దత్తపుత్రుడిలో కూడా ఈ మధ్య బీపీ కనిపిస్తోంది: సీఎం జగన్‌ | CM Jagan Powerful Speech Highlights At Bhimavaram Memantha Siddham Meeting, Details Inside - Sakshi
Sakshi News home page

దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు, మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు: సీఎం జగన్‌

Published Tue, Apr 16 2024 5:55 PM | Last Updated on Tue, Apr 16 2024 9:37 PM

Cm Jagan Powerful Speech At Bhimavaram Memantha Siddham Meeting - Sakshi

చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ

రాళ్లు వేయండి.. అంతమోందించండని పిలుపునిస్తున్నాడు

నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నాడు

ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తుంది

ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా?

భీమవరం ‘మేమంతా సిద్ధం’ బహిరంగ సభలో సీఎం జగన్‌

సాక్షి, పశ్చిమగోదావరి: సంక్షేమ, రైతు రాజ్యాన్ని చంద్రబాబు కూటమి అంతం చేయాలని చూస్తోందని మండిపడ్డారు ముఖ్యమంత్రి వైఎస్‌​ జగన్‌మోహన్‌రెడ్డి. కూటమి కుట్రలను ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. సాధ్యంకానీ హామీలతో బాబు మళ్లీ వస్తున్నాడని.. ఆయనకు ఓటేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయని అన్నారు. మీ బిడ్డ వైఎస్‌ జగన్‌ది పేదలపక్షమని.. తనకు ఓటేస్తే జరుగుతున్న మంచి కొనసాగుతుందని పేర్కొన్నారు.

సీఎం జగన్‌ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 16వ రోజు మంగళవారం ఉమ్మడి పపశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. భీమవరంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు, పవన్‌ కల్యాణ్‌లపై నిప్పులు చెరిగారు. మోసాలు పొత్తులను నమ్ముకొని బాబు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఒక్కటయ్యాయన్నారు. వీళ్లందరూ నాపై బాణాలు ఎక్కుపెట్టారు. వారి బాణాలు తగిలేవి.. జగన్‌కా? సంక్షేమ పథకాలకా? అని సభకు హాజరైన అవేష జనవాహినిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు.

సీఎం జగన్‌ ప్రసంగం

  • మంచి చేసి మనం.. జెండాలు జతకట్టి వారు.. తలపడబోతున్న ఎన్నికలు ఇవి
  • పేదలకు, చంద్రబాబు మోసాలకు జరుగుతున్న ఎన్నికలు ఇవి. 
  • మీ ఓటు.. ఐదేళ్ల భవిష్యత్తు.
  • ఈ ఎన్నికలు మన తలరాతను మార్చేవి.
  • జరుగుతున్న మంచిని కొనసాగించేందుకు మీరంతా సిద్ధమే..
  • దుష్టచతుష్టయ కూటమిని అడ్డుకునేందుకు మీరంతా సిద్ధమా?

నాకేదో అయిపోవాలని చంద్రబాబు ఆరాటం

  • చంద్రబాబుకు నాపై కోపం ఎక్కువ.
  • నాకేదో అయిపోవాలని శాపనార్థాలు పెడుతున్నాడు
  • రాళ్లు వేయండి.. అంతమోందించండని పిలుపునిస్తున్నాడు.
  • చంద్రబాబును ఆడగకూడని ప్రశ్న అడిగా. అందుకే కోపం ఎక్కువా.
  • బాబు, బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తింటూ మరోవైపు  జపం చేస్తున్నట్లు నటిస్తావెందుకని బాబును అడిగా.
  • చంద్రబాబు పేరు చెబితే.. పేదలకు గుర్తుకు వచ్చే ఒక్క పథకమైనా ఉందా?
  • ఆయన పేరు చెబితే గుర్తుకు వచ్చేది కుట్ర మోసం, వెన్నుపోటు

నాలుగేళ్లకొకసారి కార్లు మార్చినట్లు దత్తపుత్రుడు భార్యలను మారుస్తున్నాడు

  • ఇప్పుడు నియోజకవర్గాలను సైతం అలవోకగా మారుస్తున్నాడు.
  • దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లల్ని పుట్టించి భార్యలను వదిలేశాడు
  • దత్తపుత్రా.. ఒకసారి చేస్తే పొరపాటు.. మళ్లీ మళ్లీ చేస్తే అది అలవాటు అంటారు.
  • దత్తపుత్రా.. ఆడవాళ్ల జీవితాలను నాశనం చేయడం, చులకనగా చూడటం తప్పు కాదా?
  • ఇదేం అన్యాయం అని దత్తపుత్రుడిని అడిగితే ఆయనకు కూడా ఈ మధ్య బీపీ వస్తుంది.. ఊగిపోతా అంటాడు
  • ఇలా అడిగినందుకు బాబుకు, దత్తపుత్రికిడి, చంద్రబాబు వదినకు కూడా కోపం వస్తుంది.

లంచాలు, వివక్ష లేకుండా 2.70 లక్షల కోట్లుపేదల ఖాతాల్లో వేశాం

  • నాడు-నేడు ద్వారా విద్య, వైద్యరంగంలో మార్పులు తీసుకొచ్చాం
  • మీ బిడ్డకు రైతన్న, అక్కాచెల్లెమ్మలు, అవ్వాతాతలు తోడుగా ఉన్నారు 
  • ఇంతమంది తోడుగా ఉన్న మీ జగన్‌ ఎప్పుడూ ఒంటరికాదు.

రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి

  • చంద్రబాబు జీవితమంతా వెన్నుపోట్లు, కుట్రలు, పొత్తులతో రాజకీయాలు చేస్తున్నారు
  •  దలకు మంచి చేసిన ఒక్క జగన్‌కు వ్యతిరేకంగా చంద్రబాబు కూటమి యుద్ధానికి వస్తున్నారు
  • రొయ్యకు మీసం, బాబు మోసం పుట్టుకతో వచ్చాయి
  • చంద్రబాబుకు అభివృద్ధికి అసలు సంబంధమే లేదు
  • విపక్షాలు విసిరే బాణాలు జగన్‌కు తగులుతున్నాయా? ప్రజలకు తగులుతున్నాయా?
  • బాబు వస్తే జాబ్‌లు రావడం కాదు.. ఉన్నవి కూడా ఊగిపోతాయి.
  • సంక్షేమ పథకాలు అందుకున్న వారు నాతో ఉన్నారు.
  • 2014లో రంగురంగుల మేనిఫెస్టో ఇంటింటికీ పంపిణీ చేసిన కూటమి నేతలు హామీలు గాలికొదిలారు
  • జగన్‌కు అనుభవం లేదని. బాబుకు అనుభవం ఉందని ఊదరగొట్టారు
  • ఇదిగో మైక్రోసాఫ్ట్‌, అదిగో సింగపూర్‌ అంటూ బాబు సెల్ఫ్‌ డబ్బా కొట్టుకున్నారు.
  • ఇన్ని అబద్దాల తర్వాత చంద్రబాబు సింగపూర్‌ కట్టాడా?బుల్లెట్‌ ట్రైన్‌ వచ్చిందా? ఒలింపిక్స్‌ జరిగాయా?
    జగన్‌ వస్తేనే ఇంకా ఇంకా అభివృద్ధి అనేది ప్రోగ్రెస్ రిపోర్టు కాదా?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement