సాక్షి, తిరుపతి: తిరుమల ఘాట్ రోడ్డులో చిరుత సంచారం చేస్తోందని సమాచారం అందడంతో అటవీశాఖ అధికారులు కొత్త ప్రతిపాదనలు జారీ చేశారు. తిరుపతి అర్బన్ ఎస్పీ అన్బురాజన్, సీవీఎస్‌ఓ గోపినాథ్‌తో చర్చలు జరిపిన అనంతరం అటవీశాఖ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. వాటిలో... ఘాట్ రోడ్డులో సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ద్విచక్ర వాహనాలు, నడక దారిలో వచ్చే భక్తులను నిలిపి వెయ్యాలని నిర్ణయించారు. అంతేగాక ఈ దారిలో వాహనాల వేగం గంటకు 20 కిమీ మించకూడదని హెచ్చరికలు జారీ జేశారు.
ఈ సందర్భంగా సీవీఎస్‌ఓ గోపినాథ్ జెట్టి మాట్లాడుతూ.. తిరుమల వైల్డ్ లైఫ్ ఫారెస్ట్ కావడంతో జంతువుల సంచారం ఉంటుందని కావున ఆయా ప్రాంతాలలో భక్తులను అప్రమత్తం చేయడానికి సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాక ఆ ప్రాంతాంలో వాహనాల వేగాన్ని నియత్రించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment