
ఎండిన వరినారుమడి
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్‌కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది.
అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు.
సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్‌లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు.
చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment