ఐడీఎస్‌పీ బృందం పర్యటన
డయేరియా రోగుల నుంచి వివరాల సేకరణ
గోపాలపురం: ‘పల్లెల్లో పారిచోద్యం’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తకు బుధవారం వైద్యారోగ్య శాఖ, పంచాయతీ అధికారులు స్పందించారు. గోపాలపురం, పెద్దగూడెం, చిట్యాల, తొక్కిరెడ్డిగూడెం తదితర డయేరియా ప్రభావిత గ్రామాల్లో పారిశుధ్య పనులు వేగవంతం చేశారు. పెద్దగూడెం, ఉప్పరగూడెం గ్రామాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాలను యంత్రాల సాయంతో ట్రాక్టర్లు, లారీలపై డంపింగ్ యార్డుకు తరలించారు. వివిధ గ్రామాల్లో శానిటేషన్ పనులు చేపట్టారు. నాలుగు రోజులుగా డయేరియా కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం వల్ల కొత్త కేసులు నమోదు కాలేదని గోపాలపురం సీహెచ్‌సీ సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు తెలిపారు.
ఐడీఎస్‌పీ బృందం పర్యటన
అతిసారంతో సుమారు 30 మంది డయేరియా బారిన పడిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్ర ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్‌వైలెన్స్ ప్రోగ్రాం బృందం(ఐడీఎస్‌పీ) గోపాలపురం సీహెచ్‌సీని సందర్శించింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన వారి వివరాలు సేకరించి, బాధితుల ఇళ్లకు వెళ్లి ఆరా తీసింది. అతిసారానికి కారణాలు, పారిశుధ్యం, తాగునీరు వంటి అంశాలపై బృంద సభ్యులు ప్రజలతో మాట్లాడారు. గోపాలపురం, పెద్దగూడెం, వేళ్లచింతలగూడెం, చిట్యాల, గుడ్డిగూడెం, పెద్దాపురం గ్రామాల్లో స్థితిగతులను పరిశీలించారు. వీరి వెంట ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.చైతన్యరాజు, వైద్యారోగ్య, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఉన్నారు.
ఐడీఎస్‌పీ బృందం పర్యటన
ఐడీఎస్‌పీ బృందం పర్యటన
Comments
Please login to add a commentAdd a comment