ప్రపంచానికి అతి పెద్ద శత్రువు ఉగ్రవాదమని అఫ్ఘానిస్తాన్‌లో భారత రాయబారి డాక్టర్ షైదా మొహమ్మద్ అబ్దాలి పేర్కొన్నారు. ఉగ్రవాదంతో పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నమవుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయ నాలుగో స్నాతకోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన అబ్దాలి మాట్లాడుతూ నిరక్షరాస్యత, పేదరికం వంటిసామాజిక సమస్యలకు ఉగ్రవాదం కారణమన్నారు. వర్సిటీలు శక్తిమంతమైన మానవ వనరుల నిర్మాణ కేంద్రాలుగా మారాలని సూచించారు.