Obscene dances
-
ఆధ్యాత్మికం మాటున అశ్లీలం
ఆత్మకూరు: ఎన్నికల వేళ పోలీస్ వ్యవస్థ మరీ బరితెగించింది. అధికారం కోసం తల్లడిల్లుతున్న టీడీపీ నేతలు సాగించే అరాచకాలు, అసాంఘిక కార్యకలాపాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారు. ఓ వైపు ఎన్నికల కోడ్‌తో పాటు పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది. ఈ తరుణంలో గ్రామాల్లో ఉత్సవాల పేరిట అశ్లీల నృత్యాలతో టీడీపీ నేతలు అశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నారు. ఆత్మకూరు, మర్రిపాడు, ఏఎస్‌పేట ప్రాంతాల్లో దైవ ఉత్సవాల్లో ఆధ్యాత్మికం మాటున అశ్లీల నృత్యాలను టీడీపీ నేతలు నిర్వహిస్తున్నారు. దశాబ్దాల క్రితమే నిషేధించిన అశ్లీల నృత్యాలు (రికార్డింగ్ డ్యాన్స్‌లు)కు ఆత్మకూరు డివిజన్ పోలీస్ యంత్రాంగం అధికారికంగా అనుమతులిస్తోంది. సాంస్కృతిక కార్యక్రమాలకు అనుమతులివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కోరినా ససేమిరా అంటున్న పోలీసులు.. టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించే అశ్లీల నృత్యాలను చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆత్మకూరు మండలం ఆరవేడు జంగాలపల్లిలో రాములోరి ఉత్సవాల ముగింపు సందర్భంగా సాంస్కృతిక నృత్యాలకు శుక్రవారం రాత్రి అనుమతులు పొందిన టీడీపీ వారు అర్ధరాత్రి సమయంలో అశ్లీల నృత్యాలు వేశారని గ్రామస్తులు తెలిపారు. గడిచిన వారం వ్యవధిలో ఏఎస్‌పేట మండలం గుంపర్లపాడు, అక్బరాబాద్, తెల్లపాడు గ్రామాల్లో అశ్లీల నృత్యాలను విచ్చలవిడిగా వేశారని గ్రామస్తులు ఆరోపించారు. తెల్లపాడులో గ్రూప్ డ్యాన్స్‌లను విచ్చలవిడిగా చేశారని, దీనిపై పోలీసులకు ఫోన్ చేస్తే పూర్తి స్థాయిలో సిబ్బంది లేరని సమాధానం చెప్పారని గ్రామస్తులు పేర్కొన్నారు. గుంపర్లపాడులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాలను అడ్డుకొని విద్యుత్ వైర్లు, ఫ్యూజ్ లింకులను సైతం పోలీసులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో మరుసటి రోజు టీడీపీ ఆధ్వర్యంలో అర్ధరాత్రి నిర్వహించిన అశ్లీల నృత్యాలపై సమాచారం పోలీసులకు తెలియదానని గ్రామస్తులు ప్రశ్నించారు. ఈ విషయమై ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డిని సంప్రదించగా.. పోలీస్ యాక్ట్ 30, ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో నృత్య ప్రదర్శనలకు అనుమతులివ్వడంలేదని చెప్పారు. పలు గ్రామాల నుంచి నిర్వాహకులు అనుమతులు కోరిన మాట వాస్తవమేనని, అయితే ఎవరికీ మంజూరు చేయలేదన్నారు. గ్రామాల్లో మైకుల్లేకుండా ఇలాంటి డ్యాన్స్‌లను నిర్వహిస్తున్నారనే విషయమై పూర్తి స్థాయిలో విచారణ చేస్తామని పేర్కొన్నారు. -
సికింద్రాబాద్: హోటల్లో అశ్లీల నృత్యాలు.. 8 మంది యువతులు..
సాక్షి, సికింద్రాబాద్: నగరంలోని బసేరా హోటల్లో అశ్లీల నృత్యాలు చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపారు. రైడ్స్‌లో భాగంగా 8 మంది యువతులు, 25 మంది కస్టమర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని గోపాలపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇది కూడా చదవండి: లగ్గానికి డేట్ ఫిక్స్ చేసుకున్నాడు.. కానీ, ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకుని.. -
లోకేశ్ బర్త్‌డే.. ఏజెన్సీలో అశ్లీల నృత్యాలు
రాజవొమ్మంగి: టీడీపీ నాయకుడు లోకేశ్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో అశ్లీల నృత్యాలతో చిందులెయ్యడం వివాదాస్పదమైంది. అర్ధరాత్రి పూట అశ్లీల నృత్యాలతో తమ గ్రామ వాతావరణాన్ని కలుషితం చేశారంటూ రాజవొమ్మంగి మండలం అనంతగిరి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం (23వ తేదీ) మండలంలోని అనంతగిరిలో టీడీపీకి చెందిన కొందరు యువకులు తమ నాయకుడి బర్త్‌డే పేరుతో బయట ప్రాంతం నుంచి మహిళలను గ్రామానికి రప్పించారు. వారితో అశ్లీల నృత్యాలు చేయించారు. ఊరి చివర అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన టెంట్లో ఈ నృత్యాల సమాచారం పోలీసులకు తెలిసింది. దీనితో సీఐ రవికుమార్ ఆదేశాల మేరకు రాజవొమ్మంగి, జడ్డంగి ఎస్ఐలు గోపీ నరేంద్రప్రసాద్, షరీఫ్ వెళ్లి ఆరుగురు నిర్వాహకులను అరెస్టు చేశారు. మరో ముగ్గురు తప్పించుకున్నారని పోలీసులు తెలిపారు. డ్యాన్సర్లను అదుపులోకి తీసుకున్నారు. ఘటనా స్థలంలో కారు, బొలేరో వ్యాన్, 8 మోటారు సైకిళ్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. జనరేటర్, లైటింగ్ సామగ్రి, టెంట్ సామగ్రి సీజ్ చేశామని ఎస్ఐలు తెలిపారు. -
అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు.. మద్యం తాగి అర్ధనగ్నంగా
West Godavari: పోలసానిపల్లిలోని ఓ తోటలో బుధవారం అర్ధరాత్రి అశ్లీల నృత్యాలు చేస్తున్న యువతులు, యువకులపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఘటనా స్థలంలో మద్యం తాగి అర్ధనగ్నంగా ఉన్న ముగ్గురు యువతులు, ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఒక కారు, ఆరు సెల్ఫోన్లు, ఐదు మోటార్‌సైకిళ్లు, సౌండ్ సిస్టమ్‌ను స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. పంగిడిగూడెం పంచాయతీ సూర్యచంద్రరావుపేట, పంగిడిగూడెం, నల్లజర్ల, రాజమండ్రిలకు చెందిన కొంత మంది యువకులు తమ బైక్‌లపై పొలసానిపల్లిలోని ఓ తోటలోకి రాత్రి చేరుకోగా, మరో కారులో ముగ్గురు యువతులు వచ్చారు. మద్యం మత్తులో ఐటెంసాంగ్స్‌తో అర్ధనగ్నంగా ఉన్న యువతులతో అరుపులు, కేకలతో యువకులు చిందులేశారు. దీంతో ఆ ప్రాంతం హోరెత్తింది. చదవండి: (అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి) స్థానికుల సమాచారంతో ఎస్సై వీఎస్వీ భద్రరావు సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని మద్యం మత్తులో ఉన్న యువతులు, యువకులు చిందులేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకుడి అచూకీ కోసం గాలిస్తున్నామన్నారు. కోవిడ్ నిబంధనలకు తిలోదకాలిస్తూ అశ్లీల నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించామని ఎస్సై తెలిపారు. -
పోణంగిలో అశ్లీల నృత్యాలు
సాక్షి, ఏలూరు రూరల్: గురువారం ఏలూరు మండలం పోణంగి గ్రామంలో జరిగిన గొంతేలమ్మ జాతర సందర్భంగా అశ్లీల నృత్య ప్రదర్శనలు చోటుచేసుకున్నాయి. రాత్రి సమయంలో ట్రాక్టర్‌పై మహిళలతో ఈ అశ్లీల నృత ప్రదర్శనలు చేయించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ట్రాక్టర్ చుట్టూ చేరిన కుర్రకారు నృత్యం చేస్తున్న మహిళలను కిందకు లాగారు. పలువురు ట్రాక్టర్‌పైకి ఎక్కి మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పోలీసులు ఇలాంటి చర్యలను అడ్డుకోవాలని స్థానికులు కోరుతున్నారు. చదవండి: (భర్త చనిపోవడం, ఇద్దరు కొడుకులు జైలుకెళ్లడంతో.. తల్లి ఆత్మహత్య) -
చుక్కేసి.. చిందేసీ..! కలకలం రేపిన బర్త్ డే పార్టీ
పట్నంబజారు: జన్మదిన వేడుకల్లో జరిగిన అసభ్య నృత్యాల్లో పాల్గొన్న సీఐపై సస్పెçన్షన్ వేటు పడింది. సేకరించిన సమాచారం ప్రకారం... గుంటూరు నగరంలోని ఇన్నర్ రింగు రోడ్డు సమీపంలో ఉన్న తెలుగింటి రుచులు రెస్టారెంట్లో సోమవారం రాకేష్ అనే వ్యక్తి జన్మదిన వేడుకలు జరిగాయి. అయితే పార్టీలో భాగంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించటంతో పాటు, విజయవాడ నుంచి పిలిపించిన ఆరుగురు యువతులతో అసభ్య నృత్యాలు కూడా జరిగాయి. ఈ క్రమంలో పక్కా సమాచారం అందుకున్న పట్టాభిపురం పోలీసులు దాడి చేసి మొత్తం 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కోవిడ్ నిబంధనలు అతిక్రమించటం, అధిక శబ్ధాలతో ఇతరులకు ఇబ్బంది కలిగించడం, దీంతో పాటుగా మద్యం సేవించటం, అసభ్యకరమైన నృత్యాలు చేసిన కేసు నమోదు చేసి, స్వంత పూచీకత్తులపై పంపించి చేశారు. అయితే జరిగిన పార్టీకి అర్బన్ సీసీఎస్‌లో పని చేస్తున్న సీఐ వెంకటేశ్వర రావు కూడా హాజరయ్యారు. ఒకేసారి ఆరుగురు యువతులు, 19 మంది యువకులను తీసుకుని రావటంతో రేవ్‌పార్టీ జరిగిదంటూ కలకలం రేగింది. అయితే దీనిపై స్పందించి పట్టాభిపురం పీఎస్ సీఐ ఎస్వీ రాజశేఖర రెడ్డి ఎటువంటి రేవ్ పార్టీలు జరగలేదని స్పష్టం చేశారు. తాము అక్కడ జరిగిన తంతుని వీడియో చిత్రీకరించామని, ఎటువంటి అశ్లీల నృత్యాలు జరగలేదని తెలిపారు. సమాచారం వచ్చిన వెంటనే దాడి చేయటం జరిగిందని వివరించారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు అనంతరం కేసు నమోదు చేసినట్లు వివరించారు. సీఐపై సస్పెన్షన్ వేటు రెస్టారెంట్లో జరిగిన జన్మదిన వేడుకల్లో పాల్గొన్న సీసీఎస్ సీఐ వెంకటేశ్వర్లుపై సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ తివిక్రమ వర్మ ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది ఇటువంటి వ్యవహారాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. జన్మదిన వేడుకల్లో భాగంగా జరిగిన అసభ్య నృత్యాలు, మద్యం పార్టీలో సీఐ పాల్గొనడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. అయితే సీఐ వెంకటేశ్వర్లు పార్టీ జరిగిన సమయంలో పోలీసులే తప్పించారనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. పోలీసులు దాడి చేసే సమయానికే సీఐ వెంకటేశ్వర్లు ఉన్నారా.. లేక పోలీసులే తప్పించారా అనే కోణాన్ని పరిశీలించాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు సమాచారం. -
జూబ్లీహిల్స్ రేవ్‌పార్టీలో కొత్త ట్విస్ట్
-
జూబ్లీహిల్స్ రేవ్‌పార్టీలో కొత్త ట్విస్ట్
జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లో ఆదివారం రాత్రి నిర్వహించిన రేవ్ పార్టీ ఘటనలో కొత్త కోణం వెలుగుచూసింది. పబ్‌ను బుక్ చేసుకుంది ఓ ఫార్మా కంపెనీగా పోలీసులు గుర్తించారు. సేల్స్‌ను పెంచుకునేందుకే ఆ పార్మా కంపెనీ రేవ్ పార్టీని ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. జూబ్లీహిల్స్‌లోని సీక్రెట్ ఎఫైర్ పబ్‌లో కొంతమంది యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారన్న సమాచారంతో ఆదివారం సాయంత్రం బంజారాహిల్స్ పోలీసులు టాప్ పబ్‌పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో 23మంది యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డాక్టర్లు, సేల్స్ ఉద్యోగుల కోసం ప్రతి ఏటా ఇలాంటి రేవ్ పార్టీని ఈవెంట్ ఆర్గనైజన్ ప్రసాద్ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. పట్టుబడ్డ యువతులంతా ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన వారిగా గుర్తించారు. సినిమా అవకాశాలు, ఈవెంట్ డాన్సుల కోసం హైదరాబాద్‌కు వచ్చిన యువతులను వ్యభిచార రొంపిలోకి దించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రసాద్ పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. -
పబ్‌లో అశ్లీల నృత్యాలు
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ రోడ్ నెం.10లోని టాట్ పబ్‌లో అశ్లీల నత్యాలు చేస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడులు నిర్వహించి 23 మంది యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం సాయంత్రం పలువురు యువతీ యువకులు పబ్‌లో ఏర్పాటు చేసుకున్న పార్టీలో భాగంగా కొందరు యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. బంజారాహిల్స్ ఏసీపీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా 22 మంది యువతులను అదుపులోకి తీసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే తాము పార్టీ చేసుకోవడానికి వచ్చామని తమను ఎందుకు వీడియోలు తీస్తున్నారంటూ యువతులు మీడియా ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెల్ఫోన్లు లాక్కొని కిందపడేశారు. కాగా సీడ్స్ కంపెనీకి చెందిన ఓ వ్యక్తి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిసింది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు పేర్కొన్నారు. -
పబ్‌లో యువతులతో అశ్లీల నృత్యాలు
సాక్షి, హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌లోని టాట్ పబ్‌పై పోలీసులు దాడి చేశారు. యువతులతో అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారనే సమాచారంతో ఆదివారం ఈ దాడి నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో 25 మంది యువతీ యువకులు పట్టుబడినట్లు సమాచారం. కాగా, పబ్‌లో పట్టుబడ్డ యువతులు హల్ చల్ చేశారు. దృశ్యాలను చిత్రీకరిస్తున్న మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. సెల్‌ఫోన్స్‌ను నేలకేసికొట్టారు. యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ప్రైవేట్ బస్సులో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
టీడీపీ తమ్ముళ్ల ‘ముజ్రా’ మజా
సాక్షి, అమరావతి బ్యూరో: రాజధాని ప్రాంతంలో టీడీపీ నేతలు విశృంఖలత్వం వెర్రితలలు వేస్తోంది. విజయవాడను అశ్లీల నృత్యాలకు అడ్డాగా మార్చివేస్తున్నారు. పోలీసుల బుధవారం అర్ధరాత్రి చేసిన దాడుల్లో పలువురి తెలుగు తమ్ముళ్ల బండారం బయటపడింది. విజయవాడకు చెందిన వివాదాస్పద టీడీపీ ఎమ్మెల్యే బినామీకి చెందిన ఓ హోటల్లో ముజ్రా పార్టీ పేరుతో అశ్లీల కార్యకలాపాలు నిర్వహిస్తు ఆయన అనుచరులు పట్టుబడటం స్థానికంగా సంచలనం రేపింది. పోలీసులు ముజ్రా పార్టీ నిర్వాహకులైన ఆ ఎమ్మెల్యే ప్రధాన అనుచరులు ముగ్గురితో పాటు 50 మంది విటులు, ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో 47వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కొల్లూరు రామకృష్ణ, ఎమ్మెల్యేకు అత్యంత సన్నిహితుడు సామా చైతన్యతో పాటు పలువురు స్థానిక టీడీపీ నేతలు, తెలుగు యువత నేతలు, వ్యాపారులు ఉన్నారు. అదుపులోకి తీసుకున్న యువతులను పోలీసులు విజయవాడలోని వాసవ్య మహిళా మండలికి తరలించారు. పక్కా సమాచారంతో దాడులు.. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో స్థానిక భవానీపురంలోని ఆలీవ్ ట్రీ హోటల్‌పై నగర పోలీసులు దాడులు చేశారు. జాయింట్ పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా నేతృత్వంలో ఈ దాడులు జరిగాయి. ఆ సమయంలో హోటల్లో అశ్లీల నృత్యాలతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నవారిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముజ్రా పార్టీ నిర్వాహకులు ముగ్గురు ఉన్నారు. పెద్దఎత్తున మద్యం సీసాలు, కండోమ్ ప్యాకెట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అదుపులోకి తీసుకున్నవారిని భవానీపురం, విజయవాడ వన్‌టౌన్, ఇబ్రహీంపట్నం, గవర్నర్‌పేట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఆ హోటల్‌ను లీజుకు తీసుకున్న వ్యక్తిని, ముజ్రా పార్టీలో పాల్గొన్న వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఎమ్మెల్యే అనుచరుడి హోటల్ ఆలివ్ టీ హోటల్ నిర్వాహకుడు ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడు. ఈ హోటల్‌ను టీడీపీ ఎమ్మెల్యే ఏడాది క్రితం తన బినామీ పేరుతో కొనుగోలు చేశారని తెలుస్తోంది. అనంతరం తన ప్రధాన అనుచరుడికి లీజుకు ఇచ్చారు. ప్రతి నెలా మూడో బుధవారం ఆ హోటల్లో ముజ్రా పార్టీలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైనట్లు ఓ పోలీసు అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ప్రవేశ రుసుంగా రూ. 5 వేలు వసూలు చేస్తున్నారు. హైదరాబాద్, భీమవరంతోపాటు వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి అశ్లీల నృత్యాలు చేయిస్తున్నారు. ఇదే సమయంలో మద్యం, గంజాయి విక్రయాలు కూడా జోరుగా సాగిస్తున్నారు. ఈ ముజ్రా పార్టీలకు పలువురు టీడీపీ నేతలు, వ్యాపారవేత్తలు హాజరవుతున్నారు. ఇప్పటి వరకూ తమ దందా సజావుగా సాగుతుండటంతో ఈ ముజ్రా పార్టీలను రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా నిర్వహించడానికి ఎమ్మెల్యే సన్నిహితులు సిద్ధమయ్యారని తెలిసింది. దాడుల్లో దొరికిన నిర్వాహకులు, విటులపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని గురువారం న్యాయమూర్తి సమక్షంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. -
ఈవెంట్ యాంకర్లతో అసభ్య నృత్యాలు!
సాక్షి, విజయవాడ : నగరంలోని భవానీపురంలో ఉన్న ఆలీవ్ ట్రీ హోటల్‌పై బుధవారం అర్ధరాత్రి పోలీసులు దాడి చేశారు. మహిళలతో అసభ్య నృత్యాలు నిర్వహిస్తున్నారనే సమాచారంతో పోలీసులు రైడ్ చేసి.. ఐదుగురు మహిళలు, 50మంది పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నేత ముఖ్య అనుచరుడి ఆధ్వర్యంలో హోటల్లో ఈ పార్టీ జరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్‌కు చెందిన కొందరు ప్రైవేట్ ఈవెంట్ యాంకర్లను తీసుకువచ్చి హోటల్లో అసభ్య నృత్యాలు నిర్వహించారని సమాచారం. పోలీసుల దాడిలో మరో ఐదుగురు యాంకర్లని తప్పించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో పట్టుబడిన వారిలో 10 మందిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు, 15 మందిని భవానీపురం పీఎస్‌కు, 10 మందిని ఇబ్రహీంపట్నం పీఎస్‌కు, మరో పదిమందిని గవర్నర్‌పేట పీఎస్‌కు తరలించారు. ఐదుగురు యువతులను వాసవ్య మహిళా మండలికి అప్పగించారు. పట్టుబడిన యువతులు హైదరాబాద్, భీమవరం, విహయవాడకు చెందిన వారిగా గుర్తించారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడి కుటుంబ సభ్యుడు కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడని, అయితే, పోలీసుల రైడ్ నుంచి అతన్ని తప్పించారని తెలుస్తోంది. పార్టీ జరుగుతున్న ప్రాంతంలో పెద్ద ఎత్తున మద్యం, కండోమ్ ప్యాకెట్లు లభ్యమయ్యాయి. ప్రతినెలా ఇదే తరహాలో నగరంలో పార్టీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నగరంలో తొలి ముజ్రా పార్టీ కేసు! అమ్మాయిల అసభ్య నృత్యాల నేపథ్యంలో నగరంలో మొదటిసారి ముజ్రా పార్టీ కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ ముజ్రా పార్టీకి సంబంధించి 53 మందిని అరెస్ట్ చేశామని జాయింట్ సీపీ రానా తెలిపారు. హోటల్ నిర్వాహకులపైనా కేసు పెట్టామని చెప్పారు. ఒక్కో వ్యక్తి నుంచి రూ. 5 వేల నుంచి 10 వేల చొప్పున రూ. 5 లక్షల వరకు నిర్వాహకులు ఈ పార్టీ కోసం వసూలు చేశారని తెలిపారు. పోలీసుల దాడిలో దొరికిన ఐదుగురు అమ్మాయిలను వాసవ్య మహిళా మండలి సంరక్షణలో పెట్టామని చెప్పారు. ఇకపై నగరంలో ఇలాంటి పార్టీలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
పబ్‌లో అశ్లీల నృత్యాలు
బనశంకరి : యువతులతో అశ్లీల నృత్యం చేయిస్తున్న ఓ పబ్‌పై జీవనబీమానగర పోలీసులు దాడిచేసి 32 మంది యువతులకు విముక్తి కల్పించి ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. లైవ్బ్యాండ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన నేపథ్యంలో ఇందిరానగర 80 పీట్రోడ్డులో ఉన్న మ్యాంగోట్రిపబ్లో గుట్టుగా అశ్లీల నృత్యాలు చేయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో పోలీసులు మంగళవారం రాత్రి దాడులు నిర్వహించి ఆరుగురిని అరెస్ట్ చేశారు. 32 మంది యువతులను కాపాడారు. ఇది లా ఉండగా ఈ పబ్ శాంతినగర కాంగ్రెస్ ఎమ్మెల్యే హ్యారీష్ కుమారుడు మహమ్మద్నలపాడ్ స్నేహితుడైన హరీశ్‌కు చెందినదని సమాచారం. పోలీసుల దాడి నేపథ్యంలో నిర్వాహకులను అరెస్ట్ చేయకుండా మహమ్మద్నలపాడ్ సీనియర్ పోలీస్అధికారుల ద్వారా ఒత్తిడి చేసినట్లు సమాచారం. -
అడ్డూఅదుపు లేకుండా అశ్లీల నృత్యాలు
తూర్పుగోదావరి జిల్లా(మల్కిపురం) : సంక్రాంతి సంబరాల్లో అశ్లీల నృత్యాలు హోరెత్తుతున్నాయి. ఒకవైపు సంక్రాంతి సంబరాలు.. మరోవైపు కోడింపందేల జోరు.. బెట్టింగ్‌ల హోరు. ఇంకోవైపు రికార్డింగ్ డ్యాన్సులు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందేలతో పాటు రికార్డింగ్ డ్యాన్స్‌లు వేయించడం షరామామూలుగా జరిగిపోతున్నాయి. పెద్ద ఎత్తున కోడిపందాలతో పాటు అశ్లీల నృత్యాలు పెద్ద ఎత్తున సాగాయి. భోగి రోజు రాత్రి రికార్డింగ్ డ్యాన్సుల హోరు మొదలైంది. అర్ధరాత్రి దాటేసరికి ఇది కాస్తా అశ్లీల నృత్యాల మేళాగా మారింది. ప్రజా ప్రతినిధుల అండదండలు కూడా ఉండడంతో నిర్వాహకులకు జంకూగొంకూ లేకుండా పోయింది. అందుకే పోలీసులు కూడా జోక్యం చేసుకోవాలంటే జంకుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని మల్కిపురం మండలంలోని శంకరగుప్తం, తూర్పుపాలెం, మగటపల్లి, కేశనపల్లి, సఖినేటిపల్లి, కరవాక గ్రామాలలో అడ్డుఅదుపు లేకుండా అర్థరాత్రి యధేచ్చగా అశ్లీల నృత్యాలు సాగుతున్నాయి. ప్రభుత్వం ఇలాంటి అశ్లీల నృత్యాలు జరపకుండా నిర్వహకులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. -
తెలుగు తమ్ముళ్ల అశ్లీల నృత్యాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఉంగుటూరు నియోజకవర్గం ఆశ్లీల నృత్యాలకు అడ్డాగా మారింది. జాతర జరిగినా, జన్మదిన వేడుకలు జరిగినా అశ్లీల నృత్యాలు జరగడం ఆనవాయితీగా మారిపోయింది. తాజాగా భీమడోలు మండలంలోని కురెళ్లగూడెం రెవెన్యూ పరిధిలోని అంబర్‌పేటలోని ఓ తోటలో తెలుగు తమ్ముళ్లు అమ్మాయిలతో కలిసి అశ్లీల నృత్యాలు చేయడం సర్వత్రా విమర్శలకు దారితీసింది. ఆదివారం కురెళ్లగూడెం గ్రామానికి చెందిన ఓ నాయకుడి పుట్టిన రోజు వేడుకలు కావడంతో ముఖ్య నేతలను అంబర్‌పేటలోని కొబ్బరి తోటలో జరిగే విందుకు ఆహ్వానించారు. టీడీపీ నేతకు చెందిన ఆ తోటలో జరిగిన విందు కార్యక్రమం అనంతరం అశ్లీల నృత్యాలు ఏర్పాటు చేశారు. ఉంగుటూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధి సొంత గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరగడం చర్చనీయాంశంగా మారింది. విందు పూర్తయిన తర్వాత మహిళలను వేదికపై ఎక్కించి తెలుగు తమ్ముళ్లు అసాంఘిక కార్యకలాపాలు సాగించారు. ఇద్దరు అర్థనగ్న దుస్తులతో ఉన్న మహిళలతో తెలుగు తమ్ముళ్లు సైతం చిందులేశారు. వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వెలుగుచూడటంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
విశాఖ డెయిరీలో అశ్లీల నృత్యాలు
విశాఖ, అక్కిరెడ్డిపాలెం (గాజువాక): విశాఖ డెయిరీ అంటే పాల ఉత్పత్తులకు పెట్టింది పేరు. ఇక్కడ డైయిరీ యాజమాన్యం ప్రతి ఏటా ఉద్యోగులకు ఒక కానుక ఇస్తుంది. అదేంటంటే దసరా ఉత్సవాలను నిర్వహిస్తూ, చివరి రోజున వారికి కిక్కు ఇచ్చే రీతిలో అశ్లీల నృత్యాలను ఏర్పాటు చేస్తుంది. దీనిని తిలకించే అవకాశం ఒక్క డెయిరీ ఉద్యోగులకు మాత్రమే ఉంటుంది. బయట చిన్న బుర్రకథలను ఏర్పాటు చేస్తే స్టేజీపై మహిళలు ఎందుకున్నారని కార్యక్రమాలను ఆపేసే పోలీసులు దీనికి ఏం సమాధానం చెబుతారని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
డ్యాన్సర్లతో ఏఎస్ఐ చిందులు..
► వెయ్.. చిందెయ్..! ► జాతరలో స్టెప్పులేసిన ఏఎస్ఐ ► మహిళతో అసభ్యకర ప్రవర్తన ► ఏఎస్ఐ ప్రవర్తనపై వెల్లువెత్తిన విమర్శలు రాజంపేట : అతను రాజంపేట సబ్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్లో ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నందలూరు మండలం కుంపిణీపురంలో శుక్రవారం రాత్రి జరిగిన జాతరలో డ్యాన్సర్లతో కలసి రెచ్చిపోయి చిందులేశాడు. ఓ మహిళను ముద్దాడాడు. ఈ దృశ్యాలు ప్రసార మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. కుంపిణీపురంలో జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా శుక్రవారం రాత్రి సంగీతవిభావరి నిర్వహించారు. ఈ విభావరిలో ఈ ఏఎస్ఐ ఓ మహిళను బహిరంగంగానే ముద్దుపెట్టుకున్నాడు. అంతేగాకుండా ఆమెతో కలిసి డ్యాన్స్ చేశాడు. పువిత్ర పుణ్యక్షేత్రమైన కుంపిణీపురంలో అసభ్యకరమైన నృత్యాలు జరుగుతాయని డీఎస్పీ మొదలుకుని జిల్లా ఎస్పీ వరకు ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. జిల్లా ఎస్పీ కూడా ఈ విషయంపై సీరియస్ అయి అశ్లీల నృత్యాలకు అనుమతి ఇవ్వరాదని పోలీసులను ఆదేశించినట్లు తెలుస్తోంది. అయితే నెల్లూరు నుంచి ఓ నృత్యబృందంచే కార్యక్రమం నిర్వహించేందుకు రూ.1లక్షకు ఒప్పందం కుదర్చుకొని కుంపిణీపురానికి తీసుకువచ్చినట్లుగా తెలిసింది. ఈ నృత్య బృందంలోని మహిళతో కలిసి ఏఎస్ఐ చేసిన నృత్యం.. ఆయన ప్రవర్తించిన తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. -
డ్యాన్సర్లతో ఏఎస్ఐ చిందులు..
-
మహిళలతో అశ్లీల నృత్యాలు
హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డులో రికార్డింగ్ డ్యాన్సుల మోత మోగింది. బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు కూతవేటు దూరంలోని సైదప్ప కాలనీలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో మహిళలతో అశ్లీల నృత్యాలు చేయించారు. సాంస్కృతిక కార్యక్రమాల ముసుగులో నిర్వాహకులు ఈ రికార్డింగ్ డాన్సులను ఏర్పాటు చేశారు. మొదట ఆర్కెస్ట్రాతో మొదలు పెట్టి...ఆ తర్వాత అసభ్యకర నృత్యాలకు తెర తీశారు. పెద్ద సౌండ్సిస్టమ్ల మధ్య బహిరంగంగా ఈ కార్యక్రమం జరుగుతున్నా.... పోలీసులు అటువైపు కన్నెత్తి కూడా చూడకపోవడంపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని తెలుస్తుంది. -
అపార్ట్మెంట్లో అశ్లీల నృత్యాలు
ముగ్గురు యువతులు సహా 9 మంది అరెస్ట్ హైదరాబాద్: యాప్రాల్ డివిజన్ పరిధిలోని రిజిస్టేషన్ కాలనీలో ఉన్న ఓ అపార్టుమెంట్ ఫ్లాట్‌లో శనివారం అర్ధరాత్రి మద్యం మత్తులో అశ్లీల నృత్యాలు చేస్తున్న ముగ్గురు యువతులుసహా 9 మందిని ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఐ వెంకటగిరి కథనం ప్రకారం.. రిజిస్ట్రేషన్ కాలనీలోని ఓ అపార్ట్మెం ట్లో దిలీప్ కుమార్ జైన్ (50) రెండేళ్ల క్రితం ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని విజయ్‌ఠాగూర్ (28), ఎండీ వాజీత్ (28)లతో కలసి నివసిస్తున్నాడు. ఇక్కడ కొన్నాళ్లుగా అసాంఘిక కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శనివారం అర్ధరాత్రి ఫ్లాట్‌పై దాడి చేశారు. ఆ సమయంలో అక్కడ యువతులతో అశ్లీల నృత్యాలు కొనసాగుతున్నాయి. ముంబై, ఢిల్లీ, ఒడి శా రాష్ట్రాలకు చెందిన బిన్ని శర్మ (25), సోనియా (20), సిమ్రాన్‌సింగ్ (21)లతోపాటు మౌలాలికి చెందిన శంకర్‌పటేల్ (45), చార్మినార్‌కు చెందిన జావేద్(40), నయాపూల్‌కు చెం దిన పర్వేజ్ (38)లను పోలీసులు అరెస్టు చేసి, వీరి నుంచి రూ.41,910 నగదు, 3 కార్లు, నాలు గు సెల్ఫోన్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకులు దిలీప్‌కుమార్‌జైన్,విజయ్ ఠాగూర్, వాజిత్లను కూడా అరెస్టు చేశారు. -
పోలీసులను తరిమికొట్టిన జనం
భయం గుప్పెట్లో చీడికాడ ఎస్ఐ లాఠీఛార్జీలో ఎంపీటీసీ భర్తకు గాయం వినాయక నిమజ్జనంలో అపశ్రుతి పెద్ద ఎత్తున మోహరించిన బలగాలు పరిస్థితిని సమీక్షించిన ఎస్పీ చీడికాడ : వినాయక నిమజ్జనంలో మంగళవారం రా త్రి అపశ్రుతి చోటుచేసుకుంది. అశ్లీల నృత్యాలు చేసు తన్న వారిపై ఎస్ఐ లాఠీఛార్జి చేయడంతో జనం తిరగ బడ్డారు. పోలీసులను తరిమికొట్టారు. దీంతో బలగా లు మండల కేంద్రం చీడికాడతోపాటు బైలపూడిని చుట్టుముట్టాయి. రూరల్ ఎస్పీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో పోలీసు ఉన్నతాధికారులు బుధవారం పరిస్థితిని సమీక్షించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక నిమజ్జనంలో భాగంగా బైలపూడిలో అశ్లీల నృ త్యాలు జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు ఎస్.ఐ విశ్వనాథం సిబ్బందితో వెళుతుండగా చీడికాడ మొయిన్‌రోడ్డులో వివిధ వీధులకు చెందిన వినాయక విగ్రహాలకు నిమజ్జనానికి ఊరేగిస్తున్నా రు. ఇందులో భాగంగా ఇద్దరు హిజ్రాలతో డ్యాన్స్ చేయిస్తుండడంతో ఎస్.ఐ విశ్వనాథం వారిపై లాఠీ ఛార్జి చేశారు. ట్రాక్టర్ తాళాలు తీసుకున్నారు. అనంతరం బైలపూడి వెళ్లిపోయారు. అక్కడ గుమ్మాల వారి కుటుంబీకులకు చెందిన వినాయక నిమజ్జనంలో ఎంపీటీసీ భర్త గుమ్మాల తారకేసు,అప్పారావులు చీరలు కట్టుకుని ఆడవారి వేషంలో డాన్స్ చేస్తున్నారు. వారిపై కూడా ఎస్ఐ లాఠీఛార్జి చేశారు. దీంతో తారకేసు కుడిచేయిపై గట్టిగా కొట్టారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో గ్రామస్తులు పోలీసులపై దాడి చేశారు. ఈ సంఘటనలో హోంగార్డు కనకరాజుకు కుడి కన్ను కనత, చెంపపై వాపుగాయం అయింది. అక్కడి నుంచి తిరిగి వస్తుండగా శిరిజాం జంక్షన్లో మహిళలు,యువకులు పోలీసు జీపును అడ్డుకున్నారు. పలువురు యువకులు రోడ్డుకు అడ్డంగా పడుకున్నారు. మరికొందరు జీపుపైకి ఎక్కి అద్దాలు,లైట్లను ధ్వంసం చేశారు. జీపు టైర్లలో గాలి తీసేశారు. పోలీసులపై పిడుగుద్దులతో దాడి చేశారు. ఈ పరిణామంతో జీపును వదిలి పోలీసులు పరుగులు తీశారు. ఈ సంఘటనలో ఎస్.ఐ విశ్వనాథం సెల్‌ఫోన్ పగిలిపోయింది. ఇలా ఎస్ఐతోపాటు సిబ్బందిపై దాడి జరిగిన వైనంపై చీడికాడ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఎస్పీ విచారణ చేపట్టారు. ధ్వంసమైన జీపు, పగిలిపోయిన ఎస్ఐ సెల్‌ఫోన్, గాయపడిన హోంగార్డు కనకరాజును పరిశీలించారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న అనుమానితులను విచారించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉత్సవాలప్పుడు గ్రామాల్లో అపశ్రుతులతో ప్రజాజీవనానికి అటంకం కలిగించే శక్తులను అడ్డుకునేందుకు అహర్నిశలు కాపాలాగా ఉండే పోలీసులపై దాడి శోచనీయమన్నారు. అటువంటి వారిపై తీవ్రంగా వ్యవహరిస్తారన్నారు. ఈమేరకు గ్రామమంతటా పోలీసులు మోహరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకునేందుకు నాలుగు జీపుల్లో బలగాలు గ్రామంలో చక్కర్లు కొట్టాయి. దీంతో అంతటా భయాందోళనలు నెలకొన్నాయి. ఎస్ఐ విశ్వనాథం బాధ్యతలు చేపట్టిన ఏడు నెలల్లోనే మండలంలోని నీలంపేట,చినకోనాంలతో పాటు ఇప్పుడు చీడికాడ,బైలపూడి గ్రామాల వారు పోలీసులపై దాడులు,కేసులతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.