
సాక్షి, చిత్తూరు : ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న లారీ, స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు 45 నిమిశాల పాటు ఛేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇందులో ఇద్దరి నిందితులను అరెస్టు చేయగా 82దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ అశోక్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం తమిళనాడులోని జవ్వాది మలైకు చెందిన ఇద్దరు వ్యక్తులు నాలుగు రోజుల క్రితం 80 మందితో శేషాచలం లోని కాకులమాను వద్ద చెట్లని నరికి దాదాపు 30 కిలోమీటర్లు దుంగలను మోసుకుని ఏర్పేడు శ్రీ కళాశాల ప్రాంతం వద్ద ఈచర్ వాహనం లోకీ లోడ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, అక్కడ కు చేరుకునే సమయానికి ఈచర్ వాహనం బయలు దేరింది. స్మగ్లర్లను పట్టుకోవడానికి పోలీసులు మూడు వాహనాల్లో వెంబడించారు.
ఒక దశలో టాస్క్ ఫోర్స్ వాహనాన్ని గుద్దే ప్రయత్నం చేశాడు. అయితే పోలీసులు చాకచక్యంగా తిరుపతి చిత్తూరు హైవే లోని మల్లంగుంట చెక్ పోస్ట్ వద్ద బ్యారికేట్స్ ఏర్పాటు చేశారు. డ్రైవర్ విధిలేని పరిస్థితులలో వేగాన్ని తగ్గించగా టాస్క్ ఫోర్స్ వాహనాన్ని అడ్డుపెట్టి ఆపగలిగారు. వెంటనే డ్రైవర్ శంకర్ కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా, పట్టుకొని అరెస్ట్ చేశారు. అతని తో పాటు కీలక వ్యక్తిగా బావిస్తున్న శివాజీ అనే వ్యక్తిని కూడా అరేస్ట్ చేశారు. లారీలోని దుంగలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment