enemy
-
శాంతమే సౌఖ్యం..
తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్షాకవచంగా నిలుస్తుందని సుమతీ శతకకారుని సుధామయ ప్రబోధం.. శాంతం అనేది మానవులు అలవోకగా, అలవాటుగా అలంకరించుకోవలసిన గొప్ప ఆభరణం. క్రోధం కలిగినపుడు మనలో ప్రజ్వరిల్లే తక్షణ ఆవేశానికి లోను కాకుండా మదిని శాంతపర్చుకోవడం ఎంతైనా అవసరం. శాంతాన్ని ఆశ్రయించిన అతికొద్ది నిమిషాల్లోనే మనలోని వివేకం మేలుకొంటుంది.జంతుజాలానికీ, మనకూ ఉన్న భేదమే శాంతాన్ని కలిగించే వివేకం. జంతుకోటికి శాంతం వహించడం అంత సాధ్యం కాదు. వాటికి పక్కనే ఉన్న జంతువులతో తేడా వస్తే, ముందుగా గుర్తుకు వచ్చేది పోరాటం. తమను బాధపెట్టిన జంతువు బలాన్ని బేరీజు వేసుకుంటాయి. వాటితో పోరాటానికి సిద్ధమవుతాయి. అదే జంతువు బలం ఎక్కువైతే, అప్పటికప్పుడే పలాయనం చిత్తగిస్తాయి. వాటికి ఉన్న వివేకసంపద పరిమితి అంతే. కానీ, జంతుకోటికి భిన్నంగా జనించి, సమస్త జీవకోటిలోనూ అత్యంత తెలివైనవాడైన మానవుడు కోపంతోనూ, క్రోధంతోనూ చరించరాదు. బహుళ ప్రయోజనకరమైన శాంతాన్ని అన్నివేళలా ఆశ్రయించాలి. రంగస్థలంమీద పాత్రధారులు నవరసాలను పోషించి, అలరిస్తారు. అవి వరుసగా– శృంగారం, వీరం, కరుణ, అద్భుతం, హాస్యం, భయానకం, భీభత్సం, రౌద్రం, శాంతం. ఈ రసాల్లో హృదయానికి ఎటువంటి ఉద్వేగాన్ని కలగనీయకుండా అలరించే ఏకైక రసం శాంతరసం. రంగస్థలం మీద కొందరే పాత్రధారులుంటారు. జీవన రంగస్థలం మీద మానవులంతా పాత్రధారులే. అంటే, ఒకరితో ఒకరు ఏదో ఒక పనిమీద సంభాషించుకుంటూ ఉంటారు, కార్యకలాపాలను నెరపుతూ ఉంటారు. అటువంటి కార్యాలకు జయాన్ని సిద్ధింపజేయడంలో శాంతం ప్రధానపాత్ర పోషిస్తుంది. అనవసరంగా కేకలు పెడుతూ, హడావుడి చేసే మనిషి దగ్గరకు చేరడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రశాంత చిత్తంతో, శాంతంతో మాట్లాడే వారి దగ్గరకు అందరూ చేరతారు. తీయగా మాట్లాడే అటువంటి వ్యక్తులకు ఏ రంగంలోనైనా జయాన్ని సాధించే అవకాశమూ మిగిలినవారితో పోలిస్తే బాగా ఎక్కువే..!! శాంతికరమైన వ్యవహారశైలి సొంతమైన వీరు జీవితంలో ఎంతగానో సుఖిస్తారు, వారితో చరించేవారినీ ఆనందపరుస్తారు. అత్యుత్తమమైన శాంత గుణానికున్న ప్రత్యేకతను తేటపరుస్తూ,‘‘శాంతములేక సౌఖ్యము లేదు’’ అన్నాడు వాగ్గేయకారుడు త్యాగయ్య.అయితే.. మనం ఆలోచించవలసిన ప్రశ్న ఒకటుంది. మనిషికి శాంతమనేది ఏ రకంగా లభిస్తుంది? కొంతమందికి అందమైన భార్య, ప్రయోజకులైన సంతానం, కావలసినంత సంపద.. ఈ విధంగా అన్నీ అమరినట్లే ఉంటాయి. కానీ, జీవితంలో మాత్రం నిరంతరం వారికి ఏదో అసంతృప్తి, అశాంతి..!! దానికి కారణం ఒక్కటే.. తాను కోరుకునే వస్తువులు, లేదా సుఖాల మీద అంతులేని వ్యామోహం నీడలా వెన్నాడడమే..!! మనిషిని సర్వకాల సర్వావస్థల్లో శాంతపరచేది తృప్తి మాత్రమే..!!ఆనందకరమైన మానవ జీవనానికి నిత్య వసంతాన్ని నింపే ఆమని.. శాంతమనే సంజీవని..పరిస్థితులవల్ల వచ్చిన ఉద్వేగాలకూ, ఉద్రేకాలకూ లోను కాకుండా స్వభావానికి దగ్గరగా ఉండడమే శాంతంగా వర్తించడమనే నిర్వచనం చెప్పుకోవచ్చు’’ ఇదీ ఓ ఆంగ్ల సిద్ధాంతకర్త వాక్కు. వినగానే, ఒకింత కఠినమైన సూత్రంగా ఈ వాక్యం అనిపించినా, అంతర్లీనమైన భావం మాత్రం సర్వకాల సర్వావస్థల్లో శాంతియుతంగా మానవులను ప్రవర్తించమన్నట్లుగా, శాంతంగా ఎదుటివారితో వర్తించమన్నట్లుగా భావించాలి.ఇంద్రియాలను జయించినవాడికైనా, సకల శాస్త్రాలను క్షుణ్ణంగా చదివినవాడికైనా శాంతగుణం అవసరమే. ధన కనక వస్తు వాహనాలెన్ని ఉన్నా, భోగభాగ్యాల్లో తేలియాడామని తలపోసినా, మనిషి ప్రశాంతచిత్తుడు కాకపోతే, అతనికి కలిగే ‘ప్రయోజనం సున్నా’. ఇది వాస్తవం. స్వప్రయోజనాల కోసమో, పదవుల కోసమో వెంపర్లాడుతూ పంచకళ్యాణిలా పరుగెత్తే ఆశలతో సతతమూ నలిగిపోయే వాళ్లకు శాంతమనేది ఒక అందని ద్రాక్ష. జీవితకాలంలో వాళ్లు ఎప్పుడూ స్థిమితంగా ఉండరు. మరొకరిని ఉండనివ్వరు. ఏదో ఒక రూపంలో అసహనం, అశాంతి వాళ్లకు చుట్టంలా చుట్టుకుని ఉంటుంది. పక్కవాళ్లకూ వీళ్ళ సాహచర్యం ఒకింత భరింపరానిదిగానే ఉంటుంది. – వెంకట్ గరికపాటి‘‘వ్యాఖ్యాన విశారద’’ -
PM Narendra Modi: కుటుంబ పార్టీలు రాజ్యాంగానికి శత్రువులు
జమ్మూ: కుటుంబ పార్టీలైన కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ(పీడీపీ) భారత రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. ఓటు బ్యాంక్ కోసం సమాజంలో అణగారిన వర్గాల హక్కులను కాలరాశాయని, రాజ్యాంగ స్ఫూర్తిని హత్య చేశాయని నిప్పులు చెరిగారు. ఆ మూడు పార్టీలు జమ్మూకశ్మీర్‌కు తీవ్ర గాయాలు చేశాయని ఆరోపించారు. జమ్మూకశీ్మర్ ప్రజలు తమ బిడ్డల బంగారు భవిష్యత్తు, శాంతి కోసం అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం లేని మంచి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. శనివారం జమ్మూలోని ఎంఏఎం స్టేడియంలో ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు కుటుంబ పార్టీలకు గట్టిగా బుద్ధి చెప్పాలని ఇక్కడి ప్రజలు నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. అవినీతి, అక్రమాలు, అరాచకాలు, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను జనం కోరుకోవడం లేదని తేలి్చచెప్పారు. బీజేపీ ప్రభుత్వం రావాలన్నదే వారి ఆకాంక్ష అని స్పష్టంచేశారు. మొదటి రెండు దశల పోలింగ్ ఓటర్ల మనోగతాన్ని ప్రతిబింబిస్తోందని వెల్లడించారు. బీజేపీ పూర్తి మెజార్టీతో సొంతంగా అధికారంలోకి రావడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. పాకిస్తాన్ భాషలో మాట్లాడుతున్న కాంగ్రెస్‌ను ప్రజలు క్షమిస్తారా అని మోదీ ప్రశ్నించారు. హరియాణాలో కాంగ్రెస్ వస్తే అస్థిరతే: మోదీ హిస్సార్: హరియాణాలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అస్థిరత తప్పదని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఆ పార్టీలో అంతర్గత పోరాటం సాగుతోందని, ముఖ్యమంత్రి పదవి కోసం నేతలంతా పోటీ పడుతున్నారని చెప్పారు. బాపు(భూపీందర్ సింగ్), బేటా(దీపేందర్ సింగ్) పోటీలో ఉన్నారని తెలిపారు. శనివారం హరియాణాలోని హిసార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడారు. -
తన కోపమె తన శత్రువు
కోపం తెచ్చుకోవటం అంటే ఎవరో చేసిన తప్పుకి తనను తాను శిక్షించుకోవటం అని ఒక ఆంగ్ల సామెత ఉంది. దీనికి సమానార్థకంగా తెలుగులో కూడా ఒక సామెత ఉంది. ‘‘ఏ కట్టెకి నిప్పు ఉంటే ఆ కట్టే కాలుతుంది’’ అని. ఆలోచిస్తే రెండు ఎంత నిజమో కదా అనిపించక తప్పదు. సుమతీ శతకకారుడు కూడా అదే విషయాన్ని నిర్ధారించాడు – ‘‘తన కోపమె తన శత్రువు’’ అని. గొప్ప గొప్ప శాస్త్రీయమైన సత్యాలని సామాన్యమైన మాటల్లో అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పటం అన్ని సమాజాలలో ఉన్న పెద్దలు చేసిన పని. వారికి రాబోయే తరాల మీద ఉన్న ప్రేమకి అది నిదర్శనం. గమనించండి! కోపం తెప్పించిన వారిని కానీ, పరిస్థితులని కానీ ఎవరైనా మార్చ గలరా? కో΄ానికి కారణమైన వారు బాగానే ఉంటారు. సమస్య కోపం తెచ్చుకున్న వారిదే. ఎవరికైనా కోపం ఎందుకు వస్తుంది? తనని ఎవరయినా తప్పు పట్టినా, నిందించినా, దెబ్బకొట్టినా (శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, భావోద్వేగాలపరంగా, సామాజికంగా), తాను అనుకున్నది సాధించలేక ΄ోయినా ఇలా ఎన్నో కారణాలు. ఒక్క క్షణం ఆలోచించండి! వీటిలో ఏ ఒక్కటి అయినా మన అధీనంలో ఉన్నదా? లేనప్పుడు అనవసరంగా ఆయాస పడటం ఎందుకు? కోపపడి, ఆవేశ పడితే ఎడ్రినల్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. దానివల్ల ముందుగా శరీరంలో ఉన్న శక్తి అంతా ఖర్చు అయి΄ోతుంది. కోపంతో ఊగి΄ోయినవారు తగ్గగానే నీరసపడటం గమనించ వచ్చు. ఇది పైకి కనపడినా లోపల జరిగేది జీవప్రక్రియ అస్తవ్యస్తం కావటం. దానికి సూచనగా కళ్ళు ఎర్ర బడతాయి. కాళ్ళు చేతులు వణుకుతాయి, మాట తడబడుతుంది. ఆయాసం వస్తుంది. రక్త ప్రసరణలో మార్పు తెలుస్తూనే ఉంటుంది. పరీక్ష చేసి చూస్తే రక్త ΄ోటు విపరీతంగా పెరిగి ఉంటుంది. ఇది తరచుగా జరిగితే ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తక తప్పదు. కోపం తెప్పించిన వారు మాత్రం హాయిగా ప్రశాంతంగా ఉంటారు. కో΄ాన్ని వ్యక్త పరిస్తే వచ్చే వాటిలో ఇవి కొన్ని. లోపలే అణుచుకుంటే వచ్చేవి మరెన్నో! ఎసిడిటీ, విరేచనాలు, మలబద్ధకం నుండి మధుమేహం, గుండె ΄ోటు వరకు. తాను చేయని తప్పుకి ఈ శిక్ష ఎందుకు? మరేం చేయాలి? ఆలోచించి, కోపకారణాన్ని తెలుసుకోవాలి. మనని ఎవరైనా తప్పు పడితే – అది నిజంగా త΄్పా? కాదా? అని తెలుసుకోవాలి. తప్పు అయితే సరిదిద్దుకోవాలి. (ఎత్తి చూపినవారికి మనసులోనైనా కృతజ్ఞతలు తెలుపుకుంటూ) తప్పు కాక΄ోతే, మనకి అనవసరం. అనుకున్నది సాధించ లేక తన మీద తనకే కోపం వస్తే, చేయలేక ΄ోవటానికి ఉన్న కారణాలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఈ రకమైన విశ్లేషణ చేయటానికి మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవటం అవసరం. అందుకే అంటారు ఆవేశంలో నిర్ణయాలు తీసుకో కూడదు అని. మానవ మాత్రులం కనక కోపం రావటం సహజం. కానీ దానిని అదుపులో ఉంచుకుని, దానినే ఆయుధంగా ఉపయోగించుకుంటే అదే ఉపకరణంగా మారి లక్ష్యసాధనకి సహకరిస్తుంది. శ్రీరామచంద్రుడు కో΄ాన్ని అదుపులో ఉంచుకున్నాడు. అది ఆయన చెప్పు చేతల్లో ఉంది. రమ్మంటే వస్తుంది. ΄÷మ్మంటే ΄ోతుంది. అందుకే ఆయనని ‘జితక్రోధుడు’ అన్నాడు వాల్మీకి. అవసరానికి కోపం వచ్చినట్టు కనపడాలి. దాని ప్రయోజనం దానికీ ఉంది. పిల్లలు అల్లరి చేస్తుంటే తల్లి కేకలు వేస్తుంది. అమ్మకి కోపం వచ్చింది అనుకుంటారు. నిజానికి అది కోపమా? ఇంతలో అత్తగారో, భర్తో పిలిస్తే మామూలుగానే మాట్లాడుతుంది. అమ్మవారి చేతిలో క్రోధము అనే అంకుశం ఉంది అని లలితారహస్యనామసాహస్రంలో ఉంది. అంటే తన అశక్తత మీద కోపం తెచ్చుకుని అనుకున్నది సాధించాలి అని అర్థం. ఇది కో΄ాన్ని ఆయుధంగా వాడటం. శత్రువుని సాధనంగా మలచుకుని ముల్లుని ముల్లుతోనే తీయటం. – డా.ఎన్. అనంతలక్ష్మి -
సినిమా తరహా ఘటన.. హంతకుల పేర్లు పచ్చబొట్టు
ముంబై: నగరంలో సినిమా తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. స్పాలో హత్యకు గురైన ఓ వ్యక్తి ఒంటిపై వేయించుకున్న పచ్చబొట్లు హంతకులను పట్టించాయి. ముంబైలోని గురు వాఘ్మారే అనే వ్యక్తి తనకు 22 మంది వ్యక్తుల నుంచి ప్రాణహాని ఉందంటూ వారి పేర్లను శరీరంపై పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ క్రమంలో నిజంగానే ఆ వ్యక్తిని స్పా సెంటర్లో దుండగులు హత్య చేశారు. పోలీసులు మృతదేహం స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిర్వహించగా.. మృతుడి ఒంటిపై ఉన్న పచ్చబొట్టులో 22 మంది పేర్లను గుర్తించారు. వారిలో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే స్పా యజమాని సంతోష్ షెరేకర్తో పాటు హత్యకు సహకరించిన మరో ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్టు చేశారు.యూపీఐ రికార్డులో అతని పేరు మహమ్మద్ ఫిరోజ్ అన్సారీగా పోలీసులు గుర్తించారు. అన్సారీ యూపీఐ ఐడీకి లింకయిన ఫోన్ నంబర్‌కి షెరేకర్ పలుమార్లు ఫోన్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. అన్సారీ బుధవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో స్పాలోకి ప్రవేశించి, వాఘ్మారే గర్ల్ ఫ్రెండ్‌ను మరొక గదిలోకి తీసుకెళ్లారు. అనంతరం కత్తెర, బ్లేడ్లను ఉపయోగించి వాఘ్మారేను హత్య చేశారు.వాఘ్మారే గర్ల్‌ఫ్రెండ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ హత్య వెలుగులోకి వచ్చింది. కాగా వాఘ్మారే సామాజిక కార్యకర్తగా చెప్పుకుంటూ 2010 నుంచి ముంబై, నవీ ముంబై, థానే, పాల్ఘర్లోని పలువురు స్పా యజమానుల నుంచి డబ్బు వసూలు చేసేవాడని, అతనిపై దోపిడీ, అత్యాచారం, వేధింపుల క్రిమినల్ కేసులు నమోదయినట్లు పోలీసులు వెల్లడించారు. -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్‌లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
తెలంగాణ శత్రుదేశమా? కేంద్రం వైఖరిపై మంత్రి కేటీఆర్ ధ్వజం
ఏజీవర్సిటీ (హైదరాబాద్): కేంద్ర ప్రభుత్వం తెలంగాణను శత్రుదేశంగా చూస్తోందని, రాజకీయంగా పడనందునే మనల్ని అనేక ఇబ్బందులకు గురిచేస్తోందని ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కేంద్రం ఎంత ఇబ్బంది పెట్టినా దేశంలో అభివృద్ధిలో మనమే టాప్‌లో నిలిచామని చెప్పారు. కరోనాతో రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల నష్టం వచి్చందని, అయినా ఎక్కడ కూడా అభివృద్ధి ఆగలేదన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. కేటీఆర్ శుక్రవారం రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కార్మిక మంత్రి మల్లారెడ్డిలతో కలిసి జాతీయ పంచాయతీ అవార్డులను ప్రదానం చేశారు. దేశంలో 70 శాతం ప్రజలు పల్లెల్లోనే జీవిస్తున్నారని తెలంగాణలో పల్లె ప్రగతి కోసం రూ.14,232 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. కేంద్రం నిధులు ఇవ్వకున్నా గ్రామ పంచాయతీలకు రూ.1,300 కోట్లు ఈ రోజే విడుదల చేస్తున్నామన్నారు. ఇంకా రూ.250 కోట్లు ఇవ్వాల్సి ఉందని గ్రామీణాభివృద్ధి అధికారులు చెబుతున్నారని, త్వరలోనే వాటినీ విడుదల చేస్తామని స్పష్టంచేశారు. మొత్తం 12,769 పంచాయతీలకు కొత్త కంప్యూటర్లు ఇస్తామని చెప్పారు. జిల్లాస్థాయిలో అవార్డులు సాధించిన పంచాయతీలకు రూ.10 లక్షలు, రాష్ట్రస్థాయిలోని వాటికి 20 లక్షలు, జాతీయస్థాయిలోని వాటికి రూ. 30 లక్షలు నజరానా ఇవ్వాలని మంత్రి ఎర్రబెల్లికి సూచించారు. అభివృద్ధి ఆగొద్దు... పంచాయతీ సర్పంచ్‌లు, కార్యదర్శులు కష్టపడినందునే మనకు ఉత్తమ గ్రామ పంచాయతీలుగా జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయని, ఈ అభివృద్ధి ఆగకుండా నిరంతరం కొనసాగాలని కేటీఆర్ చెప్పారు. ప్రతీ గ్రామ పంచాయితీ ఉత్తమ పంచాయతీగా అవార్డు సాధించాలని ఆకాంక్షించారు. తెలంగాణలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని పల్లెలు, పట్టణాలు సమానంగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇది ముఖ్యమంత్రి కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు. ఇప్పటివరకు మనకు 79 జాతీయ అవార్డులు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు మన తలసరి ఆదాయం రూ.1,24,000 ఉండగా, 2023 మార్చి నాటికి రూ.3,17,000గా ఉందని చెప్పారు. ఇది తాను చెబుతున్న మాట కాదని సర్వేల్లో వెల్లడైందని తెలిపారు. సీఎస్డీఎస్ అనే సంస్థ దేశంలోని 13 రాష్ట్రాల్లో సర్వే చేస్తే.. తలసరి ఆదాయంలో తెలంగాణ ఫస్ట్ ఉందని, అవినీతిలో చివరిగా ఉందని తేలిందన్నారు. అనంతరం గ్రామ పంచాయితీల అభివృద్ధిపై రూపొందించిన బుక్‌లెట్‌ను కేటీఆర్ విడుదల చేశారు. జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయిలో అవార్డులకు ఎంపికైన పంచాయితీలకు అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, అధికారులు పాల్గొన్నారు. చదవండి: బీఆర్ఎస్ ఆఫీసులో రూ. 75 కోట్లు ఇచ్చా: సుఖేశ్ చంద్రశేఖర్ -
శత్రు ఆస్తుల విక్రయంతో రూ.3,400 కోట్లు
న్యూఢిల్లీ: శత్రువుల ఆస్తుల (ఎనిమీ ప్రాపర్టీస్) అమ్మకంతో కేంద్రం రూ.3,407 కోట్లు ఆర్జించింది. ఇందులో అధిక భాగం షేర్లు, బంగారం వంటి చరాస్తులేనని అధికారులు తెలిపారు. దేశ విభజన సమయంలో, 1962, 1965 నాటి యుద్ధాల తర్వాత భారత్ నుంచి పాకిస్తాన్, చైనాకు వెళ్లి, అక్కడి పౌరసత్వం పొందినవారి ఆస్తులను శత్రువుల ఆస్తులంటారు. పాక్ జాతీయులకు చెందిన 12,485, చైనా పౌరులకు చెందిన 126 ఆస్తులను తాజాగా విక్రయించారు. -
ట్రెండింగ్ పాటకు క్రికెటర్స్ అదిరిపోయే స్టెప్పులు
టీమిండియా మహిళా క్రికెటర్లు విశాల్ 'ఎనిమి' సినిమాలోని 'టమ్ టమ్(Tum Tum)' పాటకు అదిరిపోయే స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుతం దక్షిణాఫ్రికా టూర్లో ఉన్న టీమిండియా మహిళా బృందం టి20 ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా నిర్వహించిన టి20 ట్రై సిరీస్‌లో ఆడుతుంది. అయితే గురువారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు జెమిమా రోడ్రిగ్స్ సహా దీప్తి శర్మ, స్నేహ్ రాణా, ఇతర క్రికెటర్లు తమ స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోనూ ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ వీడిమోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 'స్లేయింగ్ ది ట్రెండ్' అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలవ్వగా.. ముక్కోణపు టోర్నీ విజేతగా ఆతిథ్య దక్షిణాఫ్రికా నిలిచింది. ఫైనల్లో టీమిండియాను సఫారీ బృందం 5 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయగలిగింది. అనంతరం దక్షిణాఫ్రికా 18 ఓవర్లలో 5 వికెట్లకు 113 పరుగులు చేసి విజయాన్నందుకుంది. దక్షిణాఫ్రికా కూడా 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడినా...‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ క్లో ట్రైఆన్ (32 బంతుల్లో 57 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడు ప్రదర్శించి జట్టును గెలిపించింది. భారత ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచింది. ఈ నెల 10నుంచి దక్షిణాఫ్రికా గడ్డపైనే మహిళల టి20 వరల్డ్ కప్ జరగనుంది. View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) చదవండి: ఆస్ట్రేలియా సాధన షురూ.. -
ఇలా కూడా పగ తీర్చుకోవచ్చా..!
ఏర్పేడు(తిరుపతి జిల్లా): మనకు సరిపడని వ్యక్తిపై ఎలా అయినా పగ తీర్చుకోవచ్చు. అలాంటి సంఘటనే మండలంలోని గోవిందవరం పంచాయతీ జింకలమిట్ట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రైతులు సుబ్రహ్మణ్యం నాయుడుకు, రాధికా కిరణ్‌కు మధ్య గత కొంతకాలంగా భూతగాదా నడుస్తోంది. అయితే తన పొలంలో సాగు చేసిన వరినారుపై రెండు రోజుల క్రితం రాధికాకిరణ్ కూలీలతో రాత్రిళ్లు కలుపు మందు పిచికారీ చేయించడంతో నారు ఎండిపోయిందని బాధితుడు ఏర్పేడు సీఐ శ్రీహరికి మంగళవారం ఫిర్యాదు చేశాడు. సుబ్రహ్మణ్యం నాయుడుకు 6 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. రబీ సీజన్లో వరి వేసుకునేందుకు నారు మడిని సిద్ధం చేసుకున్నాడు. అయితే భూతగాదా నడుస్తున్న నేపథ్యంలో అతను వరి నాట్లు వేయడానికి సాగు చేసిన నారుపై కలుపు మందు పిచికారీ చేయడంతో ఎండిపోయింది. అతని ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చదవండి: ఇద్దరు కుమార్తెలపై పెట్రోల్ పోసి నిప్పంటించిన తల్లి -
బైడెనే మన శత్రువు.. అమెరికా అధ్యక్షుడిపై ట్రంప్ ఫైర్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. శనివారం పెన్సిల్వేనియాలో రిపబ్లికన్ల ర్యాలీలో మాట్లాడుతూ బైడెనే మన శత్రువు అని వ్యాఖ్యానించారు. ఆగస్టు 8న ఫ్లోరిడాలోని తన నివాసంలో ఎఫ్‌బీఐ సోదాలు జరిగిన తర్వాత ట్రంప్ తొలిసారి ప్రజలు ముందుకు వచ్చి ఈ విషయంపై స్పందించారు. ఈ ఘటనను న్యాయానికి అపహాస్యంగా, ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణించారు. తనను లక్ష్యంగా చేసుకున్నందుకు బైడెన్ సర్కార్‌కు ఊహించని ఎదురుదెబ్బలు తగులుతాయని ట్రంప్ హెచ్చరించారు. ఇదివరకు ఎన్నడూ చూడని పరిస్థితులను ఎదుర్కొంటారని పేర్కొన్నారు. అమెరికా చరిత్రలో బైడెన్లా ఏ అధ్యక్షుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడలేదని ధ్వజమెత్తారు. ఇటీవల తనను విమర్శిస్తూ బైడెన్ చేసిన ప్రసంగంపైనా ట్రంప్ మండిపడ్డారు. బైడెన్ భాష ప్రజాస్యామ్య పునాదులను బెదిరించేలా అతివాదాన్ని ప్రతిబింబిస్తుందని ధ్వజమెత్తారు. అమెరికా అధ్యక్షులెవరూ ఇప్పటివరకు ఇలాంటి అత్యంత దుర్మార్గపు, విద్వేషపూరిత, విభజన ప్రసంగం చేయలేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రిపబ్లికన్లు ప్రయత్నిస్తున్నారని, రాడికల్ లెఫ్టే ప్రజాస్వామ్యానికి అసలు ముప్పు అని చెప్పారు. అమెరికాలో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన మద్దతుదారులు కుట్రలు పన్నుతున్నారని అధ్యక్షుడు జో బైడెన్ ఇటీవల ఆరోపించారు. అధికారం దక్కించుకోవడానికి దుర్బుద్ధితో రాజకీయ హింసను ఎగదోస్తున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పాలని, తగిన గుణపాఠం నేర్పాలని అమెరికా ప్రజలకు పిలుపునిచ్చారు. ‘తీవ్రవాదులను’ కచ్చితంగా ఎదిరించాలని చెప్పారు. ఫిలడెల్ఫియాలోని ప్రఖ్యాత ఇండిపెండెన్స్ హాల్లో బైడెన్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చదవండి: భారతీయులకు గుడ్ న్యూస్.. ఇంటర్వ్యూ లేకుండానే అమెరికా వీసా! -
కాంగ్రెస్ కు శత్రువు కాంగ్రెసే: నవజ్యోత్ సింగ్ సిద్ధూ
-
ఓటీటీలో ఎనిమి సినిమా, ఎప్పటినుంచంటే?
యాక్షన్ హీరో విశాల్, ఆర్య కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఎనిమి. మమతా మోహన్‌దాస్, మృణాళిని కథానాయికలు. నోటా డైరెక్టర్ ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించగా మిని స్టుడియోస్ బ్యానర్ మీద ఎస్ వినోద్ కుమార్ నిర్మించాడు. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. గతేడాది దీపావళి సందర్భంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని మంచి కలెక్షన్లు రాబట్టింది. తాజాగా ఎనిమి ఓటీటీ బాట పట్టింది. ఫిబ్రవరి 18 నుంచి సోనీలివ్ ప్లాట్ఫామ్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను థియేటర్లలో చూడటం మిస్ అయినవాళ్లు ఎంచక్కా ఇంట్లోనే ఓటీటీలో చూసేయండి మరి! Two childhood friends end up on opposite extremes of morality, and face each other in a good vs evil war. #ENEMY starring Vishal and Arya is streaming on Feb 18th only on SonyLIV. #EnemyOnSonyLIV@vishalkofficial @arya_offl @anandshank @mamtamohan @mirnaliniravi @prakashraaj pic.twitter.com/d4MOFivekX — SonyLIV (@SonyLIV) February 10, 2022 -
ఎనిమి మూవీ ట్విటర్ రివ్యూ
యాక్షన్ హీరోగా తమిళ్ తోపాటు తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు విశాల్. ఫలితాలతో సంబంధం లేకుండా వైవిధ్యమైన చిత్రాలను ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు. తాజాగా విశాల్ నటించిన మరో యాక్షన్ చిత్రం ‘ఎనిమి’.ఈ సినిమాలో విశాల్ తోపాటు మరో హీరో ఆర్య కూడా నటిస్తున్నారు. ఈ సినిమాలో విశాల్ పోలీస్ ఆఫీసర్ గ నటిస్తున్నాడు. అలాగే ఆర్య నెగిటివ్ రోల్ లో కనిపించనున్నాడు. నోటా చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. మతా మోహన్‌దాస్, మృణాళిని కథానాయికలు. ఈ సినిమా దీపావళి సందర్భంగా ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా ప్రీవ్యూస్ పడడంతో ఈ సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. సింగపూర్‌లో లిటిల్ ఇండియా అనే ప్రాంతం ఉంటుంది. అక్కడ జరిగే కథ ఇది. స్నేహితులుగా ఉన్న ఇద్దరు వ్యక్తులు శత్రువులుగా ఎలా మారారు? ఆఖరికి వాళ్లు ఎలా కలుస్తారు? అన్నది చిత్ర కథాంశం. సినిమాలో యాక్షన్‌తో పాటు డైగాగ్స్ బాగాను ఉన్నట్లు తెలుస్తోంది. #Enemy first half 🔥🔥🔥🔥🔥 Anand Shankar 💥 Aarya 🥵🧨🧨🧨🧨 pic.twitter.com/MvviWtx1Fj — MSR (@itz_chillax) November 4, 2021 #EnemyFDFS fans celebration @RohiniSilverScr 💥💥#Enemy Massive entry thalaivaa @VishalKOfficial One of the finest score points @SamCSmusic bgm is just lit 💥@arya_offl @mirnaliniravi @vinod_offl @anandshank @VffVishal pic.twitter.com/CT0IKPyE5F — Esh Vishal (@Eshvishaloff) November 4, 2021 #Annaatthe Review சரியில்லை நம்ம #ENEMY பார்க்க கிளம்புவோம்... — திண்டிவனத்தான் (@itsmetdm) November 4, 2021 #Enemy Epdi Iruku Frands — Thala Ragav™👑 (@Ragav_Tweetz) November 4, 2021 Million Thanks to my brother @VishalKOfficial for making me a part of this film 🤗🤗Had the best time working with @anandshank 😍🤗 💪 Thank you @vinod_offl darling for believing us and making #Enemy special 😍🤗 @RDRajasekar sir u r 😍😍 Happy Diwali everyone 😘💥💥 pic.twitter.com/ruKT2CYFZk — Arya (@arya_offl) November 4, 2021 #Enemy will be flop. Investment recovery is not guaranteed. #Annaatthe getting rave reviews. Industry Hit record will be sure. Watch it soon in theaters only. — AnnaattheTheFilm (@AnnaattheMovie) November 4, 2021 #Enemy review எப்டீ இருக்குன்னு போய் பார்த்தா அவனுங்க நமக்கு முன்னாடி எனிமி ரிவியூவ் எப்டீ இருக்குன்னு கேக்குறானுங்க😍🙌 — ѕ ι я α н🕊️ᴠᴋ (@Prabhaharish7) November 4, 2021 #Enemy Deepawali Than Pola 🙄🔥🔥🔥🔥 — Salva Reviews😷 (@SalvaReviews) November 4, 2021 தீபாவளி னாலே தளபதி தான் போல... புரட்ச்சி தளபதி மாஸ் #Enemy 🔥 — кαι ρυℓℓα (@KPM_Offi) November 4, 2021 #EnemyDeepavali BlockBuster #Enemy — Ansari (@Ansari0401) November 4, 2021 -
పునీత్ చేపట్టిన మంచి పనులు కొనసాగాలని స్వామిని కోరుకున్న: హీరో విశాల్
-
అందుకే పునీత్ చేసిన మంచి పనుల్లో ఒకటి చెయ్యాలి అనుకున్నా: విశాల్
సాక్షి, తిరుమల: హీరో విశాల్ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆయన మాట్లాడుతూ.. 'నాలుగు సంవత్సరాల తర్వాత స్వామివారిని దర్శించుకున్నాను. కాలి నడకన దర్శనం చేసుకొని మొక్కులు చెల్లించుకొన్నాను. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ధన్యవాదాలు. దీపావళికి 'ఎనిమీ' చిత్రం విడుదల అవుతుంది. కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్ మరణం చాలా బాధించింది. కుటుంబ సభ్యుడిని కోల్పోయినట్లు ఉంది. అందుకే అతను చేసిన అనేక మంచి పనుల్లో నేను ఒకటి చెయ్యాలి అనుకున్నా. పిల్లల చదువుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు నేను చూసుకుంటాను' అని హీరో విశాల్ తెలిపారు. చదవండి: (50 రకాల వంటకాలతో పునీత్‌కు పాలశాస్త్రం పూజలు) -
ఈ వారం ఓటీటీ, థియేటర్లో అలరించే చిత్రాలివే..
Diwali 2021 Movie Release List: కరోనా తగ్గుముఖం పట్టిన అనంతరం ప్రతి వారం కొత్త సినిమలు థియేటర్లో సందడి చేస్తున్నాయి. ఇక దసరా, దీపావళి సందర్భంగా భారీ బడ్జెట్ చిత్రాలు థియేటర్లోకి క్యూ కడుతున్నాయి. దసరా సందర్భాంగ ఇప్పటికే ‘పెళ్లి సందD, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, వరుడు కావలెను వంటి తదితర చిత్రాలు వెండితెరపై మెరిసి ప్రేక్షకులకు బాగా అలరించాయి. ఇక దీపావళి సందర్భంగా అగ్ర హీరోల సినిమా థియేటర్లోకి వచ్చేందు రెడీ అయ్యాయి. అలాగే ఈ పండుగ సంబరాలను మరింత రెట్టింపు చేసేందుకు ఓటీటీలోకి సైతం పలు సినిమాలు రాబోతున్నాయి. మరి ఆ చిత్రాలు ఏంటో తెలుసుకోవాలంటే ఇక్కడోలుక్కేయండి. ‘ఎనిమి’లుగా విశాల్, ఆర్యలు యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్యల క్రేజీ కాంబినేషన్లో యాక్షన్ ఎంటర్టైనర్ రాబోతున్న చిత్రం ‘ఎనిమి. ఇది విశాల్ 30వ చిత్రం కాగా, ఆర్య 32వ సినిమా. ‘గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ ఇందులో కీలక పాత్రలో నటించాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. దీపావళి సందర్భంగా ఈ సినిమా కూడా నవంబరు 4న తమిళ/తెలుగు భాషల్లో థియేటర్లలో విడుదల కానుంది. దీపావళికి వస్తున్న ‘పెద్దన్న’ సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం ‘అన్నాత్తే’. ఈ మూవీని తెలుగులో సైతం ‘పెద్దన్న’గా దీపావళి సందర్భంగా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్షన్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్గా అలరించబోతోంది. ఇక కీర్తి సురేశ్ రజనీకి సోదరిగా కనిపించనుండగా.. సీనియర్ నటీమణులు మీనా, ఖుష్బులు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. నవంబర్ 4న తమిళ/తెలుగులో భాషల్లో థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కరోనా తర్వాత థియేటర్లో విడుదల అవుతున్న తొలి అగ్ర హీరో మూవీగా రజనీది కావడం విశేషం. మెహ్రీన్, సంతోష్ శోభన్ల్లా ‘మంచి రోజులు వచ్చాయి’ సంతోష్ శోభన్, మెహ్రీన్ జంటగా మారుతి తెరకెక్కించిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనూప్ రూబెన్స్ స్వరాలందించారు. దీపావళి పండగను పురస్కరించుకుని ఈనెల 4న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. మారుతి శైలిలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అక్షయ్ కుమార్ ‘సూర్యవంశీ’ అక్షయ్‌కుమార్, కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన యాక్షన్ చిత్రం ‘సూర్యవంశీ’. రణ్‌వీర్‌సింగ్, అజయ్‌దేవ్‌గణ్ కీలక పాత్రలు పోషించారు. రోహిత్‌శెట్టి దర్శకత్వం రూపొందిన ఈ చిత్రం గతేడాది విడుదల కావాల్సింది. కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించినా సెకండ్‌వేవ్ కారణంగా మరోసారి ఈ మూవీ విడుదల వాయిదా పడింది. చివరకు ఈ దీపావళి కానుకగా థియేటర్లో సందడి చేసేందుకు నవంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ మూవీ రాబోతోంది. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, రోహిత్‌శెట్టి పిక్చర్స్, ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. సూపర్ హీరోస్ ‘ఇటర్నల్స్’ సూపర్ హీరోస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ హాలీవుడ్. మార్వెల్ కామిక్స్ నుంచి ఎందరో సూపర్‌హీరోలు ప్రేక్షకులను అలరించారు. అలా మరోసారి అలరించేందుకు ‘ఇటర్నల్స్’ వస్తున్నారు. థానోస్ తర్వాత భూమిని నాశనం చేసేందుకు వస్తున్న అతీంద్రియ శక్తులైన ఏలియన్స్‌ను కొందరు సూపర్ హీరోలు ఎలా ఎదుర్కొన్నారు? ఈ క్రమంలో వాళ్లకు ఎదురైన సవాళ్లు ఏంటి? ఇంతకాలం వాళ్లు ఎక్కడ ఉన్నారు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే. క్లోవీజావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇటర్నల్స్’ నవంబరు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే! సూర్య జై భీమ్ మాస్ హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న హీరో సూర్య అప్పుడప్పుడు వైవిధ్యమైన పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తుంటారు. అలాంటి పాత్రలో ఆయన నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందించిన తాజా చిత్రం ‘జై భీమ్’. తాసే జ్ఞానవేల్ దర్శకుడు. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు నేపథ్యంలో ఈ మూవీ రూపొందించారు. ‘లా అనేది ఓ శక్తిమంతమైన ఆయుధం. ఎవరిని కాపాడటం కోసం మనం దాన్ని ఉపయోగిస్తున్నామన్నదే ముఖ్యం’ అంటూ ట్రైలర్లో సూర్య చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నవంబరు 2న అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ విడుదల కానుంది. సందీప్ కిషన్ ‘గల్లీ రౌడీ’ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన వినోదభరిత చిత్రం ‘గల్లీ రౌడీ’. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతోంది. ప్రముఖ ఓటీటీ డిస్నీ+ హాట్‌స్టార్‌లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమాస్ సంస్థలు నిర్మించాయి. నేహాశెట్టి, బాబీ సింహా, హర్ష, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషించారు. సుధీర్ బాబు ‘శ్రీదేవీ సోడా సెంటర్’ కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో విడుదలై ప్రేక్షకుల్ని అలరించిన చిత్రాల్లో ‘శ్రీదేవి సోడా సెంటర్’ ఒకటి. వెండితెరపై అలరించిన ఈ చిత్రం ఇప్పుడు బుల్లితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ‘జీ 5’లో నవంబరు 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సుధీర్ బాబు, ఆనంది జంటగా నటించిన చిత్రమిది. ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వం వహించారు. -
పునీత్‌కి మాటిస్తున్నాను.. ఆ పిల్లలను నేను చదివిస్తా: విశాల్
Vishal To Continue Puneeth Rajkumars Charity Work: పునీత్ రాజ్‌కుమార్ లాంటి గొప్ప వ్యక్తిని తాను ఇంత వరకు చూడలేదని హీరో విశాల్ అన్నారు. ఆయన నటుడిగానే కాకుండా చాలా మంచి మనిషి అని తెలిపారు. ఎనిమి ప్రీ రిలీజ్ ఈవెంట్లో పునీత్‌కు నివాళులు అర్పించిన అనంతరం విశాల్ మాట్లాడారు. 'పునీత్ లేరనే విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను, ఆయన మరణం చిత్ర పరిశ్రమకే కాదు, సమాజానికి తీరని లోటు. చదవండి: పునీత్ రాజ్‌కుమార్ నుదిటిన ముద్దు పెట్టిన సీఎం బొమ్మై.. ఫిల్మ్ ఇండస్ట్రీలో పునీత్‌లాంటి గొప్ప వ్యక్తిని నేను చూడలేదు. పునీత్ ఈ సమాజానికి ఎన్నో మంచి పనులు చేశారు. చివరికి తన కళ్లు కూడా దానం చేశారు. ఆయన చదివించిన 1800 పిల్లల బాధ్యత ఇకపై నేను చూసుకుంటాను. ఒక స్నేహితుడిగా పునీత్ సేవా కార్యక్రమాలకు నా వంతు సాయాన్ని అందిస్తానని మాటిస్తున్నాను అని విశాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. విశాల్ గొప్ప మనసుకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. విశాల్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారు. ఆర్య మాట్లాడుతూ.. ‘పునీత్ సర్ లేరనే విషయాన్ని నమ్మలేకపోతున్నా. ఆయన మరణం తీరని లోటు. మిస్ యూ సర్’ అంటూ ఎమోషన్ అయ్యారు. కాగా విశాల్, ఆర్య ప్రధాన పాత్రల్లో ఆనంద్ శంకర్ రూపొందించిన ‘ఎనిమి’ ఈ నెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: పునీత్ మరణం: లైవ్‌లో న్యూస్ చదువుతూ ఏడ్చేసిన యాంకర్ నెంబర్1 హీరోల అకాల మరణం.. శాండల్‌వుడ్‌కు అది శాపమా? -
పండగ సందడి: ద‘సరదా’ షురూ
సినీప్రియులకు పండగ ఎప్పుడంటే బోలెడన్ని సినిమాలు విడుదలైనప్పుడు. పండగలప్పుడు సినిమా రిలీజుల సందడి, పండగ సందడితో డబుల్ ఆనందం దక్కుతుంది. అయితే గత ఏడాది దసరా పండగ సినీ లవర్స్‌ని నిరుత్సాహపరిచింది. థియేటర్ల లాక్డౌన్ వల్ల గత దసరాకి సినిమాలు విడుదల కాలేదు. ఈ దసరాకి సరదా షురూ అయింది. దసరా ఆరంభం నుంచి ముగిసే వరకూ ఈ నవరాత్రికి అరడజను సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూద్దాం. ఉద్యోగం వేటలో అలసిపోయిన రవీంద్ర యాదవ్ జీవితం ఆటలోనైనా గెలవాలని గొర్రెల కాపరిగా కొండపొలం వెళతాడు. అక్కడ ఓబులమ్మతో ప్రేమలో పడతాడు. అసలు కథ అక్కడే మొదలవుతుంది. అడవిలోని క్రూరమైన జంతువులతో పాటు హానికరమైన మనుషులతో కూడా రవీంద్ర యాదవ్ పోరాడాల్సి వస్తుంది. మరి.. ఈ పోరాట ఫలితం ఏంటి? అనేది థియేటర్స్‌లో తెలుస్తుంది. కటారు రవీంద్ర యాదవ్‌గా వైష్ణవ్ తేజ్, ఓబులమ్మ పాత్రలో రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కొండపొలం’. ‘కొండపొలం’లో వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‌సింగ్ సన్నపురెడ్డి వెంకట్రామి రెడ్డి రచించిన ‘కొండపొలం’ అనే నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ సోమవారం విడుదల కాగా, దేవీ నవరాత్రులు మొదలైన మరుసటి రోజు.. అంటే అక్టోబరు 8న ‘కొండపొలం’ థియేటర్స్‌లోకి వస్తుంది. ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందించారు. ఇక నెల్సన్ దర్శకత్వంలో తమిళ హీరో శివ కార్తికేయన్ నటించిన ‘డాక్టర్’ చిత్రం తెలుగులో ‘వరుణ్ డాక్టర్’గా అక్టోబరు 9న తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కోటపాడి జె. రాజేష్ ఈ చిత్రానికి నిర్మాత. ‘డాక్టర్’లో శివకార్తికేయన్ అమ్మాయిల కిడ్నాప్ నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ప్రియాంకా అరుల్ మోహనన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో వినయ్‌రాయ్, యోగిబాబు, మిళింద్ తదితరులు కీలక పాత్రధారులు. మరోవైపు ‘ఆర్ ఎక్స్ 100’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత శర్వానంద్, సిద్ధార్థ్‌ల క్రేజీ కాంబినేషన్లో అజయ్ భూపతి దర్శకత్వంలో రూపొందిన ‘మహాసముద్రం’ కూడా పండగకి వస్తోంది. ఇందులో అనూ ఇమ్మాన్యుయేల్, అదితీరావ్ హైదరీ హీరోయిన్లు. ఒక అమ్మాయి ప్రేమ, ఇద్దరు అబ్బాయిల జీవితాలను ఎలా మార్చింది? అనే అంశంతో ఈ సినిమా కథనం సాగుతుంది. రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 14న విడుదల కానుంది. దసరాకి ‘ఎనిమి’గా థియేటర్స్‌లోకి వస్తున్నాడు విశాల్. ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్య మరో హీరో. స్నేహితుడి నమ్మకద్రోహం బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథనం ఉంటుంది. ‘ఎనిమీ’లో విశాల్, ఆర్య ఇక ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ కూడా దూసుకొస్తున్నాడు. ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు, వాసూ వర్మ నిర్మించిన ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కానుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’లో పూజా హెగ్డే, అఖిల్ పెళ్లి చేసుకోవడానికి ఇండియా వచ్చిన ఓ ఎన్ఆర్ఐ కుర్రాడు, స్టాండప్ కమెడియన్ అయిన ఓ అమ్మాయి కోసం ఏం చేశాడు? అనే అంశం ఆధారంగా ఈ చిత్ర కథనం సాగుతుంది. మరోవైపు ఇదే రోజు ‘వరుడు కావలెను’ అంటూ థియేటర్స్‌కు వస్తున్నారు హీరోయిన్ రీతూ వర్మ. నాగశౌర్యనే ఈ వరుడు. ‘వరుడు కావలెను’ లో రీతూవర్మ వీరి కల్యాణం పెళ్లి పీటలపైకి వెళ్లే క్రమంలో జరిగే సంఘటనల డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రానికి లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. ఈ సినిమాలే కాకుండా వేరే సినిమాలు కూడా దసరా రిలీజ్ లిస్ట్‌లో చేరే అవకాశం ఉంది. మరి.. ఈ విజయ దశమికి ప్రేక్షకులు ఏ చిత్రానికి విజయాన్ని అందిస్తారో? ఎవరి దశను తిప్పుతారో చూడాలి. -
విశాల్ తెలుగు డబ్బింగ్ ఎలా చెప్పారో చూడండి
Actor Vishal Dubs For Enemy: యాక్షన్ హీరో విశాల్, మ్యాన్లీ స్టార్ ఆర్య కలిసి నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఎనిమీ’.ఆనంద్ శంకర్ దర్శకత్వంలో మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించాడు. గద్దల కొండ గణేష్’ ఫేమ్ మృణాళిని రవి, మమతా మోహన్‌దాస్‌లు ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలె ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. తాజాగా హీరో విశాల్ ఈ చిత్రానికి డబ్బింగ్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తూ ట్రాఫిక్ కానిస్టేబుల్ లాగా ఇలా చేతులు ఊపుకుంటూ ఉంటేనే నాకు తెలుగులో డబ్బింగ్ వస్తుంది అంటూ విశాల్ ఫన్నీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.ఇప్పటికే విడుదలైన టీజర్ మూవీపై భారీ అంచనాలను పెంచేసింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. The secret behind my way of dubbing in telugu has been revealed. Like a #TrafficConstable at his best. #EnemyDubbing#Enemy at final stage of Post-Production is going 🤔 pic.twitter.com/mHOxByRPSS — VishalFans360 © (@VishalFans360) September 21, 2021 -
Vishal: దుబాయ్ టు చెన్నై
దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్ కోసం దుబాయ్‌లో ఉన్నారు హీరో విశాల్. దుబాయ్ షెడ్యూల్ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్లో మేజర్‌గా యాక్షన్ సీక్వెన్సెస్‌ను షూట్ చేశారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా దర్శకత్వంలో వచ్చిన ‘అవన్ ఇవన్ ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం. -
నా తొలి శత్రువు సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: ‘సిద్ధరామయ్యే నా తొలి శత్రువు. బీజేపీ కాదు’అని జేడీఎస్ మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి స్పష్టం చేశారు. సీఎల్పీ నాయకుడు సిద్ధరామయ్యపై మూడు రోజుల నుంచి జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి సిద్ధరామయ్యే కారణమని ఆరోపించారు, తాను సీఎం కావడాన్ని ఆయన ఏమాత్రం సహించలేకపోయారని మీడియాతో ఆదివారం వ్యాఖ్యానించారు. తన సన్నిహిత ఎమ్మెల్యేల ద్వారా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడుతూ చివరికి వారి చేత రాజీనామాలు చేయించి, ప్రభుత్వం కూలిపోవడానికి కారకులయ్యారని మండిపడ్డారు. రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని కాంగ్రెస్ పార్టీ అధిస్టానం సూచించడంతో, ఇష్టం లేకపోయినా బలవంతంగా తనను ముఖ్యమంత్రిగా అంగీకరించారన్నారు. ఆయన ఒత్తిడి మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశించిందని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాను ముఖ్యమంత్రిగా కాకుండా, క్లర్క్‌లాగా పనిచేశానని అన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ నేతలు తనపై పెత్తనం చేసేవారని, కలెక్టర్లు సహా అందరి బదిలీలు వారు చెప్పినట్లే చేశానని తెలిపారు. సాయంత్రానికి మాట మార్పు.. ఈ వ్యాఖ్యల అనంతరం సాయంత్రానికే కుమారస్వామి మాట మార్చారు. తానెప్పుడూ సిద్ధరామయ్య తన తొలి శత్రువు అని చెప్పలేదని తెలిపారు. డిజిటల్ మీడియా విలేకరులకు కొన్ని రోజుల క్రితం ఇచ్చిన సందేశాన్ని తాజాగా కొందరు మార్చి చెబుతున్నారని అన్నారు. -
అవధూత కథ
చాలా శతాబ్దాల కిందట ఫ్లాండర్స్ అనే ప్రాంతంలో ముగ్గురు యువకులు కలసి జీవిస్తుండేవాళ్లు. సత్రాలలో, వేశ్యల ఇళ్లలో విచ్చలవిడిగా ఖుషీ చేస్తూ, రకరకాల వాద్యాలను వాయిస్తూ తైతక్కలాడుతూ, రాత్రింబగళ్లు జూదం ఆడుతూ, అడ్డూ అదుపూ లేకుండా అతిగా మద్యం తాగుతూ వాళ్లు మూర్ఖంగా ప్రవర్తించేవారు. ఆ విధంగా అసహ్యకరమైన రీతిలో దయ్యాల కొంపల్లో విపరీతమైన విశృంఖలత్వంతో దయ్యాల ప్రవర్తనతో బతికేవారు. ఒకనాడు ఆ ముగ్గురూ పెందరాళే సత్రంలో కూర్చుని, మద్యం తాగడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వాళ్లకొక గంట చప్పుడు వినిపించింది. ఎవరైనా చనిపోతే శవాన్ని శ్మశానానికి తీసుకుపోతున్నప్పుడు మోగించే గంట శబ్దంలా ఉంది ఆ ధ్వని. ఆ ముగ్గురిలోని ఒకడు అటుగా పోతున్న ఒక పిల్లవాణ్ణి పిలిచి, చనిపోయిన వ్యక్తి పేరేమిటో కనుక్కోమని చెప్పి, ‘‘పేరు తప్పుగా చెప్తే తన్నులు తింటావు సుమా!’’ అని బెదిరించాడు. ‘‘అయ్యా, నన్ను దండించే అవసరం లేదు. మీరిక్కడికి రావటంకన్న రెండు గంటల ముందే నాకు విషయం తెలిసింది. దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. చనిపోయిన వ్యక్తి ఒక ముసలివాడు. అతడు బాగా మద్యం తాగిన మత్తులో ఒక బెంచి మీద కూర్చుని ఉండగా హతుడయ్యాడు. చావు అనే పేరు గల ఒక రహస్య దొంగ వచ్చి, ముసలివాడి గుండె రెండు ముక్కలయ్యే విధంగా బరిసెతో పొడిచి, ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్లిపోయాడు. అతడు ఊళ్లోని మనుషులందర్నీ అట్లానే చంపుతాడు. ఇప్పటిదాకా దాదాపు ఒక వేయిమందిని చంపాడు. అయ్యా, అటువంటి శత్రువు మీకు ఎదురుపడక ముందే ఈ విషయాన్ని మీకు చెప్పాలనిపించింది నాకు. అతణ్ణి ఎదుర్కోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని నాకు మా అమ్మ చెప్పింది.ఇంతకన్నా ఎక్కువగా మరేం మాట్లాడలేను నేను’’ అన్నాడు ఆ పిల్లవాడు. ‘‘ఈ పిల్లవాడు చెప్తున్నది నిజం. ఇక్కడికి ఒక మైలు దూరంలో ఉన్న పెద్ద గ్రామంలో ఇద్దరు స్త్రీలనూ, ఒక చిన్న పిల్లవాణ్ణీ, ఒక పనిమనిషినీ, ఒక మోసగాణ్ణీ చంపింది ఈ దొంగే. అతడు ఆ గ్రామంలోనే నివసిస్తాడనుకుంటాను. అదుగో అటువైపు పోతే ఆ గ్రామం వస్తుంది. మీకు హాని జరగక ముందే ఈ విషయం తెలియడం మంచిదయింది’’ అన్నాడు ఆ సత్రపు యజమాని.ముగ్గురిలోని ఒకడైన ఆ దురాత్ముడు ఇలా అన్నాడు: ‘‘వాణ్ణి ఎదుర్కోవడం అంత ప్రమాదకరమా? దేవుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను వాణ్ణి రాచమార్గం మీదనో, చిన్న తోవ మీదనో ఎక్కడో ఒక చోట ఎదుర్కొంటాను.వినండి మిత్రులారా! మనం ముగ్గురం సోదరుల్లాగా మారి, చావు అనే మాయ ద్రోహిని చంపుదాం. ఎందర్నో చంపే ఆ దుష్టుడే ఈ రాత్రి మన చేతుల్లో చస్తాడు. దేవుని సాక్షిగా.’’ఆ ముగ్గురూ ఒకరి కోసం మరొకరు తమ ప్రాణాల్ని బలి పెడతామని ప్రతిజ్ఞ చేసి, సత్రపు యజమాని చెప్పిన దిశగా, తాగిన మైకంలో బయలుదేరారు. ‘చావుగాడిని దొరికించుకుని వధిస్తాం’ అంటూ వాళ్లు ఎన్నో భీకరమైన శపథాలు చేశారు. ఒక మైలు దూరం పోయి కంచెను దాటుతుంటే, ఒక బీద ముసలివాడు వాళ్లకు ఎదురొచ్చాడు. అతడు వాళ్లకు నమస్కరించి, వినయంగా ‘‘అయ్యలారా, దేవుడు మీకు మేలు చేయుగాక!’’ అన్నాడు. ఆ ముగ్గురు దుర్మార్గుల్లో అత్యంత గర్విష్టి అయిన వ్యక్తి ఇలా బదులు పలికాడు. ‘‘ఓ పొగరుబోతూ! ఇవ్వాళ నీ అదృష్టం బాగా లేదు. నీ ముఖాన్ని దాచుకోవడం కోసం ఎందుకలా మొత్తం శరీరానికి ముసుగు వేసుకున్నావు? ఇంత పెద్ద వయసు వచ్చేదాకా ఎందుకు బతికి ఉన్నావు నువ్వు?’’ఆ ముసలివాడు దురాత్ముని ముఖంలోకి పరీక్షగా చూసి, ‘‘ఎందుకంటే నేను భారతదేశం దాకా నడిచి గ్రామాల్లో, పట్టణాల్లో వెతికినా తన యవ్వనాన్ని నాకిచ్చి, నా ముసలితనాన్ని తాను తీసుకునే మనిషెవరూ కనపడలేదు నాకు. కాబట్టి దేవుడు నన్ను ఎంతకాలం ముసలివాడిగా ఉండమని ఆదేశిస్తాడో అంతకాలం దాక ముసలివాడిగానే ఉండాలి నేను. నా దురదృష్టం కొద్దీ చావు రావడం లేదు నాకు. ఆ విధంగా నేనొక దౌర్భాగ్యపు దొంగముండా కొడుకులాగా విరామం లేకుండా తిరుగుతున్నాను. నా తల్లి దగ్గరికి తోవను చూపే ద్వారం అయిన నేలను పొడుగాటి కర్రతో కొట్టి, ‘నా ప్రియమైన మాతా! నన్ను లోపలికి రానివ్వు. నా రక్తమాంసాలూ, చర్మమూ, కండరాలూ ఎంతగా కృశించిపోయాయో చూడు. నాకెప్పుడు విశ్రాంతి దొరుకుతుంది తల్లీ? నా శరీరంలో భద్రమై ఉన్న హృదయాన్ని నీకు కానుకగా ఇచ్చి, నీ లోపలికి చేరుకుంటాను. ఒక గుడ్డలో నన్ను నేను చుట్టుకుంటాను’ అంటూ మొర పెట్టుకున్నా లాభం లేకపోయింది.అందుకే నా ముఖం పాలిపోయి, వాడిపోయింది. కానీ అయ్యలారా, ఒక ముసలివానితో మీరిట్లా దురుసుగా మాట్లాడటం న్యాయం కాదు, అతడు హద్దులు మీరితే తప్ప. ఈ విషయాన్ని మీరు స్వయంగా మతగ్రంథంలో చదవవచ్చు. ‘ముసలివాడు ఎదురైనప్పుడు వినయంగా, మర్యాదగా లేచి నిలబడు’ అని ఉంది అందులో. అందుకే మీరు ముసలివాడైన నాకు హాని తలపెట్టవద్దని, నేను చెప్పిన ప్రకారం చేస్తే మీరు వృద్ధులయ్యాక ఎవరూ మీకు హాని చెయ్యరనీ సలహా ఇస్తున్నాను. దేవుడు మీకు మేలు చేయుగాక! మీరెక్కడికి పోయినా నేను మాత్రం పోవాల్సిన చోటుకే పోవాలి’’ అన్నాడు.‘‘ఉహు.. నువ్వు పోలేవు నీచుడా! నిన్ను పోనివ్వనని ప్రమాణం చేస్తున్నాను. మమ్మల్ని వదిలి అంత సులభంగా వెళ్లలేవు నువ్వు. ఊళ్లలో మనుషులందర్నీ చంపే ద్రోహి అయిన చావుదయ్యంగాడి గురించి చెప్పావు. నా అనుమానం ప్రకారం నువ్వు వాడి గూఢచారివి. వాడెక్కడున్నాడో చెప్పు. చెప్పకపోతే నిన్ను చంపుతానని హెచ్చరిస్తున్నాను. యువకుల్ని చంపవలసిందిగా చావుకు అనుమతి ఇచ్చే టక్కరి దొంగగాడివి నువ్వే’’ అన్నాడు ఆ దురాత్ముల్లోని రెండవవాడు. ‘‘అయ్యలారా, చావుగాడిని కనుగొనాలని మీకు అంత కోరికగా ఉంటే, ఆ వంకర దారి మీదుగా పోండి. అతడు ఒక చోట్ల తోపులోని వృక్షం కింద ఉన్నాడని నా నమ్మకం. అక్కడే నివసిస్తాడతడు. ఆ ఓక్ చెట్టు కనబడుతోంది కదా? సరిగ్గా అక్కడే మీరతణ్ణి చూస్తారు. మానవులకు విముక్తిని ప్రసాదించే ఆ దేవుడే మిమ్మల్ని రక్షించి సరిదిద్దనీ’’ అన్నాడు ఆ ముసలివాడు.ఆ ముగ్గురూ అక్కడికి పరుగెత్తారు. వాళ్లు ఊహించినట్టుగానే అక్కడ ఏడు తూముల నాణ్యమైన బంగారు నాణేలు కనిపించాయి వాళ్లకు. అప్పుడు తాము వెతుకుతున్న వ్యక్తి గురించి మరచిపోయారు వారు. విలువైన ఆ బంగారు నిధిని చూసి ఆ ముగ్గురూ ఎంతగా మురిసిపోయారంటే, వాళ్లు దాని పక్కనే కూర్చుండిపోయారు. వారిలో అందరికన్నా చిన్నవాడు ఇలా అన్నాడు: ‘అన్నలారా, నేను చెప్పేది వినండి. నేనెప్పుడూ నవ్వుతూ ఆడుతూ ఉంటాను కానీ, నాకు గొప్ప జ్ఞానం ఉంది. మనం జీవితాలను సంతోషంగా, హాయిగా వెళ్లబుచ్చటం కోసం అదృష్టదేవత మనకు ఇచ్చిన నిధి ఇది. కాబట్టి దీన్ని అనుభవిద్దాం. ఒకవిధంగా ఇది మనకు దేవుడిచ్చిన విలువైన కానుక. ఇంత మంచి అదృష్టం మనను వరిస్తుందని ఎవరం ఊహించాం? ఈ బంగారమంతా మనదే కాబట్టి, దీన్ని నా ఇంటికో, మీ ఇంటికో తీసుకుపోయి గొప్ప సుఖాన్ని అనుభవించగలమా? దీన్ని పగటిపూట తీసుకుపోతే మనం పెద్ద దొంగలమని భావించి పట్టుకుని, మనను ఉరి తీస్తారు. ఈ నిధిని సాధ్యమైనంత వివేకంతో, చాతుర్యంతో రాత్రిపూట తీసుకుపోవాలి.మనం ఒక నాణెపు బిళ్లను ఎగరేసి, అది ఎవడిని సూచించే విధంగా పడితే వాడే వేగంగా రహస్యంగా పట్టణానికి పోయి ఆహారాన్ని, మద్యాన్నీ తీసుకు రావాలి. మిగతా ఇద్దరూ ఈ నిధిని గుట్టుగా కనిపెట్టుకుని ఉండాలి. రాత్రయ్యాక అందరమూ కలసి నిర్ణయించుకున్న చోటుకు దీన్ని తరలించాలి.’’ ఆ నాణెపు బిళ్ల అందరికన్న చిన్నవాడైన దురాత్మునికి అనుగుణంగా పడటంతో అతడు వెంటనే పట్టణం వైపు వెళ్లిపోయాడు. అప్పుడు ఆ మిగిలిన ఇద్దరిలో ఒకడు మరొకనితో ఇలా అన్నాడు: ‘‘నువ్వు నా సోదరుని వంటి వాడివి కనుక నేను చెప్పింది వింటే లాభపడతావు. మనం ముగ్గురం పంచుకోవటానికి పుష్కలమైన ధనం ఉందిక్కడ. వాడు వెళ్లిపోయాడు కదా. ఇది మనిద్దరికే చెందేలా నేనొక ఉపాయాన్ని చెబితే, నేనొక గొప్ప స్నేహితునిలా నీకు సహాయం చేసినవాణ్ణి అవుతానా లేదా?’’‘‘అదెలా సాధ్యమో తెలియదు నాకు. ఈ నిధి దగ్గర మనమిద్దరం కాపలా ఉన్నామని వాడికి తెలుసు. ఏం చేద్దాం? ఏమని చెప్పుదాం?’’ అన్నాడు ఆ రెండవవాడు.‘‘నువ్వు రహస్యంగా ఉంచుతానంటే నీకో విషయం చెప్పనా? మనం ఏం చెయ్యాలో క్లుప్తంగా చెప్తాను విను’’ అన్నాడు మొదటి దురాత్ముడు.‘‘సరే చెప్పు, నిన్ను మోసగించను’’ ‘‘మనమిద్దరం ఉన్నాం కనుక, ఒక్కడి బలం కన్న మనిద్దరి బలమే ఎక్కువ అవుతుంది. వాడొచ్చిన తర్వాత, సరదా కోసం ఆటాడుతున్నట్టుగా వాణ్ణి నువ్వు పట్టుకో. అప్పుడు నేను కత్తితో వాడి ఛాతి పక్కలోంచి పొడుస్తాను. తర్వాత నువ్వు కూడా నీ కత్తితో వాణ్ణి పొడవాలి. అప్పుడు ఈ బంగారాన్నంతా మనమిద్దరమే పంచుకుందాం మిత్రుడా! ఆ తర్వాత మనం బాగా మద్యం తాగుతూ, జూదమాడుతూ ఇష్టమొచ్చినట్టుగా భోగవిలాస జీవితాన్ని అనుభవిద్దాం. వాణ్ణి చంపటానికి మనిద్దరికీ అనుమతి దొరికిందనుకో’’ అన్నాడు మొదటివాడు.పట్టణానికి వెళ్లినవాడి మనసులో ఆ బంగారు నాణాల ఊహే మళ్లీ మళ్లీ కదలాడింది. ‘ఓ భగవంతుడా! ఆ బంగారమంతా నాదే అయిపోతే, ప్రపంచంలో ఎవ్వడూ నా అంత సుఖంగా బతకడు.’ ఇలా ఆలోచిస్తూ దయ్యం వంటి ఆ దురాత్ముడు ఆఖరుకు తన ఇద్దరు సహచరులకు విషం ఇచ్చి చంపాలని నిశ్చయించుకున్నాడు. సైతాను ఆ దురాత్ముణ్ణి పూర్తిగా ఆవహించి, భవిష్యత్తులో వాడికి అనంత దుఃఖాన్ని కలిగేలా చేసింది. వాడు వెంటనే ఒక మందుల దుకాణంవాడి దగ్గరకుపోయి, ఎలుకల విషాన్ని ఇవ్వమన్నాడు. తన పెరట్లో పెద్ద పందికొక్కు ఉన్నదనీ, అది తన కోడిని చంపిందని, ఆ పందికొక్కును చంపటం కోసం విషం అవసరమని చెప్పాడు. ఆ దుకాణంవాడు ‘‘నేనిచ్చే విషాన్ని గోధుమ పిండిలో కలిపి పెడితే, దాన్ని తిన్న ఏ ప్రాణి అయినా ఆలస్యం లేకుండా చస్తుంది. అవును, ఎంత తొందరగా అంటే ఒక్క మైలు దూరం నడిచే లోపలే దాని చావు సంభవిస్తుంది’’ అన్నాడు. శాపగ్రస్తుడైన ఆ దురాత్ముడు విషం డబ్బాను గట్టిగా పట్టుకుని, పక్క వీధిలోకి ఉరికి, ఒకడి దగ్గర మూడు సీసాలను అరువు తీసుకున్నాడు. రెండింటిలో విషాన్ని పోసి, మూడవ దాంట్లో తన కోసం కేవలం మద్యాన్ని మాత్రమే పోసుకున్నాడు. ఎందుకంటే శ్రమపడి రాత్రంతా బంగారాన్ని మోసుకు రావాలనుకున్నాడు. తర్వాత తన సహచరుల దగ్గరికి ప్రయాణమయ్యాడు. తర్వాత జరిగిన విషయం గురించి చెప్పాల్సిన అవసరమేముంది? పథకం వేసుకున్న విధంగానే ఆ సహచరులిద్దరూ మూడో దురాత్ముణ్ణి చంపారు. మిగిలిన ఇద్దరిలోని ఒకడు ‘‘ఇక మనం కూర్చుని హాయిగా మద్యం తాగి, ఆ తర్వాత ఈ శవాన్ని పూడ్చేద్దాం’’ అన్నాడు. మద్యపాన కార్యక్రమం మొదలుపెడుతూ వాడు ఒక సీసాలోంచి కొంచెం మద్యం తాగి, మిగిలిన దాన్ని తాగమని అదే సీసాను సహచరునికిచ్చాడు. విధివశాత్తు ఆ సీసాలో ఉన్న మద్యంలో విషం కలిపి ఉంది. ఆ విధంగా వాళ్లిద్దరూ మరణించారు. చనిపోయే ముందు వాళ్లిద్దరూ ఎంత అవస్థపడ్డారు అన్న విషయాన్ని క్రీట్స్ అవిసెన్నా ఏ శ్లోకంలోనూ, ఏ ఆశ్వాసంలోనూ రాయనంత అద్భుతంగా వర్ణించాడు. విషం పెట్టిన దురాత్ముడూ, హంతకులైన ఇద్దరు సహచరులూ ఆ విధంగా ప్రాణాలు వదిలారు. - ఇంగ్లిష్ మూలం : జెఫ్రీ చాసర్ - అనువాదం: ఎలనాగ -
ఆకర్షణలకు లొంగకండి
మీరు లక్ష్యసాధన దిశగా వెళ్ళేటప్పుడు మీరు ముందుకు వెళ్ళకుండా ఆటంకపరిచేవి రెండుంటాయి. అవి హిత శత్రువు, అహిత శత్రువు. ఈ రెండింటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అహిత శత్రువు–అది శత్రువని తెలిసిపోతూనే ఉంటుంది. తెలిసికూడా ప్రమాదం చేస్తుంది. హిత శత్రువు మనిషిని ఆకర్షించి నాశనం చేస్తుంది.నేను ఒక ప్రసంగం చేయాలి. చేయబోయే ముందు దేని గురించి ఏమేం మాట్లాడాలో కొంతసేపు ఆలోచించుకుని సిద్ధం కావాలనుకుంటా. ఆ ప్రయత్నంలో కాసేపు కళ్ళుమూసుకుని ఆలోచించడం మొదలుపెడతా..అలా మొదలుపెట్టానో లేదో ‘‘వినుడు వినుడు రామాయణ గాథ...’’అంటూ పెద్దగా ఓ పాట వినిపించింది. ఎక్కడినుంచి అని నాభార్యను అడిగితే పక్కింటి టివిలోనుంచి అని చెప్పింది. ఈ పాటంటే నాకు చాలా ఇష్టం. ఏదో ఛానల్లో లవకుశ సినిమా పాట వస్తున్నట్లుందనుకుని మా ఇంట్లో టివి ఆన్ చేసా. ‘లవకుశ’ సినిమానే వస్తున్నది. ఇక అన్నీ మానేసి ఆ సినిమా చూస్తూ కూర్చున్నా. మూడున్నర గంటల తరువాత సినిమా అయిపోగానే ఈ లోకంలోకి వచ్చా. అలసటగా అనిపించి కాస్త తిని పడుకున్నా. లేచేటప్పటికి సాయంత్రం అయిపోయింది. ప్రసంగానికి వెళ్ళే సమయం సమీపిస్తుండడంతో గబగబా బయల్దేరివెళ్ళా. సరే. చేరుకున్నా. కానీ ఏం మాట్లాడాలి? సిద్ధం కాలేదుగా... అదే హిత శత్రువు. అప్పటికి మనసుకు సంతోషంగా కనబడుతుంది. కానీ పాడు చేసేస్తుంది. దాన్ని గెలవాలంటే మనోబలం ఉండాలి. లక్ష్యం మీకు జ్ఞాపకం వస్తూ ఉండాలి. అకాలంలో అనవసర విషయాల జోలికి వెళ్ళడం అంటే జీవితాలను పాడు చేసుకోవడమే. అక్కరలేని వయసులో సెల్‌ఫోన్. అర్థంలేని మెసేజ్‌లు, వీడియోలు చూసుకోవడం, పనికిమాలిన గ్రూపుల్లో ఉండడం. ఏ లక్ష్యం లేకుండా అస్తమానూ వీథులవెంట తిరగడం... ఏ పనీ లేదు కాబట్టి పక్కింటివాడిని కలిసి కబుర్లాడడం... కాసేపు మంచి పుస్తకం ఎందుకు చదువుకోవు? మంచి విషయాలు ఎందుకు ధ్యానం చేయవు? నీ చదువు నీవు చదువుకుంటూ కూడా నీ మనసుకు నచ్చిన మంచి హాబీలు.. వీటిని విలాసవిద్యలంటారు. వీటిని అభ్యాసం చేయవచ్చు. నీ చదువు నీవు చదువుకుంటూ...ఒక మృదంగం, ఒక వేణువాయిద్యం, ఒక కర్ణాటక సంగీతం... అలా ఏదయినా అభ్యసించవచ్చు. ఒకప్పడు ఆంధ్రా మెడికల్ కాలేజిలో ఆచార్యుడు, గొప్ప వైద్యుడు అయిన శ్రీపాద పినాక పాణి గారు సంగీతంలో నిష్ణాతుడై చాలా పేరు ప్రఖ్యాతులు గడించాడు. చిట్టచివరకు మహావృద్ధుడై మరణశయ్యపై ఉండి కూడా నేదునూరి కృష్ణ్ణమూర్తిగారిలాంటి విద్వాంసులు, పలువురు శిష్యులు ఆయన మంచం పక్కన నిలబడి కీర్తనలు పాడుతుంటే వింటూ ప్రాణత్యాగం చేసారు. ఆయన ప్రఖ్యాత వైద్యుడయికూడా విలాసవిద్యను కష్టపడి నేర్చుకుని అంత స్థాయికి ఎదిగారు. అందుకే మనిషి తనను ఆకర్షించి పాడుచేసే వాటి వైపుకి వెళ్ళకూడదు. నిగ్రహించుకోగలిగే శక్తి ఉండాలి. అలాగే మీ చదువు మీరు చదువుకుంటూ మీ అభీష్టం మేరకు ఏదో ఒక మంచి విలాసవిద్య నేర్చుకుని దానిలో ప్రావీణ్యం సంపాదించవచ్చు. లేదా పదిమందికి ఉపకారం చేయడానికి మీరేం చేయగలరో అది చేయండి. ఉపకారం చేయాలన్న భావన ఉండాలే కానీ చెయ్యడానికి లక్ష మార్గాలున్నాయి. విద్యార్థులుగా, ఉడుకు నెత్తురుమీదున్న యువతగా మీ సమయాన్ని వథా చేసుకోకుండా దిశానిర్దేశం మీరే చేసుకుని అటువైపుగా కృషిచేసుకుంటూ సాగిపోవాలన్నదే కలాంగారి అభిమతం. ఇది మీ వ్యక్తిత్వ నిర్మాణానికి, మీ కుటుంబ ప్రయోజనాలకు మాత్రమే ఉపకరించేదికాదు. జాతినిర్మాణానికి సంబంధించినంత ప్రాధాన్యతగల అంశం. ఆలోచించి మసలుకోండి. -
సంఘ్, బీజేపీలే దేశానికి శత్రువులు
సాక్షి, హైదరాబాద్: రాజ్యాంగంపై దాడి చేస్తున్న సంఘ్ పరివార్, బీజేపీలే దేశానికి ప్రధాన శత్రువులని, నరేంద్ర మోదీ ప్రభుత్వం గత నాలుగేళ్లలో విధ్వంసం సృష్టించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అమెరికా, ఇజ్రాయెల్‌కు తాకట్టు పెట్టిన మోదీ సర్కారు దేశంలోనూ మత కోణంలో రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. సంఘ్ పరివార్ చేతిలో బీజేపీ ప్రభుత్వం రిమోట్కంట్రోల్గా మారిందని పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సీపీఎం 22వ జాతీయ మహాసభల్లో ఆ పార్టీ ప్రతినిధులకు సౌహార్ద సందేశమిచ్చారు. ‘‘దళితులు, మైనార్టీలను బలి తీసుకుంటున్నారు. లౌకికవాద యువతను చంపేస్తున్నారు. ముఖ్య ప్రభుత్వ పదవులు, యూనివర్సిటీలు, ఇతర సంస్థల్లో ఆర్ఎస్ఎస్ శక్తులు ప్రవేశించాయి. ఫాసిస్ట్ పాలనకు మోదీ సర్కారు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ మతతత్వ సర్కారు అవలంబిస్తున్న విధానాలపై ప్రజల నుంచి నిరసన వస్తోంది. వామపక్ష పార్టీలు మిలిటెంట్ ఉద్యమాలు నిర్వహించి ప్రజలకు విముక్తి కలిగించాలి’’ అని సురవరం అన్నారు. దేశంలో అవినీతి పెరిగిపోయిందని, రైతులు కష్టాల్లో ఉన్నారని పేర్కొన్నారు. కార్పొరేట్ అనుకూల ఆర్థిక వ్యవస్థ కారణంగా దేశంలో 36 కుటుంబాలకే లబ్ధి కలుగుతోందని, సామాన్యుడు ఛిద్రమై పోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో వామపక్షాల ఐక్యత గతం కన్నా ఎంతో అవసరమని స్పష్టంచేశారు. ఈ దిశగా ఉమ్మడి పోరాటాలకు సీపీఐ తమ వంతు సహకారం అందిస్తుందన్నారు. వామపక్షాలు మాత్రమే ప్రజలను ఈ దుస్థితి నుంచి గట్టెక్కించగలవని చెప్పారు. ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదు దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పౌర హక్కులకు ఇంతటి దుస్థితి ఎప్పుడూ లేదని సీపీఐ (ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య ఆరోపించారు. బెంగాల్, త్రిపురల్లో ఓటమి వామపక్ష శ్రేణుల్లో కొంత నిరుత్సాహాన్ని కలిగించిందని అన్నారు. అయితే ఢిల్లీ, మహారాష్ట్రల్లో కార్మిక ఆందోళనలు, నాసిక్–ముంబైల వరకు రైతుల ర్యాలీ, విద్యార్థుల ఆందోళనలు దేశంలో మార్పునకు సంకేతాలుగా కనపడుతున్నాయన్నారు. – దీపాంకర్ భట్టాచార్య, సీపీఐఎంఎల్ నేత సీపీఎం పెద్దన్న పాత్ర తీసుకోవాలి దేశంలో వామపక్ష ఐక్యత కోసం కృషి చేయాల్సిన బాధ్యత సీపీఎంపై ఉందని ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నాయకుడు శివశంకరన్ అన్నారు. దేశంలో ఉన్న వామపక్ష పార్టీల్లో అతిపెద్ద పార్టీ సీపీఎం అని, మహాసభకు హాజరైన వామపక్ష పార్టీలే కాక, విస్తృత వామపక్ష ఐక్య ఉద్యమాలను నిర్మించడంలో సీపీఎం ప్రధాన పాత్ర పోషించాలన్నారు. – శివశంకరన్, ఫార్వర్డ్ బ్లాక్ జాతీయ నేత సవాళ్ల సమయమిది మతానికి రాజకీయ రంగు పులిమి దేశంలోని బీజేపీ ప్రభుత్వం ముందుకెళుతోందని రెవల్యూషనరీ సోషలిస్టు పార్టీ (ఆర్ఎస్పీ) నాయకుడు మనోజ్ భట్టాచార్య వ్యాఖ్యానించారు. సవాళ్లతో కూడుకున్న ఈ సమయంలో వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. – మనోజ్ భట్టాచార్య, ఆర్ఎస్పీ నేత బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలి దేశానికి ప్రస్తుతం మిలిటెంట్ ప్రజాస్వామిక ఉద్యమాలు అత్యవసరమని ఎస్‌యూసీఐ (సీ) నాయకుడు ఆశిష్ భట్టాచార్య అన్నారు. దేశంలోని బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. – ఆశిష్ భట్టాచార్య, ఎస్‌యూసీఐ(సీ) నేత -
హిందూ వ్యతిరేకిని కాను
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా తాను హిందూ వ్యతిరేకిని కాను, అందరివాడినని నటుడు కమల్‌హాసన్ అన్నారు. ఒక తమిళ వారపత్రికలో వస్తున్న ధారావాహిక సీరియల్లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను కొందరికి వ్యతిరేకిని అనే భావం కలిగించేట్లుగా కొందరు వ్యక్తులు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా అందరినీ సమభావంతో చూసేవాడినని తెలిపారు. ఇంట్లోనే పరమ భక్తుడైన అన్న చంద్రహాసన్‌ను పెట్టుకుని హిందూ వ్యతిరేకిగా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. అలాగే ఎంతో భక్తురాలైన కుమార్తె శ్రుతిహాసన్‌ను విభేదించగలనా అని అన్నారు.