పులివెందులలో సీఎం జగన్‌ పర్యటన | AP CM YS Jagan Pulivendula Tour Live Updates, Highlights In Telugu - Sakshi
Sakshi News home page

CM Jagan Pulivendula Visit Highlights: సీఎం జగన్‌ పులివెందుల పర్యటన.. అప్‌డేట్స్‌

Published Mon, Mar 11 2024 9:26 AM | Last Updated on Mon, Mar 11 2024 4:13 PM

LIVE Updates: AP CM YS Jagan Pulivendula Tour Details - Sakshi

AP CM YS Jagan Pulivendula Tour Updates

ఆదిత్యా బిర్లా గార్మెంట్స్‌ యూనిట్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌
►ఆదిత్యా బిర్లా యూనిట్‌ ఫేజ్‌-1 ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం జగన్‌
 

వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

►వైఎస్సార్‌ పార్క్‌లో చిల్డ్రన్‌ పార్క్‌, గార్డెన్‌ నిర్మాణం. 

►రూ.39.13 కోట్లతో వైఎస్సార్‌ మెమోరియల్‌ పార్క్‌ నిర్మాణం. 

పులివెందులలో మినీ సెక్రటేరియెట్‌ ప్రారంభించిన సీఎం జగన్‌

►పులివెందుల నియోజకవర్గంలో డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌

►ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌

►ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా కాంప్లెక్స్‌ నిర్మాణం

వైఎస్సార్‌ విగ్రహావిష్కరణ చేసిన సీఎం జగన్‌

►పాత బస్టాండ్ సర్కిల్ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

►వైఎస్సార్ సర్కిల్‌లో వైఎస్సార్ విగ్రహం ఆవిష్కరించిన సీఎం జగన్

బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ ప్రారంభం..

►పులివెందులలో బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్‌ను ప్రారంభించిన సీఎం జగన్‌

►రూ.20 కోట్ల రూపాయల వ్యయంతో ప్యాక్‌ హౌస్‌ను నిర్మించిన ప్రభుత్వం

►బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ వల్ల రైతులకు ఉపయోగం

►అరటి నాణ్యత ఆధారంగా ఎగుమతులకు అవకాశం

పులివెందులలో డాక్టర్‌ వైఎస్సార్‌ సర్వజన(జనరల్‌) ఆస్పత్రి ప్రారంభం

పులివెందులలో వైఎస్అర్ మెడికల్ కాలేజీ, అసుపత్రిని ప్రారంభించిన సిఎం వైఎస్ జగన్ 

అసుపత్రిలో డాక్టర్ వైఎస్అర్ విగ్రహాన్ని అవిష్కరించిన సీఎం జగన్‌

మెడికల్ కళాశాల, అసుపత్రికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రికి వివరించిన వైద్య అరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరి కృష్ణబాబు

కార్యక్రమంలో పాల్గొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజు, స్దానిక నాయకులు

పులివెందులలో మెడికల్ కాలేజీ
►51 ఎకరాల్లో, రూ. 500 కోట్ల వ్యయంతో నిర్మితం
►డా. వైయస్సార్ పులివెందుల ప్రభుత్వ మెడికల్ కాలేజ్ తరగతులు 2024-25 విద్యా సంవత్సరం నుండి ప్రారంభం


► ఆస్పత్రి నిర్మాణ పనుల్ని పరిశీలించిన సీఎం జగన్‌

►స్థానిక సిబ్బందితో నేరుగా మాట్లాడి వాళ్ల ఇబ్బందులు, సమస్యలు అడిగి తెలుసుకుంటున్న సీఎం జగన్‌

►ఆ సమస్యల్ని నోట్‌ చేసుకోవాలని ఎంపీ అవినాష్‌రెడ్డికి సీఎం జగన్‌ సూచన

►అధికారుల సమక్షంలోనే అక్కడికక్కడే వాళ్ల సమస్యల పరిష్కారానికి యత్నిస్తున్న సీఎం జగన్‌

వైఎస్సార్‌ ఆస్పత్రికి చేరుకున్న సీఎం జగన్‌

►పులివెందుల పర్యటనలో.. డాక్టర్‌ వైఎస్సార్‌ గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్‌

►మెడికల్‌ సిబ్బందిని పలు వివరాలు అడిగిన తెలుసుకున్న సీఎం జగన్‌

► పలువురికి సీఎం జగన్‌ అభినందనలు

►కాసేపట్లో సీఎం జగన్‌ చేతుల మీదుగా కాలేజ్‌ ప్రారంభం
 

పులివెందులకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్

►రోడ్డు మార్గాన మెడికల్ కాలేజీ వద్దకు బయలుదేరిన సీఎం జగన్‌

►కడప విమానాశ్రయానికి చేరుకున్న సీఎం జగన్‌. 
►ముఖ్యమంత్రి జగన్‌కు స్వాగతం పలికిన అధికారులు, జిల్లా నేతలు 

పులివెందుల బయల్దేరిన సీఎం జగన్‌

►వైఎస్సార్‌ జిల్లా పులివెందుల పర్యటన కోసం తాడేపల్లి నుంచి బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌
►కాసేపట్లో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించనున్న సీఎం

  • సొంత నియోజక వర్గమైన పులివెందులలో పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాల్లో పాల్గొంటారు.
  • అక్కడి నుంచి బయలుదేరి డాక్టర్‌ వైఎస్సార్‌ మినీ సెక్రటేరియట్‌ కాంప్లెక్స్‌కు చేరుకుని దానిని ప్రారంభిస్తారు.
  • ఆ తర్వాత డాక్టర్‌ వైఎస్సార్‌ జంక్షన్‌ కు వెళ్లి ప్రారంభిస్తారు. అక్కడే సెంట్రల్‌ బౌల్‌ వార్డ్‌ ప్రారంభించిన తర్వాత వైఎస్‌ జయమ్మ షాపింగ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు.
  • పులివెందులలో గాంధీ జంక్షన్‌కు చేరుకుని ప్రారంభించిన అనంతరం డాక్టర్‌ వైఎస్సార్‌ ఉలిమెల్ల లేక్‌ ఫ్రంట్‌‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఆదిత్యా బిర్లా యూనిట్‌కు చేరుకుని ఫేజ్‌-1 ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.
  • అనంతరం వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement