
కమలాపురంలో చంద్రబాబు రా..కదలిరా సభ అట్టర్‌ప్లాప్ అయ్యింది.
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కమలాపురంలో చంద్రబాబు రా..కదలిరా సభ అట్టర్‌ప్లాప్ అయ్యింది. అబద్ధాలు, అవాస్తవాలతో చంద్రబాబు ప్రసంగం ఆకట్టుకోలేకపోయింది. చంద్రబాబు తన ప్రసంగంలో రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.
చంద్రబాబు సభకు జన సమీకరణలో టీడీపీ నేతలు విఫలమయ్యారు. చంద్రబాబు ప్రసంగం పూర్తికాక ముందే కుర్చీలు ఖాళీ అయ్యాయి. మద్యం ధరలపై చంద్రబాబు మాట్లాడుతుండగా సభలో మందుబాబులు క్వాటర్ బాటిళ్లు చూపించారు. టికెట్లపై స్పష్టమైన హామీ ఇస్తారనుకున్న ఆశావహులు.. బాబు నుంచి క్లారిటీ రాకపోవడంతో వెనుదిరిగారు.