
సాక్షి, భీమవరం: గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సాకారం చేయబోతున్నారని ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. సోమవారం భీమవరం వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ..గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసి లక్షలాది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారన్నారు. గ్రామ స్వరాజ్యం గురించి ఇప్పటిదాకా విన్నామని.. వైఎస్ జగన్ పాలనలో కళ్లారా చూడబోతున్నామన్నారు.దేశంలో మిగతా రాష్ట్ర్రాలు కూడా జగన్ నాయకత్వాన్ని అనుసరించే విధంగా ఏపీలో పాలన సాగుతోందన్నారు.మళ్లీ మన రాష్ట్ర్రం రాజన్న రాజ్యం చూస్తోందని తెలిపారు.