శ్రీకాళహస్తి కొత్తపేట వద్ద బారికేడ్లు ఏర్పాటు
చిత్తూరు: జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. శుక్రవారం నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 28కు చేరుకుంది. రెండు రోజుల్లో శ్రీకాళహస్తికి చెందిన ఐదుగురికి కరోనా ఉన్నట్లు నిర్ధారౖణెంది.
శ్రీకాళహస్తిలో సర్వత్రా అప్రమత్తం
శ్రీకాళహస్తిలో గురువారం ఒక్క రోజే ఐదు పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. రెడ్‌జోన్లను పెంచి ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి జనసంచారం లేకుండా చేశారు. కొత్తపేట, పీవీరోడ్డు, పాత బస్టాండు, నగాచిపాలెం, పూసలవీధి, హిమామ్‌వీధి, జానుల్లా వీధి, మరాఠిపాలెం, పెద్దమసీదు వీధి, జెండావీధి, గాండ్లవీధి ప్రాంతాలను కూడా రెడ్‌జోన్లుగా ప్రకటించారు. గురువారం పాజిటివ్ వచ్చిన వారిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. గత నెలలో ఢిల్లీ జమాజ్‌కు హాజరై వచ్చిన ఒకరికి, అతనితో కాంటాక్టుగా మరో ఇద్దరికి పాజిటివ్ వచ్చింది. అదే బృందంలో మరో వ్యక్తి భార్యకు, ఆమె నుంచి మరో మహిళకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చి న వారిని ఐసోలేషన్‌కు తరలించారు.
వీరిలో నలుగురు క్వారంటైన్‌లో ఉండగా, ఒక్కరిని మాత్రం ఇంటి వద్ద నుంచి ఐసోలేషన్‌కు తరలించారు. వీరితో కలిసిన మొత్తం 50 మందికి శుక్రవారం రక్తనమూనాలు సేకరించి, వారిని వికృతమాలలోని క్వారంటైన్‌కు తరలించేందు కు ప్రయత్నించగా అంగీకరించలేదు. గతంలో క్వారంటైన్‌లో ఉండి వచ్చిన 29 మందిని కూడా మళ్లీ ఒకసారి వైద్యపరీక్షలు నిర్వహించేందుకు క్వారంటైన్‌కు తరలించేదుకు సన్నద్ధమవుతున్నారు. వరదయ్యపాళెం క్వారంటైన్‌లో ఉన్న వారిని కూడా ఏర్పేడు మండలంలోని వికృతమాల క్వారంటైన్‌కు తరలిస్తున్నారు.
అందుబాటులోకి రుయా కోవిడ్ ల్యాబ్
తిరుపతి తుడా : జిల్లాలో కరోనా వైరస్‌ను సమూలంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ నారాయణభరత్ గుప్త తెలిపారు. శుక్రవారం వైద్యాధికారులతో కలసి కలెక్టర్ రుయాలోని కోవిడ్ ల్యాబ్ ట్రయల్ రన్‌ను పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ కోవిడ్ వైద్య పరీక్షల కోసం రుయాలో అత్యాధునిక ల్యాబ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. వికృతమాల గృహ సముదాయాన్ని క్వారంటైన్ సెంటర్‌కు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 300 పడకలతో క్వారంటైన్ ప్రారంభమైందన్నారు.
ఇంకా 75 బ్లాకుల్లో 1,800 గృహాలు ఉన్నాయని తెలి పారు. క్వారంటైన్‌లోని బాధితులకు అన్ని వసతులు కలి్పస్తున్నామని చెప్పారు. జేసీ–2 చంద్రమౌళి, తిరుపతి ఆర్డీఓ కనకనరసారెడ్డి, తుడా సెక్రటరీ లక్షి్మ, రుయా అభివృద్ధి కమిటీ వర్కింగ్ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్, సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్‌వీ రమణయ్య పాల్గొన్నారు.
జిల్లా ఆస్పత్రికి 5 ట్రూనాట్ మిషన్లు
చిత్తూరు కార్పొరేషన్: జిల్లా ఆస్పత్రికి ఐదు ట్రూనాట్ మిషన్లు కేటాయించారు. వీటిని శుక్ర వారం డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, జిల్లా క్షయ నివా రణాధికారి రమేష్‌బాబు ప్రారంభించారు. జిల్లాలో 17 ట్రూనాట్ మిషన్లు పెట్టామని, ఒక మిషన్ ద్వారా 20 స్వాబ్స్ పరీక్షలు చేయవచ్చ ని, గంటలో ఫలితాలు వస్తాయని తెలిపారు.
113 మందికి టెస్ట్‌లు
పలమనేరు: పలమనేరు పట్టణంలో కరోనా పాజిటివ్ వచ్చిన ముగ్గురితో పరిచయమున్న 113 మందిని గుర్తించి శుక్రవారం స్వాబ్ టెస్టులకు కోవిడ్ పరీక్ష నిర్ధారణ కేంద్రానికి తరలించినట్టు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. పట్టణానికి చెందిన ముగ్గురు పాజిటివ్‌తో తిరుపతిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
సదుంలో 49 మంది..
సదుం: సదుం, సోమల మండలాల్లోని 49 మంది కోవిడ్–19 అనుమానితులకు సదుం ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రక్త నమూనాలు సేకరించారు. సదుం మండలం చెరుకువారిపల్లె పీహెచ్‌సీ పరిధిలో 33 మందికి, సోమల పీహెచ్‌సీ పరిధిలోని 16 మంది నమూనాలు సేకరించినట్టు డాక్టరు భారతి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment