
భీమవరంలో కురిశేటి విశ్వనాథం అల్లుడు నారాయణఅఖిల్ 125 రకాల వంటలతో భోజనం చేస్తున్న దృశ్యం
సాక్షి, భీమవరం: సంక్రాంతి సందర్భంగా ఒకే కుటుంబంలోని సభ్యులు పెద్ద పెద్ద అరటి ఆకుల్లో వరుసగా కూర్చుని భోజనం చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన పంజా మాణిక్యాలరావు సోదరుల సంతానమంతా సంక్రాంతి పండుగను వేడుకగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ఉన్న కుటుంబ సభ్యులంతా కలవడంతో పండుగ రోజుల్లో ఉత్సాహంగా గడిపారు. దీనిలో భాగంగానే పెద్ద పెద్ద అరటి ఆకులు వేసుకుని అందరూ సహపంక్తి భోజనం చేస్తున్న ఫొటో వాట్సప్‌లో రావడంతో వాటికి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. చదవండి: అతిథిలా వచ్చిన నగల దొంగ దొరికాడు
ఇప్పటికే భీమవరం పట్టణంలో కురిశేటి కాశీవిశ్వనాథం ఇంటిలో అల్లుడు నారాయణ అఖిల్‌కు 125 రకాల వంటలతో భోజనం పెట్టడం చర్చనీయాంశమైంది. ఒకే టేబుల్‌పై వెండి పళ్లెంలో వివిధ రకాల పిండి వంటలు, స్వీట్స్, కూరలు, ఐస్‌క్రీమ్ వంటివి వడ్డించారు. ఈ ఫొటోలకు కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది.
పంజా వేమవరంలో అరటి ఆకులో సహపంక్తి భోజనం చేస్తున్న దృశ్యం
Comments
Please login to add a commentAdd a comment