
యువకుడ్ని పట్టుకుని దేహశుద్ధి చేసిన స్థానికులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఘటన
శ్రీకాళహస్తి : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని సంత మైదానం వద్ద శనివారం ఐదేళ్ల బాలికపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన గుర్తుతెలియని యువకుడిని స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. స్థానికుల కథనం మేరకు.. సంతమైదానం సమీప ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలికను గుర్తుతెలియని యువకుడు స్కూటర్ పై తీసుకొచ్చి నిర్మాణంలో ఉన్న ఇంటి మిద్దెపైకి బలవంతంగా ఎత్తుకెళ్లాడు.
అటుగా వెళ్తున్న సుబ్బలక్ష్మి అనే యువతి అతని వాలకంపై అనుమానంతో గమనించింది. ఆపై విషయాన్ని స్థానికులకు చెప్పింది. దీంతో స్థానికులు మిద్దెపైకి వెళ్లి బాలికపై అఘాయిత్యం చేయబోతున్న యువకుడిని పట్టుకుని కరెంట్ స్తంభానికి కట్టేసి చితకబాదారు. అనంతరం ఒకటో పట్టణ పోలీసులకు అప్పగించారు. పోలీసులు యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment