సాక్షి, ప్రకాశం : తనని జైల్లో పెట్టినా పోరాటం కొనసాగిస్తానని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తనపై నమోదు చేసిన అక్రమ కేసులపై ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు. కేసులకు భయపడి పారిపోను. 2014 నుండి 2019 వరకు 88 కేసులు పెట్టారు. ఏం చేశారు?. నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయను.. నేను ఎక్కడికి పారిపోను. నన్ను జైల్లో పెట్టిన పోరాటం కొనసాగిస్తా. నాపైకి పెట్టిన కేసుకు ముందస్తు బెయిల్ కూడా అప్లై చేయను.
బిడ్డ ఆపదలో ఉందని తన తండ్రి ఫోన్ చేశారు. వెంటనే స్పందించి బాధితురాలికి మెరుగైన వైద్యం అందించా. బిడ్డ కుటుంబాన్ని కూటమి నేతలు పరామర్శించారా? అని ప్రశ్నించారు. నాపై కేసులు పెడితే.. కార్యకర్తలు భయభ్రాంతులకు గురవుతారు అని అనుకుంటున్నారు. కానీ అలాంటివేవి జరగవు’ అని చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment