Vishal: దుబాయ్‌ టు చెన్నై | 30 days foreign schedule of Enemy wrapped | Sakshi
Sakshi News home page

Vishal: దుబాయ్‌ టు చెన్నై

Published Tue, Mar 30 2021 6:35 AM | Last Updated on Tue, Mar 30 2021 11:23 AM

30 days foreign schedule of Enemy wrapped - Sakshi

దాదాపు 30 రోజులు ‘ఎనిమీ’ షూటింగ్‌ కోసం దుబాయ్‌లో ఉన్నారు హీరో విశాల్‌. దుబాయ్‌ షెడ్యూల్‌ పూర్తి కావడంతో ఈ చిత్రబృందం చెన్నైకి బయలుదేరింది. ఈ షెడ్యూల్‌లో మేజర్‌గా యాక్షన్‌  సీక్వెన్సెస్‌ను షూట్‌ చేశారు. ఆనంద్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎనిమీ’ చిత్రంలో హీరో ఆర్య మరో లీడ్‌ క్యారెక్టర్‌ చేస్తున్నారు.

ఈ సినిమా నెక్ట్స్‌ షెడ్యూల్‌ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందులో మృణాళినీ రవి, మమతా మోహన్‌దాస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తమన్‌  సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో విడుదల కానుంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. బాలా  దర్శకత్వంలో వచ్చిన ‘అవన్‌  ఇవన్‌  ’(2011) (తెలుగులో ‘వాడు–వీడు’) తర్వాత విశాల్, ఆర్య కలిసి నటిస్తున్న చిత్రం ఇదే కావడం విశేషం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement