ఒకే రోజు ఇద్దరు నేతల సభలు జరిగాయి. ఆ సభలలో వారు మాట్లాడిన విషయాలు మీడియాలో రిపోర్టు అయ్యాయి. ఆ నేతలు ఎవరో కారు. ఒకరు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిమోహన్ రెడ్డి కాగా, మరొకరు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పీచ్‌కు, చంద్రబాబు స్పీచ్‌కు ఎంత తేడా ఉందో పరిశిలిస్తే పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఉపన్యసించింది పార్టీ క్యాడర్‌కు సంబంధించిన సభలో కాగా, చంద్రబాబు మాట్లాడింది రా..కదలిరా.. అన్న సభలో. జనం విషయంలో ఈ రెండిటిని పోల్చనవసరం లేదు. ఉత్తరాంధ్ర అంతటికీ కలిపి భీమిలి వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ నిర్వహించిన సభలో లక్షల మంది హాజరయ్యారు. చంద్రబాబు సభలు ఉరవకొండ, పీలేరు నియోజకవర్గాలకు సంబంధించినవి. అయినప్పటికీ ఈ రెండు సభలలో కనిపించిన స్పందనను పోల్చవచ్చు. భీమిలి సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతి విషయానికి విపరీతమైన రెస్పాన్స్ కనిపించింది. అదే చంద్రబాబు సభలో ముందు భాగంలో ఉన్నజనం మినహాయిస్తే వెనుకవైపు అంతా ఖాళీగా కనిపించడం సాధారణం అయిపోయింది. స్పందన కూడా అంతంతమాత్రమే. అన్నిటికన్నా ముఖ్యమైన సంగతి ఏమిటంటే? వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన ప్రభుత్వం ఏమి చేసిందో, తద్వారా ప్రజలకు ఎలాంటి మేలు జరిగిందో వివరించడానికి ప్రాధాన్యత ఇచ్చారు. అదే చంద్రబాబు నాయుడు ఎక్కడా తన పద్నాలుగేళ్ల పాలనలో ఫలానాది సాధించాను.. అని చెప్పలేకపోయారు.
ఈ విషయం ఆదివారం నాడు తెలుగుదేశం భజనపత్రిక ఈనాడులో వచ్చిన వార్తను చదివితే అర్దం అవుతుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనసభలో యుద్దానికి సిద్దమా! అని తన క్యాడర్‌ను ప్రశ్నించి వారి నుంచి సిద్దం అనే జవాబును రాబట్టుకున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి శంఖం పూరించి, నగరా మోగించిన ఘట్టం అక్కడ ఉన్న లక్షలాది మందిని ఆకట్టుకుంది. చంద్రబాబు తన సభలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు సమాధానం చెబుతున్నట్లుగా సమరానికి సై అన్నారు. దానిని ప్రధాన హెడింగ్‌గా ఈనాడు పెట్టుకుంది.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన స్పీచ్‌లో చెప్పిన కొన్ని విషయాలు చూద్దాం. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కురుక్షేత్ర యుద్దానికి సిద్దమయ్యామని, తమను పాండవులుగా ఆయన అభివర్ణించుకుంటూ ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదని, అర్జునుడు అని, టీడీపీ, జనసేన, రామోజీ, రాధాకృష్ణల వంటివారి కుట్రలను ఎదుర్కోబోతున్నానని, అర్జునుడు మాదిరి ఎదుటివారు పద్మవ్యూహం పన్నినా తాను ఛేదించగలనన్న అర్ధం వచ్చేలా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాట్లాడారు. 175 సీట్ల లక్ష్యం గురించి మరోసారి ఉద్ఘాటించి చంద్రబాబు కూడా గెలవడానికి లేదని ధీమాగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. చంద్రబాబు హామీలు, తన హామీలను పోల్చి వివరిస్తూ.. ఇది అబద్దానికి, నిజానికి మద్య ఉన్న యుద్దం అని ఆయన అన్నారు.
తద్వారా చంద్రబాబు 2014లో వందల కొద్ది హామీలు ఇచ్చి 90శాతం ఎగ్గొట్టిన వైనాన్ని, తాను ఇచ్చిన హామీలలో 99శాతం పూర్తి చేసిన తీరును వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అందరికీ అర్ధం అయ్యేలా వివరించారు. వృద్దాప్య పెన్షన్లను ఇళ్లవద్దే అందిస్తున్నామని, బడులను మార్చివేశామని, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ క్లీనిక్స్ మొదలైన మార్పులను ఆయన సభలో గుర్తు చేశారు. ఆ రకంగా చంద్రబాబు తన సభలలో చెప్పినట్లు కనిపించలేదు. ఈనాడు పత్రికలో ఒక్క లైన్ కూడా అలాంటివాటి ప్రస్తావన లేకపోవడమే ఇందుకు నిదర్శనం. ప్రత్యేకించి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తెచ్చి ప్రపంచంతో పోటీ పడే విద్యను అందిస్తున్నామని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తెలిపారు.
సీబీఎస్‌ఈ, బైజూస్ కంటెంట్, పిల్లలకు టాబ్‌లు ఇలా ఏ రకంగా చూసినా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మార్పు కనిపిస్తుందని ఆయన ధైర్యంగా చెప్పగలిగారు. అదే చంద్రబాబు తన సభలలో తన మార్పు ఏమిటో ఎక్కడా చెప్పలేకపోతున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రెండున్నర లక్షల కోట్లను ప్రజల ఖాతాలలతో వేసిన విషయాల గురించి చెబుతూ, చంద్రబాబు టైమ్ లో పేదల బ్యాంకు ఖాతాలను, తన పాలన టైమ్ లో బ్యాంక్ ఖాతాలలో జమ అయిన డబ్బును చూసుకోవాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అనడం విశేషం. ముప్పై ఒక్క లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల ఇళ్ల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. చంద్రబాబు టైమ్ లో ఎవరికీ ఇళ్ల స్థలం ఇవ్వలేకపోయారు. అది కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికు కలిసి వచ్చే పాయింట్.
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన స్పీచ్ లో కొన్ని అంశాలనే ప్రస్తావించారు. నిజానికి ఉత్తరాంధ్రలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను కూడా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పి ఉండి ఉంటే ఇంకా బాగుండేది. మూలపేట పోర్టు, సమీపంలోనే ఫిషింగ్ హార్బర్, గిరిజన విశ్వవిద్యాలయం, పలాసలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకోసం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, భారీ నీటి పథకం, విశాఖలో ఐటి రంగంలో వస్తున్న కంపెనీలు మొదలైన వాటి గురించి కూడా వివరించి ఉండాలి. ఇన్ని లక్షల మంది హాజరైన సభలో అవి కూడా చెప్పి ఉండాల్సిందని ఎక్కువ మంది భావన. అయితే ఇతర వ్యక్తులు ఆ విషయాలన్ని ప్రస్తావించారు. అది వేరే సంగతి.
చంద్రబాబు తన స్పీచ్‌లో ఎంతసేపు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిను తిట్టడం, శాపనార్దాలు పెట్టడానికే ప్రాధాన్యం ఇచ్చారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విద్య, వైద్యరంగాల గురించి, ప్రజలకు వాటి ఆవశ్యకత గురించి ప్రసంగిస్తుంటే, చంద్రబాబు మాత్రం మద్యం గురించి ఎక్కువ మాట్లాడి అప్రతిష్టపాలవుతున్నారనిపిస్తుంది. మద్యం ధరలు, బ్రాండ్ల గురించి 74ఏళ్ల వయసులో మాట్లాడడం ఏ మాత్రం బాగోలేదు. ప్రజలకు మద్యం సేవించవద్దని చెప్పాల్సిన నేత, వాటిని ఎలా తాగాలో చెబుతున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాలనలో దెబ్బతినని రంగం లేదని చంద్రబాబు అంటున్నారు. కాని ఏ రంగం ఎలా దెబ్బతిందో చెప్పలేకపోతున్నారు. స్కూళ్లను బాగు చేయడం మంచిది కాదని, విలేజ్ క్లినిక్స్ పెట్టడం సరికాదని, ఇళ్లవద్దకే పెన్షన్లు తీసుకువెళ్లి వృద్దులకు ఇవ్వడం తప్పని, వాలంటీర్ల వ్యవస్థ వృధా అని, గ్రామ, వార్డు సచివాలయాలు అనవసరమని కూడా చంద్రబాబు అనగలరా? ఆ ఊసులే చంద్రబాబు తేలేకపోతున్నారు.
మరి ఏ రంగం నష్టపోయింది?.. అంటే తను విమర్శించడానికి సబ్జెక్ట్ లేక, జనరల్‌గా విమర్శలు చేస్తూ పెద్ద గొంతుతో మాట్లాడుతున్నారనిపిస్తుంది. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తన స్కీమ్‌ల వల్ల లబ్ది పొందినవారంతా తన స్టార్ కాంపెయినర్స్ అని అంటే, చంద్రబాబు దానికి పోటీగా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బాధితులు తన స్టార్ కాంపెయినర్లు అని చెబుతున్నారు. ఇంతకీ ఎవరు బాధితులో చెప్పలేకపోయారు. వైఎస్ఆర్సీపీలో సీట్ల కేటాయింపు, కొన్ని అసంతృప్తులు మొదలైనవి చంద్రబాబు మాట్లాడడం తెలివితక్కువతనంగా కనిపిస్తుంది.
ఎందుకంటే తెలుగుదేశం, జనసేన పొత్తు నేపథ్యంలో పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు, కొన్ని చోట్ల టీడీపీలో గొడవలు పెట్టుకుని ఎదుటివారిని అంటే ప్రజలు తెలుసుకోలేరనుకుంటే భ్రమే అవుతుంది. అంతేకాదు.. ఇంతకాలం లోకేష్ రెడ్ బుక్ అని ప్రచారం చేసి నవ్వులపాలైతే, చంద్రబాబు కూడా అదే బాటలో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతల చిట్టా రాస్తున్నానని, అందరిని అరెస్ట్ చేస్తానని చెప్పడం ద్వారా బెదిరింపు రాజకీయాలకే ప్రాదాన్యం ఇవ్వాలని చూస్తున్నారు. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ను రాయలసీమ ద్రోహి అని పిచ్చి ఆరోపణ చేశారు కాని, దానికి సంబంధించిన ఆధారాలు చూపలేదు.
నిజానికి పోతిరెడ్డి పాడు ప్రాజెక్టు విస్తరణకు అడ్డుపడిన చంద్రబాబు ద్రోహి అవుతారు కాని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎలా అవుతారు? అవుకు రెండో టన్నెల్‌ను, వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎలా ద్రోహి అవుతారు. పద్నాలుగేళ్లు అధికారంలో ఉన్నా.. చేయని చంద్రబాబు ద్రోహి అవుతారు! కానీ.. ఏది ఏమైనా వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభ సూపర్ హిట్ అవడం, ఒక నిర్దిష్ట లక్ష్యం సాధించినట్లుగా కనిపిస్తే, చంద్రబాబుది రొటీన్‌గా రొడ్డకొట్టుడు ఫ్లాఫ్ సభగా మిగిలింది. ఒక ఎజెండా లేకుండా, ప్రజలకు ఏమి చేస్తామో చెప్పలేక నిస్సహాయస్థితిలో చంద్రబాబు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారన్న విషయం తేలికగానే అర్ధం అవుతుంది.
:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment