
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆదివారం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు కావడంతో ముఖ్య నేతలను అంబర్‌పేటలోని కొబ్బరి తోటలో జరిగే విందుకు ఆహ్వానించారు.
టీడీపీ నేతకు చెందిన ఆ తోటలో జరిగిన విందు కార్యక్రమం అనంతరం అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి సొంత గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చర్చనీయాంశంగా మారింది. విందు పూర్తయిన తర్వాత మహిళలను వేదికపై ఎక్కించి తెలుగు తమ్ముళ్లు అసాంఘిక కార్యకలాపాలు సాగించారు. ఇద్దరు అర్థనగ్న దుస్తులతో ఉన్న మహిళలతో తెలుగు తమ్ముళ్లు సైతం చిందులేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగుచూడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment