ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీ, స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు 45 నిమిశాల పాటు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో ఇద్దరి నిందితులను అరెస్టు చేయగా 82దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని జవ్వాది మలైకు చెందిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 80 మందితో శేషాచలం లోని కాకులమాను వద్ద చెట్లని నరికి దాదాపు 30 కిలోమీటర్లు దుంగలను మోసుకుని ఏర్పేడు శ్రీ కళాశాల ప్రాంతం వద్ద ఈచర్ వాహనం లోకీ లోడ్ చేశారు.