
తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల పాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రేపు, ఎల్లుండి(మంగళ, బుధ వారాలు) పులివెందులలో వైఎస్ జగన్ పర్యటన చేపట్టనున్నారు. రేపు నియోజకవర్గ ప్రజలకు వైఎస్ జగన్ అందుబాటులో ఉండి వారి సమస్యలను వింటారు. అనంతరం ఎల్లుండి వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్ ను వైఎస్ జగన్ ప్రారంభిస్తారు.
వైఎస్ జగన్ పులివెందుల పర్యటన షెడ్యూల్ ఇదే..
రేపు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి 11.45 గంటలకు పులివెందుల చేరుకుంటారు, స్ధానికంగా అందుబాటులో ఉంటారు. బుధవారం ఉదయం 10 గంటలకు పులివెందుల గుంత బజార్ రోడ్డులో వైఎస్సార్ ఫౌండేషన్, ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్ట్సిట్యూట్ సంయుక్తంగా ఆధునీకరించిన అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వైయస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభిస్తారు.