
సాక్షి,ఏలూరుజిల్లా: మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు జిల్లా పర్యటన సందర్భంగా కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఉంగుటూరు మండలం చేబ్రోలు రైతు సేవ కేంద్రం వద్ద టీడీపీ, జనసేన నాయకుల మధ్య తోపులాట జరిగింది.
చేబ్రోలులో మినుము విత్తనాలను మంత్రి చేతుల మీదుగా అందించడానికి పలువురు రైతులను అధికారులు గుర్తించారు.అయితే ఈ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆ రైతులందరూ టీడీపీ వారేనని జనసేన శ్రేణులు ఆందోళనకు దిగారు.
దీంతో టీడీపీ,జనసేన నాయకుల మధ్య వాగ్వాదం,తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తం కాకుండా ఇరువర్గాలను పోలీసులు సముదాయించారు.
ఇదీ చదవండి: బాబు ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువు