Father Who Assassinated His Daughter Over Love Affair In Tirupati District - Sakshi
Sakshi News home page

Honor Killing: పరువు కోసం కూతురు ప్రాణం తీసిన తండ్రి?.. కడుపునొప్పితో ఆత్మహత్య చేసుకుందంటూ..

Published Fri, Dec 2 2022 12:51 PM | Last Updated on Fri, Dec 2 2022 2:14 PM

Father Who Assassinated His Daughter Over Love Affair In Tirupati District - Sakshi

మునిరాజ నివాసం

సాక్షి, తిరుపతి: చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లిలో పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. వేరే కులం యువకుడిని ప్రేమించిందని.. కన్న కూతురిని తండ్రే హత్య చేసినట్టు బయటపడింది. వివరాలు.. చంద్రగిరికి చెందిన మునిరాజ కుమార్తె మోహనకృష్ణ (19) తల్లి చిన్నతనంలోనే తల్లి మృతి చెందింది. ఈ నేపథ్యంలో ఆమెను ఎగువరెడ్డివారిపల్లిలోని తన మేనమామ బాలకృష్ణ చూసుకుంటున్నారు.

మోహన్‌కృష్ణ ఇంట్లోనే ఉంటూ డిస్టెన్స్‌లో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో నాగయ్యగారిపల్లికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. వేరే కులం యువకుడిని ప్రేమించడాని జీర్ణించుకోలేకపోయిన తండ్రి.. కూతురిని హత్య చేశాడు. ఆపై కడుపునొప్పి తాళలేక మోహనకృష్ణ ఆత్మహత్య చేసుకుందని అందరినీ నమ్మించాడు. పోలీసులకు కూడా ఆ విధంగానే ఫిర్యాదు చేశాడు. అయితే, పోస్టుమార్టంలో అమ్మాయిది హత్య అని తేలడంతో తండ్రి మునిరాజ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
చదవండి: వద్దన్నా.. వినకుండా ఈవెంట్‌ బృందంతో వెళ్లి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement