
నటుడు కమల్‌హాసన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా తాను హిందూ వ్యతిరేకిని కాను, అందరివాడినని నటుడు కమల్‌హాసన్ అన్నారు. ఒక తమిళ వారపత్రికలో వస్తున్న ధారావాహిక సీరియల్‌లో ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారు. తాను కొందరికి వ్యతిరేకిని అనే భావం కలిగించేట్లుగా కొందరు వ్యక్తులు ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రైస్తవులు ఇలా అందరినీ సమభావంతో చూసేవాడినని తెలిపారు. ఇంట్లోనే పరమ భక్తుడైన అన్న చంద్రహాసన్‌ను పెట్టుకుని హిందూ వ్యతిరేకిగా ఎలా ఉండగలనని ప్రశ్నించారు. అలాగే ఎంతో భక్తురాలైన కుమార్తె శ్రుతిహాసన్‌ను విభేదించగలనా అని అన్నారు.