
చంద్రగిరి: సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో తిరుపతి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కలిసికట్టుగా ముందుకెళ్తామని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, తుడా చైర్మన్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చెప్పారు. పార్టీ నేతలతో తిరుపతిలో శుక్రవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు.
డిప్యూటీ సీఎం, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్కే రోజా, ఎంపీలు గురుమూర్తి, రెడ్డెప్ప, ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, బియ్యపు మధుసూదన్‌రెడ్డి, కోనేటి ఆదిమూలం, వరప్రసాద్, ఎమ్మెల్సీలు భరత్, కల్యాణ్‌చక్రవర్తి, తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష, చిత్తూరు, నెల్లూరు జిల్లా పరిషత్‌ల చైర్‌పర్సన్‌లు శ్రీనివాసులు, అరుణమ్మ తదితరులు పాల్గొన్నారు. చెవిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వైఎస్సార్‌సీపీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దుతామని చెవిరెడ్డి స్పష్టం చేశారు. (క్లిక్: చంద్రబాబుకు ఇన్ని రోజులు తెలివితేటలు లేవా..)
Comments
Please login to add a commentAdd a comment