మహేష్ బాబు 'ఎనిమీ' అట..? | Mahesh babu murugadoss movie title enemy | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు 'ఎనిమీ' అట..?

Published Thu, Dec 31 2015 8:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:53 PM

మహేష్ బాబు 'ఎనిమీ' అట..?

మహేష్ బాబు 'ఎనిమీ' అట..?

శ్రీమంతుడు సక్సెస్ తరువాత మహేష్ బాబు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు. గతంలో ఎప్పుడూ ఒక సినిమా సెట్స్ మీద ఉండగా మరో సినిమా గురించి ఆలోచించని ప్రిన్స్, ఈసారి మాత్రం బ్రహ్మోత్సవం షూటింగ్ జరుగుతుండగానే నెక్ట్స్ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే కథాకథనాలు కూడా ఫైనల్ కావటంతో త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ తెలుగు, తమిళ భాషల్లో భారీగా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు నెక్ట్స్ ప్రాజెక్ట్ మాస్ ఆడియన్స్ను ఆకట్టుకునేలా ఉండాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం సినిమాలు క్లాస్ సినిమాలే కావటంతో ఈ సారి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మీద దృష్టి పెట్టాడు. అందుకే తమిళ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్కు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో భారీ బడ్జెట్తో తెరకెక్కించడానికి ప్లాన్ చేస్తున్నారు.

మురుగదాస్ రెగ్యులర్ స్టైల్లో సందేశాత్మకంగా తెరకెక్కనున్న ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. న్యాయవ్యవస్థ మీద పోరాటం చేసే కథతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'చట్టానికి కళ్లు లేవు' అనే టైటిల్ పెట్టాలని భావిస్తున్నారన్న టాక్ వినిపించింది. అయితే తాజాగా ఈ సినిమాకు 'ఎనిమీ' అనే టైటిల్ను పరిశీలిస్తున్నారన్న వార్త టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. ఇదే కనుక ఫైనల్ అయితే పోకిరీ తరువాత నెగెటివ్ టైటిల్తో వస్తున్న మహేష్ సినిమా ఇదే అవుతోంది. అదే సెంటిమెంట్ కూడా వర్క్ అవుట్ అవుతుందని నమ్ముతున్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement