
తిరుపతి: ఆఫ్రికల్ కాంగో గ్రే పారెట్ ఎట్టకేలకు తన యజమాని చెంతకు చేరింది. ఈ చిలుక గురించి శుక్రవారం సాక్షిలో ‘ఎచ ట నుంచి వచ్చెనో..’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. ఇది చూసిన మధురానగర్ వాసి జీవన్ ప్రకాష్‌రెడ్డికి ప్రాణం లే చి వచ్చినట్లైంది. చిలుక కథనం తాలూ కు క్లిప్పింగ్‌ను పలువురికి చూపిస్తూ దాని కోసం గాలించారు. ఆయన ఈ చిలుకను 3 నెలల క్రితం బెంగళూరులో రూ.36 వేలకు కొన్నారట! గురువారం ఇంటి వద్ద చిలుక తెరచి ఉన్న కిటికీలోంచి చిలుక తుర్రుమంది. దీనికోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం సాక్షిలో వచ్చిన చిలుక కథనంతో ఆయన మరోసారి అన్వేషించారు. ఎట్టకేలకు తన ఇంటికి అరకిలోమీటరు దూరంలోని ఓ ఇంట చెట్టు మీద ఉన్న చిలుకను కొందరి సాయంతో ప్రకాష్ గుర్తించారు. విజిల్ వేయడం ఆలస్యం..ఎగిరొచ్చి ఆయన చేతిపై వాలడం చూసి అందరూ ఆశ్చర్యచకితులయ్యారు!
Comments
Please login to add a commentAdd a comment