మహేష్ బాబు 'ఎనిమీ' అట! | Mahesh, puri jagananth next movie title enemy | Sakshi
Sakshi News home page

మహేష్ బాబు 'ఎనిమీ' అట!

Published Thu, Oct 22 2015 9:32 AM | Last Updated on Fri, Mar 22 2019 1:53 PM

మహేష్ బాబు 'ఎనిమీ' అట! - Sakshi

మహేష్ బాబు 'ఎనిమీ' అట!

'శ్రీమంతుడు' సినిమా సక్సెస్తో మంచి జోష్లో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస సినిమాలకు రెడీ అవుతున్నాడు.  శ్రీకాంత్ అడ్డాల దర్శాకత్వంలో 'బ్రహ్మోత్సవం' లో నటిస్తున్న ప్రిన్స్, ఆ తరువాత చేయబోయే సినిమాలను కూడా ఫైనల్ చేస్తున్నాడు. ప్రస్తుతం 'బ్రహ్మోత్సవం' షూటింగ్కు గ్యాప్ ఇచ్చి హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్న రాజకుమారుడు వీలైనంత త్వరగా ఈ సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడు.

'బ్రహ్మోత్పవం' సినిమా తరువాత మురుగదాస్ డైరెక్షన్లో సినిమా చేయబోతున్నాడు మహేష్. భారీ బడ్జెట్తో తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను మురుగదాస్ స్టైల్ లో మెసేజ్ ఓరియంటెండ్ కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్నారు. ఈ కాంబినేషన్ పై అధికారికంగా ధ్రువీకరించకపోయినా మహేష్, మురుగదాస్ల కాంబినేషన్లో సినిమా  కన్‌ఫర్మ్ అన్న టాక్ వినిపిస్తుంది.

పోకిరి, బిజినెస్మేన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ మరో సినిమాకు రెడీ అవుతున్నాడు. గతంలోనే తమ కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందంటూ ప్రకటించిన పూరి ఆ సినిమాకు 'ఎనిమీ' అనే టైటిల్ను ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తుంది. మురుగదాస్ సినిమాతో పాటు పూరి డైరెక్షన్లో తెరకెక్కబోయే 'ఎనిమీ'ని కూడా ఒకేసారి సెట్స్ మీదకు తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడు మహేష్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement