇస్తూ లోకేష్ అధికార మదంతో మాట్లాడుతున్నారని, మూల్యం చెల్లించుకునే రోజు వస్తుందని హెచ్చరించారు. లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్‌లో అరెస్టు అయినప్పుడు బెయిల్ కోసం ఎన్ని వ్యాధులు ఉన్నాయని కోర్టుకు చెప్పారని ప్రశ్నించారు. కేసులు రాగానే ఎక్కడ లేని వ్యాధులు చంద్రబాబుకు గుర్తుకు వచ్చాయని అంబటి వ్యాఖ్యానించారు. ఇందులో కొంత వాస్తవం లేకపోలేదు. ఆ స్కామ్‌లో మనీలాండరింగ్ జరిగిందని, చివరికి టీడీపీ ఆఫీస్ ఖాతాకు కూడా డబ్బు చేరిందని, అప్పట్లో సీఐడీ ఆధార సహితంగా చూపితే దానిని ఖండించలేక పోయారే!. దానికి తోడు ఒక ప్రైవేటు ఆస్పత్రి నుంచి చంద్రబాబుకు రకరకాల జబ్బులు ఉన్నాయని సర్టిఫికెట్ తీసుకుని బెయిల్ పొందారే! అదే ఆస్పత్రిలో ఇప్పుడు ఎవరైనా వైఎస్సార్సీపీ నేత చేరితే జబ్బు లేకపోయినా చేరినట్లవుతుందా? అదెందుకు!.. .. చంద్రబాబు అరెస్టు అయితే, పాదయాత్ర ఆపేసి మరీ లోకేష్ డిల్లీకి ఎందుకు పరుగులు తీశారు? కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి ఏమని వేడుకున్నారు? ఇవన్ని వాస్తవాలే కదా. కాని జాక్ పాట్ మాదిరి అధికారం వచ్చింది కదా అని విర్రవీగితే లోకేష్ కే నష్టమని రాంబాబు అన్నారు. అబ్దుల్ కలాంను టీడీపీనే రాష్ట్రపతి చేసినట్లు, ఇలా ఏవేవో డాంబికాలు చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కానీ రెడ్ బుక్ పేరుతో ప్రజలపైన ,ప్రతిపక్షంపై, ప్రశ్నించే వారిపై దాడులకు తెగబడతామంటే ఎల్లకాలం వారి ఆటలు సాగవు. ఈ సంగతిని గుర్తు పెట్టుకోకపోతే అదే రెడ్ బుక్ తన మెడకు చుట్టుకుంటుందన్న సంగతి లోకేష్ ఎంత త్వరగా గుర్తిస్తే ఆయనకే అంత మంచిది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత

Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
ఐపీఎల్ 2025లో భాగంగా సీఎస్కేతో నిన్న (మార్చి 30) జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్లో రెండు పరాజయాల తర్వాత (సన్‌రైజర్స్, కేకేఆర్) రాయల్స్ సాధించిన తొలి విజయం ఇది. సారధిగా రియాన్ పరాగ్‌కు కూడా ఇదే తొలి గెలుపు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్ గెలిచిన ఆనందం రియాన్‌కు ఎంతో సేపు నిలబడలేదు. జట్టు స్లో ఓవర్‌రేట్‌కు బాధ్యుడిని చేస్తూ రియాన్‌కు 12 లక్షల జరిమానా విధించారు. ఈ సీజన్లో రాయల్స్‌కు ఇది తొలి స్లో ఓవర్‌రేట్ తప్పిదం. Pink Prevail in a sea of Yellow 🙌#RR held their nerve to record their first win of the season by 6 runs 👍Scorecard ▶️ https://t.co/V2QijpWpGO#TATAIPL | #RRvCSK | @rajasthanroyals pic.twitter.com/FeD5txyCUs— IndianPremierLeague (@IPL) March 30, 2025స్లో ఓవర్ రేట్ (నిర్ణీత సమయంలో ఓవర్లు పూర్తి చేయలేకపోవడం) అనేది ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.22ని ఉల్లంఘన కిందికి వస్తుంది. గత సీజన్ వరకు ఓ సీజన్లో ఓ జట్టు మూడు సార్లు స్లో ఓవర్‌రేట్ తప్పిదం చేస్తే కెప్టెన్‌పై ఓ మ్యాచ్ నిషేధం (భారీ జరిమానాతో పాటు) విధించేవారు. అయితే ఈ రూల్‌ను ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ సీజన్లో రద్దు చేసింది. కెప్టెన్లపై నిషేధాస్త్రాన్ని ఎత్తి వేసి కేవలం జరిమానాతో సరిపెట్టింది. గత సీజన్లో మూడు సార్లు స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేసినందుకు గానూ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఈ సీజన్లో ఓ మ్యాచ్ నిషేధాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ సీజన్లో కూడా హార్దిక్ తన తొలి మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్ తప్పిదానికి బాధ్యుడయ్యాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ స్లో ఓవర్‌రేట్ మెయింటైన్ చేయడంతో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు 12 లక్షల జరిమానా విధించారు.కాగా, సీఎస్కేతో నిన్న జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ చివరి ఓవర్లో విజయాన్ని ఖరారు చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకునేందుకు రాయల్స్ బౌలర్లు చివరి వరకు పోరాడారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నితీశ్ రాణా (36 బంతుల్లో 81; 10 ఫోర్లు, 5 సిక్సర్లు) శివాలెత్తిపోవడంతో 182 పరుగులు చేసింది. వాస్తవానికి రాయల్స్ ఇంకా భారీ స్కోర్ చేయాల్సింది. అయితే నితీశ్‌ను ఔట్ చేశాక సీఎస్కే బౌలర్లు అద్బుతంగా బౌలింగ్ చేసి పరిస్థితికి అదుపులోకి తెచ్చుకున్నారు. అనంతరం సీఎస్కే ఛేదనలో తడబడినా చివరి ఓవర్ వరకు గెలుపు కోసం ప్రయత్నించింది. ఆఖరి ఓవర్లో 20 పరుగులు చేయాల్సి ఉండగా.. 13 పరుగులకే పరిమితమై సీజన్లో వరుసగా రెండో ఓటమిని మూటగట్టుకుంది. రాయల్స్ బౌలర్లలో హసరంగ (4-0-35-4), జోఫ్రా ఆర్చర్ (3-1-13-1) సీఎస్కేను దెబ్బకొట్టారు. కెప్టెన్‌గా తొలి విజయం సాధించిన రియాన్ ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగానూ రాణించాడు. బ్యాటింగ్‌లో కీలకమైన ఇన్నింగ్స్ (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆడి ఓ అద్భుతమైన క్యాచ్ (శివమ్ దూబే) అందుకున్నాడు.

పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
సాక్షి, గుంటూరు: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. అలాగే, రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు చెప్పాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుది అంతా పబ్లిసిటీ స్టంట్. చంద్రబాబు పీ-4 పేరుతో ప్రజలందరినీ అడ్వాన్స్డ్ ఏప్రిల్ ఫూల్ చేశారు. ఎన్నికలకు ముందు చంద్రబాబు సంపద సృష్టిస్తామన్నారు.. సంపద ఏమైంది?. రాష్ట్రంలో తొమ్మిది నెలల కూటమి పాలనలో ఎంత సంపద సృష్టించారు. గత ప్రభుత్వ పథకాలను పాతరేశారు. కొత్త పథకాల ఊసేలేదు. రాష్ట్రంలోని పేద ప్రజలను మరింత పేదరికంలోకి నెడుతున్నారు. డబ్బులు ఉన్నోడికే మెడికల్ సీట్లు దోచిపెడుతున్నారు. నీతి, నిజాయితీకి మారు పేరు అంటే చంద్రబాబు ఎవరైనా నమ్ముతారా?. బంగారు కుటుంబం అని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు. పీ-4 అంటూ బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. పీ-4 పేరుతో కొత్త నాటకం..చంద్రబాబు నాయుడు పీ-4 పేరుతో కొత్త నాటకాన్ని ప్రారంభించాడు. పీ-4కు మార్గదర్శి బంగారు కుటుంబం అని కొత్త పేరు పెట్టాడు. ఆంధ్రప్రదేశ్‌లో పేదరిక నిర్మూలనకు పీ-4 దోహదం చేస్తుందని చంద్రబాబు చెప్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కొత్తగా టోల్ గేట్లు పెడతానని చెబుతున్నారు. మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామీణ ప్రాంత రోడ్డును చంద్రబాబు నాయుడు ప్రైవేటుపరం చేస్తున్నాడు. గత చంద్రబాబు ప్రభుత్వంలో 58 కార్పొరేషన్లను ప్రైవేటీకరణ చేశాడు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్, సంపద సృష్టిస్తానని చెప్పాడు. పేదరిక నిర్మూలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే.పేదరిక నిర్మూలన కావాలంటే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలి. అంతేకానీ కాంట్రాక్టర్లను, డబ్బులు ఉన్నవారిని, బడా బాబుల్ని పీ-4 పేరుతో వేదికపైన కూర్చోబెడితే పేదరికం పోదు. ఈ రాష్ట్రంలో రెండే రెండు బంగారు కుటుంబాలు ఉన్నాయి. ఒకటి చంద్రబాబుది, రెండోది పవన్ కళ్యాణ్‌ది. ఈ రెండు బంగారు కుటుంబాలే. గతంలో చంద్రబాబు నాయుడు జన్మభూమి అన్నాడు.. శ్రమదానం అన్నాడు అవన్నీ పోయాయి. ఇప్పుడు పీ-4 పేరు చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు.చంద్రబాబు నాయుడు నేనేం తప్పు చేయనని డప్పు కొట్టుకుంటున్నాడు. ఆయన పుట్టిన దగ్గర నుంచి ఆయన చేసేవన్నీ తప్పులే. ఎన్టీఆర్ దగ్గర పని చేశారని చంద్రబాబు చెప్తున్నాడు. ఆయన ఇందిరా గాంధీ దగ్గర పని చేశాడు.. ఎన్టీఆర్ పని పూర్తి చేశాడు. లోకేష్ లాంటి అసమర్ధుడిని ప్రజలపై రుద్దాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నాడు. రాష్ట్రంలో ఒక కోటి 40 లక్షల మంది వైట్ రేషన్ కార్డులు ఉన్నవాళ్లు ఉన్నారు. ఎనిమిది లక్షల అరవై వేల మంది ట్యాక్స్ కట్టే వాళ్ళు ఉన్నారు. వీళ్లని వాళ్లతో ఎలా అనుసంధానం చేస్తాడు?.పవన్ ప్యాకేజీ స్టారే..పవన్ కళ్యాణ్ నేను అసమర్థున్ని అని మనసులో మాట బయటపెట్టారు. పవన్ మాటలను జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఆలోచించాలి. లోకేష్ డబ్బులు వసూలు చేసి పవన్‌కి ప్యాకేజీ ఇస్తున్నాడు. పేదల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. చంద్రబాబు నాయుడు సెల్ ఫోన్ నేనే కనిపెట్టాను.. ఐటీ నేనే తెచ్చానని పిట్టలదొర మాటలు మాట్లాడుతున్నాడు. డబ్బులు కోసం పోలవరాన్ని చంద్రబాబు సర్వనాశనం చేశాడు. పోలవరాన్ని ఏటీఎంగా మార్చుకున్నారని సాక్షాత్తు ప్రధాని మోదీనే చెప్పారు. పోలవరంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు నేను సిద్ధం. చంద్రబాబు వచ్చినా.. ఆయన మంత్రులను పంపించినా చర్చకు నేను సిద్ధం. కేంద్రం కట్టాల్సిన పోలవరాన్ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని ఎప్పటినుంచో అడుగుతున్నాను. కానీ, తెలుగుదేశం నాయకులు గానీ చంద్రబాబు గానీ.. ఎవరు సమాధానం చెప్పడం లేదు ఎందుకు?. కూటమి ప్రభుత్వానికి రోజులు చెల్లాయి. చంద్రబాబు సర్కార్‌పై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయి. చంద్రబాబు తెలిపి తక్కువ వల్లే పోలవరం ఆలస్యమైంది. పోలవరంపై చర్చకు ఎప్పుడైనా సిద్దమే. స్పిల్ వే, కాఫర్ డ్యామ్ పూర్తి చేసిన ఘనత వైఎస్సార్సీపీదే. కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్ వేస్తారా? అని ప్రశ్నించారు.

రాజకీయ ప్రకంపనలు.. మూడోసారి అధికారంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాను మూడోసారి అధికారంలోకి రావడానికి మార్గాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడంపై తాను జోక్ చేయడం లేదంటూ మాట్లాడారు. అయితే, అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడాన్ని రాజ్యాంగంలోని 22వ సవరణ అనుమతించదు. దీంతో, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో కొత్త చర్చకు దారి తీశాయి.అమెరికా అధ్యక్షుడిగా మూడోసారి ఎన్నిక కావడానికి అవకాశం, మార్గాలు ఉన్నాయని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే దీనిపై ఇప్పుడే ఆలోచించడం సరికాదన్నారు. దానికి ఇంకా సమయం ఉందని చెప్పుకొచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదివారం ఓ న్యూస్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అమెరికాలో చాలా మంది ప్రజలు.. నన్ను మూడోసారి ఎన్నిక కావాలని కోరుతున్నారు. నాకు పనిచేయడం అంటే ఇష్టం. అమెరికా ప్రజలు కోసం ఎంత కష్టమైనా కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడను. మూడోసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడే దానిపై ఆలోచించడం తొందరపాటు అవుతుంది. ఇప్పుడు నేను ప్రస్తుత పరిస్థితులపై దృష్టి సారించాను. ఇప్పుడు చేయాల్సింది చాలా మిగిలి ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.రెండు మార్గాలు.. ఇదిలా ఉండగా.. అమెరికా రాజ్యాంగంలో విధించిన రెండు దఫాల నిబంధనను మార్చాలంటే సవరణ చేయాలి. అది కష్టతరమైనది. రాజ్యాంగ సవరణ చేయాలంటే కాంగ్రెస్‌లో మూడింట రెండు వంతుల మెజారిటీ ఉండాలి. లేదంటే మూడింట రెండు వంతుల రాష్ట్రాలు అంగీకరించాలి. ఈ రెండు మార్గాలనూ నాలుగింట మూడు వంతుల రాష్ట్రాలు ఆమోదించాలి. ఇది వ్యాఖ్యలు చేసినంత సులభం కాదని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక, అమెరికాలో 2028లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

బాబు డబుల్ గేమ్.. సొంత ఇలాకాలో ఊహించని షాక్
చిత్తూరు, సాక్షి: ముస్లింల హక్కుల విషయంలో డబుల్ గేమ్ ఆడుతున్న నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా.. చంద్రబాబు నియోజకవర్గంలో, అదీ రంజాన్ పర్వదినాన ముస్లిం సోదరులు శాంతియుత నిరసనకు దిగారు. తమ సంక్షేమాన్ని, అభివృద్దిని నిర్లక్ష్యం చేస్తున్న చంద్రబాబు(Chandrababu).. ఇప్పుడేమో రక్షించేవాడిలా నాటకాలు ఆడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నియోజకవర్గం కుప్పం(Kuppam)లో ఇవాళ నిరసన జరిగింది. నల్ల బ్యాడ్జిలు ధరించిన మరీ రంజాన్ ప్రత్యేక ప్రార్థనంలో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం నడుం బిగించాలనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉంటూనే.. వక్ఫ్ సవరణ బిల్లుకు చంద్రబాబు మద్దతు ఇస్తుండడాన్ని వీళ్లంతా ఖండించారు. ఈ బిల్లు గనుక పార్లమెంట్లో పాసైతే ముస్లిం సమాజం తీవ్రంగా నష్టపోతుంది అని ఆవేదన చెందుతున్నారు. ఇదీ చదవండి: వక్ఫ్ సవరణ బిల్లును అడ్డుకోవాల్సిందేముస్లిం సమాజం మొత్తం వ్యతిరేకిస్తున్న వక్ఫ్ సవరణ బిల్లు(Waqf Bill) విషయంలో రాష్ట్రంలో ఒకలా, ఢిల్లీలో మరో రకంగా చంద్రబాబు మాట్లాడుతుండడాన్ని రాజకీయ వర్గాలు ఖండిస్తున్నాయి. ఈ బిల్లు విషయంలో చంద్రబాబు రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. టీడీపీ మద్ధతు మీదనే కేంద్రం ఆధారపడి ఉందనేది విశ్లేషకుల మాట. అలాంటప్పుడు ఆ బిల్లును ఆదిలోనే టీడీపీ వ్యతిరేకించి ఉంటే ఇప్పుడు జేపీసీ వరకు వచ్చి ఉండేది కాదన అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. మరోపక్క బిల్లుకి మద్దతు ప్రకటించిన చంద్రబాబు.. తాజాగా జరిగిన ఇఫ్తార్ విందులో పాల్గొని వక్ఫ్ ఆస్తులను పరిరక్షిస్తున్నామని చెబుతుండడం మోసమేనన్నది కొందరి వాదన. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమిలో కీలక భాగస్వాములైన టీడీపీ అధినేత చంద్రబాబు, జేడీయూ నితీశ్ కుమార్లపై మజ్లిస్ అధినేత.. హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాంటి వారిని క్షమించబోమంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు.

అరుదైన వ్యాధులు వస్తే.. ఇదిగో ఈ ఇన్సూరెన్స్..
హీమోఫీలియా, మర్ఫాన్ సిండ్రోమ్ లాంటి అరుదైన వ్యాధులు కొద్ది మందికి మాత్రమే వస్తాయి. కానీ వాటి తీవ్రత మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మంది 7 వేల పైగా రకాల అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనా. ఇలాంటి వాటికి నాణ్యమైన చికిత్స దొరకడం కష్టంగానే ఉంటోంది.. అలాగే చికిత్స వ్యయాలు భారీగానే ఉంటున్నాయి.భారత్ విషయానికొస్తే 7 కోట్ల మంది అరుదైన వ్యాధులతో బాధపడుతున్నారని అంచనాలున్నాయి. అవగాహనారాహిత్యం, వైద్యపరీక్షల వ్యయాలు భారీగా ఉండటం, ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అంతగా లేకపోవడం వంటి అంశాల కారణంగా వారు సమయానికి సరైన చికిత్సను పొందలేకపోతున్నారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) 4,001 అరుదైన వ్యాధులను గుర్తించింది. కానీ, 450 వ్యాధుల రికార్డులు మాత్రమే ఆస్పత్రుల్లో అధికారికంగా అందుబాటులో ఉంటున్నాయి. వైద్యపరీక్షలు, డేటా సేకరణపరమైన సవాళ్లను ఇది సూచిస్తోంది. 80 శాతం అరుదైన వ్యాధులు జన్యుపరమైనవే కాగా మిగతావి ఇన్ఫెక్షన్లు, ఆటోఇమ్యూన్ లేదా పర్యావరణంపరమైన అంశాల వల్ల వస్తున్నాయి.50 శాతం పైగా అరుదైన వ్యాధుల లక్షణాలు ఎక్కువగా పిల్లల్లోనే ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత ముందుగా వైద్యపరీక్షలు చేసి గుర్తించడం కీలకంగా ఉంటుంది. అరుదైన వ్యాధులకు ప్రత్యేకమైన చికిత్సలు, జీవిత కాల సంరక్షణ, కొన్ని సందర్భాల్లో ప్రయోగాత్మక చికిత్సలు కూడా అవసరమవుతాయి. అందుకే తగినంత బీమా కవరేజీ ఉండాలి. ఈ నేపథ్యంలో సాధారణ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ల మధ్య వ్యత్యాసాలు, వాటితో ఏయే ప్రయోజనాలు ఉంటాయో తెలియజేసేదే ఈ కథనం. క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ అంటే.. సాధారణ ఆరోగ్య బీమాతో పోలిస్తే క్రిటికల్ ఇల్నెస్ (సీఐ) స్వరూపం భిన్నంగా ఉంటుంది. ఆస్పత్రిలో చికిత్స వ్యయాలకు మాత్రమే చెల్లించడం కాకుండా, వ్యాధి నిర్ధారణయినప్పుడు ఏకమొత్తంగా బీమా మొత్తాన్ని కంపెనీ చెల్లిస్తుంది. దీన్ని చికిత్స వ్యయాల కోసం కావచ్చు, కోల్పోయిన ఆదాయాన్ని భర్తీ చేసుకోవడం కోసం కావచ్చు, ఇతరత్రా ప్రత్యామ్నాయ చికిత్స కోసం కావచ్చు, పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.లూపస్ లేదా స్లెరోడెర్మాలాంటి అరుదైన ఆటోఇమ్యూన్ వ్యాధులకు సీఐ ప్లాన్‌తో ఆర్థికంగా కొంత ఉపశమనం లభించవచ్చు. సాధారణంగా ముందస్తుగా నిర్ణయించిన వ్యాధుల కేటగిరీలకు మాత్రమే సీఐ ప్లాన్లు బీమా మొత్తాన్ని చెల్లిస్తాయి. ఒకవేళ ఏదైనా అరుదైన వ్యాధికి కవరేజీ నుంచి మినహాయింపు ఉంటే, పాలసీదారుకు ఆర్థిక ప్రయోజనం దక్కదు. కవరేజీల్లో వ్యత్యాసం.. ఏది మెరుగైనది.. అరుదైన వ్యాధుల విషయంలో ప్రాథమిక ఆరోగ్య బీమా, హాస్పిటలైజేషన్, తక్షణ వైద్య వ్యయాలకు ఉపయోగపడుతుంది. డాక్టర్లను సంప్రదించడం, ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చేరడం, అవసరమైన ప్రొసీజర్లు మొదలైన వాటికి పాలసీ చెల్లిస్తుంది. అయితే, ఆదాయ నష్టం, దీర్ఘకాల సంరక్షణలాంటి పరోక్ష వ్యయాలకు కవరేజీనివ్వదు. మరోవైపు, క్రిటికల్ ఇల్నెస్ పాలసీ అనేది ఏకమొత్తంగా చెల్లిస్తుంది. దాన్ని పాలసీదారు తనకు కావాల్సిన విధంగా ఉపయోగించుకోవచ్చు.అయితే, సదరు వ్యాధి గురించి పాలసీలో ప్రస్తావిస్తేనే ఇది వీలవుతుంది. లేకపోతే కవరేజీ లభించదు. సాధారణంగా సీఐ పాలసీలు చాలా మటుకు అరుదైన వ్యాధులకు కవరేజీనివ్వవు. కాబట్టి ఆర్థిక భద్రత కోసం వాటిని మాత్రమే నమ్ముకోవడానికి ఉండదు. అరుదైన సమస్యలు ఉన్న వారు అధిక కవరేజీ ఉండే బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్, క్రిటికల్ ఇల్నెస్ పాలసీని కలిపి తీసుకుంటే ఆర్థికంగా భరోసాగా ఉంటుంది. అసాధారణ వ్యాధుల కోసం ఆర్థిక ప్రణాళిక.. అరుదైన వ్యాధులతో అధిక రిస్కులున్న వారు రెండు రకాల బీమాను తీసుకుంటే భరోసాగా ఉంటుంది. అధిక కవరేజీ ఉండే సాధారణ ఆరోగ్య బీమా పాలసీ, ఆస్పత్రి.. వైద్య వ్యయాలకు కవరేజీనిస్తుంది. ఇక క్రిటికల్ ఇల్నెస్ పాలసీ (ఒకవేళ తీసుకుంటే) వైద్యయేతర వ్యయాలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుంది. కవరేజీల్లో అంతరాలను తగ్గించుకునేందుకు టాప్ అప్ ప్లాన్లు, నిర్దిష్ట వ్యాధి సంబంధిత పాలసీల్లాంటివి పరిశీలించవచ్చు.రెగ్యులర్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే.. సమగ్ర ఆరోగ్య బీమా పాలసీలనేవి హాస్పిటలైజేషన్ చార్జీలు, డాక్టర్ల కన్సల్టేషన్లు, వైద్య పరీక్ష ప్రొసీజర్లు, ఆస్పత్రిలో చేరడానికి ముందు అలాగే ఆ తర్వాత తలెత్తే వ్యయాలకు కవరేజీనిస్తాయి. హంటింగ్టన్స్ డిసీజ్ లేదా రెట్ సిండ్రోమ్‌లాంటి నరాల సంబంధిత అరుదైన వ్యాధుల విషయంలో హాస్పిటలైజేషన్.. సపోర్టివ్ కేర్‌కి, జీవక్రియ సంబంధ గౌచర్ వ్యాధి లేదా ఫ్యాబ్రీ వ్యాధి, ఎంజైమ్ మార్పిడి థెరపీ కూడా కవరేజీ లభిస్తుంది. అయితే, సాధారణ పాలసీల్లో అన్ని రకాల అరుదైన వ్యాధులూ కవర్ కావు. కాబట్టి, జేబు నుంచి భారీగా పెట్టుకోవాల్సి వస్తుంది.అమితాబ్ జైన్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్, స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.

HCU వద్ద హైటెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU) వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని ప్రభుత్వం విక్రయించ వద్దని విద్యార్థులు నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో నిన్న సాయంత్రం 200 మంది విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే, యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రణరంగంలా మారింది. వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లో ఆదివారం వందలాదిగా మోహరించిన పోలీసులు విద్యార్థులపై లాఠీ దెబ్బలతో విరుచుకుపడి దాదాపు 200 మందిని అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. టీజీఐఐసీ, రెవెన్యూ అధికారులు జేసీబీలతో పోలీసుల కాపలా నడుమ వర్సిటీ పరిధిలోని 400 ఎకరాల భూముల్లోకి వచ్చారు. దట్టమైన పొదలు, చెట్లను తొలగించే ప్రయత్నం చేశారు. అది గమనించిన కొందరు విద్యార్థులు అక్కడికి చేరుకునేసరికి పోలీసులు చుట్టుముట్టారు.Hyderabad Central University witnessed police brutality.Students peacefully protesting against CM @revanth_anumula remarks calling HCU students “cunning foxes” and opposing a land grab near their campus were met with violence lathi charge, phones smashed, voices silenced.… pic.twitter.com/25oHPIGoXH— Harish Rao Thanneeru (@BRSHarish) March 30, 2025ఈ క్రమంలో పర్యావరణాన్ని దెబ్బతీస్తూ.. జీవ వైవిధ్యానికి నష్టం కలిగించే ప్రయత్నాలు చేయవద్దని నినదిస్తూ అక్కడికి చేరుకున్న విద్యార్థులపై పోలీసులు రెచ్చిపోయారు. కాళ్లు, చేతులు పట్టుకొని నేలపై ఈడ్చుకెళ్లి వ్యాన్లలోకి ఎక్కించారు. అరెస్టులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిని వర్సిటీలో పరిగెత్తిస్తూ మరీ లాఠీలతో చితకబాదారు. 200 మందికి పైగా విద్యార్థులను రాయదుర్గం, మాదాపూర్, గచ్చిబౌలి, కొల్లూరు పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఠాణాలకు తరలించే క్రమంలో ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలని అడిగినందుకు హెల్మెట్లు, ప్రొటెక్షన్ షీల్డ్‌తో విచక్షణా రహితంగా కొట్టారు. కొందరు పోలీసులు తమను బూతులు తిట్టారని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు.Save our university land from being auctioned for private entities. University is an intellectual power house,don't kill the progress of the Telangana. Save our land.@KTRBRS @BRSHarish @Krishank_BRS @dhanyarajendran @revathitweets @bainjal @CharanT16 @RahulGandhi @priyankagandhi pic.twitter.com/81zQ3APMVd— sree charan (@mscharan) March 30, 2025బట్టలు చిరిగినా వదలకుండా..పోలీసుల అరాచకాన్ని ప్రశ్నించిన ఆడపిల్లలను మహిళా పోలీసులు జుట్టు పట్టుకుని నేలపై ఈడ్చుకుంటూ వ్యాను ఎక్కించారు. ఈ క్రమంలో పదుల సంఖ్యలో విద్యార్థినులు గాయాలపాలయ్యారు. బట్టలు చిరిగిపోయినా పట్టించుకోకుండా విద్యార్థులను లాకెళ్లారు. అడ్డుకోబోయిన యువకులను కాళ్లు, చేతులు పట్టుకుని వ్యాన్‌లో పడేశారు. పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ తోటి విద్యార్థులు వర్సిటీ మెయిన్ గేట్ ఎదుట బైఠాయించారు. బయటకు రాకుండా నిర్బంధించడంతో అక్కడే కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. Mohabbat Ka Dukaan at HCU today. Kudos to @RahulGandhi & Congress sarkaar You have outdone yourselves pic.twitter.com/NPZOqG7Uoh— KTR (@KTRBRS) March 30, 2025

రంజాన్ విందు: టేస్టీ.. టేస్టీగా..షీర్ కుర్మా, కచ్చీ బిర్యానీ చేసేయండిలా..!
రంజాన్ ఉపవాస దీక్షలు ముగించుకుని ఈదుల్ ఫిత్ర్ లేక రంజాన్ వేడుకను బంధుమిత్రులతో కలిసి ఆనందంగా సెలబ్రెట్ చేసుకుంటారు. ఈ పర్వదినాన్ని ఈద్ అని కూడా పిలుస్తారు. ప్రతి ఒక్కరూ ఈ రోజున వారి వారిస్థోమత మేరకు కొత్త దుస్తులు ధరించి, పలు రకాల తీపి వంటకాలు ముఖ్యంగా సేమియా/షీర్ ఖుర్మా, బిర్యానీ చేసుకుని ఆనందంగా విందు ఆరగిస్తారు. ఈ సందర్భంగా నోరూరించే ఆ వంటకాల తయారీ ఎలానో చూద్దామా..!.షీర్ కుర్మా..కావల్సినవి: పాలు – అర లీటర్ (3 కప్పులు); నెయ్యి – టేబుల్‌స్పూన్; పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్ (డేట్స్ ఎక్కువ వాడితే తక్కువ పంచదార వేసుకోవాలి); సేవియాన్ (వెర్మిసెల్లి)– అర కప్పు; జీడిపప్పు – 8 (తరగాలి); బాదంపప్పు – 8 (సన్నగా తరగాలి); పిస్తాపప్పు – 8 (తరగాలి); ఖర్జూర – 9 (సన్నగా తరగాలి); యాలకులు – 4 (లోపలి గింజలను ΄÷డి చేయాలి); బంగారు రంగులో ఉండే కిస్మిస్ – టేబుల్ స్పూన్; రోజ్‌వాటర్ – టీ స్పూన్‌తయారీ విధానం: సేవియాన్‌ను కొద్దిగా నెయ్యి వేసి బంగారురంగు వచ్చేలా వేయించి తీసి పక్కన పెట్టాలి.అదె గిన్నె లేదా పాన్‌లో మరికాస్త నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి తీయాలి ∙విడిగా పాలు మరిగించి, సన్నని మంట కాగనివ్వాలి. పాలు కొద్దిగా చిక్కబడ్డాక దీంట్లో వేయించిన సేవియాన్, పంచదార వేసి ఉడికించాలి. సేవియాన్ ఉడికాక మంట తగ్గించి డ్రై ఫ్రూట్స్ మిశ్రమం, యాలకుల పొడి వేసి కలిపి, మంట తీసేయాలి. తీపిదనం ఎక్కువ కావాలనుకునేవారు మరికాస్త పంచదార కలపుకోవచ్చు. కుంకుమపువ్వు, గులాబీ రేకలు, మరిన్ని డ్రై ఫ్రూట్స్ చివరగా అలంకరించుకోవచ్చు.నోట్: ఎండుఖర్జూరం ముక్కలు కలుపుకోవాలంటే వాటిని రాత్రిపూట నీళ్లలో నానబెట్టి మరుసటి రోజు ఉపయోగించాలి.కచ్చీబిర్యానీ..కావల్సినవి: బాస్మతి బియ్యం – పావు కేజీ (250 గ్రా.ములు); మటన్ – కేజీ (ముక్కలు 2 అంగుళాల పరిమాణం); అల్లం– వెల్లుల్లి పేస్ట్ – టేబుల్ స్పూన్; ఉల్లిపాయలు – 5 (నిలువుగా సన్నగా తరిగి, విడిగా వేయించి పక్కనుంచాలి); కారం – టేబుల్ స్పూన్; పసుపు – అర టీ స్పూన్; పచ్చి బొప్పాయి ముక్క – పేస్ట్ చేయాలి; చిలికిన పెరుగు – కప్పు; కుంకుమపువ్వు – కొన్ని రేకలు (గరిటెడు వేడి పాలలో కలిపి పక్కనుంచాలి)మటన్ మసాలా కోసం... (దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 పచ్చ యాలకులు, 3 లవంగాలు, బిర్యానీ ఆకు, అర టీ స్పూన్ మిరియాలు, అర టీ స్పూన్ సాజీర) రైస్ మసాలా కోసం... (యాలకులు 2, దాల్చిన చెక్క, పచ్చ యాలక్కాయ, 2 లవంగాలు, నెయ్యి లేదా నూనె 3 టేబుల్‌స్పూన్లు, పుదీనా, కొత్తిమీర గుప్పెడు, ఉప్పు తగినంత)తయారీ విధానం:బేసిన్లో మటన్ వేసి అందులో పెరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, బొప్పాయి ముద్ద, కారం, పసుపు, మసాలా, ఉప్పు, వేయించిన ఉల్లిపాయల తరుగు సగం వేసి కలిపి, 3 గంటల సేపు నానబెట్టాలి. కప్పు బియ్యానికి రెండున్నర కప్పుల చొప్పున నీళ్లు, మసాలా, బియ్యం, తగినంత ఉప్పు వేసి ముప్పావు వంతు వరకు ఉడికించి, నీళ్లను వడకట్టాలి. తర్వాత అందులో నెయ్యి వేసి కలపాలి. మరో మందపాటి డేకిసా(గిన్నె) తీసుకొని నెయ్యి వేసి వేడయ్యాక నానిన మటన్ వేసి కలపాలి. పైన పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, నిమ్మరసం వేయాలి. సగం ఉడికిన బియ్యం పైన లేయర్‌గా వేయాలి. మిగిలిన నెయ్యి, కుంకుమపువ్వు కలిపిన పాలు, నిమ్మరసం వేయాలి. డేకిసా మీద మూత పెట్టి, గోధుమపిండి ముద్దతో చుట్టూ మూసేయాలి. పెద్ద మంట మీద 20–25 నిమిషాలసేపు ఉడకనివ్వాలి. సన్నని మంట మీద మరో 40 నిమిషాలు ఉంచాలి. తర్వాత దించి, రైతా/ఏదైనా గ్రేవీతో వేడి వేడిగా వడ్డించాలి. (చదవండి: ప్రేమను పంచే శుభదినం ఈద్)
ఇదేం రాజకీయం?.. ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు
విశాఖ: ఒక్క రాంగ్‌కాల్ మూల్యం.. రూ.4 కోట్లు!!
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
దూసుకెళ్తున్న బంగారం.. మళ్లీ భారీగా.. కొత్త మార్క్‌కు..
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
Eid-ul-Fitr 2025 దేవుని మన్నింపు రోజు
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
ఇదేం రాజకీయం?.. ఎంపీ పార్థసారథికి చేదు అనుభవం
ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు
విశాఖ: ఒక్క రాంగ్‌కాల్ మూల్యం.. రూ.4 కోట్లు!!
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
దూసుకెళ్తున్న బంగారం.. మళ్లీ భారీగా.. కొత్త మార్క్‌కు..
ఈ వారం ఓటీటీలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే
రామాయణం చదివైనా బాగుపడు తల్లీ
Ugadi 2025 అంబరాన్నంటిన ఉగాది సంబరాలు
Eid-ul-Fitr 2025 దేవుని మన్నింపు రోజు
ఇప్పటిదాకా ఆరు అక్రమ కేసులు.. దేనికైనా రెడీ: కాకాణి
IPL 2025: బోణీ కొట్టిన రాజస్తాన్ రాయల్స్..
మయన్మార్‌లో దారుణ పరిస్థితులు.. రెస్య్కూ వేళ వైమానిక దాడులు!
పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
పవన్ అసమర్థుడినని తానే ఒప్పుకున్నాడు: అంబటి
బాబూ.. శ్రీవారికి నిద్ర లేకుండా చేస్తున్నావ్: ఆర్కే రోజా
Eid al-Fitr: ఢిల్లీ నుంచి ముంబై వరకూ.. అంతటా ఈద్ సందడి
ఐటీ నోటీసు వస్తే ‘రాజీ’ చేసుకోండి..
ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్
ట్రంప్‌కు షాకిచ్చిన ఇరాన్
సినిమా

నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు.. లూసిఫర్‌పై 'పృథ్వీరాజ్' తల్లి
'ఎల్ 2: ఎంపురాన్' (L2 Empuraan) వివాదంపై మోహన్‌లాల్ (Mohanlal) ఇప్పటికే స్పందించారు. సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం తరఫున క్షమాపణలు చెబుతూ ఆయన ఒక పోస్టు కూడా చేశారు. తాజాగా చిత్ర దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) తల్లి మల్లిక కూడా ఈ గొడవపై రియాక్ట్ అయ్యారు. లూసిఫర్ సినిమా విషయంలో కేవలం తన కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కొందరు దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. తన కుమారుడు ఎవరినీ మోసం చేయలేదని సోషల్‌మీడియా వేదికగా పోస్ట్ చేశారు.లూసిఫర్2 సినిమా విషయంలో తన కుమారుడిని కించపరిచేలా తప్పుడు కథనాలు రావడాన్ని మల్లిక తప్పుబట్టారు. ఈ వివాదంపై మొదట తాను రియాక్ట్ కాకూడదని నిర్ణయించుకున్నానని ఆమె చెప్పారు. కానీ, ఒక తల్లిగా తన కుమారుడి కోసం రియాక్ట్ కావాల్సి వస్తుందని ఆమె ఇలా అన్నారు. 'ఎల్ 2: ఎంపురాన్' తెర వెనుక జరుగుతున్న విషయాలన్ని నాకు తెలుసు. కానీ, నా కుమారుడిని మాత్రమే తప్పుగా చూపుతూ కథనాలు క్రియేట్ చేస్తున్నారు. నా కుమారుడు ఎవరినీ మోసం చేయలేదు. మోహన్‌లాల్, చిత్ర నిర్మాతలు ఎవరూ కూడా పృథ్వీరాజ్ మోసం చేసినట్లు చెప్పలేదు. మోహన్‌లాల్ నా సోదరుడితో సమానం. నా కుమారుడిపై జరుగుతున్న తప్పుడు ప్రచారం కూడా ఆయనకు తెలియకుండానే కొందరు చేస్తున్నారు. చాలామంది కుట్రలు పన్ని నా కుమారుడిని బలిపశువును చేస్తున్నారు. నా కుమారుడు పృథ్వీరాజ్ ఎవరినీ మోసం చేయడని బలంగా చెబుతున్నాను. ఈ మూవీ వల్ల ఏమైనా ఇబ్బందులు వచ్చాయంటే అందులో భాగమైన వారందరికీ బాధ్యత ఉంటుందని తెలుసుకోవాలి. కేవలం ఒక్కరి మీద మాత్రమే నిందలు వేయకూడదు. సినిమా కథను అందరూ చదివే కదా అందరూ ఆమోదించారు. సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు రచయిత కూడా ఎల్లప్పుడు పక్కనే ఉన్నారు. ఇబ్బంది ఉంటే ఆయనే మార్పులు చేసేవారు. సినిమా విడుదలయ్యాక కేవలం పృథ్వీరాజ్‌ను మాత్రమే తప్పుపడుతున్నారు. పూర్తి విషయాలు తెలుసుకోకుండా కొందరు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు కామెంట్లు చేస్తున్నారు. మోహన్‌లాల్‌కు తెలియకుండా కొన్ని సీన్లు ఈ మూవీలో కలిపారంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదు. సినిమా పూర్తి అయిన తర్వాత అందరూ చూసిన తర్వాతే విడుదల చేశారు. అందరి ఆమోదంతోనే మీ వద్దకు మూవీ వచ్చిందని గ్రహించండి. నా కుమారుడు ఎప్పటికీ ఎవరి వ్యక్తిగత విశ్వాసాల జోలికి వెళ్లడు.' అని మల్లిక చెప్పుకొచ్చారు.2002 సమయంలో గుజరాత్లో జరిగిన అల్లర్ల నేపథ్యంలోని కొన్ని సీన్లు ఈ సినిమాలో చూపించారని కొందరు తప్పపట్టారు. ఆ సమయంలో ఓ కుటుంబాన్ని మరో వర్గానికి చెందిన నాయకుడు అత్యంత కీరాతకంగా హత్య చేసి ఫైనల్‌గా అతనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారని చూపించటం ఒక వర్గం వారికి నచ్చలేదు. దీంతో ఈ చిత్రంపై చాలా విమర్శలు వచ్చాయి.

'ఆదిత్య 369' రీరిలీజ్.. 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ట్రైలర్
టాలీవుడ్ హీరో బాలకృష్ణ సినీ కెరీర్లో 'ఆదిత్య 369' సినిమాకు ప్రత్యేకమైన స్థానం ఉంది. 1991లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ ముందు భారీ విజయాన్ని దక్కించుకుంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా 4కే డిజిటలైజేషన్ వెర్షన్లో ఏప్రిల్ 4న రీరిలీజ్ కానుంది. ఈ మేరకు తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. బాలకృష్ణ ఈ మూవీలో శ్రీకృష్ణదేవరాయలుగా, కృష్ణకుమార్‌గా రెండు పాత్రల్లో మెప్పించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. రీరిలీజ్‌తో మరోసారి టైమ్‌మిషన్‌లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉండండి. ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైందని ఇప్పటికే బాలకృష్ణ ప్రకటించారు.

పిల్లలు వద్దనుకున్నాం.. కారణం ఇదే: హరీశ్ శంకర్
టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్( Harish Shankar) పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చే సినిమా 'గబ్బర్ సింగ్'. నేడు ఆయన 45వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. అయితే, మీకు ఆయన కుటుంబ నేపథ్యంతో పాటు పిలల్లను ఎందుకు వద్దనుకున్నారో తెలుసా..? కరీంనగర్‌లోని మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఆయన సినిమాలపై మక్కువతో చిత్రపరిశ్రమలో అడుగుపెట్టారు. నాన్న శ్యాంసుందర్ తెలుగు ఉపాధ్యాయుడు కావడంతో హరీశ్‌కు సాహిత్యంతో పరిచయం ఏర్పడింది. కోన వెంకట్ సహకారంతో రవితేజ నటించిన వీడే సినిమాకు సహాయకుడుగా హరీశ్ జర్నీ మొదలైంది. ఆ తర్వాత రామ్‌గోపాల్ వర్మ అతనికి రవితేజ హీరోగా షాక్ సినిమాకు దర్శకత్వం వహించమని అవకాశం ఇచ్చాడు. ఆ తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్, దువ్వాడ జగన్నాథం వంటి హిట్ సినిమాలను ఇండస్ట్రీకి ఇచ్చాడు.దర్శకులు హరీశ్ శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. తన భార్య పేరు స్నిగ్ధ అని ఆమెకు పెద్దగా సినిమాలంటే ఇష్టం ఉండదని ఆయన చెప్పారు. చివరకు ఒక సినిమా కోసం పనిచేసినందుకు వచ్చిన రెమ్యునరేషన్ గురించి కూడా ఆమెకు తెలియదని ఆయన అన్నారు. ఈ క్రమంలో తమకు పిల్లలు ఎందుకు వద్దనుకున్నారో హరీశ్ ఇలా చెప్పారు. నా భార్య స్నిగ్ధతో చాలా స్పష్టతతో ఉంటాం. మాది మధ్యతరగతి కుటుంబం. బడ్జెట్ విషయంలో ప్రతిదానికి లెక్కలు వేసుకునే ముందుకు సాగుతాం. కుటుంబంలో నేనే పెద్దవాడిని కావడంతో బాధ్యతలు తీసుకోవాల్సిందే.. నా చెల్లెలికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయడంతో పాటు తమ్ముడిని సెటిల్ చేయడం నా ప్రధాన కర్తవ్యం. అమ్మానాన్నలకు కూడా మంచి ఇల్లు నిర్మించాలి. ఇలా ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే పనిలో ఉన్న నాకు స్నిగ్ధ కూడా మద్దతుగా నిలవడం మరింత బలాన్ని ఇచ్చింది. ఇంతకుమించి జీవితంలో ఎలాంటి బాధ్యతలూ వద్దనుకున్నాం. ఇద్దరం మాట్లాడుకున్న తర్వాతే పిల్లలు వద్దని నిర్ణయం తీసుకున్నాం. పిల్లలు పుట్టిన తర్వాత సెల్ఫీష్‌గా తయారవుతాం అనిపించింది. దీంతో వారి ప్రపంచం కుదించుకుపోతుంది అనేది నా అభిప్రాయం.' అని ఆయన అన్నారు.హరీశ్ శంకర్ చేతిలో ప్రస్తుతం మూడు ప్రాజెక్టులు ఉన్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, కేవీఎన్, మైత్రీ మూవీ మేకర్స్ వంటి భారీ బ్యానర్స్‌లో ఆయన సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్‌తో ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయి. త్వరలో వారిద్దరి కాంబినేషన్లో సినిమా ప్రారంభం కానుంది. దీనిని మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నారు.

ఆదిత్య 369 సీక్వెల్‌కి కథ సిద్ధమైంది: బాలకృష్ణ
‘‘ఆదిత్య 369’ సినిమా సీక్వెల్‌కి కథ సిద్ధమైంది. పార్టు 2 సబ్జెక్ట్‌ను ఒక రాత్రిలో ఫైనలైజ్ చేశాం. నేను, సింగీతంగారు మళ్లీ మాట్లాడుకోవాలి’’ అన్నారు బాలకృష్ణ. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిన చిత్రం ‘ఆదిత్య 369’. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమర్పణలో శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 4న రీ రిలీజ్ కానుంది. 34 సంవత్సరాల తర్వాత 4 ఓ డిజిటలైజేషన్, 5.1 సౌండ్‌తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ సందర్భంగా ఆదివారం జరిగిన ‘ఆదిత్య 369’ సినిమా రీ–రిలీజ్ ప్రీ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఆదిత్య 369’ ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్. రీ రిలీజ్ తర్వాత ఇండియన్ ఫిల్మ్ కమ్యూనిటీ అంతా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటుంది. ఈ సినిమాకు ముఖ్యమైన శ్రీకృష్ణ దేవరాయల పాత్రను నేను చేయడానికి కారకులైన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంగారికి రుణపడి ఉంటాను. ఈ సినిమా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుగార్లకు హ్యాట్సాఫ్’’ అన్నారు.‘‘ఆదిత్య 369’ని నిర్మించు... కొన్ని దశాబ్దాలపాటు గుర్తుంటుందని ఎస్పీ బాలుగారు అన్నారు. ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ అవుతోందంటే అది నా పూర్మజన్మ సుకృతం’’ అని తెలిపారు శివలెంక కృష్ణప్రసాద్. ‘‘నాడు రామారావుగారు వేసిన శ్రీ కృష్ణదేవరాయల పాత్రలో (‘మహామంత్రి తిమ్మరుసు’లో) అంతే అద్భుతంగా రాణించాలంటే బాలకృష్ణకు మాత్రమే సాధ్యమౌతుందని భావించి, ఆయన్ను సంప్రదించాను.బాలకృష్ణ ఓకే అనడం... ‘ఆదిత్య 369’ స్టార్ట్ కావడం... చకా చకా జరిగిపోయాయి. ఇంత పెద్ద సబ్జెక్ట్‌ను నమ్మి, నిర్మించిన శివలెంక కృష్ణప్రసాద్‌కి ఈ సినిమా క్రెడిట్లో సింహభాగం దక్కుతుంది’’ అని వీడియో బైట్ రిలీజ్ చేశారు సింగీతం శ్రీనివాసరావు. అతిథులుగా దర్శకులు బాబీ, అనిల్ రావిపూడి పాల్గొన్నారు.
న్యూస్ పాడ్‌కాస్ట్

Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!

బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు

బడుగుల ఆలోచన ఆ పూట వరకే. ఎస్సీ, బీసీ వర్గాలపై చంద్రబాబు అక్కసు

గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్

ఆంధ్రప్రదేశ్‌లో వలంటీర్లను దగా చేసిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం... రోడ్డున పడిన 2 లక్షల 66 వేల కుటుంబాలు

థాయ్‌లాండ్, మయన్మార్‌లో భారీ భూకంపం... పేకమేడల్లా కూలిన భవనాలు... రెండు దేశాల్లో ఇప్పటికే 200 దాటిన మృతుల సంఖ్య.. ఇండియా, చైనాలోనూ భూప్రకంపనలు

హిందూ ధర్మంపై వీరికి మాట్లాడే హక్కుందా?... ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం

ఎలాగైనా ఉత్తీర్ణత పెంచాల్సిందే... ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిళ్లు..

పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు, పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది... మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్ అరెస్ట్‌పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం

అరటి రైతును ఆదుకోవాలి. కూటమి ప్రభుత్వమే పూర్తిస్థాయిలో పరిహారం అందించాలి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిమాండ్
క్రీడలు

బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసులపై తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో యాప్స్‌పై విచారణ జరిపేందుకు సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు.వివరాల ప్రకారం.. తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ వ్యవహరాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ఈ క్రమంలోనే యాప్స్ కేసులను విచారించేందుకు ఐదుగురు ఉన్నతాధికారులతో సిట్ ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్‌గా ఐజీ రమేష్ నియామకం అయ్యారు. అలాగే, సిట్ సభ్యులుగా సింధు శర్మ, వెంకటలక్ష్మి, చంద్రకాంత్, శంకర్ ఉన్నారు. ఇక, సిట్.. 90 రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని డీజీపీ జితేందర్ ఆదేశించారు. కాగా, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్‌పై పంజాగుట్ట, మియాపూర్‌లో కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసులను సిట్‌కు బదిలీ చేశారు. #SayNoToBettingApps pic.twitter.com/jPRzks6PqV— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2025 ప్రిడిక్షన్ పేరుతో బెట్టింగ్ ఉబిలోకి.. జాగ్రత్త!!ఐపీఎల్ మ్యాచ్ ల ప్రిడిక్షన్ పేరుతో కొందరు కొత్త దందా. టెలిగ్రాం ఛానెల్ లో జాయిన్ కావాలంటూ యువతను బెట్టింగ్ కు బానిసలను చేస్తున్న వైనం.ఐపీఎల్ ను ఎంజాయ్ చేయండి. అంతేకానీ ఇలాంటి మాయగళ్ల మాటలు విని మీ జేబులు గుల్ల చేసుకోకండి. pic.twitter.com/XfO1BObmgD— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 30, 2025

ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్

గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు.

‘మయామి’ క్వీన్ సబలెంకా
ఫ్లోరిడా: ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్ హోదాకు తగ్గట్టు రాణించిన బెలారస్ టెన్నిస్ స్టార్ సబలెంకా తన కెరీర్లో 19వ సింగిల్స్ టైటిల్‌ను సాధించింది. ఆదివారం ముగిసిన మయామి ఓపెన్ డబ్ల్యూటీఏ–1000 లెవెల్ టోరీ్నలో సబలెంకా తొలిసారి చాంపియన్‌గా అవతరించింది. 88 నిమిషాలపాటు జరిగిన ఫైనల్లో టాప్ సీడ్ సబలెంకా 7–5, 6–2తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జెస్సికా పెగూలా (అమెరికా)పై గెలిచింది. విజేత సబలెంకాకు 11,24,380 డాలర్ల (రూ. 9 కోట్ల 61 లక్షలు) ప్రైజ్‌మనీతోపాటు 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ పెగూలాకు 5,97,890 డాలర్ల (రూ. 5 కోట్ల 11 లక్షలు) ప్రైజ్‌మనీ 650 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. టైటిల్ గెలిచే క్రమంలో సబలెంకా తన ప్రత్యర్థులకు ఒక్క సెట్ కూడా కోల్పోకపోవడం గమనార్హం. సబలెంకా సాధించిన 19 టైటిల్స్‌లో 17 టైటిల్స్ హార్డ్కోర్టులపై రావడం విశేషం.
బిజినెస్

బ్యాంక్టెక్లో బిలియన్ డాలర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్యాంక్‌టెక్ రంగంలోకి పెట్టుబడులు 2027 నాటికి బిలియన్ డాలర్లకు (సుమారు రూ.8,600 కోట్లు) చేరతాయని వెంచర్ క్యాపిటల్ సంస్థ ‘సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్’ తన అంచనాను వెల్లడించింది. 2030 నాటికి భారత్ 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించే క్రమంలో వృద్ధిని నడిపించడంలో బ్యాంకింగ్ రంగం కీలక పాత్ర పోషించనున్నట్టు తెలిపింది.విప్లవాత్మక టెక్నాలజీలు భారత్‌లో బ్యాంకింగ్ సేవలను సమూలంగా మార్చేస్తున్నట్టు సెడార్ ఐబీఎస్‌ఐ వ్యవస్థాపకుడు, ఎండీ సాహిల్ ఆనంద్ తెలిపారు. సంప్రదాయ బ్యాంకింగ్ సేవల్లో 80 శాతాన్ని ప్రస్తుతం డిజిటల్‌గా నిర్వహిస్తున్నట్టు ఓ పరిశోధన వివరాలను గుర్తు చేశారు. అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేయడంలో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తున్నట్టు చెప్పారు.వీటి ఫలితంగా మారుమూల ప్రాంతాల్లోని వారికీ బ్యాంకింగ్ సేవలు అందుతున్నట్టు పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగాన్ని డిజిటల్‌గా మార్చడంలో క్లౌడ్ కంప్యూటింగ్ కీలకంగా పనిచేస్తోందంటూ.. సేవల విస్తరణ, చురుకుదనం, వ్యయాల కట్టడి ప్రయోజనాలు దీంతో లభిస్తున్నట్టు వివరించారు. సురక్షితమైన, పారదర్శకమైన లావాదేవీలకు బ్లాక్‌చైన్ టెక్నాలజీ సాయపడుతన్నట్టు ఆనంద్ వెల్లడించారు.ముఖ్యంగా సప్లయ్ చైన్ ఫైనాన్స్, గుర్తింపు నిర్వహణలో ఇది ఎంతో మార్పును తీసుకొస్తున్నట్టు చెప్పారు. సెడార్–ఐబీఎస్‌ఐ క్యాపిటల్ ఇప్పటికే బ్యంక్టెక్ రంగంలో రెండు లావాదేవీలతో మొత్తం రూ.240 కోట్ల పెట్టుబడులు పెట్టిందని.. తమ పోర్ట్‌ఫోలియోని 10–15 స్టార్టప్‌లకు విస్తరించనున్నట్టు ఆనంద్ ప్రకటించారు.

గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు.

ఇండస్‌ఇండ్‌పై ఆర్‌క్యాప్ రుణదాతల పిటిషన్ వాపస్
న్యూఢిల్లీ: జాతీయ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)లో ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్(ఐఐహెచ్ఎల్)పై దాఖలు చేసిన పిటిషన్‌ను రిలయన్స్ కాపిటల్ రుణదాతల కమిటీ (సీఓసీ) ఉపసంహరించుకుంది. పూర్తిగా చెల్లింపులు జరిపి ఇందుకు సంబంధించి నిర్దిష్ట ప్రణాళికను అమలు చేసినందున, ఐఐహెచ్ఎల్పై పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు అపీలేట్ ట్రిబ్యునల్‌కు ఆర్‌క్యాప్ సీఓసీ తెలిపింది. సీఓసీ పిటిషన్‌ను జస్టిస్ యోగేష్ ఖన్నా, జస్టిస్ అజయ్ దాస్ మెహ్రోత్రాలతో కూడిన ట్రిబ్యునల్ ద్విసభ్య థర్మాసనం ఆమోదించింది. కేసు వివరాల్లోకి వెళితే, దివాలా కోడ్ చట్టం కింద ఐఐహెచ్ఎల్ ఆర్థిక సేవల సంస్థ– రిలయన్స్ క్యాపిటల్ కొనుగోలుకు 2023 ఏప్రిల్‌లో రూ.9,650 కోట్లతో అత్యధిక బిడ్‌ను నమోదుచేసింది. దీని ప్రకారం దివాలా పరిష్కార ప్రణాళికను ఐఐహెచ్ఎల్ 2924 మే 27 లోపు పూర్తి చేయాల్సి ఉంది. అటు తర్వాత ఈ కాల పరిమితిని 2024 ఆగస్టు 10 వరకూ పొడిగించడం జరిగింది.

వొడాఫోన్‌లో ప్రభుత్వ వాటా అప్
న్యూఢిల్లీ: రుణ భారంతో కుదేలైన మొబైల్ టెలికం దిగ్గజం వొడాఫోన్ ఐడియాలో తాజాగా ప్రభుత్వం రూ. 36,950 కోట్ల విలువైన షేర్లను సొంతం చేసుకోనుంది. దీంతో కంపెనీలో ప్రభుత్వ వాటా 48.99 శాతానికి బలపడనున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా పేర్కొంది. ఇప్పటికే కంపెనీలో 22.6 శాతం వాటాతో ప్రభుత్వం అతిపెద్ద వాటాదారుగా నిలుస్తోంది. ప్రమోటర్లుగా కంపెనీలో వొడాఫోన్ గ్రూప్ 14.76 శాతం, ఆదిత్య బిర్లా గ్రూప్ 22.56 శాతం చొప్పున వాటాలు కలిగి ఉన్నాయి. తాజా పెట్టుబడులతో ప్రభుత్వం ప్రమోటర్ల సంయుక్త వాటాను సైతం అధిగమించనుంది. కమ్యూనికేషన్ల శాఖ 2021 సెప్టెంబర్‌లో ప్రకటించిన టెలిరం రంగ సహాయక ప్యాకేజీలో భాగంగా ప్రభుత్వం రూ. 36,950 కోట్లను ఈక్విటీ షేర్లుగా మారి్పడి చేసుకుంటున్నట్లు వొడాఫోన్ ఐడియా తాజాగా వెల్లడించింది. వెరసి కంపెనీ 30 రోజుల్లోగా ప్రభుత్వానికి 3,695 కోట్ల ఈక్విటీ షేర్లు జారీ చేయనుంది. 2026కల్లా వొడాఫోన్ ఐడియా చెల్లించవలసిన స్పెక్ట్రమ్, స్థూల ఆదాయ సర్దుబాటు(ఏజీఆర్) విలువ రూ. 32,724 కోట్లుకాగా.. ప్రభుత్వానికి తాజాగా ఈక్విటీ జారీ చేయనుంది.
ఫ్యామిలీ

ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు.. ఎందుకు?
ఉగాదికి సంబంధించిన వేడుకలూ, సంప్రదాయాలూ ఉన్నాయి కానీ, ఉగాది గురించి పురాణ కథలు కనిపించవు. కారణం – ఉగాది (Ugadi) దైవానికి సంబంధించిన పండగ కాదు, కాలానికి సంబంధించిన పండగ! మనిషికున్న వనరులలో అన్నిటికంటె విలువైనది కాలం. అందులో క్షణం ఖర్చయిపోయిందంటే, దాన్ని తిరిగి సంపాదించుకొనే అవకాశం ఎవరికీ లేదు! మనిషి ఆయుర్దాయాన్ని పన్నెండు నెలల పొడుగు ఉన్న ముక్కలుగా విభజిస్తే, ఒక్కొక్క భాగం ఆరంభానికి, ఒక్కొక్క ఉగాది మైలురాయి. ‘నిన్నటితో నీ జీవితంలో మరో ఏడు వెళ్ళి పోయింది. అది ఇక తిరిగిరాదు. ఇవ్వాళ ఇంకొక భాగం ఆరంభం. గతం గతః కనుక, రాబోయే ఏడాదిలోనైనా ధర్మార్థ కామ మోక్షాల సాధనకు సమయాన్ని సరిగా కేటాయించుకొని, సద్వినియోగం చేసు కొమ్మని కాలం చేస్తున్న హెచ్చరికగా ఉగాదిని స్వీకరించవచ్చు.కాలం (Time) చిత్రమైంది. అందులో ప్రతిక్షణమూ మన కళ్ళముందే క్రమం తప్పకుండా టిక్‌టిక్‌మని జరిగిపోతూ ఉంటుంది. కానీ విలువయిన కాలం, విలువలేని భోగలాలసతలో వేగంగా మన చేయి జారిపోయిందని, మనకు బోధపడే నాటికి, సాధారణంగా మనం ముది వయసులో ఉంటాం. ‘లాలసులగు మానవులను/ కాలము వంచించు, దురవగాహము! సుమతీ!’ అన్నారు కదా పోతన గారు. ‘తస్మాత్ జాగ్రత్త’ అని గుర్తు చేసే పర్వదినంగా ఉగాదిని చూడవచ్చు.కాలంలో మరో విచిత్రం కూడా ఉంది. ‘కాలం మారిపోతున్నది, రోజురోజుకూ భ్రష్టమై, నాశనమై పోతున్నది!’ అని లోకులం తరచుగా వాపోతూ ఉంటాం. కానీ అది సబబు లేని మాట. కాలం సృష్ట్యాది నుంచి, ఒకే క్రమంలో ఒకే వేగంతో దాని దోవన అది పోతూ ఉన్నది. దానికి మార్పెక్కడ? మారేది లోకం, కాలం కాదు. కాలం మారిపోతున్నదనటం ‘... తల/ తిరుగు మానిసి ఇల యెల్ల తిరుగుననుటె!’ (పానుగంటి).శ్రీ విశ్వావసు నామ సంవత్సర రాశిఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి‘మారేదీ, మారిందీ, మారగలిగిందీ, మారవలసిందీ కాలం కాదు, దేశం. దేశం (Country అంటే మనుషులు. అంటే మేమే! జరిగిపోయిన చెడుగు, అధర్మం, పతనం, భ్రష్టత్వాలు జరిగిపోయాయి. కనీసం రాబోయే కాలంలోనన్నా మేమంతా ‘మంచి’ దిశగా మారేలా చేయి స్వామీ! ఇప్పటి అంధకారం నుంచి మమ్మల్ని వెలుగుదిశగా నడిపించు. ‘తమసో మా జ్యోతిర్గమయ!’ అని చిత్తశుద్ధితో లోకులందరూ సర్వేశ్వరుడిని ప్రార్థించదగిన సుదినం ఉగాది.– ఎం. మారుతి శాస్త్రి

అందమైన తెలుగుదనం– అనన్య నాగళ్ల
‘‘ఆంగ్ల నూతన సంవత్సరాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. మరి... మన తెలుగు సంవత్సరాదిని ఇంకా ఘనంగా జరుపుకోవాలి కదా. మన సంస్కృతీ సంప్రదాయాలను పాటించే విషయంలో అస్సలు తగ్గకూడదు’’ అంటున్నారు అనన్య నాగళ్ల. తెలుగు తెరపై కథానాయికగా దూసుకెళుతున్న ఈ పదహారణాల తెలుగు అమ్మాయి ‘సాక్షి’ కోసం ప్రత్యేకంగా ముస్తాబయ్యారు. సంప్రదాయబద్ధంగా తయారై, ఉగాది పండగ గురించి పలు విశేషాలు పంచుకున్నారు. → ఉగాది విశిష్టత అంటే మన తెలుగు సంవత్సరాది... మన సంప్రదాయం, మన సంస్కృతిని బాగా చూపించే పండగ. ఇంగ్లిష్ న్యూ ఇయర్‌ని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మన తెలుగు సంవత్సరాదిని అంతకంటే ఘనంగా జరుపుకోవడం నాకు ఇష్టం. పైగా తెలుగువారికి తొలి పండగ కాబట్టి బాగా జరుపుకోవాలనుకుంటాను.→ ఉగాది పండగ అనగానే నాకు రాశి ఫలాలు గుర్తొస్తాయి. ఉదయం లేవగానే రాశి ఫలాలు చూసుకోవడం, ఈ ఏడాది మన ఆదాయం, వ్యయం, రాజ పూజ్యం చూసుకోవడం అనేది సరదాగా అనిపిస్తుంటుంది. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఆనవాయితీలా అయి΄ోయింది. ఉదయాన్నే లేచి అందంగా తయారవడం, ఉగాది పచ్చడి చేసుకోవడం, రాశి ఫలాలు చూసుకోవడం, గుడికి వెళ్లడం... ఇలానే నేను పండగ జరుపుకుంటాను. నాకు ఉగాది పండగ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఏడాదీ బాగా చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాను. కానీ కొన్నిసార్లు కుదురుతుంది.. మరికొన్నిసార్లు కుదరదు. ఈ ఏడాది మాత్రం మంచిగా ముస్తాబై గుడికి వెళ్లాలని, ఇంటి వద్ద పిండి వంటలు చేసుకోవాలని ప్రణాళిక వేసుకున్నాను. → ఉగాది పచ్చడి ఎప్పుడూ తయారు చేయలేదు. కానీ, ప్రతి ఏడాది తింటాను. ప్రత్యేకించి వేర్వేరు ఆలయాల్లో వేర్వేరు రుచుల్లో ఉగాది పచ్చడి ఉంటుంది. వీలైనన్ని టేస్ట్ చేస్తాను. ఇంట్లో మా అమ్మ ఉగాది పచ్చడి చేస్తుంటే సాయం చేశాను కానీ, నేనెప్పుడూ చేయలేదు. అయితే ఆ పచ్చడి రుచి అంటే నాకు చాలా ఇష్టం. → ఉగాది పచ్చడి అంటేనే అందరూ చెబుతున్నట్లు ఆరు రుచులు ఉంటాయి. తీపి, పులుపు, ఉప్పు, కారం, వగరు, చేదు... ఇలా అన్నమాట. నాకు ప్రత్యేకించి వగరుతో కూడిన రుచి అంటే ఇష్టం. ఎందుకంటే... బయట మనం వగరుతో కూడిన ఫుడ్‌ని ఎక్కువగా టేస్ట్ చేయలేం. అలాగే వగరు అనేది వైవిధ్యమైన ఫ్లేవర్‌ని యాడ్ చేస్తుంది... అందుకే నాకు ఇష్టం. → నా బాల్యంలో జరుపుకున్న ఉగాది అంటే చాలా ఇష్టం. మా ఇంటి ముందు గుడి ఉండేది... అందరం పండగని సెలబ్రేట్ చేసుకోవడానికి ఆ గుడికి వెళ్లేవాళ్లం. చిన్నప్పుడు కాబట్టి కొత్త బట్టలంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. ఇక రకరకాల పిండి వంటలు ఉంటాయి కదా... చాలా ఎగ్జయిటింగ్‌గా అనిపించేది.ఫొటో: ఎస్.ఎస్. ఠాకూర్

Ugadi 2025: విశ్వ శ్రేయస్సే విశ్వావసు...ఉగాది
మనిషికి భవిష్యత్తు తెలుసుకోవాలని ఎప్పుడూ ఉంటుంది. ఆ భవిష్యత్తులో మంచి జరగాలనే ఆకాంక్ష ఉంటుంది. కాని భవిష్యత్తు అనేది అనిశ్చితితో నిండి ఉంటుందన్న ఎరుక కూడా ఉంటుంది. అయితే ఒక ఆశ కావాలి కదా. ఆ ఆశను ఆధ్యాత్మిక రూపంలో గ్రహాలను ఊతంగా చేసుకుని సనాతనంగా వచ్చిన గ్రహ విజ్ఞానం ఆధారంగా నిలబెట్టేదే పంచాంగ దర్శనం. మంచిని వాగ్దానం చేస్తూ చెడును హెచ్చరిస్తూ సాగే పంచాంగంలో అనూహ్యమైనది ఏదీ కనిపించకపోయినా దానిని వినడం, చదవడం, పరికించడం ఆనవాయితీ. అయితే ఈసారి ‘సామాజిక పంచాంగం’ను వినిపించాలనుకుంది ‘సాక్షి’. ఆరు కీలక రంగాలు దేశంలో, స్థానికంగా ఎలా ఉంటాయో తెలియచేశారు పండితులు. అవధరించండి.ప్రకృతికి ప్రణామంమనం ఏ శుభలేఖల్లో అయినా స్వస్తిశ్రీ చాంద్రమానేన....అని చదువుతుంటాం. అంటే చాంద్రమానం ప్రకారం జరుపుకునే పండగల్లో ఉగాది పండగది ప్రథమస్థానం. ఉగాది రోజు నుంచే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ‘ఉగాది’ అన్న తెలుగు మాట ‘యుగాది‘ అన్న సంస్కృతపద వికృతి రూపం. బ్రహ్మ ఒక కల్పం ప్రళయంతో అంతమై తిరిగి కొత్త బ్రహ్మ కల్పంలో సృష్టిని ఆరంభించిన రోజు. మొదటి ఋతువు వసంత ఋతువులో మొదటి మాసం ( చైత్ర మాసం)లో మొదటి తిథి అయిన పాడ్యమి నాడు, మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభవింపజేసాడని అర్థం. అందుకే మొదటి సంవత్సరానికి ‘ప్రభవ’ అని పేరు. చివరి అరవయ్యవ సంవత్సరం పేరు ‘క్షయ’ అంటే నాశనం అని అర్థం.ఉగాది సంప్రదాయాలుఉగాది రోజు తైలాభ్యంగనం, నూతన సంవత్సరాది స్తోత్రం, ఉగాది పచ్చడి సేవనం, ధ్వజారోహణం, పంచాంగ శ్రవణం తదితర పంచకృత్యాలను నిర్వహించాలని వ్రతగ్రంథం పేర్కొంటోంది. మామిడాకుల తోరణాలు కట్టడం, తలస్నానం చెయ్యడం, కొత్తబట్టలు ధరించడం, పిండి వంటలు చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆచారం. ఆదాయ వ్యయాలు, రాజ పూజ్య అవమానాలు, కందాయ ఫలాలు, రాశి ఫలాలు తెలియజెప్పే పంచాంగం వినటం ఆనవాయితి. పల్లెల్లో రైతులు ఉగాది రోజున అక్కడి దేవాలయం వద్ద అంతా చేరి, పురోహితుడిని రప్పించి, తాము పండించబోయే పంటకి ఏ కార్తెలో ఎంత వర్షం పడుతుంది? గ్రహణాలు ఏమైనా ఉన్నాయా? ఏరువాక ఎప్పుడు సాగాలి... వంటివన్నీ శ్రద్ధాభక్తులతో అడిగి తెలుసుకుంటారు.ఉగాది పూజఅన్ని పండుగలలాగానే ఉగాది పండుగనాడు ఉదయానే తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి పూజ చేసుకొంటారు. అయితే ప్రత్యేకంగా ఫలాని దేవుడి పూజ అని ఏమీ చెప్పబడలేదు గనుక ఈరోజు ఇష్ట దేవతాపూజ చేసుకొంటారు. ఆ తర్వాత ఏమీ తినక ముందే తీపి, పులుపు, కారం, ఉప్పు, వగరు, చేదు అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తింటారు. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి ఇస్తుంది. ఋతు మార్పు కారణంగా వచ్చే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఉగాది పచ్చడి తినే ఆచారం ఆరంభమైంది అంటారు. ఉగాది పచ్చడిని శాస్త్రీయంగా తయారు చేసే పద్దతిలో ఉప్పు, వేపపువ్వు, చింతపండు, బెల్లం, పచ్చిమిరప కాయలు, మామిడి చిగుళ్ళు, అలాగే అశోక చిగుళ్ళు వేసి చేసేవాళ్ళు. ఈ పచ్చడిని శ్రీరామ నవమి వరకు తినడం వల్ల ఏడాదంతా అనారోగ్యం లేకుండా హాయిగా ఉండేలా చేస్తుందని వైద్యులు చెప్పేమాట. కాలక్రమంలో ఉగాది పచ్చడిలో లేత మామిడి చిగుళ్ళు, అనేక చిగుళ్లు, ఇలాంటివన్నీ మానేసి కేవలం వేపపూత, బెల్లం ముక్కలను మాత్రమే ఉపయోగించటం కనిపిస్తుంది. ఎక్కడికీ కదలలేని చెట్లు కూడా తమ ఆకులను రాల్చేసుకుని చివుళ్లు తొడిగి పూత, పిందెలతో కళకళలాడే ఈ వసంతరుతువులో మనం కూడా మనలోని చెడు అలవాట్లను, నకారాత్మక ఆలోచనలను వదిలేసి, శుచి, శుభ్రత, సంయమనం, సమయపాలన, సమయోచిత కార్యాలను ఆచరించటమనే సద్గుణాలను అలవరచుకుందాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం అర్థం ఏమిటి? నేడు మనం అడుగిడుతున్న కొత్త తెలుగు సంవత్సరానికి శ్రీవిశ్వావసు నామ సంవత్సరం అని పేరు. అంటే విశ్వ శ్రేయస్సు, విశ్వ సంపద అని అర్థం. ఇది అష్టవసువులలో ఒక వసువు పేరు. ఈ సంవత్సరం అందరికీ శ్రేయోదాయకంగా... సంపద్వంతంగా ఉంటుందని ఆశిద్దాం...కొత్తదనం... పచ్చదనంఉగాది అనగానే ఏదో తెలియని కొత్తదనం సుతిమెత్తగా మనసును తాకినట్టు అనిపిస్తుంది. పచ్చదనం మనసునిండా పరుచుకుంటుంది. మామిడిపళ్లు, మల్లెమొగ్గలు, తాటిముంజలు, పుచ్చకాయలు, కోయిల గానాలు మదిలో మెదులుతాయి. చిన్నప్పుడెప్పుడో చదువుకున్నట్టుగా చెట్లు చిగిర్చి పూలు పూసే వసంత రుతువు ఇది. మనసును ఉల్లాసపరిచే కాలం ఇది. అందుకే కవులు, కళాకారులు, సాహితీవేత్తలు ఉగాదిని, వసంత రుతువును విడిచిపెట్టలేదెప్పుడూ! ఉగాది కవి సమ్మేళనాలు, ఉగాది కథలు, కవితల పోటీలు, ఉగాది కార్టూన్లు కాగితం నిండా కళ్లు చేసుకుని తొంగి చూసే ప్రయత్నం చేస్తుంటాయి.ఆర్థికంగా ముందుకు...విశ్వావసు నామ సంవత్సరంలో మంత్రి చంద్రుడు అవడం చేత, రసాధిపతి శుక్రుడు అవడం చేత, నీరసాధిపతి బుధుడు అవడం చేత వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. భారతదేశం ఆర్థిక పరంగా ముందుకు సాగుతుంది. తెలుగురాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయి. పశ్చిమ దేశాల్లో యుద్ధ భయం, యుద్ధ వాతావరణాలు ఉండి ఆర్థికపరంగా పశ్చిమ దేశాలకు అనిశ్చితి ఏర్పడుతుంది. మేఘాధిపతి రవి అవడం చేత పంటలకి క్రిమి కీటకాదుల వల్ల ముప్పు ఉంటుంది. రైతులకు కొంత ఆర్థిక నష్టం జరగవచ్చు. ధనవంతులు అధిక ధనవంతులు అవుతారు. పెద్ద వ్యాపారస్తులు లాభాలు బాగా ఆర్జిస్తారు. చిన్న వ్యాపారస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉంటాయి. మొత్తం మీద శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆర్థికంగా భారతదేశానికి శుభ ఫలితాలనూ, తూర్పు ప్రాంతాలకు, తూర్పు దేశాలకు అనగా చైనా, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు అభివృద్ధిని సూచిస్తోంది.ఆరోగ్యం ఫరవాలేదు...శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో నవనాయకులలో ఐదుగురు పాపులు, నలుగురు శుభులు ఉండడం చేత రాజు రవి, మంత్రి చంద్రుడు అవటం వల్ల ప్రజలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉంటారు. కొన్ని గ్రహాల స్థితిగతులు అలజడులకు, విచిత్ర రోగాలకు, సర్వత్రా ఆందోళనలకు దారి తీస్తాయి. సంవత్సరారంభం నుంచి మే 6వ తేదీ వరకూ మీనరాశిలో నాలుగు గ్రహాలు ఒకే రాశిలో కూటమి కావడం వల్ల విశేష సూర్యతాపం, అకాల మరణాలు, యుద్ధ భయాలు, ధరల పెరుగుదల వంటి ఫలితాలు చూడాల్సిన పరిస్థితి. ఏప్రిల్ 1 నుంచి 13 రోజుల పాటు మీనరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడనుంది. దీనివల్ల దుర్భిక్ష పరిస్థితులు, కొన్ని దేశాలలో వ్యాధుల వ్యాప్తి, జననష్టం, ప్రకృతి బీభత్సాలు వంటివి నెలకొంటాయి. జూన్ ఒకటో తేదీ నుంచి జులై 28వ తేదీ వరకూ కుజరాహువుల పరస్పర వీక్షణాల వల్ల యుద్ధ వాతావరణం, ఉద్రిక్తతలు, కొన్ని వ్యాధులు వ్యాపించే సూచనలు. ఉగాది నుండి సుమారు మూడు నెలల పాటు అపసవ్య రీతిన కాలసర్పదోష ప్రభావం కారణంగా వివిధ సమస్యలు, రోగాలతో ప్రజలు అవస్థ పడతారు. జాతీయ, అంతర్జాతీయ నేతలు కొందరిపై ఆరోపణలు, అరెస్టులు, ఆందోళనలు రేకెత్తవచ్చు. – చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, ఆధ్యాత్మిక వేత్త, పంచాంగకర్తఅనుబంధాలు జాగ్రత్తఈ ఏడాది పాలకుల మధ్య గాని కుటుంబ, వ్యక్తిగత అనుబంధాలుగానీ అంత బాగుంటాయని చెప్పలేం. అందువల్ల బంధుమిత్రుల ఇళ్లకు అతి ముఖ్యమైన పని మీద వెళ్లినా, ఎక్కువ సమయం ఉండకుండా తొందరగా పని చూసుకుని రావడం మంచిది. అనుబంధాలు, మానవ సంబంధాలు బాగుండాలంటే తరచు మాట్లాడుకుంటూ ఉండటం శ్రేయస్కరం. ఆర్థికంగా అంత బాగుండని బంధువుల మీద తెలిసీ తెలియక భారం వెయ్యకుండా వారికి మీ వల్ల చేతనైన సాయం చేయడం మంచిది. అనవసరమైన, చెయ్యలేని, చేతకాని వాగ్దానాలు చేసి వాటిని నెరవేర్చలేక మాటలు పడి మానసిక ప్రశాంతతను పోగొట్టుకునే బదులు చెయ్యగలదానిని మాత్రమే చెప్పడం, చెయ్యలేని వాటిని సున్నితంగా ముందే మా వల్ల కాదని చెప్పడం వల్ల స్నేహసంబంధాలు దెబ్బ తినకుండా ఉంటాయి. బంధువులు, మిత్రుల మధ్య అనుబంధాలు బాగుండాలంటే వారితో స్నేహ సంబంధాలు కొనసాగించడం మేలు. – డా. మైలవరపు శ్రీనివాసరావు, ఆధ్యాత్మిక వేత్తఆనందానికి లోటు లేదుఈ విశ్వావసు నామవత్సరంలో పేరులోనే విశ్వశాంతి గోచరిస్తోంది. క్రోధాలు, మోసాలు, ద్వేషాలు తొలగిపోయి ప్రజలంతా ఒక్కమాటగా ఉంటారు. రాజకీయ రంగంలోని వారికి అవకాశాలు రావడం వల్ల ఆనందంగా ఉంటారు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు వచ్చి ఆనందంలో తేలుతారు, సాహిత్య, సాంస్కృతిక పర్యాటక రంగాలలోని వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఆనందం కలుగుతుంది. ప్రజలంతా చేయీ చేయీ కలుపుకొని మాటా మాటా కలుపుకొని మనసులలోని శంకలు మాపుకొని ఒక్కతాటి మీద నడుస్తూ ఆనందంగా ఉంటారు. ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరం తక్కువ ఎక్కువలనూ పేదాగొ΄్పా తారతమ్యాలను విడనాడి, దేశంలోని అన్ని రంగాలలో సమన్వయం ఏర్పడి అందరూ కలసి కట్టుగా ప్రతి నిత్యం ఆనందంతో మునిగి తేలుతూ అంబరాలనంటేలా సంబరాలను జరుపుకుంటూ జీవిద్దాం. – తాడిగడప సోదరులు: తాడిగడప సుబ్బారావు, తాడిగడప బాల మురళి భద్రిరాజు,శ్రీ వాగ్దేవి జ్యోతిష విద్యాలయం,పెద్దాపురంఅభివృద్ధికరంగా ఉంటుందిశ్రీవిశ్వావసు నామ సంవత్సరంలో దేశ అభివృద్ధి ఆశాజనకంగా ఉంది. ఈ సంవత్సరం గ్రహాలలో అత్యధిక శాతం శుభులు ఉండడం వల్ల ప్రజలు సుఖశాంతులతో ఉంటారు. సస్యవృద్ధి, పశుసంపదకు క్షేమం, ఆయురారోగ్యం కలుగుతుంది. రాజ్యాధిపతి అనుకూలుడుగా ఉండడంవల్ల దేశాధినేతలకు పాలకులకు శుభం చేకూరుతుంది. కొన్ని రాష్ట్రాలలో అతివృషి,్ట మరికొన్ని రాష్ట్రాలలో అనుకూల వృష్టి ఉండవచ్చు. నిత్యావసర వస్తువుల ధరలు నిలకడగా ఉంటాయి. రసవస్తువుల ధరలు కొంత హెచ్చి తగ్గుతాయి. నీరస వస్తువులు ధరలు తగ్గి స్వల్పంగా హెచ్చుతాయి. పరిపాలకులు సంయమనంతో ఉంటారు. చేతివృత్తుల వారికి ఈ సంవత్సరం చేతి నిండా పని దొరుకుతుంది. దేశ రక్షణ బాధ్యతను వహించే సైనికులకు ఈ సంవత్సరం పరీక్షా సమయం అయినప్పటికీ విజయం సాధిస్తారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సంక్షేమంపై దృష్టి సారిస్తారు. నీటిపారుదల, పారిశ్రామిక రంగాలపై పాలకులు ్రపాధాన్యతను చూపుతారు. యువకులకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి– ఓరుగంటి నాగరాజశర్మ, పుష్పగిరి పీఠ మహాసంస్థాన సిద్ధాంతి, జ్యోతిష విద్వాంసులుఆధ్యాత్మికం మిశ్రమంశ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఆధ్యాత్మికంగా, సామాజిక పరంగా శుభాశుభ మిశ్రమంగా ఉంటుంది. దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి చేయూత, పండితులకు కొంత వరకు ఆర్థికసాయం అందే అవకాశం ఉంది. గురుడు వర్ష జగ లగ్నంలో కేంద్ర గతులవడం వల్ల ధార్మిక ఆరాధనల్లో విస్తృతి పెరుగుతుంది. ముఖ్య దేవాలయాల్లో కొన్ని సంస్కరణల వల్ల హైందవ జాతికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా మతపరమైన విషయాల్లో స్వీయ మత ఎరుక పెరుగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా సనాతన ధర్మం అభివృద్ధికరంగా ఉంటుంది. అయితే షష్ఠగ్రహ కూటమి వల్ల బంద్‌లు, అధిక ఉష్ణోగ్రతల వల్ల సమాజంలో కొంత భయం ఏర్పడి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అంతరాయం కలుగవచ్చు. అలాగే మత్తు మందులు మారక ద్రవ్యాల వల్ల చెడుమార్గం పట్టే వారికి సంఖ్య పెరిగి వారికి ఆధ్యాత్మిక కట్టడి అవసరం అవుతుంది సమాజంలో ఆధ్యాత్మిక చింతనకు ధనవంతుల ఆర్థికసాయం లభించగలదు. – చింతా గోపీశర్మ, సిద్ధాంతి – డి.వి.ఆర్. భాస్కర్

షడ్రుచుల ఉగాది పచ్చడి తయారీ ..తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..!
తెలుగువారికి కొత్త సంవత్సరం ఉగాది నుంచి ప్రారంభం అవుతుంది. మామూలుగా ఏ పండుగ రోజైనా స్పెషల్‌గా పిండివంటలు, గారెలు, బూరెలు, పాయసం లాంటి వంటకాలు ఉంటాయి. కానీ ఉగాది స్పెషల్ మాత్రం ఉగాది పచ్చడే!. ఎన్నో ఔషధగుణాలు ఉన్న షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ఉగాది పండుగ రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి పరగడుపున తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆహారంలో ఉండే ఔషధ గుణాలను స్వీకరిస్తూ, జీవితంలో ఎదురయ్యే కష్టసుఖాలను సమానంగా స్వీకరిస్తూ కొత్త సంవత్సరమంతా ఆరోగ్యంగా, ఆనందంగా సాగిపోతుందనేది పురాణ వచనం. మరీ అందరికి ఎంతో ఇష్టమైన ఆ ఉగాది పచ్చడి తయారీ ఎలాగో చూద్దామా..!.ఉగాది పచ్చడి కావలసినవి: కొత్త బెల్లం – 100 గ్రామలు, పచ్చి మామిడి – ఒకటి (మీడియం సైజు), వేప పువ్వు – ఒక టేబుల్ స్పూన్, పచ్చి మిర్చి – రెండు (తురమాలి), ఉప్పు – చిటికెడు, చింతపండు – పెద్ద నిమ్మకాయంత (కొత్త చింతకాయల నుంచి సేకరించినది). తయారీ: బెల్లాన్ని తురిమి, అందులో కొద్దిగా నీటిని చిలకరించి పక్కన ఉంచాలి. వేప పువ్వు కాడలు లేకుండా వలిచి పువ్వు రెక్కలను సేకరించి పక్కన ఉంచాలి. మామిడి కాయ మొదలు (సొన కారే భాగం) తీసేయాలి. కాయను నిలువుగా కోసి లోపలి గింజను కూడా తీసేయాలి. ఇప్పుడు మామిడి కాయను తొక్కతోపాటు సన్నగా ముక్కలు తరగాలి లేదా తురిమి బెల్లం నీటిలో వేయాలి. చింతపండు గుజ్జును చిక్కగా రసం తీసి పై మిశ్రమంలో కలపాలి. అందులో పచ్చిమిర్చి తురుము, ఉప్పు, వేప పూత వేసి కలపాలి. ఈ మిశ్రమం చిక్కగా ఉంటుంది. మరింత రుచి కోసం చెరకు ముక్కలు, మిగుల మగ్గిన అరటి పండు గుజ్జు కలుపుకోవచ్చు. ఈ పచ్చడి తినేటప్పుడు చదవాల్సిన శ్లోకం..శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచసర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥"అందరికీ శ్రీ విశ్వావసు నామ సంవత్సరం శుభాకాంక్షలు(చదవండి:
ఫొటోలు
గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్


బ్లాక్ శారీలో మెరిసిన కీర్తి సురేష్ (ఫొటోలు)
బెట్టింగ్ యాప్స్‌పై సిట్ ఏర్పాటు.. డీజీపీ కీలక ఆదేశాలు
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!


ఇంద్రకీలాద్రి : బెజవాడ దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)


విజయవాడ : ముద్దులొలికిన సంప్రదాయం..క్యాట్‌వాక్‌లు (ఫొటోలు)


బాలకృష్ణ 'ఆదిత్య 369' రీరిలీజ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)


హైదరాబాద్ : రంజాన్ వేళ చార్మినార్ వద్ద షాపింగ్ సందడి (ఫొటోలు)


మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటున్న నటి ‘అనన్య నాగళ్ల’ (ఫొటోలు)


ఉగాది స్పెషల్ లుక్‌లో మహేశ్‌బాబు గారాలపట్టి సితార (ఫోటోలు)
International

పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?
మాస్కో: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin)కు చెందిన అధికారిక కార్లలో అత్యంత లగ్జరీ కారు లిమోజిన్‌లో భారీ పేలుడు సంభవించింది. మాస్కో నడిబొడ్డున జరిగిన ఈ ఘటన రష్యా అధ్యక్షుని భద్రతపై పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. ఈ ఘటనతో ప్రపంచ నేతలంతా ఉలిక్కిపడ్డారు. ‘ది సన్’ తెలిపిన వివరాల ప్రకారం పుతిన్‌కు చెందిన ఈ అత్యంత ఖరీదైన కారు లుబియాంకాలోని ఎఫ్ఎస్బీ ప్రధాన కార్యాలయం సమీపంలో కాలిపోతూ కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం కారు ఇంజిన్ నుండి మంటలు ప్రారంభమై, వాహనం లోనికి వ్యాపించాయి. JUST IN: 🇷🇺 Luxury limousine from Russian President Putin's official motorcade exploded on the streets of Moscow, just blocks from the FSB headquarters.It's unclear if this is an attempted ass*ssination attempt pic.twitter.com/Da4tcUoZEU— BRICS News (@BRICSinfo) March 29, 2025అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపు అక్కడికి సమీపంలోని రెస్టారెంట్‌లోని సిబ్బంది కారుకు అంటుకున్న మంటలను ఆర్పేందుకు ముందుకు వచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలో వాహనం నుండి దట్టమైన నల్లటి పొగ రావడం, కారు వెనుక భాగం దెబ్బతిడాన్ని చూడవచ్చు. ఈ పేలుడుకు గల కారణం ఇంకా తెలియరాలేదని, ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని ‘ది సన్’ పేర్కొంది. ఈ కారును ప్రెసిడెన్షియల్ ఎస్టేట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంటుంది. ఇదిలావుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆరోగ్యం క్షీణిస్తోందని, ఆయన త్వరలో చనిపోతారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ (Ukrainian President Volodymyr Zelensky) వ్యాఖ్యానించారు. బుధవారం జరిగిన ఒక ఇంటర్వ్యూలో జెలెన్స్కీ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. పుతిన్ కారు తగలబడిన ఘటన నేపధ్యంలో ఆయన మరణాన్ని జెలెన్స్కీ ముందే ఊహించారంటూ పలు కథనాలు వెలువడుతున్నాయి. కైవ్ ఇండిపెండెంట్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యూరోవిజన్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ మాట్లాడుతూ పుతిన్ త్వరలో చనిపోతారని, ఇరు దేశాల యుద్ధం కూడా త్వరలో ముగుస్తుందని అన్నారు.ఇది కూడా చదవండి: Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే..

భూకంపంలో శిశువులను కాపాడిన నర్సులు.. హ్యట్సాప్ అంటూ ప్రశంసలు
మయన్మార్‌లో భూకంప విలయం (Earthquake) కారణంగా భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. అంచనాలకు కూడా అందని నష్టాన్ని మిగిల్చింది. భూకంప కేంద్రమైన మాండలేతో పాటు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా కుప్పకూలిన భవనాల శిథిలాలే. బాధితుల హాహాకారాలే వినిపిస్తున్నాయి. శుక్రవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో విరుచుకుపడ్డ భూకంపానికి బలైన వారి సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. శిథిలాల నుంచి ఇప్పటికే 1,600కు పైగా మృతదేహాలను వెలికితీశారు. 3,500 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య 10 వేలు దాటవచ్చని చెబుతున్నారు.మరోవైపు.. భూకంపం సందర్బంగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలోని ఒక చిన్న పిల్లల ఆసుపత్రికి సంబంధించిన వీడియోపై నెటిజన్లు ప్రసంశలు కురిపిస్తున్నారు. భూకంపం సందర్భంగా ఆసుపత్రిలోని మెటర్నిటీ వార్డులో చిన్న పిల్లలను నర్సులు కాపాడారు. భూకంపం ధాటికి భవనంలో కుదుపులు ఎదురైనప్పటికీ వారు కింద పడిపోతున్నా.. ఆసుపత్రిలో ఉన్న శిశువుకు ప్రమాదం జరగకుండా నర్సులు జాగ్రత్తలు తీసుకున్నారు. మరో నర్సు ప్లోర్‌పై కూర్చుని శిశువును పట్టుకుంది. ఎంతో కష్టం మీద కన్న తల్లిలాగా శిశువులను కాపాడారు. ఈ క్రమంలో నర్సుల కష్టంపై నెటిజన్లు స్పందిస్తూ ప్రశంసిస్తున్నారు.ఇదిలా ఉండగా.. మయన్మార్‌తో పాటు థాయ్‌లాండ్‌లో 12 నిమిషాల వ్యవధిలోనే సంభవించిన రెండు భారీ భూకంపాలు (Earthquake) తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. ఈ భూకంపం 334 అణుబాంబులతో సమానమైన శక్తిని విడుదల చేసి వినాశనం సృష్టించిందని స్థానిక భూవిజ్ఞాన శాస్త్రవేత్త జెస్ ఫీనిక్స్ పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మరిన్ని ప్రకంపనలు (Aftershocks) వచ్చే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు. భారత టెక్టానిక్ ఫలకాలు యురేషియన్ ప్లేట్స్‌ను వరుసగా ఢీకొంటుండడం వల్ల నెలల తరబడి ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని జెస్ ఫీనిక్స్ తెలిపారు. భూ ఉపరితలానికి 10 కి.మీ లోతులోనే ప్రకంపనల కేంద్రాలు ఉన్నాయని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.Nurses in SW China protect newborn babies during earthquake in Myanmar #ChinaBuzz pic.twitter.com/Yixj3pCtZE— CGTN (@CGTNOfficial) March 30, 2025ప్రపంచ దేశాల ఆపన్న హస్తం..ఈ కష్ట సమయంలో అక్కడి ప్రజలకు ఆపన్న హస్తం అందించేందుకు భారత్ ఇప్పటికే ముందుకొచ్చింది. ‘ఆపరేషన్ బ్రహ్మ’ కింద దాదాపు 15 టన్నుల సహాయ సామగ్రిని అక్కడికి పంపించింది. బాధితులకు అవసరమైన ఆహారపదార్థాలతోపాటు.. తాత్కాలిక నివాసం కోసం టెంట్లు, స్లీపింగ్ బ్యాగ్స్, వాటర్ ప్యూరిఫయర్లు, సోలార్ ల్యాంప్, జనరేటర్లు, అత్యవసర వైద్య పరికరాలను మయన్మార్‌కు పంపించినట్లు సమాచారం. అంతే కాకుండా విపత్తులో ఉన్న ఆ దేశానికి సాయం చేసేందుకు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అక్కడికి పంపుతున్నట్లు పేర్కొంది. అమెరికా, ఇండోనేషియా, చైనా, ఇతర దేశాలు కూడా అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించాయి. ప్రభావిత దేశాలకు సహాయక సామగ్రి పంపుతున్నామని ఐక్యరాజ్యసమితి జనరల్ సెక్రటరీ ఆంటోనియో-గుటెరస్ వెల్లడించారు.Terrifying CCTV video of yesterdays M7.7 earthquake that hit Myanmar. The death toll is at least 1,644, with 3,408 people injured. Numbers are expected to rise. pic.twitter.com/5fAXXXpVDl— Volcaholic 🌋 (@volcaholic1) March 29, 2025 Nature doesn’t care about our strength, borders, or pride. The earthquake in #Thailand & #Myanmar is a stark reminder: no matter how advanced we become, nature still holds the power to shake everything. A brutal reminder of how small we really are. #earthquake pic.twitter.com/wQPZ82MB8j— Hala Jaber (@HalaJaber) March 29, 2025

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు
నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు. భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.ఇదేవిధంగా మయన్మార్‌లోని ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది. ఈ నేపధ్యంలో భారత్.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

బంగ్లా షేక్ హసీనాకు బిగ్ షాక్
ఢాకా: అంతర్గత తిరుగుబాటు ద్వారా యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర పన్నారంటూ బంగ్లాదేశ్ పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాపై కేసు నమోదైంది. హసీనా, మరో 72 మందిపై క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్(సీఐడీ) ఢాకాలోని చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేసిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న కోర్టు దర్యాప్తు చేపట్టాలంటూ సీఐడీని గురువారం కోరిందన్నారు.ఈ సందర్బంగా ‘జోయ్ బంగ్లా బ్రిగేడ్’పేరుతో ఏర్పాటైన ఆన్లైన్ వేదికపై 2024 డిసెంబర్ 19వ తేదీన కొందరు సమావేశమై దేశంలో అంతర్యుద్దం ద్వారా హసీనాను తిరిగి ప్రధాని పీఠంపై కూర్చోబెట్టే విషయమై చర్చించినట్లు సమాచారము ఉందని సీఐడీ తన ఫిర్యాదులో పేర్కొంది. మధ్యంతర ప్రభుత్వాన్ని కొనసాగనివ్వరాదని డాక్టర్ రబ్బీ ఆలం సారథ్యంలో జరిగిన ఈ వర్చువల్ సమావేశం నిర్ణయించిందన్నారు.షేక్ హసీనా తదితరులు పాల్గొన్న ఈ భేటీ రికార్డింగ్స్ తమకు లభ్యమైనట్లు సీఐడీ తెలిపింది. హసీనా ఆదేశాల మేరకు అమెరికాలో ఉంటున్న అవామీ లీగ్ నేత ఆలం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేశ, విదేశాలకు చెందిన మొత్తం 577 మంది పాల్గొన్నట్లు సీఐడీ తెలిపింది. ఈ కేసులో ఆలంను రెండో నిందితుడిగా పేర్కొంది. కాగా, యూనుస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం భారత్‌లో ఉంటున్న హసీనాపై పలు ఆరోపణల కింద కేసులు నమోదు చేయడం తెలిసిందే.
National

ఒడిశాలో రైలు ప్రమాదం
భువనేశ్వర్ : ఒడిశాలో రైలు ప్రమాదం జరిగింది. నెర్గుండి సమీపంలో కామాఖ్య ఎక్స్‌ప్రెస్ ట్రైన్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 11 బోగీలు పక్కకు పడిపోయాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఈస్ట్‌కోస్ట్ రైల్వే సీపీఆర్వో అశోక్ కుమార్ మిశ్రా వివరాల మేరకు.. కటక్‌లోని నెర్గుండి రైల్వే స్టేషన్ సమీపంలో ట్రైన్ నెంబర్ 12551 కామాఖ్య సూపర్ పాస్ట్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది.ట్రైన్ ప్రమాదం జరిగిన వెంటనే మెడికల్ ఎమర్జెన్సీ టీం ఘటనా స్థలానికి చేరుకుంది. గాయపడిన క్షతగాత్రులకు చికిత్స అందించారు. సీనియర్ రైల్వే అధికారులు సైతం ఘటన స్థలానికి చేరుకున్నారు.ప్రమాదానికి గల కారణాల్ని ఆరా తీస్తున్నారు. మరోవైపు, రైల్వే రాకపోకలకు ఎలాంటి అంతరాయం జరగకుండా రూట్లను మళ్లించారు. #WATCH | Bhubaneswar, Odisha: On Kamakhya Express train derailed near Nergundi Railway Station in Cuttack, Ashoka Kumar Mishra, CPRO, East Coast Railway says "We got information about the derailment of some coaches of 12551 Kamakhya Superfast Express. As of now, we have the… pic.twitter.com/olrYv7CRRX— ANI (@ANI) March 30, 2025

Mann Ki Baat: వేసవి సెలవులు.. నీటి సంరక్షణపై ప్రధాని మోదీ సందేశం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ఈరోజు(ఆదివారం) ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) 120వ ఎపిసోడ్లో ప్రజలతో వివిధ అంశాలపై సంభాషించారు.‘ఈ రోజు నుంచి చైత్ర నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. భారతీయ నూతన సంవత్సరం కూడా ఈ రోజే మొదలువుతుంది. ఈ రోజు మొదలుకొని రాబోయే కొద్ది రోజుల్లో మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పలు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ పండుగల సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.వేసవి సెలవులు సద్వినియోగం చేసుకోండి‘పరీక్షల సమయంలో వాటి గురించి చర్చించాను. త్వరలో వేసవి సెలవులు రాబోతున్నాయి. పిల్లలు వాటి కోసం వేచి చూస్తున్నారు. కొత్త అభిరుచులను మెరుగుపరుచుకునేందుకు తగిన సమయం ఇది. వేసవి సెలవుల కోసం రూపొందించిన ‘మై క్యాలెండర్’చిన్నారులకు ఎంతగానో ఉపకరిస్తుంది. అంబేద్కర్ జయంతి నాడు జరిగే పాదయాత్రలో పాల్గొనడం ద్వారా, మీరంతా రాజ్యాంగ విలువల గురించిన సమాచారాన్ని అందరికీ తెలియజేయగలుగుతారు’ అని మోదీ పేర్కొన్నారునీటిని పొదుపుగా వాడండి‘నీటి పొదుపు ప్రచారం వేసవి కాలంలోనే ముమ్మరంగా జరుగుతుంది. మనకు లభించిన సహజ వనరులను తదుపరి తరానికి అందించడం మన బాధ్యత. దేశంలో గత ఏడెనిమిదేళ్లలో కొత్తగా నిర్మించిన ట్యాంకులు, చెరువులు, ఇతర నీటి నిల్వల నిర్మాణాల ద్వారా నీటిని సంరక్షించారు. ఈ విషయంలో అందరూ ఇప్పటి నుండే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలి. మీ ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని అందరికీ అందుబాటులో ఉంచండి’ అని ప్రధాని మోదీ అభ్యర్థించారు.ప్రతిభచాటిన పారా గేమ్స్ ఆటగాళ్లు ఇటీవల ముగిసిన ఖేలో ఇండియా పారా గేమ్స్(Khelo India Para Games)లో ఆటగాళ్లు తమ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈసారి ఎక్కువ మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వారిని అభినందిస్తున్నాను. దివ్యాంగ క్రీడాకారులు 18 జాతీయ రికార్డులను కూడా సృష్టించారు. మన దేశీయ ఆటలు ఇప్పుడు ప్రాచుర్యం పొందుతున్నాయి. ఢిల్లీలో జరిగిన ఫిట్ ఇండియా కార్నివాల్లో వివిధ ప్రాంతాల నుండి సుమారు 25 వేల మంది పాల్గొన్నారు. వారందరి లక్ష్యం ఒక్కటే ‘ఫిట్‌గా ఉండటం.. ఫిట్నెస్ గురించి అందరికీ అవగాహన కల్పించడం’ అని ప్రధాని పేర్కొన్నారు.సవాల్‌గా మారిన వస్త్ర వ్యర్థాలుదేశంలో వస్త్ర వ్యర్థాలు కొత్త సవాలుగా మారాయి. మనం పాత దుస్తులను పారవేసినప్పుడు వాటిలో ఒక శాతం మాత్రమే రీసైకిల్ అవుతుంది. ప్రపంచంలో అత్యధిక వస్త్ర వ్యర్థాలు ఉత్పత్తి అయ్యే మూడవ దేశం భారత్.ఈ సవాలును ఎదుర్కొనేందుకు పలు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ స్టార్టప్‌లు పాత బట్టలు, బూట్లు, చెప్పులను రీసైక్లింగ్ చేసి ఉపయోగకరంగా మారుస్తున్నాయని ప్రధాని తెలిపారు.యోగా దినోత్సవానికి ఏర్పాట్లుయోగా దినోత్సవానికి ఇక కొద్ది రోజులు మాత్రమే ఉంది. యోగాను జీవితంలో భాగంగా చేసుకోవాలి. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన బహుమతి యోగా. ఇది భవిష్యత్ తరానికి ఉపయోగపడుతుంది. యోగా సాయంతో ప్రపంచాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిద్దాం. నేడు పెద్ద సంఖ్యలో యువత యోగాను అభ్యసిస్తున్నారు. అలాగే ఆయుర్వేదాన్ని కూడా ఆశ్రయిస్తున్నారని ప్రధాని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: పుతిన్ కారులో భారీ పేలుడు.. జెలెన్స్కీ భవిష్యవాణి నిజమేనా?

తల్లి ఫోన్ మాట్లాడలేదనే వేదనతో..
అన్నానగర్: గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది. ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Rajasthan Day: 19 రాచరిక రాష్ట్రాలు కలగలిస్తే..
నేడు(మార్చి 30) రాజస్థాన్ దినోత్సవం(Rajasthan Day). రాజస్థాన్ ఏర్పడి ఈరోజుకు 76 ఏళ్లు పూర్తయ్యాయి. 1949, మార్చి 30న రాజస్థాన్ ఒక రాష్ట్రంగా ఏర్పాటయ్యింది. ఈ రాష్ట్రంలోని అందమైన కోటలు, ప్రత్యేక సంస్కృతి, చరిత్ర ఎంతో ఆసక్తిగొలుపుతాయి. దేశంలో విస్తీర్ణం పరంగా ఈ రాష్ట్రం అతిపెద్దది. నేటి రాజస్థాన్‌ను ఒకప్పుడు ‘రాజపుతన’ అని పిలిచేవారు. అంటే రాజపుత్రుల దేశం అని అర్థం.1949లో మార్చి 30న 19 రాచరిక రాష్ట్రాలతో పాటు మూడు ప్రదేశాలను కలిపి ‘రాజస్థాన్’ను స్థాపించారు. ఈ రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ఏడు దశల్లో పూర్తయిన తర్వాత దీనికి ‘రాజస్థాన్’ అనే పేరుపెట్టారు. రాజస్థాన్ రాష్ట్రం ఎనిమిదేళ్ల, ఏడు నెలల, 14 రోజుల్లో మొత్తం ఏడు దశల్లో ఏర్పడింది. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక దేశ ఏకీకరణ ప్రక్రియ(Integration process) జరుగుతున్నప్పుడు, పలు సంస్థానాల రాజులు దేశంలో విలీనానికి నిరాకరించారు. కానీ దేశంలోని అన్ని సంస్థానాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.ఈ నేపధ్యంలోనే రాజస్థాన్‌లోని అన్ని రాచరిక రాష్ట్రాల ఏకీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 1949లో పలు రాచరిక రాష్ట్రాలు, చిన్న రాజ్యాలు కలగలపడంతో రాజస్థాన్ పెద్ద రాష్ట్రంగా అవతరించింది. ఈ ఏకీకరణ ఘనత భారత ఉక్కు మనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు దక్కుతుంది. రాజస్థాన్ దినోత్సవం నాడు రాష్ట్ర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ ప్రదర్శనలు నిర్వహిస్తారు.ఇది కూడా చదవండి: నాగ్‌పూర్ చేరుకున్న ప్రధాని మోదీ.. సంఘ్ కార్యాలయం సందర్శన
NRI

టీటీఏ (TTA) న్యూయార్క్ చాప్టర్ రీజినల్ వైస్ ప్రెసిడెంట్‌గా జయప్రకాష్ ఎంజపురి
తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్(TTA) న్యూయార్క్ చాప్టర్‌కి రీజినల్ వైస్ ప్రెసిడెంట్ (RVP)గా జయప్రకాష్ ఎంజపురి ఎంపికయ్యారు. టీటీఏ వ్యవస్థాపకులు డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి నాయకత్వంలో 2025-2026 కాలానికి ఈ ఎంపిక జరిగిందని కమిటీ ఒక ప్రకటనలో తెలిపింది. TTA వ్యవస్థాపకుడు, సలహా మండలి, TTA అధ్యక్షుడు, కార్యనిర్వాహక కమిటీ, డైరెక్టర్ల బోర్డు, స్టాండింగ్ కమిటీలు (SCలు) ప్రాంతీయ ఉపాధ్యక్షులు (RVP) ల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. అలాగే పదవీ విరమణ చేస్తున్న RVP సత్య ఎన్ రెడ్డి గగ్గెనపల్లి అందించిన సేవలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపింది.జయప్రకాష్ ఎంజపురి (జే)కు వివిధ సంస్థలలో సమాజ సేవలో 16 సంవత్సరాలకు పైగా అనుభవముందని ప్రపంచ మారథానర్ టీటీఏ వెల్లడించింది. న్యూయార్క్‌లోని తెలుగు సాహిత్య మరియు సాంస్కృతిక సంఘం (TLCA) 51వ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆరు ప్రపంచ మేజర్ మారథాన్లను పూర్తి చేసిన మొదటి తెలుగు సంతతి వ్యక్తి, 48వ భారతీయుడు నిలిచారు. ఈ రోజు వరకు, జే ప్రపంచవ్యాప్తంగా 18 మారథాన్లను పూర్తి చేశాడు. క్రీడలకు ఆయన చేసిన కృషికి గుర్తింపుగా, 2022లో న్యూజెర్సీలో జరిగిన TTA మెగా కన్వెన్షన్‌లో "లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ ఇన్ స్పోర్ట్స్" అవార్డుతో అందుకున్నారు. సెప్టెంబర్ 2023లో, అతను ఆఫ్రికాలోని ఎత్తైన శిఖరం , ప్రపంచంలోనే 4వ ఎత్తైన పర్వతం అయిన కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించారు. అలాగే గత ఏడాది జూన్‌లో పెరూలోని పురాతన పర్వత శిఖరం సల్కాంటే పాస్‌ను జయించాడు. ఈ ఏడాది సెప్టెంబరులో జే తన తదుపరి గొప్ప సాహసయాత్రకు సిద్ధమవుతున్నాడనీ, గొప్ప సాహస యాత్రీకుడుగా ఆయన అద్భుత విజయాలు,ఎంతోమందికి ఔత్సాహికులకు పరిమితులను దాటి ముందుకు సాగడానికి ప్రేరేపిస్తున్నాడని కమిటీ ప్రశంసించింది. NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండిన్యూయార్క్ బృందంలో కొత్త సభ్యులున్యూయార్క్ బృందంలో సహోదర్ పెద్దిరెడ్డి (కోశాధికారి), ఉషా రెడ్డి మన్నెం (మ్యాట్రిమోనియల్ డైరెక్టర్), రంజిత్ క్యాతం (BOD), శ్రీనివాస్ గూడూరు (లిటరరీ & సావనీర్ డైరెక్టర్) ఉన్నారు. మల్లిక్ రెడ్డి, రామ కుమారి వనమా, సత్య న్ రెడ్డి గగ్గెనపల్లి, సునీల్ రెడ్డి గడ్డం, వాణి సింగిరికొండ, హరి చరణ్ బొబ్బిలి, సౌమ్య శ్రీ చిత్తారి, విజేందర్ బాసా, భరత్ వుమ్మన్నగారి మౌనిక బోడిగం. టీటీఏ కోర్ టీమ్ సభ్యులుగా పని చేస్తారు-TTA వ్యవస్థాపకుడు: డాక్టర్ పైళ్ల మల్లా రెడ్డి -సలహా సంఘం:-అధ్యక్షుడు: డాక్టర్ విజయపాల్ రెడ్డి గారు-సహాధ్యక్షులు: డాక్టర్ మోహన్ రెడ్డి పాటలోళ్ల -సభ్యులు: భరత్ రెడ్డి మాదాడి శ్రీని అనుగు-TTA అధ్యక్షుడు: నవీన్ రెడ్డి మల్లిపెద్ది

న్యూజెర్సీలో ఘనంగా ‘మాట’ మహిళా దినోత్సవ వేడుకలు
మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి పలు కార్యక్రమాలు చేపడుతున్న మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ - మాట అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. అమెరికాలోని న్యూజెర్సీలో ఉమెన్స్ డే వేడకలను అంగరంగ వైభవంగా నిర్వహించి.. వనితలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరని మాట ఉమెన్ కమిటీ మరోసారి రుజువు చేసింది. ప్రముఖ సినీ నటి, ఇంద్రాణి ఫేమ్ అంకితా జాదవ్ ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై.. ప్రసంగించారు. సింగర్ దామిని భట్ల, దీప్తి నాగ్ తో పాటు పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అంకితా కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన మాట కార్యవర్గాన్ని అభినందించారు. అంకితా జాదవ్ నటించిన ఆల్బమ్ సాంగ్స్ ను ఈ వేదికగా ప్రదర్శించారు. ఈ వేడుకల్లో మహిళామణులు పెద్ద సంఖ్యలో పాల్గొని కనువిందు చేశారు. ఇక వేదికపై నిర్వహించిన పలు కార్యక్రమాలు మహిళల సంతోషాల మధ్య ఆహ్లదంగా సాగాయి. యువతులు, మహిళల ఆట, పాటలతో.. సంబరాల సంతోషాలు అంబరాన్నంటాయి. అటు సంప్రదాయం.. ఇటు ఆధునికత ఈ రెండింటిని ప్రతిబింబిస్తూ ఎన్నో కార్యక్రమాలతో మహిళలు ఆకట్టుకున్నారు. శాస్త్రీయ నృత్యం, మోడ్రన్ డ్యాన్స్ రెండింటిలో తమకు సాటి లేదని నిరూపించారు.MS మాట కాంపిటీషన్, ఫ్యాషన్ షో, బ్యూటీ పాజెంట్ వంటి అద్భుతమైన ప్రదర్శనలు ఆహుతులను ఆకర్షించాయి. ఈ ప్రదర్శనల్లో మగువలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా శక్తి ఏమిటో నిరూపించారు. అందాల ముద్దుగుమ్మలు హొయలు పోతూ ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేశారు. అందాల పోటీలకు నటి అంకితా జాదవ్ తో పాటు పలువురు ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. MS మాట కాంపిటీషన్ 2025 విజేతకు కిరీటాన్ని బహూకరించారు. పోటీల్లో పాల్గొన్న మగువలకు బెస్ట్ స్మైల్, బెస్ట్ వాక్ వంటి పలు విభాగాల్లో అవార్డులు అందించారు. ఫోటో బూత్, ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్, ఫన్ ఫీల్డ్ గేమ్స్, రాఫెల్ టికెట్స్ వంటి కార్యక్రమాలు అమితంగా ఆకట్టుకున్నాయి.వేదికపై మగువలు, చిచ్చర పిడుగులు ప్రదర్శించిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డ్యాన్స్‌లు, డిజె మ్యూజిక్ కార్యక్రమాలు హోరెత్తించాయి. సంప్రదాయ ఫ్యాషన్ షో, గేమ్స్ తో పాటు ఇతర కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో భాగంగా వెండర్స్ బూత్ ఏర్పాటు చేశారు. మహిళలు షాపింగ్ స్టాల్స్ దగ్గర సందడి చేశారు. తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పసందైనా విందుభోజనం అందించారు. ఆహా ఏమి రుచి… తినరా మైమరచి.. అనే మాటను నిజం చేస్తూ ఎంతో రుచికరమైన భోజనాలు అందించారు. స్వీట్స్ నుంచి ఐస్ క్రీమ్ వరకు పలు వైరటీలతో రుచికరమైన వంటకాలు ఏర్పాటు చేశారు. మాట మహిళా నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు. వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళా ప్రసంగాలతో పాటు అనేక సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మాట నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సత్కరించారు. సంస్థ మహిళలకు ఇస్తున్న ప్రాధాన్యత, మహిళా సాధికారతకు, అభ్యున్నతికి మాట అధ్వర్యంలో చేపట్టిన ప్రణాళికలను నాయకులు వివరించారు. ఈ సందర్భంగా సంస్థ తరుపున చేస్తున్న పలు కార్యక్రమాలను వివరించారు. స్త్రీలు ప్రతి కష్టాన్ని ధైర్యంగా ఎదుర్కుంటూ ముందుకు సాగాలని పలువురు ప్రముఖులు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. మాట పలువురిని అవార్డుతో సత్కరించింది. అలాగే సభా వేదికపై పలువురిని సన్మానించి, సత్కరించారు. మాట కార్యక్రమాలు అండగా ఉంటూ, సహాయసహాకారాలు అందిస్తున్న ప్రతిఒక్కరినీ నిర్వహకులు ప్రశంసించారు. ఈ సంబరాలను అద్భుతంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించిన ప్రతిఒక్కరినీ మాట ఉమెన్ కమిటీ ప్రత్యేకంగా అభినందించింది. ఈ వేడుకకు విచ్చేసిన స్త్రీమూర్తులకు నిర్వహకులు కృతజ్ఞతలు తెలియజేశారు. విందు - వినోదాలతో మాట - అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఎంతో ఉత్సహంగా సాగాయి. ఈ సంబరాల్లో మేము సైతం అంటూ వెయ్యి మందికి పైగా మహిళలు ముందుకొచ్చి ఉమెన్స్ డే వేడుకలను గ్రాండ్ సక్సెస్ చేశారు. సంబరమాశ్చర్యాలతో, ఆసాంతం ఆహ్లాద పరిచేలా ఈ వేడుకను కనువిందుగా నిర్వహించారు. వేలాదిగా ఆదర్శ వనితలు ఒక చోటు చేరి, అటపాటలతో, కేరింతలతో హోరేత్తించడం.. మాట విజయానికి మచ్చుతునకగా చెప్పవచ్చు.

ఫ్లోరిడాలో అత్యున్నత స్థాయి ‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025’
అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండో నగరంలో మెడికల్ కాన్ఫరెన్స్ ఘనంగా జరిగింది. 70-80 మంది ఆంకాలజిస్టులు, ప్రైమరి కేర్ డాక్టర్లు హాజరైన ఈ కార్యక్రమం, ఇన్నోవేటివ్ ఎడ్యుకేషన్‌కి ఒక వేదికగా పనిచేసిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సదస్సు ప్రముఖ కీనోట్ వక్త, డాక్టర్ బార్బరా మెకనీ, మాజీ AMA ఉపాధ్యక్షురాలు ఆంకాలజి పరిశోధన, పక్షవాతం, పేషంట్ కేర్ మొదలైన అంశాల ప్రాముఖ్యాన్ని వివరించారు.‘హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2025 తన విజన్‌ను నిజం చేసింది. మహిళల కోసం క్యాన్సర్ సంరక్షణను ముందుకు తీసుకెళ్లడంలో వైద్య సమాజాన్ని శక్తివంతం చేయడానికి, అవగాహన నిమిత్తందీన్ని రూపొదిచామనీ, ఈమెడ్ ఈవెంట్స్, ఈమెడ్ ఎడ్ సీఈఓగా, శంకర నేత్రాలయ, యూఎస్ఏ సీఎమ్ఈ చైర్‌పర్సన్‌గా(USA CME) ఒక మహిళగా, మహిళా ఆరోగ్య సంరక్షణలో మార్పు తీసుకురావడానికి ఇదొక సదవకాశమని’ డాక్టర్ ప్రియా కొర్రపాటి సంతోషం వ్యక్తం చేశారు. మరిన్ని NRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!చైర్పర్సన్ డాక్టర్ సతీష్ కత్తుల, ఆంకాలజిస్ట్, హెమటాలజిస్ట్, AAPI అధ్యక్షుడు, మహిళలలో సాధారణ క్యాన్సర్లను పరిష్కరించడం, నిరంతర అవగాహన ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. కాంగ్రెస్‌లో 10 మంది అత్యున్నత నైపుణ్యం కలిగిన వక్తలు ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆంకాలజీలో పురోగతి, సమగ్ర రోగి సంరక్షణపై దృష్టిపెడుతున్నారని డా. ప్రియా అన్నారు. ఈ కాంగ్రెస్‌ను కేవలం ఒక కార్యక్రమం కాకుండా, కంటిన్యూస్ లర్నింగ్ చేయాలనే తమ లక్ష్యాన్ని బలోపేతం చేశారన్నారు. AAPI, CAPI (టంపా నుండి స్థానిక అధ్యాయం) eMed Ed తో కలిసి చేస్తున్న సహకార ప్రయత్నాలను డా. సతీష్ అభినందించారు. ప్రత్యేక ఆకర్షణలుNFL ఆటగాడు షెప్పర్డ్ స్టెర్లింగ్ ఈ సదస్సు హాజరు కావడం విశేషం. ఆంకాలజీ వంటి క్రిటికల్ కేర్ వైద్యులలో చాలా ఉద్యోగపరైమన ఒత్తిడి అధికంగా ఉంటుంది దాని కోసం ప్రత్యేకంగా ఆంకాలజీ బర్నవుట్ సెషన్ నిర్వహించటం మరో విశేషం. డాక్టర్ వర్షా రాథోడ్, ఇంటిగ్రేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, ఓర్లాండో, ఫ్లోరిడా ఈ సెషన్ నిర్వహించారు. డాక్టర్ శైలజ ముసునూరి, ఇంటిగ్రేటెడ్ మెడిసిన్, చీఫ్ ఆఫ్ సైకియాట్రి, వుడ్ సర్వీసెస్, పెన్సిల్వేనియా వారు నిర్వహించిన సైకాలజికల్ ఆంకాలజీ సెషన్ ఆకట్టుకుంది. క్యాన్సర్ కేర్ లో మెడికల్ ట్రీట్మెంట్ మాత్రమే కాకుండా, రోగుల మానసిక, భావోద్వేగ స్థితిని కూడా సమర్థంగా నిర్వహించాలని పేర్కొన్నారు.వాలంటీర్ల దృక్పదంస్పీకర్లకి మించి, ఈ కాంగ్రెస్ స్వచ్ఛంద సేవకులకు కూడా గొప్ప అనుభవాన్ని ఇచ్చిందనీ, సెషన్లు, ఆసక్తిక్రమైన చర్చలు జరిగాయి. డాక్టర్లు అనేక ప్రశ్నలను చాలా లోతైన వివరణ, పరిస్కారాలు ఇచ్చారని, క్వెషన్ అండ్ ఆన్సర్ సెషన్ చాలా ఆసక్తిగా, ఉపయోగంగా ఉందని ఆమె తెలిపారు.ఆడియన్స్ అభిప్రాయాలుమహిళల క్యాన్సర్లపై దృష్టి సారించే ఆంకాలజీ సమ్మేళనాలు అరుదుగా ఉన్నాయని, ఈ కార్యక్రమం ఆంకాలజిస్ట్‌లు, ప్రమరి కేర్ డక్టర్లు ఇద్దరికీ ఒక అమూల్యమైన అవకాశం అని అన్నారు. రోగులను ఎప్పుడు రిఫర్ చేయాలి, కొత్త చికిత్సా విధానాల ఏమున్నాయి వంటి అవసరమైన అంశాలను ఎలా నిర్వహించాలనేది తమ అభిప్రాయాల ద్వారా వెల్లడించారు.హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ భవిష్యత్తు హెర్ హెల్త్ ఆంకాలజీ కాంగ్రెస్ 2026 కాంగ్రెస్ ఓహియోలో జరుగుతుందని ప్రకటించారు. ఈ కార్యక్రం విజయానికి సహకరించిన అందరికీ ప్రియా కొర్రపాటి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మహిళల కోసం ఆంకాలజీ సంరక్షణను ముందుకు తీసుకెళ్లే మిషన్‌లో ముందుకు సాగడానికి ఇది స్ఫూర్తినిస్తుందని ఇప్పుడున్నఆంకాలజీని ముందుకు ముందుకు తీసుకెళ్ళటానికి కలిసి పనిచేద్దామనిఆమె పిలుపునిచ్చారు.

డాక్టర్ కావాలనుకుంది : భారతీయ విద్యార్థిని విషాదాంతం?!
డొమినికన్ రిపబ్లిక్లో కనిపించకుండాపోయిన భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయిందా అంటే అవుననే అనుమానాలు బాగా బలపడుతున్నాయి. గత వారం విహారయాత్రకు వెళ్లి కనిపించకుండా పోయిన పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయ విద్యార్థిని నీటిలో మునిగి మరణించి ఉంటుందని భావిస్తున్నట్టు అధికారులు ఆదివారం ధృవీకరించారని ఏబీసీ న్యూస్ తెలిపింది. ప్రమాదవశాత్తూ నీటిమునిగి ఉంటుందని పోలీసులు వెల్లడించినట్టు తెలిపింది. మార్చి 6వ తేదీ,తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఆరుగురు స్నేహితులతో రిసార్ట్‌కు వెళ్లినట్లు సమాచారం. ప్రస్తుతం పిట్స్బర్గ్ యూనివర్శిటీలో గ్రాడ్యుయేషన్ చదువుతున్న సుదీక్ష కోణంకి ఈ నెల 6న ప్రముఖ పర్యాటక పట్టణమైన వ్యూంటా కానా ప్రాంతానికి వెళ్లింది. అక్కడ బీచ్‌లో ఒక స్నేహితుడితో కలిసి ఈతకోసం వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో మిగిలిన స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ఆమె ఆచూకీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. దీంతో ఆమె బీచ్‌లో కొట్టుకుపోయి ఉంటుందని పోలీసులు భావించి సముద్రంలో గాలింపు చర్యలు చేపట్టారు. డ్రోన్లు, హెలికాఫ్టర్లతో గత నాలుగు రోజులుగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. భారతదేశానికి చెందిన సుదీక్ష తల్లిదండ్రులు రెండు దశాబ్దాల క్రితం అమెరికాకు వలస వెళ్లి అక్కడ శాశ్వత నివాస హోదా పొందారు. 20 ఏళ్ల నుంచి వర్జీనియాలో నివాసం ఉంటున్న సుదీక్ష కోణంకి పిట్స్బర్గ్ యూనివర్శిటీలోచదువుతోంది. తన కుమార్తె పిట్స్బర్గ్ విశ్వవిద్యాలయంలో ప్రీ-మెడికల్ స్టడీకి ముందు వెకేషన్కోసం పుంటా కానాకు వెళ్లిందని, స్నేహితులతో కలిసి రిసార్ట్‌లో పార్టీకి వెడుతున్నట్టు చెప్పిందని, అవే తనతో మాట్లాడిన చివరి మాటలని సుదీక్ష తండ్రి సుబ్బరాయుడు కోణంకి కన్నీటి పర్యంతమైనారు. తన బిడ్డ మెరిట్ స్టూడెంట్ అనీ, డాక్టర్ కావాలని కలలు కనేదని గుర్తు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో స్నేహితులను పోలీసులు ప్రశ్నించారని, ఎవరిపైనా ఎలాంటి అభియోగాలు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
క్రైమ్

గెలుపు ఎర వేస్తారు.. తర్వాత ఓడిస్తారు: వీసీ సజ్జనార్
సాక్షి, హైదరాబాద్: ‘బెట్టింగ్ యాప్స్ ప్రభావం ఎక్కువగా యువత పైనే ఉంటోంది. కేవలం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా అనేకమంది వీటికి బలవుతున్నారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు ఈ వ్యసనానికి బానిసలుగా మారుతున్నారు. మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కీమ్‌లకు భిన్నంగా ఈ బెట్టింగ్ యాప్స్ యువతనే టార్గెట్‌గా చేసుకుని దోచుకుంటున్నాయి. ఈ బెట్టింగ్ యాప్స్ ఎలాగైనా ఎదుటివాళ్లు ఓడిపోయే విధంగానే డిజైన్ చేసి ఉంటాయి. ఒకటీ రెండుసార్లు డబ్బు వచ్చినా అది కేవలం దోచుకోవడానికి ఎర అనే విషయం తెలుసుకోవాలి..’ అని సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆర్టీసీ ఎండీ విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ హెచ్చరించారు. బెట్టింగ్ యాప్స్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ పేరుతో సజ్జనార్ ప్రారంభించిన అవగాహన కార్యక్రమం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రాన్నీ కదిలించింది. తెలంగాణ సర్కారు వీటిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తోంది. గతంలో మల్టీ లెవల్ మార్కెటింగ్ దందాల పైనా ఇలానే పోరు కొనసాగించిన సజ్జనార్.. వాటికి సంబంధించి ప్రత్యేక చట్టం రావడానికి కారణమయ్యారు. తాజాగా బెట్టింగ్ యాప్స్‌పై యుద్ధం ప్రకటించిన ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. అవగాహన పెంచేందుకే ‘సే నో టు బెట్టింగ్ యాప్స్’ యువత ప్రాణాలు తీసుకోవడం కదిలించింది. బెట్టింగ్ యాప్‌ల బారినపడ కుండా వారిని కాపాడటం కోసం, వారిలో అవగాహన కల్పించడానికి ‘హ్యాష్ ట్యాగ్ సే నో టు బెట్టింగ్ యాప్స్’ ప్రారంభమైంది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల మంది సెర్చ్ చేశారు. క్యాంపెయినింగ్ మొదలైన తర్వాత ‘ఎక్స్’ను 1.2 కోట్లు మంది, ఇన్‌స్ట్రాగామ్‌ను 85 లక్షలు మంది వీక్షించారు. ప్రస్తుతం అనేక మంది సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లూయెన్సర్లతో పాటు ప్రముఖులు బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. వీళ్లు ఆయా ప్రకటనలు చేసేప్పుడు తదనంతర పరిణామాలను ఊహించలేదు. ఇలాంటి వాటిని ప్రోత్సహించడం సైబర్ టెర్రరిజం కిందికే వస్తుంది. మన పోలీసులు ఆది నుంచీ ముందున్నారు సమాజంలో జరుగుతున్న వివిధ రకాలైన ఆర్థిక దోపిడీలను అడ్డుకోవడంలో మన పోలీసులు ఎప్పుడూ ముందుంటున్నారు. ఒకప్పుడు ఎంఎల్ఎం స్కామ్స్, ఆపై మైక్రో ఫైనాన్స్ దుర్వినియోగాలను పకడ్బందీగా కట్టడి చేశారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ వంతు వచ్చింది. అదే స్ఫూర్తితో ముందుకు వెళ్లి కేవలం పాత్రధారులనే కాదు సూత్రధారులకూ చెక్ చెప్పే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. చట్టాన్ని కూడా కఠినంగా అమలు చేయాలి. అన్నివర్గాల్లో అవగాహన కల్పించాలి. బెట్టింగ్ యాప్‌లను బ్యాన్ చేయడం, ప్రమోటర్లతో పాటు నిర్వాహకుల పైనా చర్యలు తీసుకోవడం అవసరం. ఈ బెట్టింగ్ ప్రకటనలను అనుమతించిన మీడియా ప్లాట్‌ఫామ్‌లూ బాధ్యత వహించేలా చేయాలి. లావాదేవీలను సులభతరం చేసే చెల్లింపు గేట్‌వేల లైసెన్స్‌లు రద్దు చేయాలి. అడ్డుకట్ట వేయకపోతే ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సిందే.. బెట్టింగ్ నెట్‌వర్క్‌లు విదేశాల నుండి పనిచేస్తుంటాయి. అందువల్ల వీరిని కనిపెట్టి, కట్టడి చేయడం కష్టసాధ్యమైన అంశం. అందువల్ల అంతా ముందుకు వచ్చి అందరిలోనూ అవగాహన కల్పించడం ద్వారా ఈ ఉచ్చు నుంచి యువతను తప్పించాలి. పోలీసులు సైతం ఎప్పటికప్పుడు బెట్టింగ్ దందాలపై అవరసమైన చర్యలు తీసుకుంటున్నారు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేస్తున్న ఇన్ఫ్లూయెన్సర్లు అనేక కుటుంబాలు కుప్పకూలడానికి కారణం అవుతున్నారు. ఆన్లైన్ బెట్టింగ్ ఆర్థిక ఉగ్రవాదంతో సమానం. ఇప్పటికైనా దీనికి అడ్డుకట్ట వేయకపోతే దానికి ఓ తరాన్ని ఫణంగా పెట్టాల్సి వస్తుంది. ఈ తరుణంలో అందరం కలిసి ముందుకు వెళితేనే మన సమాజాన్ని కబళిస్తున్న బెట్టింగ్ భూతానికి పూర్తి స్థాయిలో చెక్ పెట్టగలం. యువతరాన్ని రక్షించుకోగలం. తల్లిదండ్రుల అప్రమత్తతా కీలకం బెట్టింగ్ యాప్‌ల విషయంలో తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండాలి. ఈ భూతాన్ని పూర్తిగా పారద్రోలాలంటే తల్లిదండ్రుల సహకారం అనివార్యం. ప్రతి ఒక్కరూ తమ పిల్లల ఆన్లైన్ కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. సోషల్‌మీడియా వినియోగదారుల్లో 16–30 ఏళ్ల మధ్య వయసు్కలే ఈ యాప్‌ల టార్గెట్‌గా ఉంటున్నారు. ఇక తల్లిదండ్రులకు దూరంగా ఉంటున్న ఎందరో విద్యార్థులు తమ చదువుకు ఉద్దేశించిన డబ్బును బెట్టింగ్‌లో పోగొట్టుకుని విద్యకు దూరమైన ఉదంతాలు ఉన్నాయి. యువత అనేకమంది అప్పుల ఊబిలో చిక్కుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తరచుగా వెలుగులోకి వస్తున్నాయి. నిజానికి ఇవి ఆత్మహత్యలు కాదు.. బెట్టింగ్ యాప్స్, వాటిని ప్రమోట్ చేసే వాళ్లు చేసిన హత్యలు.

తల్లి ఫోన్ మాట్లాడలేదనే వేదనతో..
అన్నానగర్: గుజరాత్‌కు చెందిన అబిషా వర్మ (24). ఈమె తండ్రి చిన్నప్పుడే చనిపోయిన నేపథ్యంలో తల్లి మరో పెళ్లి చేసుకుని దుబాయ్‌లో ఉంటోంది. అబిషా వర్మ 22 ఏళ్ల వయస్సు వరకు తన తల్లితో కలిసి దుబాయ్‌లో నివసించింది, ఆమెకు చెన్నైలోని విమానాశ్రయంలో ఫ్లైట్ అటెండెంట్‌గా ఉద్యోగం వచ్చింది. దీంతో కుండ్రత్తూరు పక్కనే ఉన్న తిరుముడివాక్కం ప్రాంతంలోని ఓ ప్రైవేట్ అపార్ట్ మెంట్లో తన స్నేహితులతో కలిసి ఉంటూ రోజూ పని నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి వెళ్లేది. ఈ స్థితిలో గత కొన్ని రోజులుగా దుబాయ్ నుంచి వచ్చిన అభిషావర్మతో తన తల్లి ఫోన్లో మాట్లాడడం లేదని తెలుస్తుంది. దీంతో అబిషావర్మ తీవ్ర మనస్థాపానికి లోనై శనివారం తన తల్లి అబిషా వర్మకు పలుమార్లు ఫోన్ చేసేందుకు ప్రయతి్నంచింది. ఆమె నంబరు స్విచ్ ఆఫ్ రావడంతో అబిషా ఫ్యాన్‌కు ఉరివేసుకుని మరణించింది. ఆమె స్నేహితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కుండ్రత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇల్లరికం వచ్చిన భర్తను హత్య చేయించిన భార్య
నిజామాబాద్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని కట్టుకున్న భర్తను భార్య అంతమొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. బాన్సువాడ మండలం నాగారం గ్రా మానికి చెందిన అమృతం విఠల్ (38) అనే వ్యక్తి 20 ఏళ్ల కిత్రం సోమేశ్వర్ గ్రామంలోని మేనమామ కూతురు కాశవ్వను పెళ్లి చేసుకొని ఇల్లరికం వచ్చాడు. మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా, ఒక్కరికి పెళ్లి అయింది. విఠల్ భార్య కాశవ్వ నాగారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. విఠల్‌ను అంతమొందిస్తే ఏ గొడవా ఉండదని భావించిన కాశవ్వ అదే గ్రామానికి చెందిన అమృతం విఠల్(నిందితుడు), పుల్కంటి విఠల్‌కు విషయం తెలిపింది. శుక్రవారం రాత్రి విఠల్(మృతుడు)ను పొలం వద్దకు తీసుకెళ్లిన అమృతం విఠల్, పుల్కంటి విఠల్ అతిగా మద్యం తాగించి మెడకు టవల్‌తో గట్టిగా బిగించి, పైపులతో కొట్టి చంపారు. అనంతరం విఠల్ మృతదేహాన్ని కొల్లూర్ సబ్‌స్టేషన్ సమీపంలో బాన్సువాడ–బీర్కూర్ ప్రధాన రహదారిపై పడేసి వెళ్లారు. ఉదయం అటుగా వెళ్తున్న కొందరు చూసి పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి అన్న బింగి సాయిలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుడి భార్య కాశవ్వ, అమృతం విఠల్, పుల్కంటి విఠల్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా, విఠల్‌ను తామే హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారని సీఐ అశోక్ తెలిపారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు సీఐ పేర్కొన్నారు.

టెన్త్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురి అరెస్ట్
నకిరేకల్: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో మరో ఐదుగురిని శనివారం సాయంత్రం రిమాండ్‌కు తరలించామని నల్లగొండ జిల్లా నకిరేకల్ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఈ నెల 21న నకిరేకల్‌లోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఓ యువకుడు తెలుగు ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి సామాజిక మాద్యమాల్లో వైరల్ చేసిన విషయం విధితమే. ఈ ఘటనలో మొత్తం 12 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఈ నెల 23న చిట్ల ఆకాష్, బండి శ్రీను, గుడుగుంట్ల శంకర్, బ్రహ్మదేవర రవిశంకర్, ఓ బాలుడుని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. కేసు తదుపరి విచారణ అనంతరం శనివారం నకిరేకల్‌కు చెందిన పోగుల శ్రీరాముల, తలారి అఖిల్‌కుమార్, ముత్యాల వంశీ, పల్స అనిల్‌కుమార్, పళ్ల మనోహర్‌ను శనివారం రిమాండ్‌కు పంపామని, ఓ బాలుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. రిమాండ్ చేసినవారిలో ఇద్దరు కాంగ్రెస్, ఇద్దరు బీఆర్ఎస్, ఒకరు బీజేపీకి చెందిన వారుగా గుర్తించామని పేర్కొన్నారు.
వీడియోలు
Riyan Parag: మ్యాచ్ గెలిచినా సుఖం లేదు..!


పవన్, లోకేష్ పై అంబటి రాంబాబు అదిరిపోయే కవిత్వం


పరిటాల సునీత, శ్రీ రామ్ పై గోరంట్ల మాధవ్ ఫైర్


మీ అన్నగా చెప్తున్నా అన్న.. నీ మాటలు ఏమయ్యాయి పవన్ ?


మత్య్సకారుల సంక్షేమానికి గత YSRCP ప్రభుత్వం కృషి


ఫీజుల మోత.. మినిమం ముప్పై వేలు


సన్నబియ్యం చారిత్రాత్మకం


భారత్ బంగారు కొండ.. HSBC సంచలన రిపోర్ట్


పండగపూట సభలో బాబును ఛీ కొట్టిన జనం


భూకంపం విధ్వంసం నుంచి ఇంకా తేరుకోని మయన్మార్