351 మందిని విచారించి.. | forest officers murder case in chittoor district | Sakshi
Sakshi News home page

351 మందిని విచారించి..

Published Wed, Feb 24 2016 2:14 PM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

forest officers murder case in chittoor district

తిరుపతి: తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో 2013 డిసెంబర్ 15 న ఎర్రచందనం కూలీల దాడిలో అటవీ శాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ మృతి చెందారు. ఈ కేసు విషయంపై  బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టు లో విచారణ జరిగింది. ఈ విచారణలో దాడికి పాల్పడిన 287 మంది నిందితులను విడుదల చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన ఈ నిందితులు జైలులో ఉన్నారు. మరో 64 మంది బెయిలు పై ఉన్నారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపనందున కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు తీర్పు వెలవరించింది. నిందితులపై ఇతర కేసులు లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా హత్యకేసులో 351 మందిని కోర్టు విచారించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement