
దాహం తీరకపోగా తల బిందెలో ఇరు క్కుపోవడంతో వదిలించుకోవడానికి ఓ శునకం నానా పాట్లు పడింది. బెరెడ్డిపల్లె మండలం దేవదొడ్డి–దాసార్లపల్లె రహదారిలోని తీర్థం సమీపంలో ఆదివారం ఓ శునకం ప్లాస్టిక్ బిందెలోని నీటిని తాగేందుకు ప్రయత్నించడంతో తల ఇరుక్కుపోయింది. బిందెను విదిలించుకోవడానికి పడిన అవస్థలు వర్ణనాతీతం. చివరకు రహదారి పక్కనే ఉన్న చెట్టును తలపై ఉన్న బిందెతో కొట్టుకుంటూ పగులకొట్టింది. ఉక్కిరిబిక్కిరి అయిన శునకానికి ఊపిరి ఆడడంతో పొలం గట్లపైకి వెళ్లింది. – బైరెడ్డిపల్లె