సాక్షి, తిరుమల: భక్తుల నుంచి నగదు వసూలు చేసి కల్యాణోత్సవ టికెట్లు ఇవ్వడానికి ప్రయత్నించిన దళారీని తిరుమల టూ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పరంధామయ్య అనే వ్యక్తి జేఈవో కార్యాలయంలో తెలంగాణ ఎమ్మెల్యే సిఫార్సు లేఖపై రూ.10వేలకు రెండు కల్యాణోత్సవ టికెట్లు తీసి ఇవ్వడానికి ప్రయత్నం చేయగా.. విజిలెన్స్ అధికారులు గుర్తించారు. సిరిసిల్లకు చెందిన భక్తులకు కల్యాణోత్సవ టికెట్లు తీసి ఇస్తానని చెప్పి నగదు వసూలు చేసినట్లు తెలిసింది. టూ టౌన్ పోలీసులు కేసు విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment