Red smugglers
-
ఎర్ర స్మగ్లర్లును వంద స్పీడ్‌లో టాస్క్ ఫోర్స్ ఛేజ్
-
వంద స్పీడ్‌లో టాస్క్ ఫోర్స్ ఛేజ్
సాక్షి, చిత్తూరు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీ, స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు 45 నిమిశాల పాటు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో ఇద్దరి నిందితులను అరెస్టు చేయగా 82దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని జవ్వాది మలైకు చెందిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 80 మందితో శేషాచలం లోని కాకులమాను వద్ద చెట్లని నరికి దాదాపు 30 కిలోమీటర్లు దుంగలను మోసుకుని ఏర్పేడు శ్రీ కళాశాల ప్రాంతం వద్ద ఈచర్ వాహనం లోకీ లోడ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడ కు చేరుకునే సమయానికి ఈచర్ వాహనం బయలు దేరింది. స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసులు మూడు వాహనాల్లో వెంబడించారు. ఒక దశలో టాస్క్ ఫోర్స్ వాహనాన్ని గుద్దే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా తిరుపతి చిత్తూరు హైవే లోని మల్లంగుంట చెక్ పోస్ట్ వద్ద బ్యారికేట్స్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ విధిలేని పరిస్థితులలో వేగాన్ని తగ్గించగా టాస్క్ ఫోర్స్ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపగలిగారు. వెంటనే డ్రైవర్ శంకర్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని తో పాటు కీలక వ్యక్తిగా బావిస్తున్న శివాజీ అనే వ్యక్తిని కూడా అరేస్ట్ చేశారు. లారీలోని దుంగలను స్వాధీనం చేసుకున్నారు. -
కనిపిస్తే కాల్చేయండి
-
రూటు మార్చిన ఎర్రదొంగలు
⇒ మదనపల్లె కేంద్రంగా అక్రమ రవాణా ⇒ బెంగళూరు, చెన్నైకి తరలుతున్న ఎర్రచందనం మదనపల్లె టౌన్ : జిల్లాలో ఎర్రచందనం దొంగలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కడికక్కడ దాడులు చేసి పెద్ద సంఖ్యలో ఎర్రకూలీలను, స్మగ్లర్లను అరెస్టు చేస్తున్నారు. కొంతమందిపై పీడీ యాక్టును సైతం నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఎర్రదొంగలు రూటు మార్చారు. మదనపల్లెను కేంద్రంగా చేసుకుని బెంగళూరు, చెన్నైకి ఎర్రచందనం దుంగలను గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్నారు. వారిని పట్టుకోవడంలో మదనపల్లె ఫారెస్టు అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మూడేళ్లలో ఒక్క కేసు కూడా నమోదుకాకపోవడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. పోలీసులు మాత్రం 72 మంది స్మగ్లర్లను అరెస్టుచేసి వారి నుంచి 13 వాహనాలు, 1490 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.4.16 కోట్లు ఉంటుందని అంచనా. గత నెల 5వ తేదీన నిమ్మనపల్లెలో 11 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేశారు. ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా, తిరుపతి, జిల్లేళ్ల మంద, కేవీపల్లె, కలకడ, రాయచోటి పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామీణులు, స్మగ్లర్లకు ఎర్రచందనం దుంగలను సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. గుర్రంకొండకు చెందిన కొందరు డ్రైవర్లు వాహనాలను సమకూర్చడంతోపాటు పైలెట్లుగా వ్యవహరిస్తూ మినీ లారీలు, సుమోల్లో పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడులకు ఎర్రచందనం తరలిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇటీవల వీరి కార్యకలాపాలు ఊపందుకున్నట్లు తెలిసింది. అధికారులు నిఘా పెంచినా దొంగలు ముందుగానే సమాచారం అందుకుని ఎప్పటికప్పుడు రూటు మారుస్తూ తమ వ్యవహారాన్ని చక్కబెట్టుకుంటున్నట్టు సమాచారం. ఇందుకు కొందరు అటవీశాఖ అధికారులు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎర్రచందనాన్ని పీలేరు మీదుగా చెన్నైకి తరలించేవారు. పోలీసు అధికారులు వరుస దాడులతోపాటు, ఎన్కౌంటర్లు చేయడంతో రూటుమార్చినట్టు తెలుస్తోంది. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఎఫ్ఆర్వో మాధవరావును వివరణ కోరగా స్మగ్లర్ల కదలికలపై నిఘా పెట్టామన్నారు. కర్ణాటకకు అక్రమంగా ఎర్రచందనం తరలిస్తున్నట్లు తమకు సమాచారం లేదని తెలిపారు. -
351 మందిని విచారించి..
తిరుపతి: తిరుపతి శేషాచల అటవీ ప్రాంతంలో 2013 డిసెంబర్ 15 న ఎర్రచందనం కూలీల దాడిలో అటవీ శాఖ అధికారులు శ్రీధర్, డేవిడ్ మృతి చెందారు. ఈ కేసు విషయంపై బుధవారం తిరుపతి మూడో అదనపు జిల్లా కోర్టు లో విచారణ జరిగింది. ఈ విచారణలో దాడికి పాల్పడిన 287 మంది నిందితులను విడుదల చేస్తూ కోర్టు తీర్పును వెల్లడించింది. కాగా అప్పటి నుంచి తమిళనాడుకు చెందిన ఈ నిందితులు జైలులో ఉన్నారు. మరో 64 మంది బెయిలు పై ఉన్నారు. ప్రాసిక్యూషన్ సరైన సాక్ష్యాధారాలు చూపనందున కేసును కొట్టివేస్తున్నట్టు కోర్టు తీర్పు వెలవరించింది. నిందితులపై ఇతర కేసులు లేకుంటే వారిని వెంటనే విడుదల చేయాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. దేశ చరిత్రలోనే మొదటిసారిగా హత్యకేసులో 351 మందిని కోర్టు విచారించింది. -
ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు రెడీ
- కలెక్టర్‌కు నివేదిక - టాస్క్‌ఫోర్స్ ఏఎస్పీ రత్న సాక్షి, చిత్తూరు: ఐదుగురు ఎర్రస్మగ్లర్లపై పీడీ యాక్టుకు సిద్ధం చేస్తూ కలెక్టర్‌కు నివేదించినట్లు టాస్క్ఫోర్సు ఏఎస్పీ రత్న తెలిపారు. కలెక్టర్ సంతకమే తరువాయి అన్నారు. వీరితోపాటు మరో ముగ్గురిపైనా పీడీయాక్టులు పెడుతున్నట్లు చెప్పారు. సోమవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. గతంలో మాదిరి కాకుండా పీడీ యాక్టును కఠినతరం చేశామన్నారు. పీడీయాక్టు నమోదైతే ఆరు నెలలకు తగ్గకుండా శిక్ష పడుతుందన్నారు. దీంతో పాత స్మగ్లర్లు స్మగ్లింగ్‌కు ముం దుకు వచ్చే అవకాశం తక్కువన్నారు. చైనాస్మగ్లర్ యాంగ్‌పింగ్‌ను విచారిస్తే మరిన్ని స్మగ్లింగ్ ముఠాలు బయటపడే అవకాశం ఉందన్నారు. దానిని బట్టి తదుపరి వ్యూహరచన ఉంటుందన్నారు. చెన్నై స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలను వ్వూహాత్మకంగా నిలిపివేసినట్లు ఆమె చెప్పారు. ఇప్పటికే వారి కుటుంబాలు అజ్ఞాతంలో ఉన్నాయన్నారు. కొన్ని రోజులు ఆగి దాడులు కొనసాగిస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో కఠిన చట్టాలు లేకపోవడం వల్లే ఎర్రచందన స్మగ్లింగ్ ను వెనువెంటనే అరికట్టే పరిస్థితి లేదన్నారు. జాతీయస్థాయిలో చ ట్టాలను కఠినతరం చేయాల్సి ఉందన్నారు. చట్టాలను సవరించి కఠిన చట్టాలు తీసుకువస్తే ఎర్రచందనం అక్రమ రవాణా ఆగిపోతుం దన్నారు. స్మగ్లర్లను పట్టుకోవడంతోపాటు చందనం అక్రమ రవాణా నేరమనే విషయంపై గ్రామాల్లో అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు, అటవీ సిబ్బంది కలిసి రేయింబవళ్లు కృషి చేస్తున్నట్లు రత్న చెప్పారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు సహకరించిన పోలీసు, అటవీ సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని ఆమె తెలిపారు. -
వేట ముమ్మరం
ఎర్ర స్మగ్లర్ల వేటలో సాయుధ పోలీసు బలగాలు చామలరేంజ్‌లో నాలుగు స్పెషల్ పార్టీలు వాహనాల తనిఖీ సాక్షి, చిత్తూరు: జిల్లాలోని చామల అటవీ ప్రాంతంలో పోలీసులపై స్మగ్లర్లు దాడికి దిగిన నేపథ్యంలో ప్రత్యేక పోలీసు బలగాలను భారీగా మోహరించారు. జిల్లా ఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో తలకోన అటవీ ప్రాంతంలోని చామల రేంజ్లో సాయుధ పోలీసులు కూంబింగ్ ముమ్మరం చేశారు. రెండు రోజుల క్రితం ఎర్రచందనం స్మగ్లర్లు, కూలీలు దాడికి దిగడంతో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన కూలీ మృతి చెందాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అటవీశాఖ సిబ్బందితో కలిసి విస్తృతంగా కూంబింగ్ చేపట్టారు. తలకోన అటవీ ప్రాంతంలో జరిగిన పోలీసు కాల్పులు, ఇక్కడ ఎన్కౌంటర్లో చనిపోయిన తమిళ కూలీ వివరాలను రెండు రోజులుగా తమిళనాడులోని తిరువణ్ణామలై, వేలూరు, సేలం ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. చిత్తూరు జిల్లా శేషాచలం కొండల్లో ఎర్రచందనం నరికేందుకు వస్తే కాల్చడానికీ వెనుకాడమనే సంకేతాలను పంపుతున్నారు. తద్వారా తమిళనాడు నుంచి ఎర్రచందనం నరికేందుకు వచ్చే కూలీల సంఖ్యను తగ్గించాలన్న యోచనలో పోలీసులు ఉన్నారు. కూంబింగ్‌కు నాలుగు పార్టీలు చామల అటవీ ప్రాంతంలో కూంబింగ్ కోసం నాలుగు స్పెషల్ పార్టీలను మోహరించారు. ఒక్కో పార్టీలో 15 నుంచి 20 మంది సాయుధ పోలీసులు ఉన్నారు. వీరు 24 గంటలూ అడవిలో స్మగ్లర్ల కోసం వేట సాగిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని విచారిస్తున్నారు. తమిళనాడు స్మగ్లర్లకు దట్టమైన అటవీ ప్రాంతంలోకి వెళ్లేందుకు మార్గం ఎవరు చూపుతున్నారనే అంశంలోనూ పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. స్థానికులు ఏమైనా సహకరిస్తున్నారా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతోంది. చెక్‌పోస్టుల్లో ప్రత్యేక నిఘా తమిళనాడు నుంచి వేలూరు మీదుగా చిత్తూరు జిల్లాలోకి ప్రవేశించే అన్ని మార్గాల్లో నిఘా పెంచారు. ఎన్కౌంటర్ జరిగిన రోజు నుంచి తమిళనాడు బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయివేట్ వాహనాల్లో ప్రయాణించేవారిలో అనుమానాస్పదంగా ఉన్న వారిని విచారిస్తున్నారు. పీలేరు పోలీసు సర్కిల్లో రాత్రి సమయాల్లో ప్రయాణించే ప్రతి వాహనాన్నీ తనిఖీ చేస్తున్నారు. అటవీ సమీప ప్రాంతాల నుంచి ప్రధాన రహదారుల్లోకి రాత్రి పూట వచ్చే వాహనాలను జల్లెడపడుతున్నారు. ఎర్రచందనం అక్రమంగా తరలిపోతున్న మార్గాలపై మదనపల్లె డీఎస్పీ, పలమనేరు డీఎస్పీ ప్రత్యేక దృష్టిసారించారు.